ఇండియాలో చొరబడి దాడి చేశాం, పాకిస్తాన్ మంత్రి

జమ్మూ కాశ్మీర్ లోని పుల్వామాలో గతఏడాది జరిగిన ఉగ్రదాడికి తామే బాధ్యులమని పాకిస్తాన్ అంగీకరించింది. ఆ దాడిలో 40 మంది భారత జవాన్లు అమరులయ్యారు. పాక్ మంత్రి ఫాద్ చౌదరి గురువారం ఈ విషయాన్ని…

  • Umakanth Rao
  • Publish Date - 7:55 pm, Thu, 29 October 20

జమ్మూ కాశ్మీర్ లోని పుల్వామాలో గతఏడాది జరిగిన ఉగ్రదాడికి తామే బాధ్యులమని పాకిస్తాన్ అంగీకరించింది. ఆ దాడిలో 40 మంది భారత జవాన్లు అమరులయ్యారు. పాక్ మంత్రి ఫాద్ చౌదరి గురువారం ఈ విషయాన్ని నేషనల్ అసెంబ్లీలో ప్రస్తావించారు. మనం ఇండియాలో చొరబడి దాడి చేశాం..పుల్వామాలో మన విజయం ఇమ్రాన్ ఖాన్ నాయకత్వంలోని ప్రజల విజయం, మీరు, మనమంతా ఆ గెలుపులో భాగస్వాములం అని ఆయన వ్యాఖ్యానించారు. అయితే ఈ వ్యాఖ్యతో సభలో గందరగోళం రేగడంతో. చౌదరి కాస్త తన కామెంట్ ను సవరించారు. పుల్వామా ఘటన జరిగిన అనంతరం మనం ఇండియాపై దాడి చేశాం అన్నారు. ఆ తరువాత ఆయన ట్వీట్ చేస్తూ, అమాయకులను చంపడానికి  సాహసించలేకపోయామని, పాక్ విమానాలు పోరాట స్థావరాలను మాత్రం టార్గెట్ చేశాయని పేర్కొన్నారు.