గేట్ 2021 ప‌రీక్ష రిజిస్ట్రేషన్ గ‌డువు పెంపు

గేట్ 2021 ప‌రీక్ష ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ గ‌డువును అక్టోబ‌ర్ 7వ తేదీ వ‌ర‌కు పొడిగించారు. ఇందుకు ఐఐటి-ముంబై అధికారిక వెబ్‌సైట్ లో నోటిఫికేషన్ విడుదల.

గేట్ 2021 ప‌రీక్ష రిజిస్ట్రేషన్ గ‌డువు పెంపు
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Sep 29, 2020 | 4:56 PM

కరోనా కారణంగా ప్రజా జీవనం స్తంభించిపోయింది. విద్యార్దుల చదువులు దాదాపు అటకెక్కాయి. ఇప్పుడు జాతీయ స్ధాయి కోర్సులు, ఉద్యోగాల కోసం నిర్వహించే అర్హత పరీక్ష గేట్ లోనూ భారీ మార్పులు జరిగాయి. కరోనా కారణంగా విద్యార్ధులకు చదువుకునే అవకాశం లేకుండా పోవడంతో వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరిగే గేట్ పరీక్షలో పలు మార్పులు చేస్తూ, సడలింపులతో బోంబే ఐఐటీ కొత్త షెడ్యూల్ విడుదల చేసింది. .

గేట్ 2021 ప‌రీక్ష ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ గ‌డువును అక్టోబ‌ర్ 7వ తేదీ వ‌ర‌కు పొడిగించారు. ఇందుకు సంబంధించి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ముంబై (ఐఐటి-ముంబై) అధికారిక వెబ్‌సైట్ gate.iitb.ac.in.లో గేట్ పరీక్ష నోటిఫికేషన్ ను విడుదల చేశారు. గేట్ 2021 ప‌రీక్షకు సంబంధించిన దరఖాస్తు ఫారమ్‌ను విడుదల చేశారు. అంతకుముందు గేట్ 2021 పరీక్ష ఆన్‌లైన్ నమోదుకు చివరి తేదీ సెప్టెంబర్ 30. అయితే, కొవిడ్ విజృంభణ కారణంగా తాజాగా ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ కోసం చివరి తేదీ గ‌డువును అక్టోబర్ 7వ తేదీ వరకు పెంచుతూ నిర్ణ‌యం తీసుకున్నారు. ఐఐటీ ముంబై ఫిబ్రవరి 2021లో గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజనీరింగ్ (గేట్) ను నిర్వహించనుంది. ఫిబ్రవరి 5 నుంచి 14 తేదీల్లో ప‌రీక్ష నిర్వ‌హ‌ణకు ఏర్పాట్లు చేస్తోంది. అయితే, ఈసారి గేట్ పరీక్ష రాసే అభ్యర్ధుల సంఖ్యతో పాటు పోటీ కూడా భారీగా పెరిగే అవకాశముందని భావిస్తున్నారు.

ఇదిలావుంటే, కరోనా కారణంగా విద్యార్ధులు చదువులు పూర్తి చేసే అవకాశం లేకపోవడంతో విద్యార్హతల్లో పలు మార్పులు చేయడంతో పాటు కొత్త సబ్జెక్టులను చేర్చి గేట్ రూపురేఖలు మార్చేశారు. ఈ పరీక్ష రాసేందుకు ఎవరెవరికి అర్హతలు కల్పించారు, ఏయే సబ్జెక్టులు కొత్తగా వచ్చి చేరాలన్న అంశంపైనా ఐఐటీ క్లారిటీ ఇచ్చింది. జాతీయ స్ధాయిలో ఏటా నిర్వహించే గేట్ పరీక్షకు ఇప్పటివరకూ ఇంజనీరింగ్ నాలుగో ఏడాది చదివిన వారికి మాత్రమే అవకాశం కల్పిస్తుండగా.. ఈసారి కరోనా కారణంగా బీఏ చదివిన వారికీ, బీటెక్ మూడో సంవత్సరం చదువుతున్న వారికీ పరీక్ష రాసే ఛాన్స్ ఇచ్చారు. దీంతో 10 ప్లస్ 2 ప్లస్ 4గా ఉన్న ఫార్మాట్ కాస్తా 10 ప్లస్ 2 ప్లస్ 3గా మారిపోయింది. తాజా మార్పుతో బీఏ చదివి గేట్ పరీక్షలో అర్హత సాధించిన వారు ఐఐటీల్లో కొత్తగా చేర్చబోతున్న ఎంఏ కోర్సు చదువుకోవచ్చు. అలాగే కేంద్ర ప్రభుత్వ సంస్ధల ఉద్యోగాల ఇంటర్వ్యూలకు నేరుగా హాజరు కావచ్చు. కరోనా ప్రభావం తగ్గాక నిర్వహించే ఉద్యోగాల ఇంటర్వ్యూలకు దీన్ని వర్తింపజేయనున్నారు.