Breaking News
  • చెన్నై: ఐఐటీ విద్యార్థిని ఫాతిమా లతీఫ్‌ ఆత్మహత్య కేసు. ఫాతిమా లతీఫ్‌ ఆత్మహత్యపై విద్యార్థి సంఘాల ఆందోళనలు. అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పద్మనాభన్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌. నేడు ఐఐటీ ముట్టడికి విద్యార్థి సంఘాల పిలుపు.
  • కరీంనగర్‌: అలుగునూరులో రోడ్డుప్రమాదం. లారీ ఢీకొని ఇద్దరు యువకులు మృతి. మృతులు సాయికిరణ్‌, సాయికృష్ణగా గుర్తింపు.
  • నిజామాబాద్‌: భీమ్‌గల్‌ మండలం లింబాద్రిగుట్ట జాతరలో ప్రమాదం. డ్యాన్సింగ్‌ వీలుపై నుంచి పడి రవి అనే వ్యక్తికి తీవ్రగాయాలు. నిజామాబాద్‌ ఆస్పత్రికి తరలింపు.
  • ప్రభుత్వం 50 మంది కార్మికులను చంపేసింది. తప్పుడు విధానాలతో భవన నిర్మాణ కార్మికులు ఆకలితో చనిపోతున్నారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వంపై యుద్ధం చేస్తున్నా. వ్యక్తిగతంగా విమర్శించను.. తప్పుడు విధానాలపైనే ప్రశ్నిస్తున్నా. కార్మికుల కష్టాలను సీఎం జగన్‌ పట్టించుకోవాలి-పవన్‌కల్యాణ్‌.
  • విశాఖ: ఏజెన్సీలో తగ్గిన ఉష్ణోగ్రతలు. అరకులో 13, చింతపల్లిలో 8, మినుములూరులో 10 డిగ్రీల ఉష్ణోగ్రత. పాడేరులో 12 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు.
  • కర్నూలు: విజయానికేతన్‌ స్కూల్‌ కరస్పాండెంట్‌, డైరెక్టర్‌ అరెస్ట్. సాంబార్‌ గిన్నెలో పడి విద్యార్థి మృతి చెందిన ఘటనలో అరెస్ట్‌. కరస్పాండెంట్ నాగమల్లేశ్వరరెడ్డి, డైరెక్టర్ విజయకుమార్‌రెడ్డిని.. రహస్యంగా రిమాండ్‌కు తరలించిన పాణ్యం పోలీసులు. హాస్టల్‌కు అనుమతి లేదని తేల్చిన విద్యాశాఖ అధికారులు. ఇంత వరకు బయటకు రాని సీసీఫుటేజ్‌. హాస్టల్‌లో సీసీ కెమెరాలు లేవంటున్న యాజమాన్యం.
  • హైదరాబాద్‌: మాదాపూర్‌లో రోడ్డుప్రమాదం. అయ్యప్ప సొసైటీలో అదుపుతప్పి స్కూల్‌ బస్సు బోల్తా. బస్సులో విద్యార్థులెవరూ లేకపోవడంతో తప్పిన ప్రమాదం.

ఏపీ ప్రభుత్వం బంపరాఫర్..సీఎం జగన్ మార్క్ నిర్ణయం!

ఇంతకుముందు పరిపాలించిన అనుభవం లేదు..కానీ సీఎంగా ఇంత పరిణితి ఎలా ప్రదర్శించగల్గుతున్నారు?.. ఇది సీఎం జగన్‌ను ఉద్దేశించి ఇప్పుడు ఏపీలోని సీనియర్ మంత్రులు, అధికారుల నుంచి వినిపిస్తున్న మాట. ఏపీలో తీసుకునే ప్రతి నిర్ణయంలోనూ సీఎం జగన్ మార్క్ ప్రస్పుటంగా కనిపిస్తుంది. దేశంలో ఏ సీఎం చేయని, సాహసించని రివర్స్ టెండరింగ్, పరిశ్రమలలో 75 శాతం స్థానికులకే ఉద్యోగాలంటూ చట్టం చేయడం జగన్‌కే చెల్లుతుంది. ప్రజల్లో తన విశ్వసనీయతను పెంచుకునే విధంగా జగన్ వడివడిగా అడుగులు వేస్తున్నారు. విపక్షాల విమర్శలను లైట్ తీసుకుంటూ… కాలయాపన చేయకుండా సంక్షేమంపై దృష్టి పెడుతున్నారు.

గ్రామ వలంటీరు వ్యవస్థను స్వీకారం చుట్టిన జగన్..అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాలు చేరువయ్యేలా చర్యలు తీసుకుంటున్నారు. “కులం చూడొద్దు, మతం చూడొద్దు, రాజకీయాలు చూడొద్దు..పార్టీ అసలే చూడొద్దు..మనకు ఓటు వేయనివారు కూడా మంచి పాలన చూసి..వచ్చే ఎన్నికల్లో మనసు మార్చుకోవాలి” ఇవి ఇటీవలే నియామక పత్రాలు అందుకున్న వలంటీర్లను ఉద్దేశించి జగన్ చెప్పిన మాటలు. అధికారం చేపట్టిన నాలుగు నెలల్లోనే సీఎం తానేంటో..ప్రజలకు అర్థమయ్యేలా చెప్పగలిగారు. ప్రతిపక్ష టీడీపీ కూడా అటు ఎక్కువగా దాడుల రాజకీయం చేస్తుంది తప్ప..జగన్ పాలనలోని లోపాలపై సమర్థవంతంగా వేలెత్తి చూపలేకపోతుంది.

ఇప్పటికే రికార్డు స్థాయిలో ఉద్యోగాలు కల్పించిన జగన్.. నిరుద్యోగులకు మరో శుభవార్తను తీసుకొస్తున్నారు. జాబ్స్ లేవని ఎవ్వరూ అధైర్యపడొద్దని.. ప్రతి ఒక్కరు వారి లక్ష్యంపై దృష్టి పెట్టాలని పేర్కొన్నారు. ఇకపై ప్రతి జనవరిలో వేలాది ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్లు వెలువడతాయని చెప్పారు. మరో మూడు నెలల్లో జనవరి రాబోతున్నది కాబట్టి అప్పటికి మరోసారి భారీ సంఖ్యలో ఉద్యోగాల కల్పనకు ప్రణాళిక జరగబోతుందని సీఎం హింట్ ఇచ్చారు. జనవరి నెలను ఉద్యోగాల కల్పన నెలగా మారుస్తామని ఇప్పటికే పేర్కొనడం విశేషం. కాగా అధికారంలోకి వచ్చిన నాలుగు నెలల్లోపే దాదాపుగా లక్షా 26వేల మందికి శాశ్వతంగా ప్రభుత్వ ఉద్యోగం కల్పించినట్టు జగన్ చెప్పిన విషయం తెలిసిందే.