గంగూలీకి కీలక బాధ్యతలు..!

ఐపీఎల్-12 మరికొద్ది రోజుల్లో ప్రారంభం కానుంది. ఇప్పటికే  ఫ్రాంచైజీలు అందరూ కూడా ట్రోఫీని కైవసం చేసుకోవడానికి కసరత్తులు మొదలు పెట్టారు. మరోవైపు ఈ ఏడాది ఫ్రాంచైజీ పేరు మార్చుకున్న ఢిల్లీ జట్టు మరో కీలక నిర్ణయం తీసుకుంది. టీం ఇండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీని తమ జట్టుకు సలహాదారుడిగా నియమిస్తున్నట్లు ఢిల్లీ క్యాపిటల్స్ ప్రకటించింది. ఇప్పటికే ఢిల్లీ టీం కు ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ ప్రధాన కోచ్ కాగా, భారత మాజీ క్రికెటర్ […]

గంగూలీకి కీలక బాధ్యతలు..!
Follow us

| Edited By: Team Veegam

Updated on: Feb 14, 2020 | 1:37 PM

ఐపీఎల్-12 మరికొద్ది రోజుల్లో ప్రారంభం కానుంది. ఇప్పటికే  ఫ్రాంచైజీలు అందరూ కూడా ట్రోఫీని కైవసం చేసుకోవడానికి కసరత్తులు మొదలు పెట్టారు. మరోవైపు ఈ ఏడాది ఫ్రాంచైజీ పేరు మార్చుకున్న ఢిల్లీ జట్టు మరో కీలక నిర్ణయం తీసుకుంది. టీం ఇండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీని తమ జట్టుకు సలహాదారుడిగా నియమిస్తున్నట్లు ఢిల్లీ క్యాపిటల్స్ ప్రకటించింది.

ఇప్పటికే ఢిల్లీ టీం కు ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ ప్రధాన కోచ్ కాగా, భారత మాజీ క్రికెటర్ మహమ్మద్ కైఫ్ అసిస్టెంట్ కోచ్ గా, ఆస్ట్రేలియన్ బౌలర్ జేమ్స్ హోప్ బౌలింగ్ కోచ్ గా వ్యవహరిస్తున్నారు. ఇక వారితో ఇప్పుడు సౌరవ్ గంగూలీ కలిసి పని చేయనున్నారు. ఫ్రాంచైజీ పేరు నుంచి.. టీం కోచ్స్ వరకు అందరిని మార్చిన ఢిల్లీ జట్టు ఈసారైనా ఫైనల్స్ కు చేరుతుందో లేదో వేచి చూడాల్సిందే.