గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో కాకపెంచిన అమిత్ షా టూర్.. పోరు టీఆర్ఎస్, బీజేపీ మధ్యేనా.?

గ్రేటర్ ఎన్నికల ప్రచార పర్వం అగ్రశ్రేణీ నేతలతో హోరెత్తిన సంగతి తెలిసిందే. గులాబీ పార్టీతో ఢీ అంటే ఢీ అంటున్న కమళదళం తరపున కేంద్ర హోం మంత్రి అమిత్‌షా నిర్వహించిన..

గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో కాకపెంచిన అమిత్ షా టూర్.. పోరు టీఆర్ఎస్, బీజేపీ మధ్యేనా.?
Follow us

| Edited By: Ram Naramaneni

Updated on: Dec 01, 2020 | 6:04 AM

గ్రేటర్ ఎన్నికల ప్రచార పర్వం అగ్రశ్రేణీ నేతలతో హోరెత్తిన సంగతి తెలిసిందే. గులాబీ పార్టీతో ఢీ అంటే ఢీ అంటున్న కమళదళం తరపున కేంద్ర హోం మంత్రి అమిత్‌షా నిర్వహించిన ప్రచార పర్వం తుది ఘట్టంలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా నిలిచింది. అటు గులాబీ పార్టీ.. ఇటు కమలదళం ప్రచారం చివరి రోజున పోటాపోటీగా రోడ్‌షోలు నిర్వహించారు.

గులాబీ పార్టీ తరపున మొదట్నించి అన్నీ తానై వ్యవహరించిన మునిసిపల్ మంత్రి కే.తారక రామారావు చివరి రోజున బీజేపీ టార్గెట్‌గా మాటల తూటాలను పేల్చిన సంగతి విదితమే. అంతేకాకుండా గ్రేటర్ హైదరాబాద్‌ను ప్రపంచ స్థాయి నగరంగా తీర్చి దిద్దేందుకు తమ ప్రభుత్వం కంకణబద్దమై వుందని చెప్పుకొచ్చారు. ఢిల్లీ నుంచి వస్తున్న నేతల మాటలను విశ్వసించ వద్దని ఆయన చివరి రోడ్ షోలో పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే.

ఇదిలా ఉంటే బీజేపీ చివరి అంకంలో జాతీయ స్థాయి నేతలను రంగంలోకి దింపింది. అధికార టీఆర్ఎస్ వైఫల్యాలను ప్రజలకు వివరించే ప్రయత్నం చేసింది. యుపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, మహారాష్ట్ర మాజీ సీఎం దేవంద్ర ఫడ్నవీస్, గ్రేటర్ ఎన్నికల ఇంఛార్జీ భూపేంద్ర యాదవ్ తదితరులు ప్రచారం నిర్వహించారు. మధ్యలో వచ్చిన తేజస్వీ సూర్య ఓయూ ఏరియాలో ప్రచారం నిర్వహించి, వివాదాస్పదునిగా నిలిచారు. వాడీవేడీ కామెంట్లతో వార్తల్లోకి ఎక్కారు.

ఇక ప్రచారం చివరి రోజున వచ్చిన కేంద్ర హోం మంత్రి అమిత్‌షా ప్రచారాన్ని పీక్ లెవెల్లోకి తీసుకు వెళ్ళారు. రోడ్‌షోకు జనం అధికంగా రావడంతో అమిత్ షా మధ్యలోనే తన షోను ముగించి.. బీజేపీ కార్యాలయానికి చేరుకోవాల్సి వచ్చింది. బీజేపీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో అమిత్‌షా టీఆర్ఎస్ ప్రభుత్వమే లక్ష్యంగా కామెంట్లు చేశారు.

మరోవైపు కాంగ్రెస్ పార్టీ నేతలు చివరి రోజున ప్రెస్ కాన్ఫరెన్సుకే పరిమితమయ్యారు. గల్లీ గల్లీలో కాంగ్రెస్ నేతలు పలువురు ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ అభ్యర్థులు పలు చోట్ల శరవేగంతో ప్రచారం నిర్వహించారు. తమ పరిధిలోని అన్ని ఏరియాలను కవర్ చేసేందుకు శ్రమించారు. ఇక బరిలో వున్న మరో కీలక పార్టీ ఎంఐఎం పాతబస్తీలో ప్రచార నిర్వహించింది. అసదుద్దీన్ ఓవైసీ, అక్బరుద్దీన్ ఓవైసీలు పలు వీధి సమావేశాల్లో పాల్గొని ప్రసంగించారు. మొత్తానికి ప్రచార పర్వం ఎలాంటి ఉద్రిక్తతలు లేకుండా ముగిసిన సంగతి తెలిసిందే.

దిన ఫలాలు (ఏప్రిల్ 17, 2024): వారి ఆదాయం బాగా పెరుగుతుంది..!
దిన ఫలాలు (ఏప్రిల్ 17, 2024): వారి ఆదాయం బాగా పెరుగుతుంది..!
సెంచరీతో చెలరేగిన బట్లర్.. కోల్‌కతాపై రాజస్థాన్ విజయం
సెంచరీతో చెలరేగిన బట్లర్.. కోల్‌కతాపై రాజస్థాన్ విజయం
47 కోట్ల విలువైన ప్లేయర్లు రిజర్వ్ బెంచ్‌పైనే! RCBనిఅమ్మిపారేయండి
47 కోట్ల విలువైన ప్లేయర్లు రిజర్వ్ బెంచ్‌పైనే! RCBనిఅమ్మిపారేయండి
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
స్టార్ హీరోస్ అందరూ సెట్స్ లోనే.! కానీ నో సినిమా అప్డేట్.!
స్టార్ హీరోస్ అందరూ సెట్స్ లోనే.! కానీ నో సినిమా అప్డేట్.!
సౌందర్య మరణంపై సీనియర్ హీరో కామెంట్స్..
సౌందర్య మరణంపై సీనియర్ హీరో కామెంట్స్..
నిద్రపట్టడం లేదా..? చిరాకు పడుతున్నారా..? రాత్రివేళ ఇలా చేస్తే..
నిద్రపట్టడం లేదా..? చిరాకు పడుతున్నారా..? రాత్రివేళ ఇలా చేస్తే..
వేసవిలో మజ్జిగా తాగడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయో తెలుసా?
వేసవిలో మజ్జిగా తాగడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయో తెలుసా?
సునీల్ నరైన్ విధ్వంసకర సెంచరీ.. రాజస్థాన్ టార్గెట్ ఎంతంటే?
సునీల్ నరైన్ విధ్వంసకర సెంచరీ.. రాజస్థాన్ టార్గెట్ ఎంతంటే?
ఊరిస్తున్న వెయ్యి కోట్లు.. టాలీవుడ్ లో కుంభస్థలాన్ని కొట్టేదెవరు?
ఊరిస్తున్న వెయ్యి కోట్లు.. టాలీవుడ్ లో కుంభస్థలాన్ని కొట్టేదెవరు?
భారతీయుడిని చంపిన పాకిస్థాన్‌ డాన్‌ సర్ఫరాజ్‌ హతం.!
భారతీయుడిని చంపిన పాకిస్థాన్‌ డాన్‌ సర్ఫరాజ్‌ హతం.!
ఆ నలుగురు హీరోలతో సినిమాటిక్‌ యూనివర్స్‌.? సందీప్‌ రెడ్డి వంగా.?
ఆ నలుగురు హీరోలతో సినిమాటిక్‌ యూనివర్స్‌.? సందీప్‌ రెడ్డి వంగా.?
ఇదికదా అసలైన పుట్టిరోజు సెలబ్రేషన్ అంటే.. వీడియో వైరల్.
ఇదికదా అసలైన పుట్టిరోజు సెలబ్రేషన్ అంటే.. వీడియో వైరల్.
విమానంలో ప్రయాణికులు భయానక అనుభవం..ఏం జరిగిందంటే.!
విమానంలో ప్రయాణికులు భయానక అనుభవం..ఏం జరిగిందంటే.!
నా జీవితంలో శివుడు అద్భుతాలు చేశాడు.! కాఫీ కూడా దొరికని పరిస్థితి
నా జీవితంలో శివుడు అద్భుతాలు చేశాడు.! కాఫీ కూడా దొరికని పరిస్థితి
వందల కోట్ల ఆస్తిని వదిలేసి.. సన్యాసంలోకి భార్యభర్తలు..
వందల కోట్ల ఆస్తిని వదిలేసి.. సన్యాసంలోకి భార్యభర్తలు..
మండు వేసవిలో చల్లని కబురు.. 10 రోజులు వానలే వానలు.!
మండు వేసవిలో చల్లని కబురు.. 10 రోజులు వానలే వానలు.!
భక్తులకు గుడ్ న్యూస్‌.. ఇంటి వద్దకే భద్రాద్రి రామయ్య తలంబ్రాలు.!
భక్తులకు గుడ్ న్యూస్‌.. ఇంటి వద్దకే భద్రాద్రి రామయ్య తలంబ్రాలు.!
అతనితో డేటింగ్ చేసేటప్పుడు నన్ను చాలా అన్నారు.. ప్రియమణి ఎమోషనల్!
అతనితో డేటింగ్ చేసేటప్పుడు నన్ను చాలా అన్నారు.. ప్రియమణి ఎమోషనల్!
కరిచినపామును వెంటపెట్టుకుని ఆస్పత్రికి వెళ్లిన మహిళ..ఆ తర్వాత.!
కరిచినపామును వెంటపెట్టుకుని ఆస్పత్రికి వెళ్లిన మహిళ..ఆ తర్వాత.!