వేడెక్కిన గ్రేటర్ వార్.. కొనసాగుతున్న స్క్రూట్నీ ప్రక్రియ.. బీఫామ్‌ సమర్పించేందుకు రేపటి వరకు అవకాశం..!

గ్రేటర్‌ వార్‌ వేడెక్కింది. గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికల్లో వార్డు సభ్యుల ఎన్నికకు నామినేషన్ల ప్రక్రియ నిన్నటితో ముగిసింది. ఇప్పటికే నామినేషన్ల పర్వం ముగియగా.. ఇక స్క్రూట్నీ ప్రక్రియ కొనసాగుతోంది.

  • Balaraju Goud
  • Publish Date - 3:46 pm, Sat, 21 November 20

గ్రేటర్‌ వార్‌ వేడెక్కింది. గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికల్లో వార్డు సభ్యుల ఎన్నికకు నామినేషన్ల ప్రక్రియ నిన్నటితో ముగిసింది. ఇప్పటికే నామినేషన్ల పర్వం ముగియగా.. ఇక స్క్రూట్నీ ప్రక్రియ కొనసాగుతోంది. పార్టీల తరఫున నామినేషన్‌ దాఖలు చేసిన అభ్యర్థులు బీఫామ్‌ సమర్పించేందుకు రేపటి వరకు అవకాశం కల్పించినట్టు రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ పార్థసారధి తెలిపారు. బీ-ఫామ్‌ అందించేందుకు శనివారం వరకే అవకాశమిస్తున్నట్టు ఎస్‌ఈసీ మొదట ప్రకటించారు. రేపు నామినేషన్ల ఉపసంహరణకు ఆదివారం మధ్యాహ్నం 3గంటల వరకు గుడువు ఉందని, ఆ సమయం లోపు బీఫామ్‌ సంబంధిత రిటర్నింగ్‌ అధికారికి అందించాలని ఎస్‌ఈసీ సూచించారు. నామినేషన్లు ముగిసినందున నిన్నటి వరకే ఏఫామ్‌ అందించేందుకు గడువు ముగిసింది. ఇక నామినేషన్ల ఉపసంహరణ అనంతరం రేపు మధ్యాహ్నం 3గంటల తర్వాత బరిలో ఉన్న తుది అభ్యర్థుల జాబితాను రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించనుంది. తుది జాబితా ప్రకటనతో అసలు పోటీ ఉండే అభ్యర్థుల లెక్క తేలనుంది.

కాగా, మరోవైపు అన్నిపార్టీల నేతలు ఎప్పడు ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఇంటింటికి తిరుగుతూ ఓటర్లను ప్రసన్న చేసుకునే పనిలో పడ్డారు. అన్నిపార్టీ తమ స్టార్ క్యాపెంయినింగ్ లీడర్ల పేర్లను ప్రకటించాయి. ప్రచారం అధికార టీఆర్ఎస్ పార్టీ ముందు వరసలో ఉంది. ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు ఇవాళ్టి నుంచి ప్రచార యాత్ర మొదలు పెడుతున్నారు.