ఇది గోల్డెన్ ఛాన్స్.. అస్సలు మిస్ కాకండి..

కరోనా సమయంలో అందనంత పైకి పరుగులు పెట్టిన బంగారం.. నెమ్మదిగా కిందికి  దిగివస్తోంది. ఇంటర్నేషనల్‌ మార్కెట్లో ధర పెరుగుతోంది. కానీ దేశీ మార్కెట్లో రేటు పడిపోతోంది. హైదరాబాద్ మార్కెట్‌లో బంగారం ధర తగ్గింది.

ఇది గోల్డెన్ ఛాన్స్.. అస్సలు మిస్ కాకండి..
Follow us

|

Updated on: Aug 28, 2020 | 3:30 PM

పసిడి మరింత దిగివచ్చింది. బంగారం ప్రియులను మరింత ఊరిస్తోంది. నేను మీ ఇంటికి వస్తానంటూ గోల్డ్ టచ్ చేస్తోంది. కన్నవారికి కొంగు బంగారం అవుతానంటోంది. మరింత పడిపోతే కొనుగోలు చేద్దామనుకునేవారికి.. కాాదు కాదు ఇప్పుడే కొనుగోలు చేయాలని అంటూ ఊరిస్తోంది. సామాన్యులకు దగ్గరకు రాకున్నా.. కొత్త  బంగారం లాంటి ఆశలు మాత్రం చిగురిస్తున్నాయి.

కరోనా సమయంలో అందనంత పైకి పరుగులు పెట్టిన బంగారం.. నెమ్మదిగా కిందికి  దిగివస్తోంది. ఇంటర్నేషనల్‌ మార్కెట్లో ధర పెరుగుతోంది. కానీ దేశీ మార్కెట్లో రేటు పడిపోతోంది. హైదరాబాద్ మార్కెట్‌లో బంగారం ధర తగ్గింది. గురువారం 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.390 పడిపోయింది. దీంతో ధర రూ.53,660కు దిగొచ్చింది. అదేసమయంలో 22 క్యారెట్ల బంగారం ధర కూడా రూ.290 క్షీణించింది. దీంతో 10 గ్రాముల బంగారం ధర రూ.49,190కు పడిపోయింది.

బంగారం ధరతోపాటు దిగిరావల్సిన వెండి  ధర మాత్రం కొద్ది కొద్దిగా ముందుకు కదులుతోంది. కేజీ వెండి ధర రూ.50 పెరిగింది. దీంతో హైదరాబాద్‌లో ధర రూ.65,550కు చేరింది. పరిశ్రమ యూనిట్లు, నాణేపు తయారీదారుల నుంచి డిమాండ్ పుంజుకోవడం ఇందుకు ప్రధాన కారణమని తెలుస్తోంది.

ఇక అంతర్జాతీయ మార్కెట్‌లో మాత్రం బంగారం ధర పెరిగింది. పసిడి ధర ఔన్స్‌కు 0.28 శాతం పెరుగుదలతో 1957 డాలర్లకు చేరింది. బంగారం ధర పెరిగితే వెండి ధర కూడా పెరిగింది. వెండి ధర ఔన్స్‌కు 0.18 శాతం పెరుగుదలతో 27.39 డాలర్లకు చేరింది.