నగరంలో మరో 8 వేల టాయిలెట్లు, ఉచితంగానే వినియోగించవచ్చు !

హైదరాబాద్ నగరంలో కొత్తగా ఎనిమిది వేల పబ్లిక్‌ టాయిలెట్లు అందుబాటులోకి రానున్నాయి. పార్కులు, ప్రభుత్వ స్థలాల్లో వీటిని నిర్మిస్తున్నారు.

నగరంలో మరో 8 వేల టాయిలెట్లు, ఉచితంగానే వినియోగించవచ్చు !
Follow us

|

Updated on: Sep 17, 2020 | 3:54 PM

హైదరాబాద్ నగరంలో కొత్తగా ఎనిమిది వేల పబ్లిక్‌ టాయిలెట్లు అందుబాటులోకి రానున్నాయి. పార్కులు, ప్రభుత్వ స్థలాల్లో వీటిని నిర్మిస్తున్నారు. జీహెచ్‌ఎంసీ ఆధ్వర్యంలోనే వీటి నిర్వహణ సాగనుంది. ప్రజంట్ రెండు వేల పబ్లిక్‌ టాయిలెట్లు ఉపయోగంలో ఉండగా, గాంధీ జయంతి రోజుకు 10 వేల మరుగుదొడ్లను అందుబాటులోకి తేవాలన్న లక్ష్యంతో జీహెచ్‌ఎంసీ పని చేస్తుంది.

కేంద్ర ప్రభుత్వ నియమనిబంధనల ప్రకారం ప్రతి వెయ్యి మందికి ఒక పబ్లిక్‌ టాయిలెట్ ఉండాలి. ఈ లెక్కన సీటీలో  కోటి జనాభాకు పది వేల పబ్లిక్‌ టాయిలెట్లు ఉండాలి. ప్రస్తుతం జీహెచ్‌ఎంసీ,  బీవోటీ, సులభ్‌, లూకేఫ్‌ల ఆధ్వర్యంలో అన్నీ కలిపి రెండు వేల వరకు ఉన్నాయి. వీటి సంఖ్యను పదివేలకు పెంచాలంటే కొత్తగా ఎనిమిది వేల టాయిలెట్ల నిర్మాణం జరగాలి. దీంతో సర్కిళ్ల ప్రాతిపదికన కొత్తగా ఎనిమిది వేల పబ్లిక్‌ టాయిలెట్లను నిర్మించాలని జీహెచ్‌ఎంసీ నిర్ణయించింది. ఇందులో భాగంగా గవర్నమెంట్ స్థలాలు, పార్కులు, అందుబాటులో ఉన్న ఖాళీ ప్లేసుల్లో వీటిని నిర్మిస్తున్నారు. ఈ ఎనిమిది వేల టాయిలెట్లలో జీహెచ్‌ఎంసీ పరిధిలో ఏడు వేలు నిర్మిస్తున్నారు. మిగిలిన వెయ్యి టాయిలెట్లను బీవోటీ పరిధిలో రానున్నాయి.

పబ్లిక్‌ టాయిలెట్లను నిర్మించడం పెద్ద ఖర్చుతో కూడుకున్న పని కాదు. కానీ వాటి నిర్వహణ మాత్రం కాస్త ఇబ్బందికరమే. సరైన పర్యవేక్షణ లేకపోతే త్వరగా పాడైపోయే ప్రమాదం ఉంటుంది. అంతేకాక వాటిని అలాగే వదిలేస్తే ఉపయోగించడానికి కూడా పనికిరావు. దీన్ని దృష్టిలో పెట్టుకొని నూతనంగా నిర్మిస్తున్న టాయిలెట్ల నిర్వహణ బాధ్యతను ప్రైవేట్‌ ఏజెన్సీల ఆధ్వర్యంలో  పూర్తిగా జీహెచ్‌ఎంసీయే చేపట్టాలని నిర్ణయించింది. ఇందుకోసం ప్రతి నెలా రెండు కోట్ల చొప్పున సంవత్సరానికి రూ.25 కోట్లు వరకు ఖర్చు చెయ్యనుంది. టాయిలెట్ల వినియోగానికి ఎలాంటి ఫీజు వసూలు చేయరాదని నిర్ణయించారు. ప్రస్తుతం యూజర్ ఛార్జీలు వసూలు చేస్తూ ఉండటంతో చాలా మంది వీటిని వినియోగించుకునేందుకు వెనుకాడుతున్నారని.. ఫలితంగా బహిరంగ మల, మూత్ర విసర్జన ద్వారా పరిసరాలు అపరిశుభ్రంగా తయారవుతున్నాయని అధికారులు అంచనాకు వచ్చారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని కొత్తగా నిర్మిస్తున్న పబ్లిక్‌ టాయిలెట్లు పూర్తి ఉచితంగా వినియోగించుకునేలా ఏర్పాట్లు చేస్తున్నామని చెబుతున్నారు.

Also Read :

ఒక్క రోజులో రేషన్ కార్డ్, జగన్ సర్కార్ నయా రికార్డ్

విశాఖ మణ్యంలో అంతు చిక్కని వ్యాధి, గిరిజనులు మృతి