పోలీస్ తో పెళ్లా ? వద్దన్న గాళ్ ..ఖాకీ రాజీనామా !

girl refuses to marry police constable citing difficulties of police personnel, పోలీస్ తో పెళ్లా ? వద్దన్న గాళ్ ..ఖాకీ రాజీనామా !

పోలీసుల పని ఒత్తిడి అంతాఇంతా కాదు.. డిపార్ట్ మెంట్ లో వారు దాదాపు 24 గంటలూ విధి నిర్వహణలో ఉన్నట్టే లెక్క.. వీక్లీ ఆఫ్ అంటూ ఈ మధ్య పోలీసులకు కూడా రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వాలు కాస్త రిలీఫ్ ఇఛ్చినప్పటికీ.. వారి వర్క్ ఏదో విధంగా వారి వెన్నంటే ఉంటుంది. ఇంటికి వచ్చినా ఫోన్లు వస్తూనే ఉంటాయి. అందులోనూ కానిస్టేబుల్ స్థాయి ఖాకీలు ఒక్కోసారి రెండుమూడు రోజులు అదే పనిగా పని చేయవలసి రావచ్ఛు. ఇక ప్రజా ఆందోళనలు, ఉద్యమాలు, అల్లర్లు, లేదా పండుగలు, పబ్బాలు, వినాయక నిమజ్జనాల వంటి రోజుల్లో అయితే మరీనూ ! తమ ఆరోగ్యాన్ని, కుటుంబ సభ్యుల బాగోగులను సైతం పట్టించుకునే తీరిక ఉండదు. దీన్నే ఓ కారణంగా చూపి ఓ కానిస్టేబుల్ ని పెళ్లి చేసుకునేందుకు ఒక యువతి నిరాకరించింది. పెళ్లి చూపులకు వఛ్చిన ఇతడ్ని పెళ్ళాడలేనని తెగేసి చెప్పింది. దీంతో మనస్తాపానికి గురైన ఆ కానిస్టేబుల్ తన ఉద్యోగానికి రాజీనామా చేశాడు. తన ఖాకీ ఉద్యోగం కన్నా తనకు పెళ్ళే మిన్న అని రుజువు చేశాడు. రాజీనామా చేస్తున్నానంటూ హైదరాబాద్ సీపీకే లేఖ రాశాడు. పైగా ఈ రాజీనామా లేఖలో పోలీసు డిపార్ట్ మెంట్ లో ఉన్న చిక్కులను, లొసుగులను ప్రస్తావించాడు. వివరాల్లోకి వెళ్తే.. సిటీకి చెందిన సిధ్ధాంతి ప్రతాప్ అనే యువకుడు చార్మినార్ పీ ఎస్ లో కానిస్టేబుల్ గా పని చేస్తున్నాడు. తన కుటుంబ సభ్యులతో కలిసి ఈ మధ్య పెళ్లి చూపులకు వెళ్ళాడు. కానీ ఇతడు కానిస్టేబుల్ అని తెలుసుకున్న ఆ అమ్మాయి ఇతనితో పెళ్ళికి నిరాకరించింది. ఈ సంబంధం తనకు వద్దని చెప్పిందట. దీంతో షాకైన సిధ్ధాంతి ప్రతాప్ రాజీనామా చేశాడు. పైగా పోలీసు శాఖలో ఎన్నేళ్లు పని చేసినా ప్రమోషన్లు ఉండవని, దాదాపు 20, 30 సంవత్సరాల సర్వీసు ఉన్నవారు కూడా ఎస్ ఐ స్థాయికి మించి ‘ ఎదగలేరని ‘ ఆ లేఖలో పేర్కొన్నాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *