ఆ మందు కరోనాకు మంచిదే.. యుఎస్

కరోనా వ్యాధి చికిత్సకు రెమ్ డెసివిర్ మందు మంచిదేనని అమెరికాలోని నేషనల్ ఇన్స్ టి ట్యూట్ ఆఫ్ ఎలర్జీ, ఇన్ఫెక్షియస్ డిసీజెస్ సంస్థ ప్రకటించింది. ఈ సంస్థ హెడ్ ఆంథోనీ ఫోసీ  వైట్ హౌస్ లో మీడియాతో మాట్లాడుతూ..

ఆ మందు కరోనాకు మంచిదే.. యుఎస్
Remdesivir
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Apr 30, 2020 | 2:37 PM

కరోనా వ్యాధి చికిత్సకు రెమ్ డెసివిర్ మందు మంచిదేనని అమెరికాలోని నేషనల్ ఇన్స్ టి ట్యూట్ ఆఫ్ ఎలర్జీ, ఇన్ఫెక్షియస్ డిసీజెస్ సంస్థ ప్రకటించింది. ఈ సంస్థ హెడ్ ఆంథోనీ ఫోసీ  వైట్ హౌస్ లో మీడియాతో మాట్లాడుతూ.. కరోనా వైరస్ ను నాశనం చేయడంలో ఇది చక్కని ఫలితాలను కనబరిచిందన్నారు. గిలీద్ కంపెనీ ఉత్పత్తి చేసిన రెమ్ డెసిమిర్.. తీసుకున్న రోగులు త్వరగా కోలుకున్నారని, ఇతర మెడిసిన్స్ కన్నా ఇదే నాణ్యమైనదని నిరూపితమైందని అన్నారు. తమ సంస్థ అంతర్జాతీయంగా సుమారు వెయ్యి మంది రోగులకు ఈ మందును ఇఛ్చి ప్రయోగాత్మకంగా పరీక్షించగా.. ఇది తీసుకున్న రోగులు సగటున 11 రోజుల్లో రికవర్ అయ్యారన్నారు. ఇప్పటివరకు మలేరియా చికిత్సలో వాడే హైడ్రాక్సీక్లోరోక్విన్ మందు కన్నా ఇదే బాగా పని చేస్తోందని ఆయన అభిప్రాయపడ్డారు.