జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కొత్త ట్రెండ్ : కాలేజి టూ కార్పొరేటర్ .. న్యూ కెరీర్లో అమ్మాయిలు

ప్రజలకు సేవ చేయాలన్న ఆలోచనతో చాలా మంది రాజకీయాల్లోకి అడుగు పెడుతున్నారు. మగవారే కాదు వారికీ ధీటుగా మహిళలు కూడా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి రాణిస్తున్నారు. తాజాగా జీహెచ్ఎంసీ ఎన్నికల బరిలో దిగిన కొందరు రాజీకీయాల్లోకి రావాలనుకుంటున్న ఎంతో మంది మహిళలకు సూర్తిగా నిలుస్తున్నారు.

జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కొత్త ట్రెండ్ : కాలేజి టూ కార్పొరేటర్ .. న్యూ కెరీర్లో అమ్మాయిలు
Follow us

|

Updated on: Dec 01, 2020 | 1:05 PM

ప్రజలకు సేవ చేయాలన్న ఆలోచనతో చాలా మంది రాజకీయాల్లోకి అడుగు పెడుతున్నారు. మగవారే కాదు వారికీ ధీటుగా మహిళలు కూడా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి రాణిస్తున్నారు. తాజాగా జీహెచ్ఎంసీ ఎన్నికల బరిలో దిగిన కొందరు రాజీకీయాల్లోకి రావాలనుకుంటున్న ఎంతో మంది మహిళలకు సూర్తిగా నిలుస్తున్నారు. చదువు పూర్తి అయిన వెంటనే ప్రజాసేవ కోసం రాజకీయాల్లోకి అడుగు పెట్టారు కొందరు అతివలు. వీరిలో కొందరు ప్రధాన పార్టీల తరపున పోటీచేస్తుండగా మరి కొందరు స్వతంత్ర అభ్యర్థులుగా రంగంలోకి దిగారు. వీరి వయస్సు 21 ఏళ్ల నుంచి 25 ఏళ్ల మధ్యే ఉంది. చిన్న వయసులోనే రాజకీయాలపైన మక్కువతో ఇలా ఎన్నికల బరిలోకి దిగుతున్నారు.

సికింద్రాబాద్‌ నియోజకవర్గంలోని బౌద్ధనగర్‌ డివిజన్‌ టీఆర్‌ఎస్‌ టికెట్‌ కోసం ఇద్దరు విద్యార్థినులు ఎన్‌.వరలక్ష్మి, గుండు జ్యోత్స్నప్రియ ప్రయత్నించారు. కానీ టికెట్ దక్కకపోవడంతో టీఆర్‌ఎస్‌ రెబల్‌ అభ్యర్థులుగా చేసున్నారు. వీరిలో జ్యోత్స్న ప్రియ ఇటీవల డిగ్రీ పూర్తి చేయగా, ఎన్‌.వరలక్ష్మి బీటెక్‌ చేశారు. ఇక సనత్ నగర్ డివిజన్ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పెరుమాళ్ళ వైష్ణవి పోటీచేస్తున్నారు. ఈమె ప్రస్తుతం బీబీఏ చివరిసంవత్సరం చదువుతున్నారు. ప్రధాన పార్టీల అభ్యర్థులుగా మల్కాజిగిరి నియోజకవర్గంలోని గౌతమ్‌నగర్‌ డివిజన్‌ నుంచి కాంగ్రెస్‌ తరపున తపస్విని యాదవ్‌ పోటీ చేస్తున్నారు. తపస్విని ఇటీవలే బీటెక్ పూర్తి చేసారు. అలాగే జియాగూడ కాంగ్రెస్‌ అభ్యర్థిగా అభిషేక్‌ చౌగ్లే బీకామ్‌ పూర్తి చేసిరాజకీయాల్లోకి వచ్చారు. ఇలా జీహెచ్ఎంసీ ఎన్నికల్లో 21 మంది బరిలో నిలిచారు.