పాక్‌ నుంచి వచ్చిన ఏడువేల హిందూ కుటుంబాలకు సాయం..

ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ ఎంతలా విజృంభిస్తోందో తెలియంది కాదు. ఈ క్రమంలో సామాన్య ప్రజానీకం అనేక ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా ఇతర ప్రాంతాల నుంచి పొట్టకూటికోసం వచ్చిన వారి పరిస్థితి దయనీయంగా మారింది. వీరికి ఇప్పటికే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కావాల్సిన సహాయ సహకారాలు అందిస్తున్నాయి. పలు సేవా సంస్థలు కూడా వీరికి కావాల్సిన సహాయ సహకారాలు చేస్తోంది. ఇక పొరుగు దేశం పాకిస్థాన్‌లో మైనార్టీలుగా ఉన్న హిందూ, క్రైస్తవుల పట్ల మాత్రం అక్కడి ప్రభుత్వం […]

పాక్‌ నుంచి వచ్చిన ఏడువేల హిందూ కుటుంబాలకు సాయం..
Follow us

| Edited By:

Updated on: Apr 09, 2020 | 4:57 PM

ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ ఎంతలా విజృంభిస్తోందో తెలియంది కాదు. ఈ క్రమంలో సామాన్య ప్రజానీకం అనేక ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా ఇతర ప్రాంతాల నుంచి పొట్టకూటికోసం వచ్చిన వారి పరిస్థితి దయనీయంగా మారింది. వీరికి ఇప్పటికే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కావాల్సిన సహాయ సహకారాలు అందిస్తున్నాయి. పలు సేవా సంస్థలు కూడా వీరికి కావాల్సిన సహాయ సహకారాలు చేస్తోంది. ఇక పొరుగు దేశం పాకిస్థాన్‌లో మైనార్టీలుగా ఉన్న హిందూ, క్రైస్తవుల పట్ల మాత్రం అక్కడి ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోంది. కరోనా వ్యాప్తి ఉన్న సమయంలో కొన్ని స్వచ్ఛంద సంస్థలు అక్కడి మైనార్టీలకు రేషన్ సరకులను సహాయంగా అందిస్తున్న తరుణంలో.. వారిని అడ్డగించి. మైనార్టీలకు ఎలాంటి సహాయం అందించకుండా తన రాక్షసత్వాన్ని ప్రదర్శిస్తోంది.

ఈ క్రమంలో ఇప్పటికే పాక్‌లో జరుగుతున్న ఘోరాలను తట్టుకోలేక.. వేల హిందూ కుటుంబాలు భారత్‌ బాటపట్టాయి. వారిలో ఎక్కువ మంది రాజస్థాన్‌, గుజరాత్‌, పంజాబ్‌ రాష్ట్రాల్లో స్థిరపడ్డారు. గత కొన్నేళ్లుగా.. రాజస్థాన్‌లోని జైపూర్, జోద్‌పూర్, బార్మార్, పాలీ, బికనేర్, జైసల్మేర్, జాలోర్, సిరోహి ప్రాంతాల్లో… దాదాపు ఏడువేల హిందూ కుటుంబాలు నివసిస్తున్నాయి. వీరంతా చిక్కుకుపోవడంతో.. ఈ పాకిస్తానీ వలస కుటుంబాలకు నిత్యావసర సరకులు అందించాలని రాజస్థాన్‌ సీఎం అశోక్‌ గెహ్లాట్‌ అధికారులను ఆదేశించారు. వలస వచ్చిన వీరి పరిస్థితి చాలా దుర్భరంగా ఉందని, వెంటనే ప్రభుత్వం ఆదుకోవాలంటూ జోధ్‌పూర్ సామాజిక కార్యకర్త హిందూ సింగ్ జోధ్ సీఎంకు లేఖ రాశారు. వెంటనే స్పందించిన సీఎం.. వారందరినీ ఆదుకోవాలంటూ ఆదేశాలు జారీ చేశారు.