Breaking News
 • స్పీకర్‌ తీరు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసే విధంగా ఉంది. సభలో స్పీకర్‌ తీసుకునే నిర్ణయాలు సీఎం తీసుకుంటున్నారు. స్పీకర్‌ సస్పెండ్‌ చేయకుండానే మార్షల్స్‌ బయటకు ఎలా తీసుకెళ్తారు. -మీడియా పాయింట్‌లో చినరాజప్ప. సీఎం కూడా రౌడీలా వ్యవహరిస్తున్నారు-చినరాజప్ప. సీఎం ఆదేశాలతోనే మార్షల్స్‌ నన్ను బయటకు తీసుకొచ్చారు. సస్పెండ్‌ చేయకుండా నన్ను బయటకు తీసుకురావడం.. సభా నిబంధనలకు విరుద్ధం-మీడియా పాయింట్‌లో చినరాజప్ప.
 • ప్రకాశం: ఒంగోలులో అపస్మారకస్థితిలో పడిఉన్న మహిళ. ఘటనా స్థలంలో మహిళ లోదుస్తులు, కండోమ్స్‌ గుర్తింపు. మహిళపై అత్యాచారం జరిగినట్టు అనుమానం. పోలీసుల సహకారంతో మహిళను ఆస్పత్రికి తరలింపు. మహిళ నోట్లో బియ్యం కుక్కి హత్యచేసేందుకు దుండగుల యత్నం. మహిళ ఊపిరితిత్తుల్లో బియ్యం గింజలు గుర్తించిన వైద్యులు. మహిళ పరిస్థితి విషమం.
 • శాసన మండలిలో వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లులపై చర్చ. 3 గంటలపాటు చర్చకు అనుమతించిన డిప్యూటీ చైర్మన్‌. పార్టీల వారీగా సమయం కేటాయించిన డిప్యూటీ చైర్మన్‌. టీడీపీకి 84 నిమిషాలు, వైసీపీకి 27 నిమిషాలు.. పీడీఎఫ్‌ 15 నిమిషాలు, బీజేపీకి 6 నిమిషాల సమయం కేటాయింపు.
 • శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌ నుంచి ఢిల్లీకి బయల్దేరిన పవన్‌కల్యాణ్‌. పవన్‌కల్యాణ్‌ వెంట నాదెండ్ల మనోహర్‌. రేపు మధ్యాహ్నం వరకు ఢిల్లీలో ఉండనున్న పవన్‌కల్యాణ్‌. పలువురు బీజేపీ పెద్దలను కలవనున్న పవన్‌కల్యాణ్.
 • తెలంగాణ భవన్‌ నుంచి ఎన్నికల సరళీని సమీక్షిస్తున్న మంత్రి తలసాని. నగర మేయర్‌ బొంతు రామ్మోహన్‌, జిల్లాల కోఆర్డినేటర్లు.

అధికారుల వార్నింగ్.. వాటిపై కూడా చలాన్లు తప్పవు..!

GHMC implements e-challans for garbage and banners in Hyderabad, అధికారుల వార్నింగ్.. వాటిపై కూడా చలాన్లు తప్పవు..!

ట్రాఫిక్ చలాన్ల తరహాలో జీహెచ్ఎంసీ చలాన్లను త్వరలోనే.. పూర్తిస్థాయిలో అమలు చేస్తామని జీహెచ్ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్ తెలిపారు. రోడ్లపై చెత్త వేసినా, ఫ్లెక్సీలు పెట్టినా, బహిరంగ ప్రదేశాల్లో మలమూత్ర విసర్జన చేసినా, వాల్ పోస్టర్లు అంటించినా వాటిని ఫోటోలు తీసి జరిమానాలు విధిస్తామన్నారు. హైదరాబాద్‌ నగర సుందరీకరణకు విఘాతం కలిగించే అంశాలపై జీహెచ్‌ ఎంసీ కఠినంగా వ్యవహరించనుంది.

GHMC implements e-challans for garbage and banners in Hyderabad, అధికారుల వార్నింగ్.. వాటిపై కూడా చలాన్లు తప్పవు..!

ఈ తరహాలో ఒక్క నెలలోనే ఇప్పటి వరకు 1085 నోటీసులు పంపి రూ.1.50 కోట్ల మేర జరిమానాలు విధించినట్లు మేయర్‌ బొంతు రామ్మెహన్‌ తెలిపారు. చలాన్ వేసిన 24 గంటల్లోగా చెత్తను తీసివేయకుంటే జరిమానా మరింత పెరుగుతుందన్నారు. వచ్చే శనివారం నుండి ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తే ఆన్‌లైన్‌ ద్వారా జరిమానా విధిస్తామన్నారు.

జరిమానాలు:

 • కుండీలో కాకుండా రోడ్లపై, బహిరంగ ప్రదేశాల్లో చెత్తవేస్తే: రూ.100
 • డ్రైయిన్లలో చెత్తవేస్తే: రూ.1000
 • షాపుల ముందు చెత్తవేస్తే: రూ.1000
 • రోడ్లపై బల్క్ గార్బేజ్ డంప్ చేస్తే: రూ.2000
 • బహిరంగ మూత్రవిసర్జన: రూ.100
 • గోడరాతలు: రూ.1000
 • ఒక్క వాల్ పోస్టర్‌కి: రూ. 2 వేలు
 • అక్రమ బ్యానర్లు, కటౌట్లకి: రూ.5 వేలు ఒక్కోదానికి
 • హానికారక పదార్థాలు, నిర్మాణవ్యర్థాల అక్రమ రవాణాపై మొదటిసారి: రూ.25 వేలు
 • రెండోసారి అదే నేరానికి పాల్పడితే: రూ.50 వేలు
 • మూడోసారి కూడా అది రిపీట్ చేస్తే: రూ.లక్ష జరిమానా

GHMC implements e-challans for garbage and banners in Hyderabad, అధికారుల వార్నింగ్.. వాటిపై కూడా చలాన్లు తప్పవు..!