రసవత్తర పోరులో టీఆర్ఎస్ అధిపత్యం.. కంచుకోటను పదిలం చేసుకున్న ఎంఐఎం.. రికార్ఢు స్థాయి సీట్లతో సత్తా చాటిన కమలం..

గ్రేటర్ ఎన్నికల సమరం ముగిసింది. ఒక్క నేరెడ్‌మెట్‌ వార్డు మినహా అన్ని వార్డుల ఫలితాలు వెలువడ్డాయి. ఈసారి అన్ని పార్టీల నేతలు ప్రతిష్టాత్మకంగా తీసుకుని బల్దియా ఎన్నికల యుద్ధం పాల్గొన్నారు. ఈ ఎన్నికల్లో అధిక స్థానాలు గెలుచుకున్న టీఆర్ఎస్ అతి పెద్ద పార్టీగా అవతరించగా.. భారతీయ జనతాపార్టీ రెండో స్థానంలో నిలిచి సత్తా చాటింది.

రసవత్తర పోరులో టీఆర్ఎస్ అధిపత్యం.. కంచుకోటను పదిలం చేసుకున్న ఎంఐఎం.. రికార్ఢు స్థాయి సీట్లతో సత్తా చాటిన కమలం..
Follow us

|

Updated on: Dec 05, 2020 | 11:03 AM

GHMC Election results 2020: గ్రేటర్ ఎన్నికల సమరం ముగిసింది. ఒక్క నేరెడ్‌మెట్‌ వార్డు మినహా అన్ని వార్డుల ఫలితాలు వెలువడ్డాయి. ఈసారి అన్ని పార్టీల నేతలు ప్రతిష్టాత్మకంగా తీసుకుని బల్దియా ఎన్నికల యుద్ధం పాల్గొన్నారు. ఈ ఎన్నికల్లో అధిక స్థానాలు గెలుచుకున్న టీఆర్ఎస్ అతి పెద్ద పార్టీగా అవతరించగా.. భారతీయ జనతాపార్టీ రెండో స్థానంలో నిలిచి సత్తా చాటింది. ఇక, మజ్లిస్‌ పార్టీ తన కోటను యథావిధిగా పదిల పర్చుకుంది. 2016 గ్రేటర్‌ ఎన్నికలతో పోలిస్తే అధికార టీఆర్ఎస్‌కు సీట్లు భారీగా తగ్గగా.. దూకుడుగా వెళ్లిన కమలనాథులు రికార్డుస్థాయిలో బలం పుంజుకొని నగరంలో ఓ బలమైన శక్తిగా అవతరించారు. గత ఎన్నికల మాదిరిగానే ఈసారి కూడా కాంగ్రెస్‌ చతికిలపడింది. 2009 నుంచి 2020 వరకు జరిగిన జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో ఓట్లు, పోలింగ్‌ సరళి, ఆయా పార్టీలు సాధించిన ఫలితాలను ఓసారి చూద్ధాం…

2020లో.. తాజాగా జరిగిన గ్రేటర్‌ ఎన్నికల్లో మొత్తంగా 74,67,256 ఓట్లకు గానూ.. 34,50,331 ఓట్లు పోలయ్యాయి. అంటే 46.55% ఓట్లు మాత్రమే పోలయ్యాయని ఎలక్షణ్ అధికారులు వెల్లడించారు. ఈ ఎన్నికల్లో మొత్తం 1,122 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. 2016 ఎన్నికలతో పోలిస్తే టీఆర్ఎస్ పార్టీకి గట్టి షాకే తగిలింది. గ్రేటర్‌లో ఆ పార్టీకి గతంలో 99 స్థానాలు గెలుచుకోగా.. ఆ సంఖ్య 55కి పడిపోయింది. ఎంఐఎం 44 స్థానాల్లో విజయకేతనం ఎగురవేసి తన కోటను పదిలపర్చుకుంది. ఇక, గ్రేటర్ పీఠమే లక్ష్యంగా పోరాడిన బీజేపీ.. భారీగా బలం పుంజుకొని 48 డివిజన్లలో కాషాయ జెండాను ఎగురవేసింది. అటు, కాంగ్రెస్ పార్టీ ఈసారి కూడా కేవలం రెండు స్థానాలకే పరిమితమై ఘోర పరాభవాన్నే చవిచూసింది.

2016లో.. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా అవతరించిన తర్వాత జీహెచ్‌ఎంసీకి 2016లో జరిగిన ఎన్నికల్లో బరిలోకి దిగిన టీఆర్ఎస్ తిరుగులేని విజయం సాధించి గ్రేటర్‌ పీఠం కైవసం చేసుకొంది. ఆ ఎన్నికల్లో మొత్తం 70,67,934 మంది ఓటర్లకు గానూ.. 33,60,543 మంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. మొత్తంగా చూస్తే 45.25% మాత్రమే పోలయ్యాయి. 2016 1,333 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. అయితే, 2016లో గ్రేటర్‌ ఎన్నికల్లో టీఆర్ఎస్ 150 స్థానాల్లో పోటీచేసి 99 స్థానాలు గెలుచుకొని చారిత్రక విజయం సాధించింది. 149 స్థానాల్లో పోటీచేసిన కాంగ్రెస్‌ కేవలం రెండు స్థానాలకు పడిపోయి ఘోర పరాభవం ఎదుర్కొంది. ఈ ఎన్నికల్లో బీజేపీ, టీడీపీ కలిసి పోటీ చేశాయి. 95 స్థానాల్లో పోటీచేసిన టీడీపీ ఒక్క స్థానం గెలుచుకోగా.. 55 స్థానాల్లో బరిలో దిగిన కమలనాథులు నాలుగు స్థానాల్లో గెలుపొందారు. ఇక ఎంఐఎం విషయానికి వస్తే.. 60 స్థానాల్లో పోటీచేసి 44 స్థానాల్లో విజయఢంకా మోగించింది.

2009లో.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 2009 జీహెచ్‌ఎంసీ పరిధిలోని 150 డివిజన్లలో మొత్తం 56,99,015 ఓట్లు ఉండగా.. 24,08,001 ఓట్లు పోలయ్యాయి. 44.15% మంది మాత్రమే ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఆ సమయంలో 1,310 మంది అభ్యర్థులు గ్రేటర్ ఎన్నికల్లో పోటీ చేశారు. కాంగ్రెస్‌ 149 స్థానాల్లో పోటీచేసి 52 స్థానాలు గెలుచుకోగా.. బీజేపీ 138 స్థానాల్లో అభ్యర్థులను బరిలో దించి కేవలం 5 స్థానాలే దక్కించుకోగలిగింది. ఎంఐఎం 70 స్థానాల్లో పోటీచేసి 43 స్థానాలు గెలుచుకోగా.. 139 స్థానాల్లో పోటీచేసిన టీడీపీ అభ్యర్థులు 45 స్థానాల్లో విజయం సాధించారు. ఆ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ పార్టీ పోటీ చేయలేదు. అయితే, మజ్లిస్‌తో కలిసి కాంగ్రెస్‌ మేయర్‌ పీఠాన్ని దక్కించుకోగలిగింది.

పొలిటికల్ కమాండర్‎లా మారిన సీఎం రేవంత్.. ఢిల్లీ హైకమాండ్ సపోర్ట్‎
పొలిటికల్ కమాండర్‎లా మారిన సీఎం రేవంత్.. ఢిల్లీ హైకమాండ్ సపోర్ట్‎
భారత్‌లో ఎయిర్‌ ట్యాక్సీలు వచ్చేది అప్పుడే.. ఇండిగో ప్రకటన
భారత్‌లో ఎయిర్‌ ట్యాక్సీలు వచ్చేది అప్పుడే.. ఇండిగో ప్రకటన
24 గంటల్లో 120 పబ్బుల్లో తాగేశాడు- గిన్నిస్ రికార్డ్ కొట్టేశాడు..
24 గంటల్లో 120 పబ్బుల్లో తాగేశాడు- గిన్నిస్ రికార్డ్ కొట్టేశాడు..
ఏపీలో అభ్యర్థుల ఆస్తి, అప్పుల చిట్టా ఇదే.. టాప్‎లో ఉన్నది ఎవరంటే
ఏపీలో అభ్యర్థుల ఆస్తి, అప్పుల చిట్టా ఇదే.. టాప్‎లో ఉన్నది ఎవరంటే
కూటమి నేతల్లో కలవరపెడుతున్న అసమ్మతి కుంపటి.. తెరపైకి రాజకీయ వేడి
కూటమి నేతల్లో కలవరపెడుతున్న అసమ్మతి కుంపటి.. తెరపైకి రాజకీయ వేడి
మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే.?
మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే.?
దిన ఫలాలు (ఏప్రిల్ 20, 2024): 12 రాశుల వారికి ఇలా..
దిన ఫలాలు (ఏప్రిల్ 20, 2024): 12 రాశుల వారికి ఇలా..
రాహులో రాహులా! లక్నో కెప్టెన్ సూపర్ ఇన్నింగ్స్.. చెన్నై చిత్తు
రాహులో రాహులా! లక్నో కెప్టెన్ సూపర్ ఇన్నింగ్స్.. చెన్నై చిత్తు
మూడేళ్లు.. 215 మ్యాచ్‌లు.. ఐపీఎల్ నుంచి సూపర్ ఓవర్ మాయమైనట్లేనా?
మూడేళ్లు.. 215 మ్యాచ్‌లు.. ఐపీఎల్ నుంచి సూపర్ ఓవర్ మాయమైనట్లేనా?
తండ్రయ్యాక ఆ అలవాట్లకు పూర్తిగా గుడ్ బై చెప్పేసిన హీరో నిఖిల్
తండ్రయ్యాక ఆ అలవాట్లకు పూర్తిగా గుడ్ బై చెప్పేసిన హీరో నిఖిల్