Breaking News
  • కరోనా వైరస్ వ్యాప్తిని నిరోధించడానికి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు అనేక మంది ప్రముఖులు తమ మద్దతు తెలిపారు. ప్రభుత్వ ప్రయత్నాలకు ఆర్థికంగా అండగా నిలిచేందుకు బుధవారం భారీ ఎత్తున విరాళాలు అందించారు.
  • భక్తులు లేక భద్రాద్రి బోసిపోయింది.. సీతా రామ చంద్ర స్వామి వారి కల్యాణానికి కరోనా ఆటంకం ఏర్పడింది .. కరోనా వైరస్ విస్తరణకు సామాజిక దూరం పాటించడమే శరణ్యం కావడంతో ... నిరాడంబరంగా జగదబిరాముని కళ్యాణం జరిగితోంది.
  • జమ్మూకాశ్మీర్ లోని కొన్ని గ్రామాలు రెడ్ జోన్ గా ప్రకటన. రాజౌరి జిల్లాలోని మంజకోట్ తహసీల్‌కు చెందిన సరోలా, డెహ్రీధర, మంగల్ నార్, గంబిర్ ముగ్లాన్ & కోట్లి అనే 5 గ్రామాలు జమ్మూ లో రెడ్ జోన్‌లుగా ప్రకటించిన అధికారులు.
  • సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) సంచలన నిర్ణయం తీసుకుంది. దేశంలో కరోనా వైరస్ వల్ల లాక్ డౌన్ చేసిన నేపథ్యంలో ఒకటో తరగతి నుంచి 8వ తరగతి వరకు విద్యార్థులు అందర్నీ పాస్ చేసినట్టు ప్రకటించింది.
  • కరోనా వైరస్‌ను నియంత్రించడానికి తెలంగాణ ప్రభుత్వం పకడ్బందీగా పని చేస్తున్నదని అన్నారు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌. దేశంలో అన్ని రాష్ట్రాల కంటే ముందుగా తెలంగాణ లాక్‌డౌన్‌ ప్రకటించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.

అమ్మ కడుపులోనే పసికందుల్ని చిదిమేస్తున్నారు..

అర్హతులుండవు.. అనుమతులసలే ఉండవు.. కాసులకు కక్కుర్తి పడి బ్రూణహత్యలకు పాల్పడుతున్నారు.. ఇష్టరాజ్యంగా స్కానింగ్ సెంటర్ల నిర్వహిస్తూ లింగనిర్ధారణ చేస్తూనే ఉంటారు.. తనీఖీల్లో అడంగా దొరికిపోతున్న యధేచ్చగా దందా కొనసాగిస్తూనే ఉంటారు.
illegal abortion in chittoor district, అమ్మ కడుపులోనే పసికందుల్ని చిదిమేస్తున్నారు..

అర్హతులుండవు.. అనుమతులసలే ఉండవు.. కాసులకు కక్కుర్తి పడి బ్రూణహత్యలకు పాల్పడుతున్నారు.. ఇష్టరాజ్యంగా స్కానింగ్ సెంటర్ల నిర్వహిస్తూ లింగనిర్ధారణ చేస్తూనే ఉంటారు.. తనీఖీల్లో అడంగా దొరికిపోతున్నా యధేచ్చగా దందా కొనసాగిస్తూనే ఉంటారు.

చిత్తూరు జిల్లాలో ఎంబిబిఎస్‌లకు కొదువ లేకుండాపోతుంది.. చదువు డిగ్రీతో పనిలేకుండానే నకిలీ వైద్యులు దందా కొనసాగుతుంది.. ఏకంగా నర్సింగ్‌హోంలు.. ఆసుపత్రులు.. స్కానింగ్ సెంటర్లను నిర్వహిస్తూ దర్జాగా రాణిస్తున్నారు.. డబ్బులకోసం అబార్షన్‌లు, ఆపరేషన్‌లే కాదు లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహించి బ్రూణహత్యలకు పాల్పడుతున్నారు. జిల్లాలో పుట్టగొడుగులా విస్తరించిన స్కానింగ్ సెంటర్లు గుట్టుచప్పుడు కాకుండానే ఈ వ్యవహారాన్ని నడిపిస్తున్న వైనం తనిఖీల్లో బట్టబయలు అవుతోంది. పీలేరు నోబుల్‌ నర్సింగ్ హోం నిర్వహకుడు డాక్టర్ బాషా స్కానింగ్ చేస్తూ.. వైద్య ఆరోగ్యశాఖ అధికారుల దాడుల్లో అడ్డంగా దొరికిపోయాడు. అర్హత లేకుండా వైద్యం చేస్తూ పట్టుబడటంతో స్కానింగ్ సెంటర్‌ను సీజ్‌ చేశారు..

మరోవైపు పీలేరు, మదనపల్లి, పలమనేరు, చిత్తూరు ప్రాంతాల్లో కలకత్తా వైద్యం పేరుతో పైల్స్‌ నివారణకు చిక్సిత్‌ సెంటర్‌ బట్టబయలు కాగా.. గంగాధర నెల్లూరు మండలం పోలినాయుడుపల్లిలో కిడ్నీలో రాళ్లు తీస్తామంటూ మోసానికి పాల్పడుతున్న విజయ, జగన్నాధం దంపతుల గుట్టురట్టు చేశారు డీఎమ్‌హెచ్ఓ అధికారి రమాదేవి. మిడిమిడి జ్ఞానంతో పీన్‌డిటి చట్టాన్ని నీరుగార్చుతూ స్కానింగ్ సెంటర్లు అక్రమాలకు పాల్పడుతుంటే.. మరోవైపు బ్రూణహత్యలతో నకిలీ వైద్యులు దందా కొనసాగిస్తున్న వైనం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ తనీఖీలతో తేటతెల్లం అవుతోంది.

ఇది కూడా చదవండి : హీరో ధనుష్‌కు మదురై హైకోర్టు షాక్..బర్త్ సర్టిఫికెట్ ఎక్కడ..?

Related Tags