Breaking News
  • ఏడు నెలల పాలనలో జగన్‌ విఫల నాయకుడిగా పేరుపొందారు. ప్రతిపక్ష నేతను అసెంబ్లీలోకి రాకుండా అడ్డుకోవడం ఎన్నడూ చూడలేదు. ఉద్యోగ సంఘాలు కూడా చంద్రబాబు మాటలను వక్రీకరించడం బాధాకరం. చౌకబారు రాజకీయాలు సరికాదు-నక్కా ఆనందబాబు.
  • ప్రకాశం: ఒంగోలులో సీపీఎస్‌ ఎంప్లాయిస్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో మనోవేదన నిరసన ర్యాలీ, పాల్గొన్న కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల ప్రభుత్వ ఉద్యోగులు.
  • కృష్ణాజిల్లా: కీసర టోల్‌ప్లాజా దగ్గర పనిచేయని ఫాస్టాగ్‌. ఇబ్బందులు పడుతున్న వాహనదారులు. రెండు క్యాష్‌ కౌంటర్ల ద్వారా టోల్‌ వసూలు చేస్తున్న సిబ్బంది.
  • చిత్తూరు టూటౌన్‌ పీఎస్‌ దగ్గర ఉద్రిక్తత. ఆత్మహత్య చేసుకున్న ఫాతిమా మృతదేహంతో తల్లిదండ్రుల ధర్నా. నిందితుడిని తప్పించేందుకు పోలీసులు యత్నిస్తున్నారని ఆరోపణ. పోలీస్‌స్టేషన్‌ ఎదుట ఫాతిమా మృతదేహంతో తల్లిదండ్రుల ఆందోళన.
  • చెన్నై వన్డేలో టాస్‌గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకున్న విండీస్‌. భారత్‌-విండీస్‌ మధ్య తొలివన్డే.
  • తిరుమల: ధనుర్మాసం సందర్భంగా ఈ నెల 17 నుంచి జనవరి 14 వరకు శ్రీవారి సుప్రభాత సేవ రద్దు.
  • విశాఖ: హుకుంపేట మండలం రంగశీలలో కాల్పులు. రైతుభరోసా నగదు కోసం అన్నదమ్ముల మధ్య వివాదం తనవాటా డబ్బులు అడిగిన తమ్ముడు జయరాం, భార్య కొండమ్మపై నాటు తుపాకీతో కాల్పులు జరిపిన అన్న కృష్ణ. తమ్ముడి భార్య కొండమ్మ చేతిలోకి దూసుకెళ్లిన బుల్లెట్. కొండమ్మను చికిత్స నిమిత్తం కేజీహెచ్‌కు తరలింపు. కాల్పులు జరిపి సమీప కొండల్లోకి పారిపోయిన కృష్ణ.

గెట్ రెడీ.. మరికొన్ని గంటల్లో బిగ్‌బాస్ త్రీ

Bigg Boss 3 Nagarjuna Bigg Boss telugu reality show, గెట్ రెడీ.. మరికొన్ని గంటల్లో బిగ్‌బాస్ త్రీ

తెలుగు ప్రేక్షకులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్న బిగ్‌బాస్ షో మరికొన్ని గంటల్లో ప్రారంభం కానుంది. ఇప్పటికే టీమ్ సభ్యులు బిగ్‌బాస్ హౌస్‌లోకి వెళ్లారు. షూటింగ్ ఒక రోజు ముందు జరుగుతుంది కాబట్టి వీరు ముందుగానే హౌస్‌లోకి ఎంటరయ్యారు. బిగ్‌బాస్ సీజన్ 3 గతంలో ఎన్నడూ లేనన్ని వివాదాల నడుమ టీవీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అయితే రోజుకో కొత్త మలుపులు తిరుగుతున్న ఈ రియాలిటీ షోపై ఎన్నో అనుమానాలు వ్యక్తమయ్యాయి. అసలు ఈ మూడో సీజన్ జరుగుతుందా? లేదా? అనే సందేహాలు జనాల మెదళ్లను తొలిచేశాయి.

అటు మానవహక్కుల సంఘం, ఇటు హైకోర్టులో వేసిన పిటిషన్లు, మరోపక్క ఓయూ జేఏసీ నుంచి హెచ్చరికలు. బిగ్‌బాస్ చుట్టూ ఇంట ఉచ్చుబిగుసుకున్న నేపథ్యంలో బిగ్‌బాస్ షో టీమ్ హైకోర్టును ఆశ్రయించడం అక్కడ టీమ్‌కు ఊరట కలగడం వంటి సంఘటనలు జరిగినా.. చివరికి ఏమవుతుందో తెలియని ఉత్కంఠ వేధించింది. ఈ పరిస్థితిలో అన్ని రూమర్స్‌ను కొట్టి పారేస్తూ మరికొన్ని గంటల్లో బిగ్‌బాస్ ఆడియన్స్ ముందుకు రానుంది.

అటు ఆల్‌మోస్ట్ 14 మంది కంటెస్టెంట్ల జాబితా కూడా ఇప్పటికే సోషల్‌మీడియాలో వైరల్ అవుతోంది. అయితే చాల వరకు సోషల్ మీడియాలో  సెలబ్రిటీలే బిగ్‌బాస్ హౌస్‌లోకి వెళ్తున్నారు. యాంకర్ శ్రీముఖి, తీన్మార్ సావిత్రి, నటి హేమ, టీవీ9 జాఫర్.. ఇలా చాలమంది కన్‌ఫామ్ అయిపోయారు. ఎన్నో వివాదాలను తోసుకుంటూ టీవీ ప్రేక్షకుల ముందుకు వస్తున్న బిగ్‌బాస్ 3..గతంలో కంటే ఎంత పాపులర్ అవుతుందో చూడాలి.