దుబ్బాక టు స్టేట్ అసెంబ్లీ.. వయా గ్రేటర్ హైదరాబాద్.. కమలం పార్టీలో ముప్పిరిగొన్న కదనోత్సాహం

దేశంలో కమల వికాసానికి విస్తృతంగా కవాటాలు తెరచుకుంటున్నాయి. పెద్ద రాష్ట్రాలే కాదు, చిన్న రాష్ట్రాలలోనూ, అందులోనూ స్థానిక ఎన్నికల్లో సైతం బీజేపీ విజయదుంభిని మోగించడానికి తహతహలాడుతోంది.

దుబ్బాక టు స్టేట్ అసెంబ్లీ.. వయా గ్రేటర్ హైదరాబాద్.. కమలం పార్టీలో ముప్పిరిగొన్న కదనోత్సాహం
Follow us

| Edited By: Ram Naramaneni

Updated on: Dec 01, 2020 | 6:10 AM

దేశంలో కమల వికాసానికి విస్తృతంగా కవాటాలు తెరచుకుంటున్నాయి. పెద్ద రాష్ట్రాలే కాదు, చిన్న రాష్ట్రాలలోనూ, అందులోనూ స్థానిక ఎన్నికల్లో సైతం బీజేపీ విజయదుంభిని మోగించడానికి తహతహలాడుతోంది. సమయానికి, సందర్భానికి తగినట్టు పావులు కదుపుతోంది. ఎప్పటికప్పుడు సాధారణ స్థానిక పంచాయతీ ఎన్నికల నుంచి అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలవరకు ఒక్కో స్థానాన్నీ (సీటును) అధిగమిస్తూ (గెలుచుకుంటూ) దేశవ్యాప్త కమల ‘సువాసనలు’ వెదజల్లే ప్రయత్నంలో ముందుకు సాగుతోంది.

అసెంబ్లీ. లోక్ సభ ఉపఎన్నికల్లోనూ తన సత్తా చాటుతోంది. ఇందుకు ఉదాహరణగా ఇటీవల మధ్యప్రదేశ్, కర్ణాటకవంటి రాష్ట్రాల్లో జరిగిన ఉప ఎన్నికల్లో విజయాలే సాక్ష్యం. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే..తెలంగాణ రాజధాని హైదరాబాద్ లో జరగనున్న మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలను సైతం ఈ పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకోవడమే.. ఈ ఎన్నికల్లో విజయం ద్వారా దీన్ని తన గేట్ వే గా ఉపయోగించుకోవాలన్నది బీజేపీ ధ్యేయం.

తెలంగాణ సీఎం కేసీఆర్ కు, ఆర్ధిక మంత్రి హరీష్ రావుకు మంచి పట్టున్న దుబ్బాక అసెంబ్లీ నియోజకవర్గానికి ఇటీవల జరిగిన ఉప ఎన్నికల్లో పాలక టీఆర్ఎస్ ను ఓడించి సాధించిన విజయం ఊపుతో జీహెచ్ఎంసీ ఎన్నికల్లోనూ సత్తా చాటేందుకు, హైదరాబాద్ మేయర్ పదవిని దక్కించుకునేందుకు భారీ ఎత్తున అధిష్టానాన్ని మోహరించింది. దేశంలోని ఒక అతి పెద్ద జాతీయ పార్టీ,,ఒక సాధారణ కార్పొరేషన్ ఎన్నికలను తన పొలిటికల్ మైలేజీకి వినియోగించుకోవడం అత్యంత ప్రధానమైన విషయం.

బీజేపీ అతిరథ మహారథులు హోమ్ మంత్రి అమిత్ షా, పార్టీ అధ్యక్షుడు జేపీ.నడ్డా, యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, కేంద్ర మంత్రులు స్మృతి ఇరానీ, ప్రకాష్ జవదేకర్, మహారాష్ట్ర మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్, యువ నేత తేజస్వి సూర్యవంటివారంతా హైదరాబాద్ లో మోహరించారంటే ఈ ఎన్నికలను ఎంత ముఖ్యమైనవిగా పరిగణించారో అర్థమవుతుంది. ఒక రాజకీయ విశ్లేషణ ప్రకారం.. సుమారు మూడేళ్ళ క్రితమే..2017 లో భువనేశ్వర్ లో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడిన అమిత్ షా.. బీజేపీని పాన్ ఇండియా పార్టీగా మారుస్తామని పేర్కొన్నారు. అంటే పంచాయత్ నుంచి పార్లమెంట్ వరకు పవర్ లో ఉన్న పార్టీగా మార్చాలన్నదే ధ్యేయమన్నారు.

ఒక విధంగా ఇది పీపీపీ అప్రోచ్ అన్నమాట ! తాము బలహీనంగా ఉన్న చోట బలోపేతం కావాలన్నదే ధ్యేయమన్నారు. తమిళనాడు, ఒడిషా . కేరళ, ఏపీ, తెలంగాణ వంటి రాష్ట్రాలలో బీజేపీ బలంగా లేక పోవచ్ఛుగాక ! కానీ తెలంగాణ విషయానికి వచ్ఛేసరికి ఈ ట్రెండ్ క్రమంగా మారుతోంది.(ఒక్క పంజాబ్ లో మాత్రం కాంగ్రెస్ హవా సాగుతోంది).ఇటీవలి బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే విజయం కూడా చెప్పుకోదగ్గదే !

ఇక్కడ ముఖ్యమైన విషయం ఏమిటంటే ఒడిషా రాష్ట్రంలో అనుసరించిన ట్రెండ్ నే తెలంగాణాలో..హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో అనుసరించాలన్నది పార్టీ ఉద్దేశంగా కనబడుతోంది. ఒడిశాలో స్థానిక సంస్థలకు జరిగిన ఎన్నికల్లో ఈ పార్టీ పాలక బిజూ జనతా దళ్ కు గట్టి పోటీని ఇఛ్చి కాంగ్రెస్ పార్టీని మూడో స్థానానికి దిగజార్చింది. ఆ ఎన్నికల్లో తన స్థానాలను గణనీయంగా పెంచుకోగలిగింది. ఇక తెలంగాణాలో 2018 లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తాను ఒక్క స్థానాన్ని గెలుచుకుంది. 7 శాతం ఓట్లను సాధించింది.

2019 లోక్ సభ ఎన్నికల్లో 4 సీట్లను గెలిచి 19.45 శాతం ఓట్లను రాబట్టింది. నాటి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మూడు స్థానాలను మాత్రమే దక్కించుకుంది. ఇలా బీజేపీ ఒక్కో మెట్టూ ఎక్కుతూ తన స్థానాన్ని పదిలపరచుకుంటోంది. నాడు నిజామాబాద్ లోక్ సభ ఎన్నికలో టీ ఆర్ ఎస్ నేత. సీఎం కేసీఆర్ కుమార్తె కవిత ఓడిపోయి బీజేపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ విజయం సాధించిన విషయం గమనార్హం.

ఇప్పుడు హైదరాబాద్ లో మంచి పట్టున్న ఎంఐ ఎం కి గట్టి సవాల్ విసరాలన్నది కూడా బీజేపీ లక్ష్యం. ఈ పార్టీ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ, పాలక టీఆర్ఎస్ మంచి దోస్తానా పార్టీలు. కేసీఆర్ నాయకత్వంలోని తెలంగాణ రాష్ట్ర సమితి, ఒవైసీ నేతృత్వంలోని ఎంఐఎం భాగస్వామ్యపార్టీలుగా కొనసాగుతున్నాయి. 2016 లో జరిగిన జీ హెచ్ ఎం సి ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి 99 సీట్లు, ఎంఐఎం 44 సీట్లు గెలుచుకున్నాయి.

తెలంగాణ రాష్ట్ర సమితికి ప్రత్యామ్నాయంగా ఎదగాలన్నదే తమ ధ్యేయమని బీజేపీ నేత రామచంద్ర రావు అంటున్నారు. తాము ఈ ఎన్నికల్లో గెలిస్తే హైదరాబాద్ పేరును మార్చి భాగ్యనగరంగా చేస్తామని బీజేపీ నేతలు అప్పుడే ప్రకటించారు. ఇంతకీ చెప్పవచ్చేదేమిటంటే భారతీయ జనతా పార్టీ.. ఇక ఈ జీ హెచ్ ఎం సి ఎన్నికలను తన విజయానికి అనువుగా మార్చుకుంటుందా అన్నదే వెయ్యి డాలర్ల ప్రశ్న. బీహార్ ఎన్నికల్లో బీజేపీ విజయానికి గట్టి వ్యూహం పన్నిన పార్టీ నేత భూపేంద్ర యాదవ్ ఈ ఎన్నికల్లో ఎలాంటి వ్యూహం అనుసరిస్తారో చూడాలి !

ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..