ఎన్‌కౌంటర్‌లో పట్టుబడ్డ గ్యాంగ్‌స్టర్‌..

ఓ మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్ యూపీలో పోలీసులకు పట్టుబడ్డాడు. అది కూడా పోలీసులు జరిపిన ఓ ఎన్‌కౌంటర్‌లో. అనేక నేరాల్లో మోస్ట్ వాంటెడ్‌గా ఉన్న సుమిత్ బటి అనే గ్యాంగ్‌స్టర్‌ తలపై 25వేల రివార్డ్ కూడా ఉంది.

  • Tv9 Telugu
  • Publish Date - 9:04 pm, Fri, 5 June 20

ఓ మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్ యూపీలో పోలీసులకు పట్టుబడ్డాడు. అది కూడా పోలీసులు జరిపిన ఓ ఎన్‌కౌంటర్‌లో. అనేక నేరాల్లో మోస్ట్ వాంటెడ్‌గా ఉన్న సుమిత్ బటి అనే గ్యాంగ్‌స్టర్‌ తలపై 25వేల రివార్డ్ కూడా ఉంది. గౌతం బుద్ద్‌ నగర్‌లోని చక్రసేన్‌పూర్‌ రోడ్డు సమీపంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో పోలీసులు ఈ గ్యాంగ్‌స్టర్‌ను అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రేటర్‌ నోయిడా, దాద్రా పోలీసులకు క్రిమినల్స్‌కు మధ్య ఎన్‌కౌంటర్‌ చోటుచేసుకుందని.. ఈ ఘటనలో రూ.25వేల రివార్డ్ ఉన్న సుమిత్‌ బటి అనే గ్యాంగ్‌ స్టర్ గాయాలపాలయ్యాడని తెలిపారు. వెంటనే అతడిని అదుపులోకి తీసుకుని ఆస్పత్రికి తరలించామని తెలిపారు. సంఘటనా స్థలం నుంచి మరో క్రిమినల్ పారిపోయాడని తెలిపారు. వీరు కొద్ది రోజుల క్రితం ట్రక్కు డ్రైవర్ల నుంచి ఫోన్లను దొంగతనం చేశారని.. అలా దొంగతనం చేసిన ఫోన్లతో పాటు.. ఓ నాటు తుపాకీ, బైక్‌ను స్వాధీనం చేసుకున్నట్లు పోలీస్ అధికారులు తెలిపారు.