సైలెంట్ కిల్లర్‌గా గంటా.. బాబుకిక చుక్కలే..!

గత కొంత కాలంగా మౌనంగా వుంటూ.. పార్టీలో వున్నారా? లేరా? అన్నట్లు వ్యవహరిస్తున్న మాజీ మంత్రి గంటా శ్రీనివాస్ రావు మరోసారి అధినేత అభిప్రాయంతో విభేదించారు. గత రెండు నెలలుగా జరుగుతున్న పార్టీ మారతారన్న ప్రచారాన్ని ఇటీవలనే ఖండించిన గంటా.. పార్టీలో మాత్రం చురుగ్గా మారలేదు. అసెంబ్లీ సమావేశాలు వారం రోజుల పాటు జరిగితే.. ఆయన హాజరైంది ఒకే రోజు. ఆ ఒక్క రోజు కూడా చంద్రబాబు సహా పార్టీ నేతలంతా ప్రభుత్వంపై దాదాపు యుద్దం ప్రకటించిన […]

సైలెంట్ కిల్లర్‌గా గంటా.. బాబుకిక చుక్కలే..!
Follow us

|

Updated on: Dec 18, 2019 | 2:50 PM

గత కొంత కాలంగా మౌనంగా వుంటూ.. పార్టీలో వున్నారా? లేరా? అన్నట్లు వ్యవహరిస్తున్న మాజీ మంత్రి గంటా శ్రీనివాస్ రావు మరోసారి అధినేత అభిప్రాయంతో విభేదించారు. గత రెండు నెలలుగా జరుగుతున్న పార్టీ మారతారన్న ప్రచారాన్ని ఇటీవలనే ఖండించిన గంటా.. పార్టీలో మాత్రం చురుగ్గా మారలేదు. అసెంబ్లీ సమావేశాలు వారం రోజుల పాటు జరిగితే.. ఆయన హాజరైంది ఒకే రోజు. ఆ ఒక్క రోజు కూడా చంద్రబాబు సహా పార్టీ నేతలంతా ప్రభుత్వంపై దాదాపు యుద్దం ప్రకటించిన పరిస్థితి. కానీ గంటా మాత్రం చాలా కూల్‌గా సమావేశాలకు హాజరై వెళ్ళిపోయారు.

అయితే, అసెంబ్లీ చివరి రోజు చాలా నాటకీయ పరిణామాలు జరిగాయి. రాష్ట్ర రాజధానిపై సభలో చర్చ జరిగింది. తెలుగుదేశం, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల మధ్య దాదాపు యుద్దవాతావరణం ఏర్పడింది. చంద్రబాబు రాజధాని పేరిట రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశారంటూ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గణాంకాలు వివరిస్తుంటే.. టీడీపీ సభ్యులు గోలగోల చేశారు. చివరికి తొమ్మిది మంది టీడీపీ ఎమ్మెల్యేలు సస్పెన్షన్ వేటుకు గురయ్యారు. ఆ తర్వాత రాష్ట్ర రాజధానిపై ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అత్యంత కీలకమైన ప్రకటన చేశారు. ఇంత జరుగుతున్నా గంటా శ్రీనివాస్ రావు జాడ కనిపించలేదు.

అయితే, ఏపీకి మూడు రాజధానులు వుండే అవకాశం వుందంటూ ముఖ్యమంత్రి చేసిన ప్రకటనపై చంద్రబాబు, నారా లోకేశ్, దేవినేని ఉమా తదితరులు తుగ్లక్ నిర్ణయమంటూ విమర్శలు గుప్పించారు. మూడు రాజధానులుంటే ముఖ్యమంత్రి ఎక్కడుంటారంటూ చంద్రబాబు ప్రభుత్వాన్ని నిలదీశారు. కానీ చంద్రబాబు వైఖరికి, పార్టీ విధానానికి భిన్నంగా స్పందించారు గంటా శ్రీనివాస్ రావు. విశాఖను ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్‌గా చేయడమన్నది చక్కని ఆలోచన అంటూ ఆయన మౌనాన్ని వీడారు.

గంటా శ్రీనివాస్ రావు వ్యాఖ్యలు సహజంగానే టీడీపీ వర్గాలకు, టీడీపీ అధినాయకత్వానికి ఇబ్బందిగానే వుంటుంది. కానీ, అవేమీ పట్టనట్లుగా గంటా శ్రీనివాస్ ముఖ్యమంత్రి ప్రకటనను స్వాగతించారు. పార్టీని వీడనంటూ మరి ఇదేం ధోరణి అంటూ పార్టీలో ఆయన వ్యతిరేకులు తెరచాటు కామెంట్లు చేస్తున్నారు. ఉంటే పార్టీ విధానాలకు అనుగుణంగా వుండాలి.. ఇష్టం లేకపోతే వెళ్ళిపోవాలి అంతే కానీ.. ఇలా అధినేతకు ఇబ్బందికలిగించేట్లు మాట్లాడడమేంటని అంటున్నారు.

సో.. పార్టీలో వుంటూనే ఇబ్బందికరంగా బిహేవ్ చేయడం ద్వారా అధినేతే పార్టీ బయటికి పంపేలా గంటా వ్యూహరచన చేస్తున్నారా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి తాజాగా.