ట్రాఫిక్ జామ్‌ సమస్యపై జీహెచ్ఎంసీ కొత్త ప్రయోగం

ట్రాఫిక్ జామ్ సమస్యతో రాజధాని హైదరాబాద్ నగరం అల్లాడిపోతోంది. అసలే వర్షాకాలం.. ఎక్కడికక్కడ నిలిచిపోయే వాహనాలతో రోడ్లన్నీ రద్దీగా మారుతున్నాయి. ముఖ్యగా సాఫ్ట్‌వేర్ కంపెనీలు అధికంగా ఉండే హైటెక్ సిటీ ప్రాంతంలో ఈ సమస్య మరీ ఎక్కువగా ఉంది. ట్రాఫిక్ జామ్‌తో వీఐపీలు సైతం తమ కార్లలోనే ఉండిపోవాల్సి వస్తోంది. అదే సమయంలో అంబులెన్స్ వంటి వాహనాలు మధ్యలోనే చిక్కుకుంటే పరిస్థితి ఊహించలేం. రోజురోజుకు పెరిగిపోతున్న ట్రాఫిక్ జామ్ సమస్య నుంచి బయటపడేందుకు జీహెచ్ఎంసీ కీలక నిర్ణయం […]

ట్రాఫిక్ జామ్‌ సమస్యపై  జీహెచ్ఎంసీ కొత్త ప్రయోగం
Follow us

| Edited By:

Updated on: Jun 28, 2019 | 4:51 PM

ట్రాఫిక్ జామ్ సమస్యతో రాజధాని హైదరాబాద్ నగరం అల్లాడిపోతోంది. అసలే వర్షాకాలం.. ఎక్కడికక్కడ నిలిచిపోయే వాహనాలతో రోడ్లన్నీ రద్దీగా మారుతున్నాయి. ముఖ్యగా సాఫ్ట్‌వేర్ కంపెనీలు అధికంగా ఉండే హైటెక్ సిటీ ప్రాంతంలో ఈ సమస్య మరీ ఎక్కువగా ఉంది. ట్రాఫిక్ జామ్‌తో వీఐపీలు సైతం తమ కార్లలోనే ఉండిపోవాల్సి వస్తోంది. అదే సమయంలో అంబులెన్స్ వంటి వాహనాలు మధ్యలోనే చిక్కుకుంటే పరిస్థితి ఊహించలేం. రోజురోజుకు పెరిగిపోతున్న ట్రాఫిక్ జామ్ సమస్య నుంచి బయటపడేందుకు జీహెచ్ఎంసీ కీలక నిర్ణయం తీసుకుంది.

సాఫ్ట్‌వేర్ కంపెనీల్లో డ్యూటీ అయిపోయే సమయానికి అంటే సాయంత్రం 4 నుంచి 6 గంటల మధ్య వర్షం కురుస్తూ ఉంటే ముందుగా మహిళా ఉద్యోగులను మొదట బయటకు విడిచిపెట్టాల్సి ఉంటుంది. అలాగే ఒకవేళ వర్షం ధారాపాతంగా కురుస్తూ ఉంటే మహిళా ఉద్యోగులతో పాటు మిగిలిన వారిని సైతం వర్షం తగ్గరే వరకు ఆఫీసులోనే ఉంచాలి. ఈ నిబంధన దాదాపు 10 నుంచి 12 రోజులపాటు అమల్లో ఉంటుందని జీహెచ్ఎంసీ కమిషనర్ దానకిషోర్ చెప్పారు. హైటెక్ సిటీ పరిసర ప్రాంతాల్లో విపరీతమైన ట్రాఫిక్ జామ్ సమస్య ఉంది. దీన్ని అధిగమించేందుకు జీహెచ్ఎంసీ సరికొత్తగా ఆలోచించి ఈ నిర్ణయం తీసుకుంది. మరి ఈ నిర్ణయాన్ని సాఫ్ట్‌వేర్ కంపెనీలు ఏమేరకు అమలు చేస్తాయో చూడాల్సిందే.