GHMC Election Results 2020 : బ్యాలెట్ బాక్సుల్లో అభ్యర్థుల భవిష్యత్తు.. గ్రేటర్ కౌంటింగ్ కేంద్రాల వివరాలు ఇవేః

గ్రేటర్ ఎన్నికల సమరం ముగిసింది.. బ్యాలెట్‌ బాక్సులు ఆయా కేంద్రాలకు తరలివెళ్లాయి. ఓటరు తీర్పు బ్యాలెట్‌ పెట్టెల్లో నిక్షిప్తమైంది.. అన్ని పార్టీల నేతలు, అభ్యర్థులు కౌంటింగ్‌పై దృష్టి పెట్టారు.  ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది.

GHMC Election Results 2020 : బ్యాలెట్ బాక్సుల్లో అభ్యర్థుల భవిష్యత్తు.. గ్రేటర్ కౌంటింగ్ కేంద్రాల వివరాలు ఇవేః
Follow us

|

Updated on: Dec 04, 2020 | 6:47 AM

గ్రేటర్ ఎన్నికల సమరం ముగిసింది.. బ్యాలెట్‌ బాక్సులు ఆయా కేంద్రాలకు తరలివెళ్లాయి. ఓటరు తీర్పు బ్యాలెట్‌ పెట్టెల్లో నిక్షిప్తమైంది.. అన్ని పార్టీల నేతలు, అభ్యర్థులు కౌంటింగ్‌పై దృష్టి పెట్టారు.  ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. 150 డివిజన్లకు గానూ మొత్తం 30 లెక్కింపు కేంద్రాల్లో ఎన్నికల సంఘం పటిష్ఠ ఏర్పాట్లు చేస్తోంది.

మరోవైపు రాజకీయ పార్టీలు ఆ రోజు అనుసరించాల్సిన వ్యూహాలను సిద్ధం చేసుకుంటున్నాయి. బ్యాలెట్లు కావడంతో కౌంటింగ్‌ ప్రక్రియ ప్రహసనంగా మారనుంది. ఫలితాలు వెల్లడయ్యేందుకు చాలా సమయం పట్టే అవకాశముందని భావిస్తున్నారు. ఆ రోజు అర్ధరాత్రి వరకు లెక్కింపు కొనసాగవచ్చని అధికారులు భావిస్తున్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని పార్టీలు తమ వ్యూహాలు సిద్ధం చేసుకుంటున్నాయి. అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో ఈ సారి ఎన్నికలు రసవత్తరంగా సాగాయి.

అయితే, ఈసారి పోలింగ్ శాతం తగ్గడంతో రాజకీయపార్టీల్లో ఆందోళన మొదలైంది. దీంతో ప్రతి బ్యాలెట్‌ పత్రాన్ని లెక్కించడం, చెల్లని ఓట్లు సరిచూసుకోవడం.. ఇలా ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించాల్సి ఉంటుంది. మెజార్టీలు తక్కువగా వచ్చే అవకాశం ఉన్నందున ప్రతి ఓటును అభ్యర్థులు కీలకంగా భావిస్తున్నారు. నమ్మకస్తులు, అన్నింటిపై అవగాహన ఉన్న కౌంటింగ్‌ ఏజెంట్లను అభ్యర్థులు ఎంచుకుంటున్నారు. చివరి ఓటు లెక్కించేందుకు రాత్రి వరకు పడితే.. అప్పటివరకు ఏజెంట్లు ఉండేలా ఏర్పాట్లు చేసుకుంటున్నాయి రాజకీయపార్టీలు.

గ్రేటర్ కౌటింగ్ కేంద్రాల వివరాలు ఇవేః

1 కాప్రా – శ్రీచైతన్య స్కూల్, నాచారం 2 ఉప్పల్ – జవహర్‌లాల్ నెహ్రూ పాలిటెక్నిక్ కాలేజ్, రామంతపూర్ 3 హయత్‌నగర్ – వర్డ్ అండ్ డీడ్ స్కూల్, హయత్‌నగర్ 4 ఎల్‌బీ నగర్ –  విక్టోరియా హోం, సరూర్‌నగర్ 5 సరూర్‌నగర్ – ఇండోర్ స్టేడియం, సరూర్‌నగర్ 6 మలక్‌పేట – ఇండోర్ స్టేడియం, అంబర్‌పేట 7 సంతోష్‌నగర్ – మహావీర్ ఇన్‌స్టిట్యూట్, బండ్లగూడ 8 చాంద్రాయణగుట్ట – అరోరా లీగల్ సైన్స్ అకాడమీ, బండ్లగూడ 9 చార్మినార్ – సిటీ కాలేజ్, హైకోర్టు రోడ్ 10 ఫలక్‌నుమా – కమలనెహ్రూ పాలిటెక్నిక్ కాలేజ్, నాంపల్లి 11 రాజేంద్రనగర్ – వెటర్నరీ సైన్స్ కాలేజ్, రాజేంద్రనగర్ 12 మెహిదీపట్నం v ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజ్, మాసాబ్‌ట్యాంక్ 13 కార్వాన్ – ఎల్‌బీ స్టేడియం, బాక్సింగ్ హాల్ 14 గోషామహల్ – నిజాం కాలేజ్ ఓపెన్ గ్రౌండ్ 15 ఖైరతాబాద్ – జీహెచ్ఎంసీ స్పోర్ట్స్ కాంప్లెక్స్, సనత్‌నగర్ 16 జూబ్లీహిల్స్ – సుల్తాన్ ఉలూమ్ కాలేజ్, బంజారాహిల్స్ 17 ముషీరాబాద్ – ఏవీ పీజీ కాలేజ్, దోమలగూడ 18 అంబర్‌పేట – రాంరెడ్డి దూరవిద్యా కేంద్రం, ఓయూ క్యాంపస్ 19 మల్కాజిగిరి – భవాన్స్ వివేకానంద కాలేజ్, డిఫెన్స్‌కాలనీ 20 సికింద్రాబాద్ – ఓయూ కాలేజ్ ఆఫ్ కామర్స్ 21 బేగంపేట – వెస్లీ డిగ్రీ కాలేజ్, బేగంపేట 22 యూసుఫ్‌గూడ – కేవీబీ ఇండోర్ స్టేడియం, యూసుఫ్‌గూడ 23 శేరిలింగంపల్లి – ఇండోర్ స్టేడియం, గచ్చిబౌలి 24 చందానగర్ v శాంటియా ది గ్లోబ్ స్కూల్, మియాపూర్ 25 పటాన్‌చెరు – పీజేఆర్ ఇండోర్ స్టేడియం, ,చందానగర్ 26 మూసాపేట్ – క్లాస్‌రూమ్ కాంప్లెక్స్, జేఎన్‌టీయూ, కేబీహెచ్‌బీ 27 కూకట్‌పల్లి – రిషి ఎంఎస్ ఐటీ కాలేజ్, హైదర్‌నగర్ 28 కుత్బుల్లాపూర్ – సుచిత్ర అకాడమీ, సుచిత్ర సర్కిల్ 29 గాజుల రామారం – సెయింట్ ఆన్స్ స్కూల్, పేట్ బషీరాబాద్ 30 అల్వాల్ –  లయోలా అకాడమీ, ఓల్డ్ అల్వాల్

కూలర్ కొనాలనుకునే వారికి గుడ్ న్యూస్.. బెస్ట్ బ్రాండ్లపై..
కూలర్ కొనాలనుకునే వారికి గుడ్ న్యూస్.. బెస్ట్ బ్రాండ్లపై..
అప్పుడురణ్‌బీర్.. ఇప్పుడు అలియా..బాబీ డియోల్‌కు మరో క్రేజీ ఛాన్స్
అప్పుడురణ్‌బీర్.. ఇప్పుడు అలియా..బాబీ డియోల్‌కు మరో క్రేజీ ఛాన్స్
పరిణితి చోప్రా ప్రెగ్నెంట్ ?.. హీరోయిన్ రియాక్షన్ వైరల్..
పరిణితి చోప్రా ప్రెగ్నెంట్ ?.. హీరోయిన్ రియాక్షన్ వైరల్..
లాంచింగ్‌కు సిద్ధమైన వన్‌ప్లస్‌ కొత్త ఫోన్‌.. ఫీచర్స్‌ ఇలా...
లాంచింగ్‌కు సిద్ధమైన వన్‌ప్లస్‌ కొత్త ఫోన్‌.. ఫీచర్స్‌ ఇలా...
బీఆర్‌ఎస్‌కు బిగ్‌ షాక్‌.. కాంగ్రెస్‌లోకి కడియం శ్రీహరి, కావ్య
బీఆర్‌ఎస్‌కు బిగ్‌ షాక్‌.. కాంగ్రెస్‌లోకి కడియం శ్రీహరి, కావ్య
ఇది మరుపురాని ప్రయాణం.. అల్లు అర్జున్ ఎమోషనల్..
ఇది మరుపురాని ప్రయాణం.. అల్లు అర్జున్ ఎమోషనల్..
మీ డబ్బు భద్రం.. లాభం అధికం.. ఐదు బెస్ట్ పెట్టుబడి పథకాలు ఇవే..
మీ డబ్బు భద్రం.. లాభం అధికం.. ఐదు బెస్ట్ పెట్టుబడి పథకాలు ఇవే..
ఇంటర్‌ కాలేజీలకు వేసవి సెలవులు ప్రకటించిన బోర్డ్‌.. ఎప్పటినుంచంటే
ఇంటర్‌ కాలేజీలకు వేసవి సెలవులు ప్రకటించిన బోర్డ్‌.. ఎప్పటినుంచంటే
ప్రసిద్ధ్ కృష్ణ స్థానంలో హనుమాన్ భక్తుడికి చోటు..
ప్రసిద్ధ్ కృష్ణ స్థానంలో హనుమాన్ భక్తుడికి చోటు..
గ్యాంగ్‌స్టర్‌ ముఖ్తార్‌ అన్సారీ గుండెపోటుతో మృతి..
గ్యాంగ్‌స్టర్‌ ముఖ్తార్‌ అన్సారీ గుండెపోటుతో మృతి..