తమిళనాడులో తండ్రీ కొడుకుల మృతి.. పోటెత్తిన పొలిటికల్ వార్

తమిళనాడులో జయరాజ్ ఆయన కుమారుడు బెనిక్స్ పోలీసుల కస్టడీలో మరణించిన ఘటన రాష్ట్రాన్ని కుదిపివేసింది. ట్యుటికోరన్ లో తమ సెల్ ఫోన్ షాపును సమయానికి మించి తెరచి ఉంచారన్న కారంణంపై వీరిని పోలీసులు అరెస్టు చేసి తీసుకుపోయారని, లాకప్ లో..

తమిళనాడులో తండ్రీ కొడుకుల మృతి.. పోటెత్తిన పొలిటికల్ వార్
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jun 27, 2020 | 6:51 PM

తమిళనాడులో జయరాజ్ ఆయన కుమారుడు బెనిక్స్ పోలీసుల కస్టడీలో మరణించిన ఘటన రాష్ట్రాన్ని కుదిపివేసింది. ట్యుటికోరన్ లో తమ సెల్ ఫోన్ షాపును సమయానికి మించి తెరచి ఉంచారన్న కారంణంపై వీరిని పోలీసులు అరెస్టు చేసి తీసుకుపోయారని, లాకప్ లో చిత్రహింసలు పెట్టడంతో.. తీవ్రంగా గాయపడి 4 రోజుల అనంతరం ఆసుపత్రిలో మృతి చెందారని వార్తలు వచ్చిన సంగతి విదితమే. పోలీసుల దమనకాండకు పాలక అన్నా డీఎంకె పార్టీయే కారణమని, చట్టాన్ని వారు చేతిలోకి తీసుకోవడానికి ఆ పార్టీ నాయకులు అనుమతించారని విపక్ష డీఎంకే ఆరోపించింది. అటు-రక్షక భటులే భక్షించే వారయ్యారని, ఈ తండ్రీ కొడుకుల మృతికి కారకులైనవారిని కఠినంగా శిక్షించాలని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. పోలీసుల అమానుషత్వాన్ని ఉపేక్షిస్తే అది నేరమే అవుతుందన్నారు. గుజరాత్ కు చెందిన ఇండిపెండెంట్ ఎమ్మెల్యే జిగ్నేష్ మేవానీ.. ఈ ఘటననుఁ అమెరికాలో నల్ల జాతీయుడు జార్జిఫ్లాయిడ్ మరణంతో పోలుస్తూ ట్వీట్ చేశారు. అటు-ప్రియాంక చోప్రా, క్రికెటర్ శిఖర్ ధావన్, నటుడు జయం రవి వంటి వారు కూడా ఈ ఘటనను ఖండిస్తూ ట్వీట్లు చేశారు. జయరాజ్, బెనిక్స్ మృతికి నిరసనగా రాష్ట్రమంతా ఈ నెల 24 న బంద్ పాటించారు.

ప్రపంచంలో బెస్ట్‌ ఎయిర్‌పోర్టులు ఏవో తెలుసా..?
ప్రపంచంలో బెస్ట్‌ ఎయిర్‌పోర్టులు ఏవో తెలుసా..?
మీ పిల్లల చదువుకు రూ.2 కోట్లు కావాలంటే నెలకు ఎంత SIP చేయాలి?
మీ పిల్లల చదువుకు రూ.2 కోట్లు కావాలంటే నెలకు ఎంత SIP చేయాలి?
YCP నుంచి వచ్చే రియాక్షన్‌కి తట్టుకోలేరు..TDPకి సజ్జల వార్నింగ్
YCP నుంచి వచ్చే రియాక్షన్‌కి తట్టుకోలేరు..TDPకి సజ్జల వార్నింగ్
కేసీఆర్ చేసిన తప్పులే రేవంత్ కూడా చేస్తున్నారు: ఈటల రాజేందర్
కేసీఆర్ చేసిన తప్పులే రేవంత్ కూడా చేస్తున్నారు: ఈటల రాజేందర్
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు