విశాఖజిల్లా లంబసింగి అటవీశాఖ చెక్‌పోస్ట్‌ దగ్గర భారీగా పట్టుబడ్డ గంజాయి.. 625 కిలోలు 12లక్షల పైమాటే..

విశాఖజిల్లా చింతపల్లి మండలం లంబసింగి అటవీశాఖ చెక్ పోస్టు దగ్గర పెద్దమొత్తంలో గంజాయి పట్టుబడింది. పోలీసుశాఖ, అటవీశాఖ సిబ్బంది కలసి..

  • Venkata Narayana
  • Publish Date - 4:25 am, Wed, 2 December 20
విశాఖజిల్లా లంబసింగి అటవీశాఖ చెక్‌పోస్ట్‌ దగ్గర భారీగా పట్టుబడ్డ గంజాయి.. 625 కిలోలు 12లక్షల పైమాటే..

విశాఖజిల్లా చింతపల్లి మండలం లంబసింగి అటవీశాఖ చెక్ పోస్టు దగ్గర పెద్దమొత్తంలో గంజాయి పట్టుబడింది. పోలీసుశాఖ, అటవీశాఖ సిబ్బంది కలసి మందస్తు సమాచారంతో వాహనాలు తనీఖీ చేస్తుండగా గంజాయి అక్రమ రవాణా వెలుగుచూసింది. సీలేరు నుండి మైదాన ప్రాంతంకు వెళ్ళుచున్న ఐసర్ వాహనములో 12 లక్షల 50 వేలు విలువ కలిగిన గంజాయి పోలీస్ ల కంటపడింది. 625 కిలోల గంజాయిని పట్టుకొన్నామని, డ్రైవరు ను అదుపులోకి తీసుకుని లారీనీ స్వాధీనం చేసుకుని పోలీసు స్టేషను కు తరలించినట్టు పోలీసులు వెల్లడించారు.