జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారానికి పార్టీల అగ్రనేతలు.. ఈ నెల 28న సీఎం కేసీఆర్‌ సభ.. ముస్తాబవుతున్న ఎల్బీ స్టేడియం

జీహెచ్ఎంసీ ఎన్నికల తేదీ దగ్గర పడుతున్న కొద్దీ అన్ని పార్టీలు ప్రచార జోరు పెంచాయి. కార్పొరేటర్ అభ్యర్థుల గెలుపు కోసం అగ్రనేతలు వీధి వీధీ తిరిగి ప్రచారం చేస్తున్నారు. బల్దియా పీఠమే లక్ష్యంగా అగ్ర నాయకత్వం సైతం కదనరంగంలో దూసుకుపోతున్నారు. ఏకంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ప్రచారానికి దిగుతున్నారు.

  • Balaraju Goud
  • Publish Date - 1:28 pm, Thu, 26 November 20

జీహెచ్ఎంసీ ఎన్నికల తేదీ దగ్గర పడుతున్న కొద్దీ అన్ని పార్టీలు ప్రచార జోరు పెంచాయి. కార్పొరేటర్ అభ్యర్థుల గెలుపు కోసం అగ్రనేతలు వీధి వీధీ తిరిగి ప్రచారం చేస్తున్నారు. బల్దియా పీఠమే లక్ష్యంగా అగ్ర నాయకత్వం సైతం కదనరంగంలో దూసుకుపోతున్నారు. ఏకంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ప్రచారానికి దిగుతున్నారు.

జీహెచ్‌ఎంసీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ నెల 28 సీఎం కేసీఆర్‌ ఎల్బీ స్టేడియంలో బహిరంగ సభ నిర్వహించనున్నారు. సీఎం కేసీఆర్ బహిరంగ సభకు ఎల్బీ స్టేడియం ముస్తాబవుతోంది. సభా వేదికను మంత్రి కేటీఆర్‌ పరిశీలించారు. ఇందులో భాగంగా సభా ఏర్పాట్లను మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌తో కలిసి పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కేటీఆర్‌ పరిశీలించారు. ఏర్పాట్లకు సంబంధించిన వివరాలను నగరం పోలీసు కమిషనర్ అంజనీ కుమార్‌ను అడిగి తెలుసుకున్నారు. బహిరంగ సభ సందర్భంగా స్టేడియం పరిసరాల్లో గట్టి బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నట్లు సీపీ తెలిపారు. ఇందులో భాగంగా స్టేడియం లోపల, చుట్టుపక్కల భద్రతా ఏర్పట్లకు సంబంధించిన అంశాలను సీఎం అంజనీ కుమార్‌ వివరించారు.

ఇదిలావుంటే జీహెచ్‌ఎంసీ ఎన్నికల ప్రచారంలో టీఆర్‌ఎస్‌ పార్టీ దూసుకెళ్తోంది. ప్రచార బాధ్యతలను భుజాన వేసుకున్న మంత్రి కేటీఆర్‌ అన్నీ తానై వ్యవహరిస్తున్నారు. పార్టీ అభ్యర్థుల విజయాన్ని మంత్రి నగరంలో విస్తృతంగా రోడ్ షోలు నిర్వహిస్తున్నారు. మరోవైపు, పార్టీ అభ్యర్థుల పక్షాన మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రచారం నిర్వహిస్తున్నారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికలు వచ్చే నెల 1న జరుగనున్నాయి. ఫలితాలు డిసెంబర్‌ 4న వెలువడనున్నాయి.