బండి సంజయ్‌పై టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ సంచలన వ్యాఖ్యలు.. చిల్లర కార్పొరేటర్ అంటూ..

జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ దూకుడు పెంచింది. ఇప్పటి వరకు సైలెంట్‌గా ఉన్న నేతలు ఇప్పుడిప్పుడే తమ నోటికి పని చెబుతున్నారు.

  • Ram Naramaneni
  • Publish Date - 4:18 pm, Wed, 25 November 20
బండి సంజయ్‌పై టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ సంచలన వ్యాఖ్యలు.. చిల్లర కార్పొరేటర్ అంటూ..

జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ దూకుడు పెంచింది. ఇప్పటి వరకు సైలెంట్‌గా ఉన్న నేతలు ఇప్పుడిప్పుడే తమ నోటికి పని చెబుతున్నారు. తాజాగా ఎంపీ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌పై తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించిన ఆయన.. కరీంనగర్‌లో చిల్లర కార్పొరేటర్‌గా గెలిచిన సంజయ్ ఇక్కడికి వచ్చి మతాల మధ్య చిచ్చుపెడుతున్నాడంటూ ఫైర్ అయ్యారు.

బండి సంజయ్ వ్యాఖ్యలు చూస్తుంటే ఆయనకు ఏమాత్రం రాజకీయ పరిపక్వత లేదని స్పష్టంగా అర్థమవుతోందని విమర్శించారు. ఇక బండి సంజయ్‌కు హైదరాబాద్‌ ఎక్కడుందో కూడా సరిగా తెలియదని, అలాంటి వ్యక్తిని రాష్ట్ర పార్టీకి అధ్యక్షుడిగా నియమిస్తే ఇలాగే ఉంటుందని ఉత్తమ్ తనదైన శైలిలో వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఇదిలాఉంటే, తమ పార్టీకి జీహెచ్ఎంసీ మేయర్ పీఠం కట్టబెడితే పాతబస్తీపై సర్జికల్ స్ట్రైక్ చేస్తామంటూ బండి సంజయ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై అన్ని పార్టీల నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు.