రాజస్థాన్లో రాక్షసుడు… అడవిలో బంధించి అఘాయిత్యం… యువతిపై 14 రోజులుగా అత్యాచారం…

దేశంలో అత్యాచార నిందితులకు కఠిన శిక్షలు పడుతున్న మృగాళ్లలో మార్పు రావడం లేదు. రోజు రోజుకు పశు ప్రవృత్తి పెరిగిపోవడంతో పాటు మానవత్వానికి మచ్చ తెచ్చే ఘటనలకు పాల్పడుతూనే ఉన్నారు. అలాంటి ఘటనలో రాజస్థాన్లో చోటు చేసుకుంది.

  • Rajeev Rayala
  • Publish Date - 8:58 pm, Thu, 26 November 20
రాజస్థాన్లో రాక్షసుడు... అడవిలో బంధించి అఘాయిత్యం... యువతిపై 14 రోజులుగా అత్యాచారం...

Girl raped for 14 days in the forest  దేశంలో అత్యాచార నిందితులకు కఠిన శిక్షలు పడుతున్న మృగాళ్లలో మార్పు రావడం లేదు. రోజు రోజుకు పశు ప్రవృత్తి పెరిగిపోవడంతో పాటు మానవత్వానికి మచ్చ తెచ్చే ఘటనలకు పాల్పడుతూనే ఉన్నారు. అలాంటి ఘటనలో రాజస్థాన్లో చోటు చేసుకుంది. ఓ యువకుడు 20 ఏళ్ల వయస్సు ఉన్న ఓ యువతిని అడవిలో బంధించి ఆమెపై14 రోజుల పాటు అత్యాచార చేశాడు. ఎట్టకేలకు ఆ కామాంధుడి చెర నుంచి తప్పించుకున్న ఆ యువతి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం బయటకు వచ్చింది.

యువతిపై అత్యాచారం చేసిన నిందితుడు ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. పోలీసులు అతడి ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. బాధితురాలు, పోలీసుల వివరాల ప్రకారం.. యువతి నవంబర్9న బంధువుల ఇంట్లో జరిగే పెళ్లికి హాజరైంది. చుట్టు పక్కల ఉన్న ప్రాంతాలను చూడడానికి ఆ యువతి ఇంటి నుంచి బయటకు వచ్చింది. అయితే బుండి జిల్లాకు చెందిన ఫోరులాల్ అనే వ్యక్తి ఆ విషయాన్ని గమనించాడు. ఈ చుట్టు పక్కల ఇంకా అందమైన ప్రదేశాలు ఉన్నాయని మాయ మాటలు చెప్పాడు. తనతో బయటకు వస్తే వాటిని చూపిస్తానని నమ్మబలికాడు. అతని మాయ మాటలు నమ్మిన ఆ యువతి ఆ వ్యక్తి మోటారు సైకిల్‌ ఎక్కింది. దీంతో అతడు ఆమెను కోట జిల్లాలోని మందనాకు దగ్గరలో ఉండే ఓ అడవికి తీసుకెళ్లాడు. ఆ తర్వాత యువతిని కట్టేశాడు. 14 రోజుల పాటు ఆమెపై దారుణంగా అఘాయిత్యానికి పాల్పడ్డాడు.

బయటపడింది ఇలా…

14 రోజుల పాటు అత్యాచారరం చేసిన నిందితుడు యువతిని అక్కడే ఉంచి బయటకు వెళ్లాడు. దీంతో ఆ యువతి పడేసిన తన మొబైల్ ను వెతికి తన తండ్రికి ఫోన్ చేసింది. తండ్రికి జరిగిన విషయాన్ని మొత్తం చెప్పింది. దీంతో బాధితురాలి తండ్రి ఆమె చెప్పిన ప్రదేశానికి వెళ్లి కూతురును తీసుకొచ్చాడు. అనంతరం పోలీస్ స్టేషన్‌లో తనకు జరిగిన అన్యాయంపై ఫిర్యాదు చేసింది. కేసును నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. బాధితురాలిని ఆరోగ్య పరీక్షల కోసం హాస్పటల్ కు తరలించినట్లు వెల్లడించారు.