వావ్ ! రాకాసి తోడేలు.. ఏ నాటిది ?

Wolf dead body, వావ్ ! రాకాసి తోడేలు.. ఏ నాటిది ?

సైబీరియాలోని యాకుటియా ప్రాంతంలో పర్యటిస్తున్న రష్యన్ శాస్త్రవేత్తలకు ఒక చోట ఓ వింత రాకాసి జీవి మృతదేహం కనిపించింది. దీనిపై వారు పరిశోధనలు చేసి ఆశ్చర్యకరమైన విషయాన్ని కనుగొన్నారు. ఇది సుమారు 40 వేల సంవత్సరాల క్రితం నాటి భారీ తోడేలు అయి ఉండవచ్చునన్న అంచనాకు వారు వచ్చారు. మెదడుతో సహా దీని తలలోని ఇతర భాగాలు పాడవకుండా ఉండడం వారిని షాక్ కి గురి చేసింది. ప్రస్తుత జంతు జాలంలో మామూలు తోడేళ్ళ తల సుమారు 9 అంగుళాలు ఉంటే… ఈ భారీ తోడేలు తల దాదాపు 16 అంగుళాల పొడవు ఉంది. ఇప్పటివరకు తాము ఇలాంటి జంతు కళేబరాన్ని కనుగొనలేదని, పూర్తి స్థాయి కణజాలంతో ఒక తోడేలు నాడు జీవించి ఉండవచ్చన్న అభిప్రాయానికి వచ్చామని డాక్టర్ అల్బర్ట్ ప్రోటోపోపోవ్ అనే శాస్త్రవేత్త తెలిపారు. టోక్యో లోని జికియో యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ మెడిసిన్ ప్రొఫెసర్ ఒకరు ఈయనతో ఏకీభవిస్తూ.. ఈ రాకాసి జంతువు తలా లోని కండరాలు, వివిధ భాగాలు, మెదడు బాగానే ఉన్నట్టు పేర్కొన్నారు. ఈ తోడేలు పళ్ళు ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉన్నాయని ఇది ఎంతో ఆశ్చర్యంగా ఉందని ఆయన చెప్పారు. యకుటియా ప్రాంతంలో పర్మాఫ్రోస్ట్ (మంచుగడ్డలు నింపిన చోట) ఈ విచిత్ర రాకాసి తోడేలు కళేబరాన్ని అటవీ సిబ్బంది ప్రిజర్వ్ చేశారు. ఈ వింతను చూడడానికి పర్యాటకులు అక్కడికి పోటెత్తుతున్నారు.Wolf dead body, వావ్ ! రాకాసి తోడేలు.. ఏ నాటిది ?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *