ఆఫ్ఘనిస్థాన్‌లో బాంబు పేలుడు 24 మంది మృతి

ఆఫ్ఘనిస్తాన్‌లో భారీ బాంబు పేలుడు సంభవించింది. అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ ఎన్నికల ర్యాలీ జరుగుతున్న సమయంలో ఈ బాంబు పేలుడు సంభవించింది. ఈ దారుణ ఘటనలో సుమారు 24 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో 31 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఉత్తర కాబూల్ లోని పర్వాన్ ప్రావిన్స్ రాజధాని చరికల్‌లో ఎన్నికల సభలో ఘనీ మాట్లాడుతుండగా ఈ ప్రేలుడు జరిగింది. మృతి చెందిన వారిలో అత్యధిక సంఖ్యలో మహిళలు, చిన్నారులు ఉన్నారు. అష్రఫ్ ఘనీ సభకు […]

ఆఫ్ఘనిస్థాన్‌లో బాంబు పేలుడు 24 మంది మృతి
Follow us

| Edited By:

Updated on: Sep 17, 2019 | 6:42 PM

ఆఫ్ఘనిస్తాన్‌లో భారీ బాంబు పేలుడు సంభవించింది. అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ ఎన్నికల ర్యాలీ జరుగుతున్న సమయంలో ఈ బాంబు పేలుడు సంభవించింది. ఈ దారుణ ఘటనలో సుమారు 24 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో 31 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఉత్తర కాబూల్ లోని పర్వాన్ ప్రావిన్స్ రాజధాని చరికల్‌లో ఎన్నికల సభలో ఘనీ మాట్లాడుతుండగా ఈ ప్రేలుడు జరిగింది. మృతి చెందిన వారిలో అత్యధిక సంఖ్యలో మహిళలు, చిన్నారులు ఉన్నారు. అష్రఫ్ ఘనీ సభకు జనం భారీగా తరలి రావడంతో ఓ ఆత్మాహుతీ సభ్యుడు తనను తాను పేల్చుకున్నట్టుగా స్ధానిక అధికారులు తెలిపారు. అయితే ర్యాలీ జరుగుతున్నప్పుడు మోటార్ సైకిల్‌పై వచ్చిన ఆత్మహుతి దళ సభ్యుడే ఈ ఘాతుకానికి పాల్పడి ఉండవచ్చని భావిస్తున్నారు. ఈ నెల 28న ఆఫ్ఘనిస్థాన్‌ అధ్యక్ష ఎన్నికలు జరగున్నాయి. ప్రస్తుతం అధికారంలో ఉన్న ఘనీ మరో ఐదేళ్లపాటు కనొసాగడానికి ఆయన పోటీ చేస్తున్నారు. ఈ బాంబు ప్రేలుడు ఘటన నుంచి ఘనీ తప్పించుకున్నారు.

2016 నుంచి ఇప్పటి వరకు ఆఫ్ఘనిస్థాన్‌లో 256 బాంబు పేలుళ్లు సంభవించగా వీటిలో మొత్తం 3,932 మంది మృతి చెందారు. 6,162 మంది క్షతాగాత్రులుగా మిగిలారు.