సీఏఏకు వ్యతిరేకంగా తీర్మానించిన తొలి మునిసిపల్ కార్పొరేషన్

దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన సీఏఏ, ఎన్నార్సీలకు వ్యతిరేకంగా ఓ మునిసిపల్ కార్పొరేషన్ తీర్మానించింది. ఇప్పటి వరకు పలు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలతో పాటు కొన్ని బీజేపీ వ్యతిరేక పార్టీలు అధికారంలో వున్న రాష్ట్రాలు సీఏఏ, ఎన్నార్సీలను వ్యతిరేకిస్తున్నాయి. కానీ ఓ మునిసిపల్ కార్పొరేషన్ సీఏఏ, ఎన్నార్సీకి వ్యతిరేకంగా తీర్మానం చేయడం ఇదే తొలిసారి. అది కూడా తెలుగు రాష్ట్రాలకు చెందిన మునిసిపల్ కార్పొరేషన్ కావడం విశేషం. దేశంలో తొలిసారిగా ఓ మునిసిపల్ కార్పొరేషన్ స్థాయిలో కేంద్ర ప్రభుత్వ […]

సీఏఏకు వ్యతిరేకంగా తీర్మానించిన తొలి మునిసిపల్ కార్పొరేషన్
Follow us

| Edited By: Ram Naramaneni

Updated on: Feb 08, 2020 | 7:31 PM

దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన సీఏఏ, ఎన్నార్సీలకు వ్యతిరేకంగా ఓ మునిసిపల్ కార్పొరేషన్ తీర్మానించింది. ఇప్పటి వరకు పలు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలతో పాటు కొన్ని బీజేపీ వ్యతిరేక పార్టీలు అధికారంలో వున్న రాష్ట్రాలు సీఏఏ, ఎన్నార్సీలను వ్యతిరేకిస్తున్నాయి. కానీ ఓ మునిసిపల్ కార్పొరేషన్ సీఏఏ, ఎన్నార్సీకి వ్యతిరేకంగా తీర్మానం చేయడం ఇదే తొలిసారి. అది కూడా తెలుగు రాష్ట్రాలకు చెందిన మునిసిపల్ కార్పొరేషన్ కావడం విశేషం.

దేశంలో తొలిసారిగా ఓ మునిసిపల్ కార్పొరేషన్ స్థాయిలో కేంద్ర ప్రభుత్వ నిర్ణయంలో వ్యతిరేకత వ్యక్తమైంది. హైదరాబాద్ జీహెచ్ఎంసీ శనివారం జరిగిన సమావేశంలో సీఏఏ, ఎన్నార్సీలకు వ్యతిరేకంగా తీర్మానాన్ని ఆమోదించింది. సీఏఏ, ఎన్నార్సీలను వ్యతిరేకిస్తూ మేయర్ బొంతు రామ్మోహన్ ఆధ్వర్యంలో తీర్మానాన్ని ప్రతిపాదించగా ఒక్క బీజేపీ మాత్రమే వ్యతిరేకించింది. ఎంఐఎం సభ్యులు పెద్ద ఎత్తున ఆమోదం తెలపడంతో భారీ మెజారిటీతో సీఏఏ, ఎన్నార్సీలకు వ్యతిరేకిస్తూ తీర్మానం ఆమోదం పొందింది.

తొలుత శనివారం మధ్యాహ్నం సమావేశం ప్రారంభం కాగానే.. ముందుగా సీఏఏకు వ్యతిరేకంగా తీర్మానం చేయాలని ఎంఐఎం సభ్యులు పట్టుబట్టారు. కొద్దిసేపు మీనమేషాలు లెక్కించిన మేయర్ బొంతు రామ్మోహన్ చివరికి తమ పార్టీ విధానం కూడా అదే కావడంతో తీర్మానాన్ని ప్రతిపాదించేందుకు ముందుకొచ్చారు. అయితే, జీహెచ్ఎంసీకి సంబంధం లేని అంశం కాబట్టి తీర్మానం చేయాల్సిన అవసరం లేదని బీజేపీ కార్పొరేటర్లు అభ్యంతర పెట్టారు.

అయితే, బీజేపీ సభ్యులు తక్కువ సంఖ్యలో వుండడంతో వారి వాదన నిలవలేదు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆల్‌రెడీ సీఏఏకు వ్యతిరేకంగా ఇటీవల చేసిన వ్యాఖ్యలను ఉటంకిస్తూ.. సీఏఏ, ఎన్నార్సీలను వ్యతిరేకిస్తూ ఏక వాఖ్య తీర్మానాన్ని ప్రతిపాదించారు. టీఆర్ఎస్, ఎంఐఎం సభ్యుల మద్దతులో తీర్మానాన్ని ఆమోదించారు. తెలంగాణ ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థిస్తూ.. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ తీర్మానం చేసినట్లు జీహెచ్ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్ ప్రకటించారు. ఇదే విషయాన్ని ఎంఐఎం అధినేత అసదుద్దిన్ ఓవైసీ ట్విట్టర్‌లో కన్ఫామ్ చేశారు.

YCP నుంచి వచ్చే రియాక్షన్‌కి తట్టుకోలేరు..TDPకి సజ్జల వార్నింగ్
YCP నుంచి వచ్చే రియాక్షన్‌కి తట్టుకోలేరు..TDPకి సజ్జల వార్నింగ్
కేసీఆర్ చేసిన తప్పులే రేవంత్ కూడా చేస్తున్నారు: ఈటల రాజేందర్
కేసీఆర్ చేసిన తప్పులే రేవంత్ కూడా చేస్తున్నారు: ఈటల రాజేందర్
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!