గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది. ఈసారి బల్దియా బరిలో 150 డివిజన్లకు గాను 1,122 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. గ్రేటర్ లో మొత్తం ఓటర్ల సంఖ్య 74 లక్షల 67వేల 256 మంది. ఇక పోలింగ్ కోసం జంటనగరాల పరిధిలో 9,101 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. బ్యాలెట్ విధానంలో పోలింగ్ నిర్వహిస్తున్నారు. ఓటింగ్ కోసం మొత్తం 18,202 బ్యాలెట్ బాక్సులను వినియోగిస్తున్నారు. పలు కేంద్రాల్లో లైవ్ వెబ్ కాస్టింగ్ కు ఏర్పాట్లు చేశారు. పోలింగ్ విధుల్లో 36మందికిపైగా సిబ్బంది ఉన్నారు.
టీఆర్ఎస్-150, బీజేపీ-149, కాంగ్రెస్-146 చోట్ల పోటీ చేస్తున్నాయి. ఇక టీడీపీ-106, ఎంఐఎం-51 స్థానాల్లో అభ్యర్థులను నిలిపాయి. సీపీఐ-17, సీపీఎం-12, ఇతర పార్టీలు-76, స్వతంత్రులు-415 మంది పోటీలో ఉన్నారు. గ్రేటర్లో అతిపెద్ద డివిజన్ మైలార్దేవ్పల్లికాగా… అతిచిన్న డివిజన్ రాంచంద్రాపురం. పోలింగ్ ప్రశాంతంగా జరిగేందుకు 50 వేలమందికిపైగా పోలీసులతో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. 60 ఫ్లయింగ్ స్క్వాడ్లు, 30 స్టాటిస్టిక్ సర్వేలెన్స్ టీమ్లు నియమించారు. కరోనా నేపథ్యంలో పోలింగ్ కేంద్రాల వద్ద కొవిడ్ నిబంధనలు అమలు చేస్తున్నారు. ఆయా కేంద్రాల్లో మార్కింగ్ వేశారు.
Also Read :
గ్రేటర్ ఓటర్ ప్లీజ్ అటెన్షన్… ఓటర్ స్లిప్ పొందండిలా…
కచ్చితంగా ప్రతీ ఓటరు ఈ విషయాన్ని తెలుసుకోవాలి.. లేదంటే మీ ఓటు గాల్లో కలిసినట్టే..
దుబ్బాక టు స్టేట్ అసెంబ్లీ.. వయా గ్రేటర్ హైదరాబాద్.. కమలం పార్టీలో ముప్పిరిగొన్న కదనోత్సాహం
అప్పుడు.. ఇప్పుడు..ఎక్కడుంది.. గ్రేటర్ పోరులో కాంగ్రెస్ పార్టీ ఉత్థాన పతనాలు..
ప్రధాన పార్టీల మధ్య రసవత్తర పోరు.. జీహెచ్ఎంసీలో మేజిక్ ఫిగర్ 102.! మరి విజయం ఎవరిది.?
గ్రేటర్ ఎన్నికల్లో పతంగి పార్టీ టార్గెట్ 50.. పక్కా వ్యూహంతోనే గెలుపుపై ధీమా.!
గ్రేటర్ ఓటర్ స్లిప్ అందలేదా..? అయితే ఇలా సులువుగా పొందండి…