పవన్ కళ్యాణ్ ‘జార్జ్ రెడ్డి’ సినిమా చేయాలనుకున్నారు..!

సందీప్ మాధవ్ హీరోగా దర్శకుడు జీవన్ రెడ్డి తెరకెక్కించిన చిత్రం ‘జార్జ్ రెడ్డి’. ఈ సినిమా నవంబర్ 22న ప్రేక్షకుల ముందుకు రానుంది. 1967లో ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థి ఉద్యమాలకు బీజం వేసిన జార్జ్ రెడ్డి అనే విద్యార్థి నాయకుడి జీవిత కథ ఆధారంగా ఈ సినిమాను రూపొందించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన సందీప్ మాధవ్ సినిమా గురించి పలు ఇంట్రెస్టింగ్ విషయాలను షేర్ చేసుకున్నారు. వంగవీటి తరవాత… ‘వంగవీటి’ సినిమా తరువాత దాదాపు 30 కథలను […]

పవన్ కళ్యాణ్ ‘జార్జ్ రెడ్డి’ సినిమా చేయాలనుకున్నారు..!
Follow us

|

Updated on: Nov 19, 2019 | 2:16 AM

సందీప్ మాధవ్ హీరోగా దర్శకుడు జీవన్ రెడ్డి తెరకెక్కించిన చిత్రం ‘జార్జ్ రెడ్డి’. ఈ సినిమా నవంబర్ 22న ప్రేక్షకుల ముందుకు రానుంది. 1967లో ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థి ఉద్యమాలకు బీజం వేసిన జార్జ్ రెడ్డి అనే విద్యార్థి నాయకుడి జీవిత కథ ఆధారంగా ఈ సినిమాను రూపొందించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన సందీప్ మాధవ్ సినిమా గురించి పలు ఇంట్రెస్టింగ్ విషయాలను షేర్ చేసుకున్నారు.

వంగవీటి తరవాత…

‘వంగవీటి’ సినిమా తరువాత దాదాపు 30 కథలను విన్నాను. ఏదీ కూడా కనెక్ట్ కాలేదు. అలాంటి తరుణంలో జీవన్ గారు ‘జార్జ్ రెడ్డి’ కథను చెప్పారు. విన్న వెంటనే చాలా ఎగ్జైట్ అయ్యాను.

కొన్ని ప్రిపరేషన్స్…

జార్జ్ రెడ్డి’ క్యారెక్టర్ కోసం కొన్ని ప్రిపరేషన్స్ చేసుకోవాల్సి వచ్చింది. ఆయనకు సంబంధించిన ఆర్టికల్స్ చదవడమే కాకుండా అప్పట్లో ఉస్మానియా యూనివర్సిటీలో చదివిన వాళ్ళను కూడా కలిసి.. ‘జార్జ్ రెడ్డి’ ఎలా ఉండేవారు..? ఎలా ప్రవర్తించేవారు.? ఇలా పలు విషయాలను తెలుసుకున్నా. మరోవైపు మా దర్శకుడు జీవన్ రెడ్డి, కెమెరామన్ ఇచ్చిన సలహాలు కూడా నాకెంతో ఉపయోగపడ్డాయి.

‘జ్యోతిలక్ష్మి’ సినిమా తర్వాత ‘వంగవీటి’లో ఛాన్స్ ఎలా వచ్చింది…

‘జ్యోతిలక్ష్మి’ సినిమా తరువాత కమెడియన్‌గా అవకాశాలు వస్తాయనుకున్నా.. కానీ అనుకోకుండా వర్మ గారు… ‘నిన్ను చూస్తుంటే వంగవీటి రాధ’లా ఉన్నావ్… ఓసారి ఈ లుక్స్ కోసం ట్రై చేయమని చెప్పారు… అలా రంగా పాత్రను నాకు ఇచ్చారు.

జార్జ్ రెడ్డి’ పూర్తిగా బయోపిక్ సినిమా అనవచ్చా…

జార్జ్ రెడ్డి’ కంప్లీట్‌గా బయోపిక్ అని చెప్పను. కానీ, కొన్ని చోట్ల కమర్షియల్ ఎలిమెంట్స్ యాడ్ చేయడం జరిగింది. అవి కూడా చాలా నేచురల్‌గా ఉంటాయి. బేసిక్‌గా ఆయన బాక్సర్, స్టూడెంట్ లీడర్ కాబట్టి.. విజువలైజేషన్‌లో హీరోయిజం న్యాచురల్‌గానే ఉంటుంది.

ట్రైలర్‌కు మంచి స్పందన వచ్చింది.. సినిమా కూడా హిట్ అవుతుందని నమ్ముతున్నారా..

ట్రైలర్‌కు మేము అనుకున్న దానికంటే ఎక్కువగానే.. అద్భుతమైన స్పందన వచ్చింది. సినిమా కూడా అదే స్థాయిలో రీచ్ అవుతుందనే నమ్మకంతో చాలా కష్టపడ్డాం… ఇక ట్రైలర్‌ చూసిన చాలామంది ఉస్మానియా యూనివర్సిటీలో షూటింగ్ చేశాం అనుకున్నారు. నిజానికి అది సెట్ వేశాం. 1960లో యూనివర్సిటీ ఎలా ఉండేదో దాన్ని బట్టి మా ఆర్ట్ డైరెక్టర్ గాంధీ గారు బాగా సెట్స్ వేశారు.

ఈ సినిమాను పవన్ కళ్యాణ్ గారు చేయాలనుకున్నారా…

నిజానికి ‘జార్జ్ రెడ్డి’ అంటే పవన్ కళ్యాణ్ గారికి చాలా ఇష్టం. ఈ సినిమా ఆయన ఎలాగైనా చేయాలనుకున్నారట. ఇక ఆయన ట్రైలర్ చూసి.. మమ్మల్ని కలవమని చెప్పారు. కానీ కొన్ని కారణాల వల్ల కలవడం కుదర్లేదు. ఇకపోతే సినిమాలోని ఓ సాంగ్‌ను పవన్ కళ్యాణ్ గారి కోసం ప్రత్యేకంగా డెడికేట్ చేశాం.