దక్షిణాఫ్రికాలో గణేశ్ ఉత్సవాలు

Ganesh festival celebrations in south africa for fifty years, దక్షిణాఫ్రికాలో గణేశ్ ఉత్సవాలు

హైందవ సంస్కృతి కేవలం భారత్‌లో మాత్రమే కాక పలు దేశాల్లోకూడా విస్తరించి ఉన్న సంగతి తెలిసిందే. మలేషియా, ఇండోనేషియా, మయన్మార్, ఇంకా పలు దేశాల్లో హైందవ పండుగలు సైతం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. తాజాగా దక్షిణాఫ్రికాలో కూడా గణేశ్ నవరాత్రులు నిర్వహించడం వార్తలకెక్కింది.

దక్షిణాఫ్రికాలోని ఘనా దేశంలో దాదాపు 12 వేలమంది భారతీయులు నివసిస్తున్నారు. వీరు ఏటా భారతీయ సంప్రదాయం ప్రకారం పండుగలు ఆచరిస్తూనే ఉన్నారు. భారతీయులతో పాటు అక్కడనున్న దక్షిణాఫ్రికా వాసులు సైతం ఈ పండుగలకు హాజరవుతారు. ప్రస్తుతం అక్కడ వినాయక చవితి పండగను ఘనంగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. చవితి రోజున గణేశ్‌ను పూజించి మూడు రోజుల తర్వాత అక్కడికి దగ్గర్లో ఉన్న సముద్రంలో నిమజ్జనం చేయడం వీరికి అలవాటు. ఈ విధంగా పండుగలు జరుపుకోవడం అనేది 1970లోనే ప్రారంభమైందనట్టుగా తెలుస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *