రూ.8 కోట్ల విలువైన గంజాయి సీజ్.. ఇద్దరు అరెస్ట్

అక్రమంగా భారీగా గంజాయి తరలిస్తున్న ముఠా గుట్టురట్టైంది. ఎనిమిది కోట్ల రూపాయ‌ల విలువైన గంజాయి పోలీసులు ప‌ట్టుకున్నారు. ఈ ఘ‌ట‌న మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లోని అగ‌ర్‌మాల్వా జిల్లా సుస్న‌ర్ ప‌ట్ట‌ణంలో శ‌నివారం చోటుచేసుకుంది.

రూ.8 కోట్ల విలువైన గంజాయి సీజ్.. ఇద్దరు అరెస్ట్
Follow us

|

Updated on: Sep 05, 2020 | 5:45 PM

అక్రమంగా భారీగా గంజాయి తరలిస్తున్న ముఠా గుట్టురట్టైంది. ఎనిమిది కోట్ల రూపాయ‌ల విలువైన గంజాయి పోలీసులు ప‌ట్టుకున్నారు. ఈ ఘ‌ట‌న మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లోని అగ‌ర్‌మాల్వా జిల్లా సుస్న‌ర్ ప‌ట్ట‌ణంలో శ‌నివారం చోటుచేసుకుంది. భారీగా గంజాయి స‌ర‌ఫ‌రా అవుతున్నట్లు స‌మాచారం అందుకున్న నోయిడా యూనిట్ ఎస్‌టీఎఫ్ సిబ్బంది పాగా వేశారు. మ‌ధ్య‌ప్ర‌దేశ్ స్థానిక పోలీసుల సహ‌కారంతో కంటైనర్ ట్రక్కును వెంబడించి గంజాయిని పట్టుకున్నారు. ఇందుకు సంబంధించి ఇద్ద‌రు వ్య‌క్తుల‌ను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. నిందితుల వ‌ద్ద నుంచి 1,727 కిలోల గంజాయిని, గంజాయి ర‌వాణా చేస్తున్న కంటైన‌ర్ ట్ర‌క్కును స్వాధీనం చేసుకున్నారు. నిందితులు ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని గ‌జియాబాద్ జిల్లాకు చెందిన శుభం త్యాగి, లోకేశ్‌సింగ్‌గా ఎస్టీఎఫ్ సిబ్బంది తెలిపారు.