కరోనా ఉందని తెలీక ఆపరేషన్.. క్వారంటైన్‌లో డాక్టర్లు..

కరోనా ఉందని తెలియక గుంటూరుకు చెందిన జీజీహెచ్ డాక్టర్లు.. ఓ మహిళకు ఆపరేషన్ చేశారు. ఈ కారణంగా వైద్యులను హోం క్వారంటైన్‌కి తరలించారు అధికారులు. వివరాల్లోకి వెళ్తే.. గుంటూరుకి చెందిన ఓ గర్భిణి ఈ నెల 7న జీజీహెచ్ ఆస్పత్రికి వచ్చింది. ప్రసవం సమయం దగ్గర పడటంతో వెంటనే ఆమెకు...

కరోనా ఉందని తెలీక ఆపరేషన్.. క్వారంటైన్‌లో డాక్టర్లు..
Follow us

| Edited By:

Updated on: Jun 11, 2020 | 1:12 PM

కరోనా ఉందని తెలియక గుంటూరుకు చెందిన జీజీహెచ్ డాక్టర్లు.. ఓ మహిళకు ఆపరేషన్ చేశారు. ఈ కారణంగా వైద్యులను హోం క్వారంటైన్‌కి తరలించారు అధికారులు. వివరాల్లోకి వెళ్తే.. గుంటూరుకి చెందిన ఓ గర్భిణి ఈ నెల 7న జీజీహెచ్ ఆస్పత్రికి వచ్చింది. ప్రసవం సమయం దగ్గర పడటంతో వెంటనే ఆమెకు ఆపరేషన్ చేశారు వైద్యులు. ప్రసవానంతరం తల్లీబిడ్డ ఇద్దరూ క్షేమంగానే ఉన్నారు. అయితే ఆ మహిళకి అప్పటికే కరోనా టెస్టు కోసం శాంపిల్స్ సేకరించారు. ఈ విషయం తెలియని వైద్యులు ఆ మహిళకు ఆపరేషన్ చేశారు. 9వ తేదీన వచ్చిన నివేదికలో ఆమెకు కోవిడ్ పాజిటివ్ అని తేలింది.

కాగా ఈ విషయం తెలుసుకున్న పోలీసులు.. ఆస్పత్రిలోని వైద్యులకు సమాచారం అందించారు. కరోనా సోకిన మహిళను వెంటనే ఐసోలేషన్‌కు తరలించారు. అలాగే ఆమె జన్మనిచ్చిన శిశువుకు కూడా కరోనా టెస్టులు నిర్వహించారు. ఇక ఆ మహిళకు వైద్యం అందించిన డాక్టర్లను, 8 మంది నర్సులను, సిబ్బందిని వారం రోజుల పాటు ఇంటి వద్దే స్వీయ నిర్భంధంలో ఉండాలని ఆదేశాలు జారీ చేశారు అధికారులు.

ప్రస్తుతం ఏపీలో 182 కరోనా కేసులు నమోదైనట్టు.. ఆరోగ్య శాఖ తెలిపింది. రాష్ట్రానికి చెందిన 135 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్థరణ అయింది. అలాగే ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన మరో 38 మందికి, విదేశాల నుంచి వచ్చిన మరో 9 మందికి కరోనా పాజిటివ్‌గా తేలింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 4,261కి చేరింది. అలాగే ఇవాళ కరోనాతో ఇద్దరు మృతి చెందడంతో.. ఈ సంఖ్య 80కి చేరింది. ఇక కోవిడ్‌ నుంచి 2540 మంది కోలుకున్నారు. ప్రస్తుతం 1641 యాక్టీవ్ కేసులు ఉన్నట్లు ఆరోగ్య శాఖ పేర్కొంది.