సంతోష్ బాబు స్థానే.. బిహార్ రెజిమెంట్ కు కొత్త కల్నల్ !

గాల్వన్ వ్యాలీలో గత జూన్ 15న చైనా దళాలతో జరిగిన ఘర్షణలో భారత సైన్యంలోని 16 బిహార్ రెజిమెంట్ కీలక పాత్ర పోషించింది. చైనా సైనికులను దీటుగా ఎదుర్కొంది. నాటి ఘర్షణలో ఈ యూనిట్ కమాండింగ్ ఆఫీసర్..

సంతోష్ బాబు స్థానే.. బిహార్ రెజిమెంట్ కు కొత్త కల్నల్ !
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jul 01, 2020 | 6:40 PM

గాల్వన్ వ్యాలీలో గత జూన్ 15న చైనా దళాలతో జరిగిన ఘర్షణలో భారత సైన్యంలోని 16 బిహార్ రెజిమెంట్ కీలక పాత్ర పోషించింది. చైనా సైనికులను దీటుగా ఎదుర్కొంది. నాటి ఘర్షణలో ఈ యూనిట్ కమాండింగ్ ఆఫీసర్ కల్నల్ సంతోష్ బాబు సహా 12 మంది అమరులయ్యారు. ఇతర యూనిట్లకు చెందిన  ఎనిమిది మంది జవాన్లు కూడా ప్రాణాలు కోల్పోయారు. అప్పటి నుంచి బిహార్ రెజిమెంట్ కి కల్నల్ లేకపోగా.. మరో బెటాలియన్ కి చెందిన కల్నల్ స్థాయి అధికారి ఈ యూనిట్ కి కమాండింగ్ ఆఫీసర్ గా నియమితులయ్యారు. తగిలిన గాయాల నుంచి తేరుకుని, గాల్వన్ లోయలో తిరిగి  సైన్యం సంసధ్ధతకు తోడ్పడేందుకుఈ నియామకాన్ని చేపట్టారు. ఈ కొత్త కల్నల్ బిహార్ రెజిమెంట్ కు నాయకత్వం వహించనున్నారు.

నాటి ఘర్షణలో గాయపడిన దాదాపు 70 మంది జవాన్లు లేహ్ లోని ఫీల్డ్ హాస్పిటల్ లో చికిత్స పొందారు. వీరిలో పలువురు కోలుకుని మళ్ళీ సైనిక విధుల్లో చేరనున్నారు. కొత్త కల్నల్ ఈ యూనిట్ తో బాటు ఇతర యూనిట్లలోను స్ఫూర్తిని, ధైర్యాన్ని నింపుతారని ఆశిస్తున్నారు.