గంటా గారి మాటలు వేరు..చేతలు వేరు.. ఇదే ప్రూఫ్

గంటా శ్రీనివాస్ రావు.. తెలుగుదేశం పార్టీలో కీలక నేత. మాజీ మంత్రి కూడా. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో విశాఖ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన గంటా శ్రీనివాస్ రావు.. గత కొంత కాలంగా పార్టీతో అంటీ ముట్టనట్లు వుంటూ వస్తున్నారు. పార్టీ మారతారంటూ గత ఆరు నెలలుగా చర్చ జరుగుతూనే వుంది. బీజేపీ, వైసీపీ నేతలతో ఆయన సంప్రదింపులు జరుపుతున్నారంటూ ప్రచారం జోరుగా సాగుతూనే వుంది. ఆ ప్రచారాన్ని ఎంజాయ్ చేస్తూ వస్తున్న గంటా శ్రీనివాస్ రావు.. ఇటీవల […]

గంటా గారి మాటలు వేరు..చేతలు వేరు.. ఇదే ప్రూఫ్
Follow us

|

Updated on: Jan 04, 2020 | 1:09 PM

గంటా శ్రీనివాస్ రావు.. తెలుగుదేశం పార్టీలో కీలక నేత. మాజీ మంత్రి కూడా. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో విశాఖ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన గంటా శ్రీనివాస్ రావు.. గత కొంత కాలంగా పార్టీతో అంటీ ముట్టనట్లు వుంటూ వస్తున్నారు. పార్టీ మారతారంటూ గత ఆరు నెలలుగా చర్చ జరుగుతూనే వుంది. బీజేపీ, వైసీపీ నేతలతో ఆయన సంప్రదింపులు జరుపుతున్నారంటూ ప్రచారం జోరుగా సాగుతూనే వుంది. ఆ ప్రచారాన్ని ఎంజాయ్ చేస్తూ వస్తున్న గంటా శ్రీనివాస్ రావు.. ఇటీవల రెండు సందర్భాలలో తాను పార్టీ మారడం లేదంటూ ప్రకటనలు చేశారు.

పార్టీ మారతారా లేదా అన్నది పక్కన పెడితే.. గంటా.. టీడీపీ కార్యక్రమాలలో పెద్దగా పార్టిసిపేట్ చేయడం లేదు. డిసెంబర్‌ నెలలో జరిగిన రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల్లో ఆయన పాల్గొన్నది ఒకే ఒక్క రోజు. సమావేశాలు జరిగినన్ని రోజులు.. టీడీపీ అధినేత చంద్రబాబు ఏదో రకంగా ప్రభుత్వంపై ఉద్యమిస్తూనే వున్నారు. పలు దఫాలలో సభలోను అధికార పార్టీతో హీటెడ్ డిస్కషన్స్ చోటుచేసుకున్నాయి కూడా. కానీ టీడీపీ పక్షాన గెలిచిన మొత్తం 23 మందిలో కేవలం నలుగురైదుగురు మాత్రమే చంద్రబాబు పక్కన యాక్టివ్‌గా కనిపించారు. ఆ నలుగురైదుగురిలో సైతం మద్దాలి గిరిధర్ రావు ఇటీవల ముఖ్యమంత్రి జగన్‌ని కలిసి, సభలో టీడీపీ పక్షాన కాకుండా.. ప్రత్యేకంగా తనను గుర్తించాలని స్పీకర్ తమ్మినేనిని కోరనున్నట్లు ప్రకటించారు మద్దాలి గిరి.

వల్లభనేని, మద్దాలి.. ఇలా టీడీపీ పక్షాన గెలిచిన ఎమ్మెల్యేలు ఒక్కరొక్కరే తట్టాబుట్టా సర్దుకుంటుంటే వీరి కంటే ముందు నుంచి ప్రచారంలో వున్న గంటా శ్రీనివాస్ రావు మాత్రం మాటల్లో ఒకటి చెబుతూ.. చేతల్లో మరొకటి చేస్తూ కాలం గడుపుతున్నారు. తాజాగా గంటా శ్రీనివాస్ రావు వైసీపీ నేతలతో భేటీ అయిన ఫోటో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో సంచారం చేస్తోంది. వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు, మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డిలతో పాటు కాంగ్రెస్ నేత టి.సుబ్బిరామిరెడ్డి ఈ పోటోలో వున్నారు. వీరంతా ఏదో పార్టీలో కలిసి వున్నట్లుగా కనిపిస్తున్న ఈ ఫోటోలో గంటా శ్రీనివాస్ రావు.. రఘురామకృష్ణంరాజుతో సీరియస్ డిస్కషన్‌లో వున్నట్లు తెలుస్తోంది.

అయితే.. గంటా వైసీపీ నేతలతో సంప్రదింపులు జరుపుతున్నారా లేక ఇంకేదైనా వుందా అనేది తేలాల్సి వుంది. ఎందుకంటే ఇటీవలి కాలంలో రఘురామకృష్ణంరాజు బీజేపీ నేతలతో ఎక్కువగా సన్నిహితంగా వుంటున్నారు. అదే సమయంలో మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి సైతం వైసీపీలో తనకు తగిన గుర్తింపు లేదని భావిస్తూ నర్మగర్భ వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో గంటా సంప్రదింపులు ఏ విషయంలో అన్నది తేలాల్సి వుంది. అయితే.. వైసీపీ లేదా బీజేపీ అనే కోణంలో గంటా రాజకీయ ప్రయాణం వుండే ఛాన్స్ వుందని విశాఖ పొలిటికల్ వర్గాలు చెప్పుకుంటున్నాయి.

దిన ఫలాలు (మార్చి 29, 2024): 12 రాశుల వారికి ఇలా..
దిన ఫలాలు (మార్చి 29, 2024): 12 రాశుల వారికి ఇలా..
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!