Trump: అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ట్రంప్‌ అందుకున్న బహుమతులెంటో తెలుసా.. తన నిర్ణయాలను వ్యతిరేకించిన వారు కూడా..

Gifts That CEOs Gave To Trump: అమెరికా చరిత్రలో అత్యంత వివాదాస్పద అధ్యక్షుడిగా పేరు తెచ్చుకున్నారు డొనాల్డ్‌ ట్రంప్‌. అధ్యక్ష పీఠాన్ని అధిరోహించిన తర్వాత నుంచీ తన వివాదాస్పద నిర్ణయాలతో ప్రపంచవ్యాప్తంగా..

Trump: అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ట్రంప్‌ అందుకున్న బహుమతులెంటో తెలుసా.. తన నిర్ణయాలను వ్యతిరేకించిన వారు కూడా..
Follow us

|

Updated on: Jan 22, 2021 | 8:22 AM

Gifts That CEOs Gave To Trump: అమెరికా చరిత్రలో అత్యంత వివాదాస్పద అధ్యక్షుడిగా పేరు తెచ్చుకున్నారు డొనాల్డ్‌ ట్రంప్‌. అధ్యక్ష పీఠాన్ని అధిరోహించిన తర్వాత నుంచీ తన వివాదాస్పద నిర్ణయాలతో ప్రపంచవ్యాప్తంగా వార్తల్లో నిలిచారు ట్రంప్‌. ఇక ట్రంప్‌ నిర్ణయాలు కొందరు సమర్థిస్తే ఎక్కువ వరకు మాత్రం వ్యతిరేకించారు. ఈ క్రమంలో ముఖ్యంగా అమెరికాకు చెందిన బడా సంస్థలైన గూగుల్‌ , యాపిల్‌, మైక్రోసాఫ్ట్‌ వంటి సంస్థలు ట్రంప్‌ వీసా విధానాలను తప్పుపడుతూ కోర్టు మెట్లెక్కాయి. ఇదిలా ఉంటే తాజాగా అమెరికా అధ్యక్ష పదవిని వీడిని ట్రంప్‌ ఫ్లోరిడాలోని తన సొంత రిసార్టుకు వెళ్లిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ట్రంప్‌ తాజాగా తన ఫైనాన్షియల్‌ రిపోర్ట్‌లో.. తాను అధ్యక్ష పదవిలో ఉన్నప్పుడు అందుకున్న కొన్ని బహుమతుల వివరాలను వెల్లడించారు. ఇందులో తన నిర్ణయాలను తప్పుపట్టిన యాపిల్‌ సీఈవో టిమ్‌కుక్‌ కూడా ఉండడం విశేషం. టిమ్‌ కుక్‌ నుంచి 5,999 డాలర్లు విలువ చేసే మాక్‌ ప్రో కంప్యూటర్‌ను బహుమతిగా అందుకున్నట్లు ట్రంప్ పేర్కొన్నారు. ఇక యాపిల్‌తో పాటు బోయింగ్, ఫోర్డ్ కంపెనీలు కూడా ట్రంప్‌కు బహుమతులు ఇచ్చాయి. ఫోర్డ్‌ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్‌ బిల్ ఫోర్డ్ ఒక లెదర్‌ జాకెట్, బోయింగ్ ప్రెసిడెంట్ డెన్నిస్‌ ములెన్‌బర్గ్‌ కస్టమైజ్డ్‌ గోల్ఫ్ క్లబ్‌ను బహుమతిగా ఇచ్చారట. ఇవే కాకుండా ఛాంపియన్‌షిప్‌ బెల్ట్‌, నేషనల్‌ మెమోరియల్‌ కాంస్య విగ్రహం, గోల్ఫ్‌ క్లబ్ కవర్‌, చేతి గ్లోజ్‌, గోల్ఫ్ బ్యాగ్, గొడుగు అధ్యక్షుడిగా ట్రంప్‌ అందుకున్న బహుమతుల జాబితాలో ఉన్నాయి.

Also Read: కరోనాకు చెక్ పెట్టిన ఆక్సఫర్డ్ శాస్త్రవేత్తలు.. మరో కొత్త ప్రయోగానికి శ్రీకారం.. స్ట్రెయిన్ వైరస్ అంతానికి ప్రయోగాలు..!