బీజేపీ ప్రభుత్వంపై 132 ఛార్జ్ షీట్లు వేయాలి.. అభివృద్ధిపై ఎన్డీయేది అంతా తప్పుడు ప్రచారం..

 • Ravi Kiran
 • Publish Date - 7:31 am, Wed, 25 November 20
బీజేపీ ప్రభుత్వంపై 132 ఛార్జ్ షీట్లు వేయాలి.. అభివృద్ధిపై ఎన్డీయేది అంతా తప్పుడు ప్రచారం..

GHMC Elections: జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో భాగంగా టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ వరుసగా మూడో రోజూ నగరంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఈ సాయంత్రం మూషిరాబాద్, అంబర్‌పేట్‌లలో రోడ్ షోలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆరేళ్లలో కేంద్ర ప్రభుత్వానికి పన్నుల రూపంలో తెలంగాణ రూ. 2.72 లక్షలు చెల్లిస్తే.. కేవలం రూ. 1.64 వేల కోట్ల రూపాయలు మాత్రమే తిరిగి ఇచ్చారని మండిపడ్డారు. మరోసారి వరద బాధితులకు ఆర్ధిక సాయం డిసెంబర్ 4 నుంచి పంపిణీ చేస్తామని మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చారు. ఈ ఆరేళ్లలో పేదవాడికి ఐదురూపాయలకే అన్నం పెట్టినం, బస్తీ బస్తీలో దావఖానాలు పెట్టినం అని కేటీఆర్ అన్నారు. తెలంగాణలో పక్కా లోకల్ ఎవరు అన్నది మనం ఆలోచించాలని కేటీఆర్ అన్నారు. హైదరాబాద్ గులాబీలు కావాలా, గుజరాత్ గులాంలు కావాల్నా ఆలోచించండి అని కేటీఆర్ అన్నారు. బీజేపీపై 132 ఛార్జ్ షీట్‌లు వేయాలని ధ్వజమెత్తారు. అభివృద్ధిపై బీజేపీ తప్పుడు ప్రచారం చేస్తోందని తీవ్ర విమర్శలు గుప్పించారు.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
 • 24 Nov 2020 19:47 PM (IST)

  కేటీఆర్ రోడ్ షో.. పేదవాడి సంక్షేమానికే టీఆర్ఎస్ ప్రభుత్వం పెద్ద పీట..

  జీహెచ్ఎంసీ ఎన్నికల్లో భాగంగా మంత్రి కేటీఆర్ నగరంలో రాంనగర్ చౌరస్తాలో రోడ్ షో నిర్వహించారు. పేదవాడి సంక్షేమానికి టీఆర్ఎస్ ప్రభుత్వం పెద్ద పీట వేస్తుందన్నారు. కేసీఆర్ హయాంలో పేద ప్రజలు సంతోషంగా ఉన్నారని చెప్పుకొచ్చారు. అన్నపూర్ణ సెంటర్ ద్వారా ఐదురూపాయలకే అన్నం పెట్టినం, వైద్యం కోసం బస్తీ బస్తీకి దావఖానాలు పెట్టించాం, లగ్గం చేసుకుంటే కళ్యాణ లక్ష్మీ, బిడ్డ పుడితే కేసీఆర్ కిట్, ఇక బిడ్డను స్కూల్‌కు పంపితే సన్న బియ్యంతో బువ్వ, హాస్టల్‌కు పంపితే… రూ. 1,20,000తో బట్టలు, బూట్లు, పుస్తకాలతో సహా మొత్తం ప్రభుత్వమే చూసుకుంటోందని కేసీఆర్ అన్నారు. అంతేకాదు కరోనా కాలంలో, వరదల సమయంలో కూడా పేదవాడికి అండగా నిలిచింది కేసీఆర్ ప్రభుత్వం అని మంత్రి కేటీఆర్ అన్నారు.

 • 24 Nov 2020 19:39 PM (IST)

  కేటీఆర్ రోడ్ షో.. సీఎం కేసీఆర్ హయాంలోనే తెలంగాణ అభివృద్ధి జరిగింది..

  జీహెచ్ఎంసీ ఎన్నికల్లో భాగంగా మంత్రి కేటీఆర్ నగరంలో రాంనగర్ చౌరస్తాలో రోడ్ షో నిర్వహించారు. కేసీఆర్ హయంలోనే రోడ్లు బాగుపడ్డాయని ఆయన చెప్పుకొచ్చారు. ఇందిరా పార్క్ నుంచి వీఎస్టీ వరకు రూ. 450 కోట్లతో స్టీల్ బ్రిడ్జ్ నిర్మించామని చెప్పుకొచ్చారు. మతం, కులం పేరుతో ఎలాంటి వివాదాలు లేకుండా అన్నదమ్ముల వలె కలిసిమెలిసి ఉన్నామని మంత్రి కేటీఆర్ అన్నారు. పేకాట క్లబులు, ఆకతాయిల ఆగడాలు, పోకిరిల పోకడలు, మత కల్లోలాలు, అల్లర్లు లేకుండా హైదరాబాద్ ప్రశాంతంగా ఉందని ఆయన అన్నారు.

 • 24 Nov 2020 19:26 PM (IST)

  కేటీఆర్ రోడ్ షో.. ప్రతిపక్ష నేతల విమర్శలకు ధీటుగా స్పందించిన మంత్రి..

  జీహెచ్ఎంసీ ఎన్నికల్లో భాగంగా మంత్రి కేటీఆర్ నగరంలో రాంనగర్ చౌరస్తాలో రోడ్ షో నిర్వహించారు. ఐదేళ్ల క్రిందట మీ అభిమానంతోనే 99 స్థానాల్లో గెలుపొందామని.. ఈసారి కూడా అదే అభిమానం చూపించాలని మంత్రి కేటీఆర్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రతిపక్షాల విమర్శలపై తీవ్రంగా స్పందించారు.

  తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఎప్పటి నుంచో ఉన్న కరెంట్ సమస్యను తీర్చుకున్నామని ఆయన తెలిపారు. అలాగే శాశ్వతంగా తాగునీటి సమస్యను అధిగమించేందుకు కేశవాపురంలో రిజర్వాయర్ నిర్మిస్తున్నామని.. ఏడాది తిరిగేలోపు దాన్ని పూర్తి చేస్తామని.. ప్రతీ రోజూ తాగునీటిని అందిస్తామని మంత్రి కేటీఆర్ అన్నారు.

 • 24 Nov 2020 19:07 PM (IST)

  కేటీఆర్ రోడ్ షో.. హైదరాబాద్ ప్రజలకు మరో గుడ్ న్యూస్ చెప్పిన మంత్రి..

  జీహెచ్ఎంసీ ఎన్నికల్లో భాగంగా మంత్రి కేటీఆర్ నగరంలో విస్తృతంగా రోడ్ షోలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అన్ని బస్తీలలో, కాలనీలలో, అపార్ట్‌మెంట్లలో 20 వేల లీటర్ల తాగునీటిని వాడుకునే వాళ్లకు బిల్లు లేదని స్పష్టం చేశారు. పేదవాడికి సహాయం చేసే దమ్మున్న నాయకుడు కేసీఆర్.. అని తప్పకుండా ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారని ఆయన అన్నారు.