సీజనల్ వ్యాధులపై జీహెచ్‌ఎంసీ ప్రత్యేక దృష్టి.. ప్రజలకు కీలక సూచనలు

వానాకాలంలో తరుముకొచ్చే అంటువ్యాధులపై జీహెచ్ఎంసీ ప్రత్యేక దృష్టి సారించింది. ఈ సందర్బంగా జీహెచ్‌ఎంసీ అధికారులు మాట్లాడుతూ.. హైరిస్క్ ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించి ఇంటెన్సివ్ శానిటేషన్, యాంటీ లార్వా స్ప్రేయింగ్ చేయాలని..

సీజనల్ వ్యాధులపై జీహెచ్‌ఎంసీ ప్రత్యేక దృష్టి.. ప్రజలకు కీలక సూచనలు
Follow us

| Edited By:

Updated on: May 24, 2020 | 12:32 PM

వానాకాలంలో తరుముకొచ్చే అంటువ్యాధులపై జీహెచ్ఎంసీ ప్రత్యేక దృష్టి సారించింది. ఈ సందర్బంగా జీహెచ్‌ఎంసీ అధికారులు మాట్లాడుతూ.. హైరిస్క్ ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించి ఇంటెన్సివ్ శానిటేషన్, యాంటీ లార్వా స్ప్రేయింగ్ చేయాలని కోరారు. అలాగే ప్రతీ గ్రామాల్లో ర్యాపిడ్ ఫీవర్ సర్వే, ఆరోగ్య శిబిరాలు నిర్వహించాలన్నారు. నీరు నిల్వ ఉన్న ప్రాంతాల్లో గాంబూషియా చేపలను విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేసుకోవాలని, బావుల్లో క్లోరినేషన్ చేయించాలన్నారు. విద్యా సంవత్సరం పున:ప్రారంభమయ్యే వారం ముందు నుంచి పాఠశాల ఆవరణలో ఉన్న పిచ్చి మొక్కలను తొలగించాలన్నారు. అలాగే పైప్‌ లైన్ లీకేజీలను అరికట్టాలని, అక్కడ బ్లీచింగ్ పౌడర్ చల్లించాలని వారు పేర్కొన్నారు.

కాగా ముఖ్యంగా దోమల నివారణపై ప్రత్యేక కార్యక్రమం తీసుకురావాలని అధికారులను ఆదేశించారు తెలంగాణ మంత్రి కేటీఆర్. పరిసరాల శుభ్రతతో పాటు వ్యక్తిగత శుభ్రత కూడా పాటించాలన్నారు. అందులోనూ కరోనా సమయం కాబట్టి మరింత జాగ్రత్తలు వహించడం ముఖ్యమన్నారు. ఇలా చేయడం ద్వారా.. డెంగ్యూ, మలేరియా, చికెన్ గున్యా వంటి సీజనల్ వ్యాధులను దూరంగా పెట్టొచ్చు అన్నారు.

కేటీఆర్ ఆదేశాలతో.. ఎల్బీనగర్‌లో దోమలపై యుద్ధం కార్యక్రమం చేపట్టారు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి. 33 ఫాగింగ్, 33 స్ప్రే మిషన్‌లను కార్యకర్తలకు అందజేశారు ఎమ్మెల్యే. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రజల భాగస్వామ్యంతోనే సీజనల్ వ్యాధుల నివారణ సాధ్యమవుతుందన్నారు. మూసి పారుతున్న ప్రాంతాల్లో డ్రోన్‌ల ద్వారా యాంటీ లార్వా ద్రావణాన్ని స్ప్రే చేస్తామన్నారు. 80 శాతం దోమల నివారణ లక్ష్యంగా.. దోమలపై యుద్ధం కార్యక్రమం చేపడతామన్నారు. కాగా వానాకాలంలో వచ్చే అంటు వ్యాధుల లక్షణాలు కరోనాతో దగ్గరగా ఉంటాయి. కానీ అది కరోనా కాదు. ప్రజలు భయపడవద్దంటూ వెల్లడించారు ఎమ్మెల్యే సుధీర్.

Read More:

బ్రేకింగ్: మరో బాలీవుడ్ నటుడికి కరోనా పాజిటివ్

మా అమ్మాయికి ప్రభాస్ లాంటోడు కావాలి… అనుష్క తల్లి

రైళ్లను ఎలా శానిటైైజ్ చేస్తున్నారో.. స్పెషల్ వీడియో రిలీజ్

ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..