జోరందుకున్న గ్రేటర్ ప్రచారం.. రోడ్ షోలో ముఖ్యనేతలు.. 28వ తేదీన సీఎం కేసీఆర్ బహిరంగసభ

గ్రేటర్ ఎన్నికలను అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి. ఎన్నికల ప్రచారం పీక్‌ స్టేజ్‌కు చేరుకోబోతోంది.

జోరందుకున్న గ్రేటర్ ప్రచారం.. రోడ్ షోలో ముఖ్యనేతలు..  28వ తేదీన సీఎం కేసీఆర్ బహిరంగసభ
Follow us

|

Updated on: Nov 21, 2020 | 4:39 PM

గ్రేటర్ ఎన్నికలను అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి. ఎన్నికల ప్రచారం పీక్‌ స్టేజ్‌కు చేరుకోబోతోంది. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు వారం రోజులు మాత్రమే సమయం ఉండటంతో పార్టీలు జోరు పెంచాయి. ఇప్పటికే అన్ని పార్టీలు స్టార్ క్యాంపెయింనింగ్ జాబితాను ప్రకటించాయి. మరో గంటలో కేటీఆర్ రోడ్‌షోలు ప్రారంభం అవుతాయి. తొలి రోడ్‌షో కూకట్‌పల్లి నుంచి కుత్బుల్లాపూర్‌ వరకు సాగుతుంది. గ్రేటర్‌లో ప్రచారం ముగియడానికి సరిగ్గా ఒక్క రోజు ముందు సీఎం కేసీఆర్‌ బహిరంగ సభ నిర్వహించబోతున్నారు. 28వ తేదీన మధ్యాహ్నం 12 గంటలకు హైదరాబాద్ నడిబొడ్డున ఎల్బీ స్టేడియంలో ముఖ్యమంత్రి సభ ఉంటుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. దీనికి BSNL, LIC సహా 20 సంస్థలకు చెందిన కార్మిక సంఘాల నేతలు హాజరుకానున్నారు.

ప్రభుత్వ రంగ సంస్థలను మోదీ ప్రభుత్వం దివాలా తీయిస్తోందని ఆరోపిస్తున్నారు సీఎం కేసీఆర్. LIC, రైల్వేను కూడా అమ్మేస్తున్నారని మండిపడ్డారు. వాళ్లందరి పక్షాన కేంద్రంపై యుద్ధం ప్రకటించారాయన. అందుకు తగ్గట్టే తొలి అడుగు పడబోతోంది. 28వ తేదీ మధ్యాహ్నం LB స్టేడియంలో సభ నిర్వహించబోతున్నారు సీఎం కేసీఆర్.