GHMC Elections Results 2020:కౌంటింగ్ కేంద్రాల వద్ద ఉద్యోగుల ధర్నా..మరికాసేపట్లో అసలు లెక్కలు..

గ్రేటర్‌ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. స్వస్తిక్‌ గుర్తునే పరిగణనలోకి తీసుకోవాలన్న హైకోర్టు ఆదేశాల మేరకు ఓట్ల లెక్కింపు చేపట్టాలని, ఈ మేరకు కౌంటింగ్‌ కేంద్రాలకు..

GHMC Elections Results 2020:కౌంటింగ్ కేంద్రాల వద్ద ఉద్యోగుల ధర్నా..మరికాసేపట్లో అసలు లెక్కలు..
Follow us

| Edited By: Ram Naramaneni

Updated on: Dec 04, 2020 | 11:31 AM

గ్రేటర్‌ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. స్వస్తిక్‌ గుర్తునే పరిగణనలోకి తీసుకోవాలన్న హైకోర్టు ఆదేశాల మేరకు ఓట్ల లెక్కింపు చేపట్టాలని, ఈ మేరకు కౌంటింగ్‌ కేంద్రాలకు సమాచారం ఇవ్వాలన్ని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇదిలా ఉంటే, పలు చోట్ల కౌంటింగ్‌ కేంద్రాల వద్ద ఉద్యోగులు ఆందోళనకు దిగారు.

సనత్‌నగర్, హయత్‌నగర్‌ కౌంటింగ్ సెంటర్ల దగ్గర ఉద్యోగులు ధర్నాకు దిగారు. కౌంటింగ్‌ కోసం రెండు రోజులు శిక్షణ ఇచ్చారు. ఆర్డర్‌ కాపీ కూడా ఇచ్చి …ఓట్ల లెక్కింపునకు పిలిచి, ఇప్పుడు అవసరం లేదని పంపిస్తున్నారని ఆరోపించారు. పోలింగ్ కేంద్రం వద్ద దాదాపు 200 మంది ఉద్యోగులు వేచి ఉన్నారు. కావాల్సిన సిబ్బంది కంటే అధికంగా పిలిచారని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు.