<urlset xmlns:xsi="http://www.w3.org/2001/XMLSchema-instance" xmlns:image="http://www.google.com/schemas/sitemap-image/1.1" xsi:schemaLocation="http://www.sitemaps.org/schemas/sitemap/0.9 http://www.sitemaps.org/schemas/sitemap/0.9/sitemap.xsd http://www.google.com/schemas/sitemap-image/1.1 http://www.google.com/schemas/sitemap-image/1.1/sitemap-image.xsd" xmlns="http://www.sitemaps.org/schemas/sitemap/0.9"><url><loc>https://tv9telugu.com/photo-gallery/healthy-pesala-molakala-karam-podi-recipe-sprouted-moong-dal-karam-for-hot-rice-and-idli-1937679.html</loc><lastmod>2026-10-18T21:52:09+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/10/molakala-karam-podi-6.jpg</image:loc>
					<image:title><![CDATA[ Molakala Karam Podi (6) ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/10/molakala-karam-podi-1.jpg</image:loc><image:caption><![CDATA[ కావలసిన పదార్థాలు: 1 కప్పు పెసల మొలకలు, 10 నుండి 12 వెల్లుల్లి రెబ్బలు, 2 చెంచాల పల్లీలు, 2 చెంచాల ఎండు కొబ్బరి ముక్కలు, 2 రెమ్మల కరివేపాకు, 1 చెంచా జీలకర్ర, 
రుచికి తగినంత కారం పొడి, రుచికి సరిపడా ఉప్పు, 2 నుండి 3 చెంచాల వంట నూనె. గమనిక: ఈ రెసిపీకి చింతపండు అస్సలు అవసరం లేదు ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/10/molakala-karam-podi-2.jpg</image:loc><image:caption><![CDATA[ తయారీ విధానం: స్టవ్‌పై బాండీ పెట్టి 2-3 చెంచాల నూనె వేసి వేడిచేయాలి. నూనె కాగిన తర్వాత వెల్లుల్లి రెబ్బలను వేసి దోరగా వేయించాలి. ఆ తర్వాత 2 చెంచాల పల్లీలు వేసి వేయించాలి. పల్లీలు సగం వేగిన తర్వాత ఎండు కొబ్బరి ముక్కలు వేసి ఎర్రగా మారే వరకు వేయించి ఒక ప్లేట్‌లోకి తీసుకోవాలి. అదే నూనెలో కరివేపాకు వేసి క్రిస్పీగా వేయించి ప్లేట్‌లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/10/molakala-karam-podi-5.jpg</image:loc><image:caption><![CDATA[ అదే బాండీలోకి మొలకలు వచ్చిన పెసలను వేయాలి. మంటను లో-మీడియం ఫ్లేమ్‌లో ఉంచి గరిటెతో కలుపుతూ నిదానంగా ఎక్కువసేపు వేయించాలి . మొలకలలో ఉండే చెమ్మ పూర్తిగా ఆవిరైపోయి, అవి చక్కగా క్రిస్పీగా మారే వరకు వేయించాలి. ఇలా వేయించకపోతే పొడి వాసన వచ్చేస్తుంది. మొలకలు క్రిస్పీగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి, ఆ వేడి మీదే ఒక చెంచా జీలకర్ర వేయాలి. ఆ బాండీ వేడికే జీలకర్ర చక్కగా వేగిపోతుంది. ఈ మిశ్రమాన్ని పూర్తిగా చల్లారనివ్వాలి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/10/munagaku-karivepaku-karam-podi-4.jpg</image:loc><image:caption><![CDATA[ బాగా చల్లారిన తర్వాత మిక్సీ జార్‌లోకి వేయించిన పెసల మొలకలు, జీలకర్ర వేయాలి. ఇందులోనే ముందుగా వేయించి ఉంచుకున్న కొబ్బరి ముక్కలు, పల్లీలు, కరివేపాకు మరియు వెల్లుల్లి రెబ్బలు వేయాలి. ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు, కారానికి తగినంత కారం పొడి వేసి మరీ మెత్తటి పిండిలా కాకుండా కాస్త బరకగా ఉండేలా గ్రైండ్ చేసుకోవాలి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/10/munagaku-karivepaku-karam-podi-3.jpg</image:loc><image:caption><![CDATA[ గ్రైండ్ చేసిన కారప్పొడిని ప్లేట్‌లోకి తీసుకుని పూర్తిగా చల్లారిన తర్వాత గాలి చొరబడని డబ్బాలో భద్రపరుచుకోవాలి. ఇది 10 నుండి 15 రోజుల పాటు తాజాగా ఉంటుంది. అంతే, నోరూరించే బలవర్ధకమైన &#039;పెసల మొలకల కారప్పొడి&#039; సిద్ధం. పొగలు కక్కే వేడివేడి అన్నంలో ఈ కారప్పొడి వేసి, స్వచ్ఛమైన నెయ్యి కలుపుకుని తింటే అద్భుతమైన రుచితో పాటు శరీరానికి పుష్కలమైన పోషకాలు అందుతాయి! ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/healthy-oats-omelette-recipe-for-weight-loss-high-protein-quick-breakfast-1937665.html</loc><lastmod>2026-10-18T21:43:27+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/10/oats-omelette-6.jpg</image:loc>
					<image:title><![CDATA[ Oats Omelette (6) ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/10/oats-omelette-1.jpg</image:loc><image:caption><![CDATA[ కావలసిన పదార్థాలు: ప్లెయిన్ ఓట్స్ అర కప్పు, గుడ్లు 2 నుండి 3, 1 మీడియం సైజు ఉల్లిపాయ సన్నగా తరిగినది, సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు 2, తురిమిన 1 క్యారెట్, 
కొద్దిగా తాజా కొత్తిమీర తరుగు, పావు టీస్పూన్ కారం పొడి, రుచికి సరిపడా ఉప్పు, పాన్‌పై స్ప్రెడ్ చేయడానికి వంట నూనె ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/10/oats-omelette-2.jpg</image:loc><image:caption><![CDATA[ తయారీ విధానం: ముందుగా ఉల్లిపాయ, పచ్చిమిర్చిని శుభ్రంగా కడిగి వీలైనంత సన్నని ముక్కలుగా కట్ చేసుకోవాలి. క్యారెట్‌ను శుభ్రం చేసి తురుము పీటపై సన్నగా తురుముకోవాలి. క్యారెట్‌తో పాటు లేదా క్యారెట్ లేకపోతే బీట్‌రూట్ తురుమును కూడా వేసుకోవచ్చు. కొత్తిమీరను కూడా శుభ్రంగా కడిగి సన్నగా తరిగి ఉంచుకోవాలి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/10/oats-omelette-3.jpg</image:loc><image:caption><![CDATA[ ఒక మిక్సింగ్ బౌల్‌లోకి తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, క్యారెట్ తురుము తీసుకోవాలి. ఇందులోనే అర కప్పు ప్లెయిన్ ఓట్స్ వేయాలి. ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు, పావు టీస్పూన్ కారం పొడి వేయాలి. ఎలాంటి ఇతర గరం మసాలాలు అవసరం లేదు. ఇందులో మొదట రెండు గుడ్లను పగలగొట్టి వేయాలి. స్పూన్‌తో ఓట్స్, కూరగాయలు, గుడ్లు సమంగా కలిసేలా బాగా మిక్స్ చేయాలి. ఆ తర్వాత సన్నగా తరిగిన కొత్తిమీర వేసి కలపాలి. మిశ్రమం మరీ పొడిగా అనిపిస్తే మరొక గుడ్డును కూడా పగలగొట్టి వేసి జారుడు బ్యాటర్‌లా కలుపుకోవాలి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/10/oats-omelette-4.jpg</image:loc><image:caption><![CDATA[ స్టవ్‌పై నాన్‌స్టిక్ లేదా దోశ పాన్ పెట్టి వేడిచేయాలి. పాన్ వేడయ్యాక డైట్ రెసిపీ కాబట్టి కేవలం అర టీస్పూన్ నూనె మాత్రమే వేసి పాన్ అంతటా బ్రష్ లేదా స్పూన్‌తో పల్చగా స్ప్రెడ్ చేయాలి. ఇప్పుడు తయారుచేసి పెట్టుకున్న ఓట్స్-ఎగ్ మిశ్రమాన్ని పాన్ మధ్యలో వేసి.. మరీ మందంగా కాకుండా స్పూన్‌తో సమానంగా రౌండ్‌గా స్ప్రెడ్ చేయాలి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/10/oats-omelette-5.jpg</image:loc><image:caption><![CDATA[ మంటను పూర్తిగా లో ఫ్లేమ్‌లో ఉంచాలి. హై ఫ్లేమ్‌లో పెడితే కింద మాడిపోయి పైన ఓట్స్ ఉడకవు. మూతపెట్టి ఒకటి నుండి రెండు నిమిషాల పాటు ఆవిరిపై ఉడకనివ్వాలి. అడుగు భాగం చక్కగా కాలి గట్టిపడిన తర్వాత.. జాగ్రత్తగా అట్లకాడతో రెండో వైపుకు తిప్పాలి. అటువైపు కూడా సిమ్ మంటపైనే మరో నిమిషం పాటు కాల్చి ప్లేట్‌లోకి తీసుకోవాలి. అంతే, నోరూరించే బలవర్ధకమైన &#039;ఓట్స్ ఆమ్లెట్&#039; సిద్ధం! దీనిని ముక్కలుగా కట్ చేసుకుని ఇష్టమైతే కొద్దిగా టమాటా సాస్‌తో నంజుకుని తింటే దోశ తిన్న అనుభూతితో పాటు కడుపు నిండుగా ఉండి బరువును సులభంగా అదుపులో ఉంచుతుంది! ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/sleeping-position-personality-test-what-your-sleep-posture-reveals-about-your-true-self-1937583.html</loc><lastmod>2026-10-18T20:41:53+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/10/sleeping-position-personality-test-6.jpg</image:loc>
					<image:title><![CDATA[ Sleeping Position Personality Test ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/10/sleeping-position-personality-test-4.jpg</image:loc><image:caption><![CDATA[ మనం పడుకునే భంగిమ అనేది మన ఉపచేతన మనస్సును ప్రతిబింబిస్తూ మన క్యారెక్టర్ గురించి ఆసక్తికర విషయాలు చెబుతుందట. అవును కొన్ని అధ్యయనాల ప్రకారం కేవలం 5 శాతం మంది మాత్రమే ఒక్కో రాత్రి ఒక్క పోజిషన్‌లో నిద్రపోతారట.. మిగిలిన 95 శాతం మంది ఎల్లప్పుడూ ఒకే పోజిషన్‌లో పడుకుంటారట. మీరు కూడా ఇలా రకరకాల పొజిషన్‌లో పడుకుంటే.. మీరు పగడుకునే విధానం మీ గురించి ఏం చెబుతుంలో ఇక్కడ తెలుసుకోండి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/10/sleeping-position-personality-test-3.jpg</image:loc><image:caption><![CDATA[ సోల్జర్ పొజిషన్ స్లీప్: కొంత మంది చేతులు, కాళ్లను శరీరానికి సమాంతరంగా నిటారుగా చాచి వెల్లకిలా పడుకుంటారు. ఇలాంటి వ్యక్తులు క్రమశిక్షణకు మారుపేరుగా ప్రవర్తిస్తారట. వీరు సాధారణంగా ఇంట్రోవర్ట్స్ ఉంటూ ప్రతి విషయంలోనూ క్రమబద్ధతను పాటిస్తారట. అంతేకాదు తమపై మాత్రమే కాకుండా ఇతరులపై కూడా ఉన్నతమైన అంచనాలు పెట్టుకుంటారు. ఇలాంటి వ్యక్తులు అనుకున్న పనిని సాధించే వరకు పట్టుదలతో శ్రమిస్తారట. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/10/sleeping-position-personality-test-2.jpg</image:loc><image:caption><![CDATA[ పొట్టపై పడుకోవడం: కొందరు బోర్లా లేదా పొట్టపై పడుకునే అలవాటు ఉంటుంది. ఇలాంటి వ్యక్తులు చాలా తక్కువగా ఉంటారు. ఈ భంగిమలో నిద్రించే వ్యక్తులు చాలా యాక్టీవ్‌గా, ఉల్లాసంగా, ధైర్యంగా ఉంటారట. ఇలాంటి వారు ఎక్కువగా స్వేచ్ఛను అమితంగా ఇష్టపడతారట. అలాగే కొత్త రిస్క్‌లు తీసుకోవడానికి వెనుకాడరట. అయితే ఇలాంటి వారు తమపై పక్కవారు చేసే విమర్శల పట్ల కాస్త సున్నితంగా స్పందిస్తారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/10/sleeping-position-personality-test-1.jpg</image:loc><image:caption><![CDATA[ పిండం ఆకారంలో పడుకోవడం: కొందరు వ్యక్తులు చేతులు, కాళ్లు వెడల్పుగా చాచి స్టార్ ఫిష్ ఆకారంలో పడుకుంటారు. ఇలాంటి  వ్యక్తులు స్నేహానికి ఎక్కువగా ప్రధాన్యత ఇస్తారట. ఇతరుల సమస్యలను శ్రద్ధగా విడమే కాకుండా వాటిని పరిష్కరించేందుకు కూడా ఇంట్రెస్ట్ చూపిస్తారట. అలాగే కొంత మంది పిండ భంగిమలో ముడుచుకుని పడుకుంటారు. ఇలాంటి పడుకునే వారు చాలా మందే ఉన్నారట, దాదాపు 41 శాతం మంది ఈ భంగిమలోనే పడుకుంటారట. ఇలాంటి వ్యక్తులు లోపల సున్నితంగా, సిగ్గరిగా ఉంటారట. వీరు భద్రతను కోరుకుంటూ సమస్యల నుంచి దూరంగా ఉండటానికి ప్రయత్నిస్తారట. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/10/sleeping-position-personality-test.jpg</image:loc><image:caption><![CDATA[ తల వెనుక చేతులు పెట్టుకొని పడుకునే వారు: కొంతమందికి తల వెనుక రెండు చేతులు దిండులా పెట్టుకునే అలవాటు ఉంటుంది. అలాంటి నిద్రించేవారు ఎప్పుడూ ప్రశాంతంగా ఉంటారట. అలాగే ఎప్పుడూ ఇతరుల మంచిని కోరుకుంటారట. వీరు ప్రాక్టికాలిటీ కంటే భావోద్వేగాలకే ప్రాధాన్యత ఇస్తారట. అలాగే దిండును హత్తుకుని పడుకునే వారు అందరి పట్ల ప్రేమగా ఉంటారట. అలాగే వీరు బంధాలను నిలబెట్టుకోవడంలో ఎక్కవ శ్రద్ధ చూపిస్తారట. మరి మీ నిద్ర భంగిమ ఏమిటి.. మీ క్యారెక్టర్ ఎలాంటిదో చూశారా? ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/cricket-photos/7-indian-cricketers-who-made-a-comeback-to-team-india-after-years-from-unadkat-to-bhuvneshwar-kumar-1937576.html</loc><lastmod>2026-10-18T20:29:06+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/10/team-india-comeback-players.jpg</image:loc>
					<image:title><![CDATA[ Team India Comeback Players ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/10/team-india-comeback-players-1.jpg</image:loc><image:caption><![CDATA[ Team India Comeback: టీమిండియాలో ప్రతిభకు కొదవ లేదు. అందుకే ఒకసారి జట్టుకు దూరమైన ఆటగాళ్లు తిరిగి చోటు సంపాదించడం అంత సులభం కాదు. అయితే సుదీర్ఘ నిరీక్షణ తర్వాత భారత జట్టులోకి విజయవంతంగా పునరాగమనం చేసిన ఆటగాళ్లు కూడా ఉన్నారు. జయదేవ్ ఉనద్కట్, కరుణ్ నాయర్, పార్థివ్ పటేల్, ఆశిష్ నెహ్రా, భువనేశ్వర్ కుమార్, దినేశ్ కార్తీక్, వరుణ్ చక్రవర్తి ఈ జాబితాలో ఉన్నారు. టీమిండియాలో ప్రతిభావంతులైన ఆటగాళ్లు ఎంతో మంది ఉండటంతో.. ఒకసారి జట్టుకు దూరమైన తర్వాత మళ్లీ చోటు దక్కించుకోవడానికి చాలా కాలం ఎదురుచూడాల్సి వస్తుంది. ఇలా ఏళ్ల తరబడి జాతీయ జట్టుకు దూరంగా ఉండి, ఆ తర్వాత తిరిగి టీమిండియాలోకి వచ్చిన ఆటగాళ్ల వివరాలు ఇవే. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/10/team-india-comeback-players-jayadev-1.jpg</image:loc><image:caption><![CDATA[ 1. జయదేవ్ ఉనద్కట్: టీమిండియాకు దూరమైన తర్వాత అత్యంత సుదీర్ఘ కాలం ఎదురుచూసిన ఆటగాళ్ల జాబితాలో జయదేవ్ ఉనద్కట్ (Jaydev Unadkat) ముందుంటాడు. 2010 డిసెంబర్‌లో దక్షిణాఫ్రికాతో సెంచూరియన్‌లో జరిగిన టెస్టు మ్యాచ్‌తో ఉనద్కట్ అంతర్జాతీయ టెస్టు అరంగేట్రం చేశాడు. అయితే ఆ తర్వాత మరో టెస్టు మ్యాచ్ ఆడేందుకు అతడు ఏకంగా 12 ఏళ్లు వేచి చూడాల్సి వచ్చింది. 2022 డిసెంబర్‌లో బంగ్లాదేశ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో ఉనద్కట్‌కు మళ్లీ భారత జట్టులో చోటు లభించింది. అంటే తన తొలి టెస్టు తర్వాత దాదాపు 12 ఏళ్లకు అతడు మరోసారి టెస్టు మ్యాచ్ ఆడాడు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/10/team-india-comeback-players-karun-nair-1.jpg</image:loc><image:caption><![CDATA[ 2. కరుణ్ నాయర్: కర్ణాటకకు చెందిన బ్యాటర్ కరుణ్ నాయర్ (Karun Nair) కూడా టీమిండియాలో మరో అవకాశం కోసం సుదీర్ఘంగా ఎదురుచూడాల్సి వచ్చింది. 2016 డిసెంబర్‌లో ఇంగ్లాండ్‌తో చెన్నైలో జరిగిన టెస్టులో నాయర్ అజేయంగా 303 పరుగులు చేశాడు. దీంతో టెస్టు క్రికెట్‌లో ట్రిపుల్ సెంచరీ సాధించిన రెండో భారత బ్యాటర్‌గా రికార్డు సృష్టించాడు. అయితే 2017 మార్చిలో ఆస్ట్రేలియాతో ధర్మశాల టెస్టు తర్వాత అతడికి భారత టెస్టు జట్టులో మరో అవకాశం రాలేదు. చివరకు 2025 జూన్‌లో కరుణ్ నాయర్‌కు మళ్లీ భారత టెస్టు జట్టులో చోటు లభించింది. దాదాపు 8 ఏళ్ల తర్వాత అతడు టీమిండియాకు తిరిగి వచ్చాడు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/10/team-india-comeback-players-pardhiv-patel-1.jpg</image:loc><image:caption><![CDATA[ 3. పార్థివ్ పటేల్: వికెట్ కీపర్ బ్యాటర్ పార్థివ్ పటేల్ (Parthiv Patel) చాలా చిన్న వయసులోనే భారత జట్టులోకి అరంగేట్రం చేశాడు. అయితే జట్టులో స్థిరమైన స్థానం మాత్రం దక్కలేదు. 2008లో తన చివరి టెస్టు మ్యాచ్ ఆడిన పార్థివ్.. ఆ తర్వాత నవంబర్ 2016లో ఇంగ్లాండ్‌తో మొహాలీలో జరిగిన టెస్టు మ్యాచ్‌లో మళ్లీ టీమిండియాలో చోటు సంపాదించాడు. అంటే దాదాపు ఎనిమిదేళ్ల తర్వాత అతడు భారత జట్టులోకి తిరిగి వచ్చాడు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/10/team-india-comeback-players-ashish-nehra-2.jpg</image:loc><image:caption><![CDATA[ 4. ఆశిష్ నెహ్రా: వేగవంతమైన బౌలర్ ఆశిష్ నెహ్రా (Ashish Nehra) కూడా గాయాలు, ఫిట్‌నెస్ సమస్యల కారణంగా తరచూ జట్టుకు దూరమయ్యాడు. 2011 ప్రపంచకప్ సెమీఫైనల్లో పాకిస్థాన్‌తో మ్యాచ్ ఆడిన తర్వాత నెహ్రా భారత జట్టుకు దూరమయ్యాడు. ఆ తర్వాత 2016 జనవరిలో ఆస్ట్రేలియాతో జరిగిన టీ20 సిరీస్‌లో తిరిగి జాతీయ జట్టులోకి వచ్చాడు. అంటే దాదాపు ఐదేళ్ల తర్వాత నెహ్రాకు టీమిండియాలో మళ్లీ అవకాశం లభించింది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/10/team-india-comeback-players-bhuvaneswar-kumar-1.jpg</image:loc><image:caption><![CDATA[ 5. భువనేశ్వర్ కుమార్: స్వింగ్ బౌలింగ్‌కు పేరుగాంచిన భువనేశ్వర్ కుమార్ (Bhuvneshwar Kumar) కూడా దాదాపు నాలుగేళ్ల తర్వాత టీమిండియాకు తిరిగి వచ్చాడు. 2022 నవంబర్‌లో న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో భువనేశ్వర్ చివరిసారిగా భారత్ తరఫున టీ20 అంతర్జాతీయ మ్యాచ్ ఆడాడు. ఆ తర్వాత అతడు జాతీయ జట్టుకు దూరమయ్యాడు. ఇప్పుడు సుదీర్ఘ విరామం తర్వాత మళ్లీ భారత టీ20 జట్టులోకి పునరాగమనం చేశాడు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/10/team-india-comeback-players-dinesh-karthik-1.jpg</image:loc><image:caption><![CDATA[ 6. దినేశ్ కార్తీక్: వికెట్ కీపర్ బ్యాటర్ దినేశ్ కార్తీక్ (Dinesh Karthik) 2014లో తన చివరి వన్డే మ్యాచ్ ఆడాడు. ఆ తర్వాత 2017 జూలైలో వెస్టిండీస్‌తో జరిగిన వన్డే సిరీస్ సందర్భంగా మళ్లీ భారత జట్టులో చోటు దక్కించుకున్నాడు. అంటే దినేశ్ కార్తీక్ కూడా మూడేళ్లకు పైగా విరామం తర్వాత వన్డే జట్టులోకి తిరిగి వచ్చాడు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/10/team-india-comeback-players-varun.jpg</image:loc><image:caption><![CDATA[ 7. వరుణ్ చక్రవర్తి: మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి (Varun Chakravarthy) 2021 టీ20 ప్రపంచకప్‌లో భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. ఆ తర్వాత అతడిని జాతీయ జట్టు నుంచి తప్పించారు. మళ్లీ టీమిండియాలోకి రావడానికి వరుణ్ దాదాపు మూడేళ్లు వేచి చూడాల్సి వచ్చింది. 2024 అక్టోబర్‌లో బంగ్లాదేశ్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో అతడికి మరోసారి భారత జట్టులో ఆడే అవకాశం లభించింది. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/business-photos/airtel-new-recharge-plans-185-203-and-206-plans-launched-under-new-trai-rules-check-benefits-1937541.html</loc><lastmod>2026-10-18T18:54:17+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/10/airtel.jpg</image:loc>
					<image:title><![CDATA[ Airtel ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/10/airtel-1.jpg</image:loc><image:caption><![CDATA[ ట్రాయ్ కొత్త రీఛార్జ్ రూల్స్‌ను అక్టోబర్ 21వ తేదీ నుంచి అమల్లోకి తీసుకొస్తుంది. ఈ  నిబంధనల్లో భాగంగా టెలికాం కంపెనీల రీఛార్జ్ ప్లాన్లలో మార్పులు చోటుచేసుకోనున్నాయి. తక్కువ చెల్లుబాటు అయ్యే కాలానికి వాయిస్ ప్లస్ ఎస్‌ఎంఎస్ ప్లాన్లను తీసుకురావాలని ట్రాయ్ ఆదేశించింది. అలాగే వాయిస్, ఎస్‌ఎంఎస్, డేటా లభించే ప్లాన్లు 30 రోజుల పాటు చెల్లుబాటు అయ్యేలా తీసుకురావాలని మార్గదర్శకాల్లో పేర్కొంది. ఈ క్రమంలో టెలికాం కంపెనీలు కొత్త ప్లాన్లను లాంచ్ చేస్తున్నాయి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/10/airtel-2.jpg</image:loc><image:caption><![CDATA[ ఈ క్రమంలో టెలికాం రూల్స్ ప్రకారం ఎయిర్ టెల్ కొత్త ప్లాన్లను తీసుకొచ్చింది. రూ.185, రూ.203, రూ.206 వాయిస్, ఎస్‌ఎంఎస్ ప్లా్న్లను లాంచ్ చేసింది. రూ.185 ప్లాన్‌ వ్యాలిడిటీ 28 రోజుల పాటు ఉండనుండగా.. ఇందులో అన్‌లిమిటెడ్ కాల్స్, 300 ఎస్‌ఎంఎస్ ప్రయోజనాలు లభిస్తాయి. ఇక రూ.203 ప్లాన్ వ్యాలిడిటీ 30 రోజులు ఉంటుంది. అన్‌లిమిట్ కాల్స్, 300 ఎస్‌ఎంఎస్‌లు చేసుకోవచ్చు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/10/airtel-3.jpg</image:loc><image:caption><![CDATA[ రూ.206 ప్లాన్ విషయానికొస్తే.. ఒక క్యాలెండర్ నెల అందుబాటులో ఉంటుంది. అన్‌లిమిటెడ్ కాల్స్, 300 ఎస్‌ఎంఎస్‌లు అందుబాటులో ఉంటాయి. వీటితో పాటు ఉచిత హలో టూన్స్ ఈ మూడు ప్లాన్లలో పొందవచ్చని ఎయిర్‌టెల్ తెలిపింది. అయితే మొబైల్ డేటా వీటిల్లో అందుబాటులో ఉండదు. వాయిస్ కాల్స్, ఎస్‌ఎంఎస్‌లు మాత్రమే కావాలనుకునేవారు వీటిని ఎంచుకోవచ్చు ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/10/airtel-4.jpg</image:loc><image:caption><![CDATA[ ఈ మూడు ప్రీపెయిడ్ ప్లాన్స్ మాత్రమే. దీంతో ప్రీపెయిడ్ సిమ్ వినియోగదారులు వీటి ప్రయోజనం పొందవచ్చు. డేటా అవసరం లేనివారికి ఈ ప్లాన్లు ఎంతగానో ఉపయోగపడనున్నాయి. మొబైల్ వినియోగదారులు వీటిని ఉపయోగించుకోవాలని ఎయిర్‌టెల్ తెలిపింది. ఇక మిగతా టెలికాం కంపెనీలు కూడా 30 రోజుల వ్యాలిడిటీతో కూడిన ప్లాన్లను ప్రవేశపెడుతున్నాయి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/10/airtel-5.jpg</image:loc><image:caption><![CDATA[ ఈ ప్లాన్లలో అన్‌లిమిటెడ్ లోకల్, ఎస్‌టీడీ కాల్స్ పొందవచ్చు. అలాగే ఉచిత రోమింగ్స్‌తో పాటు ప్లాన్ కాలపరిమితిలో 300 ఎస్‌ఎంఎస్‌లు పంపుకోవచ్చు. డేటాతో కూడుకున్న రీఛార్జ్ ప్లాన్లు ఖరీదుగా ఉంటాయి. దీంతో తక్కువ ధరలతో కూడిన వాయిస్, ఎస్‌ఎంఎస్ ప్లాన్లను తీసుకురావాలని ట్రాయ్ ఆదేశాలు జారీ చేసింది. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/andhra-style-egg-pickle-recipe-how-to-make-tangy-and-spicy-egg-pickle-at-home-1937526.html</loc><lastmod>2026-10-18T18:43:15+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/10/egg-karam-5.jpg</image:loc>
					<image:title><![CDATA[ Egg Karam 5 ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/10/egg-karam-5.jpg</image:loc><image:caption><![CDATA[ కావలసిన పదార్థాలు.. కోడిగుడ్లు: 3 (ఉడికించినవి), పసుపు: 1/4 టీస్పూన్, కారం: 1/2 టీస్పూన్ (మ్యారినేషన్ కోసం), 1 1/2 టీస్పూన్ (ఉల్లిపాయ పేస్ట్ కోసం), గరం మసాలా: 1/2 టీస్పూన్ (మ్యారినేషన్ కోసం), 1 టీస్పూన్ (చివరిగా), ఉప్పు: 1/4 టీస్పూన్ (మ్యారినేషన్ కోసం), రుచికి సరిపడా (చివరిగా), నిమ్మరసం: 1 1/2 టీస్పూన్ (మ్యారినేషన్ కోసం), 1 1/2 టీస్పూన్ (చివరిగా), నీళ్లు: 1 టీస్పూన్ (మ్యారినేషన్ కోసం), ఉల్లిపాయలు: 1 కప్పు (నిలువుగా తరిగినవి), నూనె: 5 టేబుల్ స్పూన్లు (వేయించడానికి, తాలింపు కోసం), అల్లం: సన్నగా తరిగిన ముక్కలు (లేదా అల్లం వెల్లుల్లి పేస్ట్), వెల్లుల్లి: సన్నగా తరిగిన ముక్కలు (లేదా అల్లం వెల్లుల్లి పేస్ట్).. చొప్పున తీసుకోవాలి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/10/egg-karam-1.jpg</image:loc><image:caption><![CDATA[ ముందుగా కోడిగుడ్లను ఉడికించి, పొట్టు తీసి, శుభ్రంగా కడిగి ఒక క్లాత్‌తో తుడుచుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక గిన్నెలో పావు చెంచా పసుపు, అర చెంచా కారం, అర చెంచా గరం మసాలా, పావు చెంచా ఉప్పు వేసి, ఒకటిన్నర చెంచా నిమ్మరసం, ఒక చెంచా నీళ్లు వేసి పేస్టులా కలుపుకోవాలి. ఈ మిశ్రమం పులుపు ఎక్కువగా కావాలంటే నిమ్మరసం ఇంకొక స్పూన్ అదనంగా వేసుకోవచ్చు. ఇప్పుడు ఉడికించిన కోడిగుడ్లకు టూత్‌పిక్‌తో రంధ్రాలు చేసి, ఈ మసాలా మిశ్రమాన్ని గుడ్లకు బాగా పట్టించి మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/10/egg-karam-3.jpg</image:loc><image:caption><![CDATA[ ఒక కప్పు నిలువుగా తరిగిన ఉల్లిపాయ ముక్కలను మిక్సీ జార్‌లోకి తీసుకొని, ఒకటిన్నర చెంచా కారం వేసుకోవాలి. కారం కొంచెం ఎక్కువ పడుతుంది. ఈ ఉల్లిపాయలను మెత్తగా కాకుండా, సన్నగా తరిగినట్లుగా కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకోవాలి. ఈ పేస్ట్ పట్టుకుంటే రవ్వ రవ్వగా తగలాలి. స్టవ్ ఆన్ చేసి బాండీలో మూడు చెంచాల నూనె వేసుకోవాలి. కోడిగుడ్లను వీడియోలో చూపిన విధంగా జాగ్రత్తగా కట్ చేసి, పచ్చసొన, తెల్లసొనలను వేరు చేసుకోవాలి. తెల్లసొనను చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/10/egg-karam-2.jpg</image:loc><image:caption><![CDATA[ ఇప్పుడు ముందుగా మ్యారినేట్ చేసిన కోడిగుడ్ల పచ్చసొన, తెల్లసొన ముక్కలను ఆ నూనెలో విడివిడిగా వేయించుకోవాలి. పచ్చసొన ముక్కలను లో ఫ్లేమ్‌లో పెట్టి మాడిపోకుండా జాగ్రత్తగా వేపుకొని తీసేయాలి. ఆ తర్వాత తెల్లసొన ముక్కలను కూడా లో ఫ్లేమ్‌లో పెట్టి గోధుమ రంగులోకి వచ్చి, క్రిస్పీగా మారే వరకు వేపుకొని ఒక ప్లేట్‌లోకి తీసుకోవాలి. అదే బాండీలో మరో రెండు చెంచాల నూనె వేసి కాగిన తర్వాత సన్నగా తరిగిన అల్లం ముక్కలు, వెల్లుల్లి ముక్కలు వేసి పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వాడే కంటే ముక్కలు వాడితేనే రుచి బాగుంటుంది. ఇప్పుడు మిక్సీ పట్టుకున్న ఉల్లిపాయ కారం పేస్ట్ వేసి నూనె పీల్చుకునే వరకు వేపాలి. ఆ తర్వాత నూనె మళ్ళీ పైకి తేలే వరకు బాగా వేపుతూ ఉండాలి. ఈ దశలో ఒక చెంచా గరం మసాలా, రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసి, ఈ మిశ్రమాన్ని పూర్తిగా చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత ఒకటిన్నర చెంచా నిమ్మరసం వేసి బాగా కలుపుకోవాలి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/10/egg-karam-4.jpg</image:loc><image:caption><![CDATA[ ఇప్పుడు, ముందుగా వేయించుకున్న కోడిగుడ్డు తెల్లసొన ముక్కలను ఈ మిశ్రమంలో వేసి బాగా కలిసేలా చూసుకోవాలి. పచ్చడి ముక్కలకు బాగా పట్టేలా కలుపుకోవాలి. కోడిగుడ్డు పచ్చసొనను అప్పటికప్పుడు తినే పనైతేనే పచ్చడిలో కలపండి. మీరు పచ్చడిని ఫ్రిజ్‌లో వారం పది రోజుల పాటు నిల్వ ఉంచాలనుకుంటే, పచ్చసొనను కలపకుండా ఉండటమే మంచిది. పచ్చసొన కలపకపోతే ఫ్రిజ్‌లో వారం పది రోజుల పాటు, బయట రెండు రోజుల పాటు నిల్వ ఉంటుంది. ఈ పుల్లపుల్లగా, కార కారంగా ఉండే కోడిగుడ్డు పచ్చడి చల్లటి వాతావరణంలో వేడి వేడి అన్నంతో తినడానికి అద్భుతంగా ఉంటుంది. ఇంట్లో పెద్దవాళ్ల చేత కలిపించుకొని తింటే ఆ రుచి మరింత ప్రత్యేకం. మళ్ళీ మళ్ళీ కావాలనిపిస్తుంది. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/visakhapatnam-sri-kanaka-mahalakshmi-navratri-2026-goddess-blesses-devotees-as-gajalaxmi-with-1-lakh-bangles-puja-1937519.html</loc><lastmod>2026-10-18T18:40:20+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/10/visakhapatnam-sri-kanaka-mahalakshmi-navratri-pooja.jpg</image:loc>
					<image:title><![CDATA[ Visakhapatnam Sri Kanaka Mahalakshmi Navratri Pooja ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/10/visakhapatnam-sri-kanaka-mahalakshmi-navratri-2026.jpg</image:loc><image:caption><![CDATA[ ఉత్తరాంధ్ర ఇలవేల్పు విశాఖలోని శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో దేవీ నవరాత్రి మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. అక్టోబర్ 11 నుంచి ఆలయంలో అమ్మవారికి మొదలైన ప్రత్యేక పూజలు తొమ్మిది రోజుల పాటు కొనసాగనున్నాయి. ఒక్కో రోజు ఒక్కో రూపంలో దర్శనమిస్తున్న అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి పూజిస్తున్నారు భక్తులు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/10/visakhapatnam-sri-kanaka-mahalakshmi-navratri-2026-4.jpg</image:loc><image:caption><![CDATA[ అక్టోబర్ 11 నుంచి అక్టోబర్ 20 వరకు ఈ శరన్నవరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. తొలిరోజు ఆదిలక్ష్మి అలంకరణలో అమ్మవారు భక్తులకు దర్శనమివ్వగా.. ఆ రోజు అమ్మవారికి స్వర్ణ కవచ అలంకరణలో శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు. ఇక రెండవ రోజు ధనలక్ష్మిగా అమ్మవారు భక్తులకు దర్శనమివ్వగా.. ఆ రోజు లక్ష చామంతుల అలంకరణలో అమ్మవారికి పూజలు నిర్వహించారు. ఇక మూడవ రోజు ధాన్యలక్ష్మిగా దర్శనమిచ్చిన అమ్మవారికి లడ్డూలతో పూజ చేశారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/10/visakhapatnam-sri-kanaka-mahalakshmi-navratri-2026-3.jpg</image:loc><image:caption><![CDATA[ ఇక నాలుగవ రోజు ధైర్యలక్ష్మి అలంకారంలో అమ్మవారు భక్తులకు దర్శనమివ్వగా.. ఆ రోజు అమ్మవారికి తులసి పూజ నిర్వహించారు. ఐదవ రోజు సంతానలక్ష్మిగా అమ్మవారిని అలంకరించారు. కలువ పూజను కన్నుల పండువగా చేశారు. ఇక ఆరవ రోజు విద్యాలక్ష్మి అలంకారంలో శ్రీ పుష్పయాగాన్ని నిర్వహించారు. ఏడవ రోజు విజయలక్ష్మి అలంకారంలో గులాబీల పూజ చేశారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/10/visakhapatnam-sri-kanaka-mahalakshmi-navratri-2026-2.jpg</image:loc><image:caption><![CDATA[ ఇక ఎనిమిదో రోజైన ఆదివారం అమ్మవారు గజలక్ష్మి అలంకారంలో భక్తులకు దర్శనమివ్వగా.. ఆ రోజు ఆలయంలో లక్ష గాజులతో అలంకరించి అమ్మవారికి ప్రత్యేక పూజ నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమానికి భారీగా భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/10/visakhapatnam-sri-kanaka-mahalakshmi-navratri-2026-1.jpg</image:loc><image:caption><![CDATA[ చివరి రోజైన ఈ నెల 20న అమ్మవారు కనకమహాలక్ష్మి రూపంలో భక్తులకు దర్శనమివ్వనున్నారు. ఆ రోజు స్వర్ణ కవచ అలంకరణలో అమ్మవారిని పూజించనున్నారు. 18 బంగారు పుష్పాలతో స్వర్ణ పుష్పార్చన నిర్వహిస్తారు. నవరాత్రుల్లో అమ్మవారిని దర్శించుకునేందుకు ఉత్తరాంధ్ర నుంచే కాక రెండు తెలుగు రాష్ట్రాల నుంచి భక్తులు తరలివస్తున్నారు. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/business-photos/gold-price-today-gold-rates-crash-by-3270-in-a-week-is-this-the-best-time-to-buy-gold-before-diwali-1937499.html</loc><lastmod>2026-10-18T17:56:05+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/10/gold-prices-15.jpg</image:loc>
					<image:title><![CDATA[ Gold Prices ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/10/gold-prices-1-1.jpg</image:loc><image:caption><![CDATA[ బంగారం కొనుగోలు చేసేందుకు ఇదే మంచి సమయమా..? పండుగ సీజన్ క్రమంలో రాబోయే రోజుల్లో డిమాండ్ వల్ల ధరలు పెరగనున్నాయా? అంటే అవుననే అంటున్నారు మార్కెట్ నిపుణులు. వారం రోజుల్లో బంగారం ధరలు భారీగా డౌన్ అయ్యాయి. గత వారంలో ధరలు కుప్పకూలాయి. అయితే దసరా, దీపావళి వరుస పండుగల క్రమంలో డిమాండ్ వల్ల రాబోయే రోజుల్లో ధరలు పెరుగుతాయనే అంచనాలు వెలువడుతున్నాయి. దీంతో కొనుగోలు చేయాలనుకునేవారికి ఇదే మంచి టైమ్ అని విశ్లేషిస్తున్నారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/10/gold-prices-2-2.jpg</image:loc><image:caption><![CDATA[ గత వారం రోజుల్లో బంగారం ధరలు ఢమాల్ అయ్యాయి. అక్టోబర్ 9  నుంచి 16వ తేదీ వరకు ధరలను పరిశీలిస్తే.. హైదరాబాద్‌లో అక్టోబర్ 9న 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,50,710 వద్ద ప్రారంభమవ్వగా.. 16వ తేదీ నాటికి రూ.1,47,440కి చేరుకుంది. అంటే రూ.3270 మేర పడిపోయింది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/10/gold-prices-3-2.jpg</image:loc><image:caption><![CDATA[ ఇక 22 క్యారెట్ల విషయానికొస్తే.. హైదరాబాద్‌లో అక్టోబర్ 9న రూ.1,38,150 వద్ద ప్రారంభమవ్వగా.. 16వ తేదీ నాటికి రూ.1,35,150కి దిగొచ్చింది. అంటే వారం మొత్తంలో ధరల రూ.3 వేలు తగ్గింది. అటు వెండి ధరలు కూడా గత వారంలో కుప్పకూలాయి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/10/gold-prices-4-1.jpg</image:loc><image:caption><![CDATA[ అక్టోబర్ 9న హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.2.45 లక్షల వద్ద ఉండగా.. అక్టోబర్ 16 నాటికి రూ.2.40 లక్షలకు పడిపోయాయి. అంటే వారంలో రూ.5 వేలు తగ్గింది. ధరలు తగ్గడం పండుగల సమయాల్లో పసిడి కొనేవారికి ఉపశమనంగా చెప్పవచ్చు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/10/gold-prices-5-1.jpg</image:loc><image:caption><![CDATA[ అక్టోబర్ 18న హైదరాబాద్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.1,47,660 వద్ద కొనసాగుతోండగా.. 22 క్యారెట్ల రేటు రూ.1,35,350కు లభిస్తోంది. ఇక కేజీ సిల్వర్ రేటు రూ.2.40 లక్షల వద్ద ట్రేడవుతోంది. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/cricket-photos/team-india-drops-3-star-players-after-west-indies-series-comeback-looks-difficult-1937475.html</loc><lastmod>2026-10-18T17:25:18+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/10/india-squad-for-new-zealand.jpg</image:loc>
					<image:title><![CDATA[ India Squad For New Zealand ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/10/india-squad-for-new-zealand-1-1.jpg</image:loc><image:caption><![CDATA[ India Squad for New Zealand: వెస్టిండీస్‌తో జరిగిన సిరీస్‌లో భారత జట్టుకు గట్టి పోటీ ఎదురైంది. మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను టీమిండియా 2-1తో గెలుచుకోగా, ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ 2-2తో సమమైంది. ఇప్పుడు భారత్ ముందు న్యూజిలాండ్ సవాల్‌ ఉంది. న్యూజిలాండ్ పర్యటనలో టీమిండియా 5 టీ20లు, 5 వన్డేలు, 2 టెస్టు మ్యాచ్‌లు ఆడనుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/10/india-squad-for-new-zealand-1.jpg</image:loc><image:caption><![CDATA[ వన్డే, టీ20 జట్లను పరిశీలిస్తే.. వెస్టిండీస్‌తో ఆడినప్పటికీ న్యూజిలాండ్ పర్యటనకు ఎంపిక కాని ముగ్గురు ఆటగాళ్లు ఉన్నారు. వారిలో యశస్వి జైస్వాల్ కూడా ఉన్నాడు. వన్డే జట్టులో జైస్వాల్‌కు చోటు దక్కకపోవడం చూస్తే.. 2027 వన్డే ప్రపంచకప్ ప్రణాళికల్లో అతను ఉన్నాడా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/10/ravindra-jadeja-2.jpg</image:loc><image:caption><![CDATA[ 1. రవీంద్ర జడేజా: రవీంద్ర జడేజా దాదాపు ఎనిమిది నెలల తర్వాత భారత వన్డే జట్టులోకి తిరిగి వచ్చాడు. జనవరిలో న్యూజిలాండ్ సిరీస్ తర్వాత వెస్టిండీస్‌తో ఆడే అవకాశం లభించింది. దీంతో 2027 వన్డే ప్రపంచకప్‌లో జడేజా ఆడే అవకాశం ఉందని భావించారు. అయితే ఇప్పుడు న్యూజిలాండ్‌తో జరిగే వన్డే సిరీస్‌కు ఎంపిక చేసిన జట్టులో జడేజాకు చోటు దక్కకపోవడం ఆశ్చర్యం కలిగించింది. జడేజా స్థానాన్ని వన్డే జట్టులో నమన్ ధీర్ భర్తీ చేసినట్లు ఊహాగానాలు మొదలయ్యాయి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/10/yashasvi-jaiswal-1-1.jpg</image:loc><image:caption><![CDATA[ 2. యశస్వి జైస్వాల్: వెస్టిండీస్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో యశస్వి జైస్వాల్ ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. అయితే జట్టులో మాత్రం ఉన్నాడు. ఇప్పుడు న్యూజిలాండ్ సిరీస్‌కు అతనికి బ్యాకప్ ఓపెనర్‌గా అవకాశం దక్కుతుందనే ఆశలు కూడా ముగిశాయి. ఎందుకంటే అతనికి జట్టులో పూర్తిగా చోటు దక్కలేదు. అయితే ఈ నిర్ణయం కొంతవరకు సహజమేనని చెప్పొచ్చు. వన్డేల్లో రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్నే ఓపెనింగ్ జోడీగా కొనసాగించే అవకాశం ఎక్కువగా ఉంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/10/ravi-bishnoi-2.jpg</image:loc><image:caption><![CDATA[ 3. రవి బిష్ణోయ్: రవి బిష్ణోయ్ టీ20 జట్టులో ఉన్నప్పటికీ వెస్టిండీస్‌తో ఒక్క మ్యాచ్‌లోనూ ఆడలేదు. వెస్టిండీస్ సిరీస్ తరహాలోనే న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌కు కూడా భారత్ ఇద్దరు ప్రధాన స్పిన్నర్లను ఎంపిక చేసింది. వెస్టిండీస్ సిరీస్‌లో రవి బిష్ణోయ్, కుల్దీప్ యాదవ్ జట్టులో ఉన్నారు. ఇప్పుడు కుల్దీప్ యాదవ్ న్యూజిలాండ్ పర్యటనకు వెళ్తుండగా, బిష్ణోయ్‌కు మాత్రం చోటు దక్కలేదు. అతని స్థానంలో వరుణ్ చక్రవర్తి టీ20 జట్టులోకి తిరిగి వచ్చాడు. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/parijat-flower-health-benefits-joint-pain-fever-relief-and-key-precautions-1937462.html</loc><lastmod>2026-10-18T17:03:29+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/10/parijat-flower-health-benefits-5.jpg</image:loc>
					<image:title><![CDATA[ Parijat Flower Health Benefits ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/10/parijat-flower-health-benefits-3.jpg</image:loc><image:caption><![CDATA[ ముఖ్యంగా వయసు పైబడిన వారిని వేధించే కీళ్ల నొప్పులు, మోకాళ్ల వాపులకు పారిజాత ఆకులు దివ్యౌషధంగా పనిచేస్తాయని నమ్ముతారు. ఈ ఆకులలో ఉండే సహజసిద్ధమైన యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు కీళ్ల అసౌకర్యాన్ని, నొప్పులను తగ్గించడంలో సహాయపడతాయని ప్రాథమిక అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. అయితే ఇది కీళ్లవాతాన్ని పూర్తిగా నయం చేస్తుందని శాస్త్రీయంగా నిరూపించేందుకు మానవులపై నిర్వహించిన క్లినికల్ ఆధారాలు ఇంకా తగినంతగా లేవని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/10/parijat-flower-health-benefits-1.jpg</image:loc><image:caption><![CDATA[ మారే కాలాలతో వచ్చే సీజనల్ వ్యాధులైన జలుబు, దగ్గు, సాధారణ జ్వరాలకు పారిజాత ఆకులతో చేసిన కషాయాన్ని సాంప్రదాయ చికిత్సలో ఎక్కువగా వాడుతుంటారు. ఈ ఆకులను నీటిలో మరిగించి తాగడం వల్ల శ్వాసకోశ సమస్యల నుంచి కొంత ఉపశమనం లభిస్తుందని నమ్ముతారు. అయినప్పటికీ మలేరియా, డెంగ్యూ లేదా టైఫాయిడ్ వంటి తీవ్రమైన ఇన్ఫెక్షన్లు వచ్చినప్పుడు కేవలం ఇలాంటి మూలికా కషాయాలపైనే ఆధారపడటం ప్రాణాలకే ప్రమాదకరమని, తప్పనిసరిగా డాక్టర్లను సంప్రదించి రక్తపరీక్షలు చేయించుకోవాలని హెచ్చరిస్తున్నారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/10/parijat-flower-health-benefits-2.jpg</image:loc><image:caption><![CDATA[ పారిజాతం జీర్ణ సంబంధిత రుగ్మతలను తగ్గించడంలోనూ సహాయపడుతుందని ఆయుర్వేద నిపుణులు చెబుతుంటారు. పారిజాత మొక్క భాగాలను అజీర్ణం, కడుపుబ్బరం, పేగుల్లో అసౌకర్యం వంటి సమస్యలకు ఉపశమనకారిగా పరిగణిస్తారు. శరీరంలోని విష వ్యర్థాలను తొలగించడంలో ఇది తోడ్పడుతుందని భావిస్తున్నప్పటికీ, జీర్ణవ్యవస్థపై దీని పూర్తిస్థాయి కార్యాచరణను, దుష్ప్రభావాలను ధ్రువీకరించడానికి ఇంకా విస్తృత పరిశోధనలు జరగాల్సి ఉంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/10/parijat-flower-health-benefits-4.jpg</image:loc><image:caption><![CDATA[ సాధారణంగా పారిజాత ఆకులు, పువ్వులను ఎండబెట్టి పొడి రూపంలోనో లేదా తాజా ఆకులను నీటిలో మరిగించి కషాయం రూపంలోనో తీసుకుంటుంటారు. అయితే మూలికా ఔషధాలైనా సరే మోతాదు మించితే శరీరానికి హాని చేసే అవకాశం ఉంటుంది. అందరి శారీరక తత్వం ఒకేలా ఉండదు కాబట్టి ప్రతిరోజూ స్వతంత్రంగా ఈ కషాయాలను తాగడం సురక్షితం కాదు. ముఖ్యంగా గర్భిణీలు, బాలింతలు, దీర్ఘకాలిక వ్యాధులతో మందులు వాడుతున్నవారు మరింత అప్రమత్తంగా ఉండాలి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/10/parijat-flower-health-benefits.jpg</image:loc><image:caption><![CDATA[ ప్రకృతి ప్రసాదించిన మూలికలు శారీరక రుగ్మతలకు చక్కని ఉపశమనాన్ని ఇచ్చినప్పటికీ, అవి ఆధునిక వైద్య చికిత్సలకు పూర్తి ప్రత్యామ్నాయం కాలేవు. పారిజాతాన్ని ఇంటి వైద్యంగా పరిగణించవచ్చేమో కానీ ప్రాణాంతక సమస్యలకు ఏకైక పరిష్కారంగా భావించకూడదు. ఈ మొక్క భాగాలను ఔషధంగా లేదా కషాయంగా రోజూ వాడాలనుకునేవారు ముందుగా అర్హత కలిగిన ఆయుర్వేద వైద్యుడిని సంప్రదించి సరైన మోతాదు, సమయాన్ని నిర్ధారించుకోవడం ఎంతో ఉత్తమం. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/saffron-milk-during-pregnancy-does-it-really-make-your-baby-fair-myths-vs-facts-1937452.html</loc><lastmod>2026-10-18T16:45:53+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/10/does-saffron-really-change-your-babys-skin-color.jpg</image:loc>
					<image:title><![CDATA[ Does Saffron Really Change Your Babys Skin Color ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/10/saffron-in-pregnancy.jpg</image:loc><image:caption><![CDATA[ గర్భధారణ సమయంలో స్త్రీలు కుంకుమపువ్వు కలిపిన పాలు తాగినా లేదా ఆహారంలో తీసుకున్నా పుట్టబోయే బిడ్డ ఎరుపు రంగులో ప్రకాశవంతంగా పుడతారని పెద్దలు చెబుతుంటారు. కానీ, ఈ నమ్మకానికి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. పిల్లల చర్మం రంగు అనేది పూర్తిగా తల్లిదండ్రుల జన్యుపరమైన అంశాలపైనే (Genetics) ఆధారపడి ఉంటుంది. కాబట్టి కుంకుమపువ్వు పాల వల్ల బిడ్డ రంగు మారుతుందనడంలో ఎలాంటి వాస్తవం లేదు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/10/saffron-in-pregnancy-4.jpg</image:loc><image:caption><![CDATA[ అయితే, సమాజంలో ఉన్న ఇలాంటి నమ్మకాలను చూసి చాలామంది కుంకుమపువ్వును అధిక మోతాదులో తీసుకుంటుంటారు. ఎంత ఎక్కువ తీసుకుంటే అంత మంచి ఫలితం ఉంటుందని భావిస్తారు. కుంకుమపువ్వు మంచిదే అయినప్పటికీ, దీనిని మోతాదుకు మించి వాడటం ఏమాత్రం శ్రేయస్కరం కాదని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. కాబట్టి గర్భిణులు దీనిని ఆహారంలో చేర్చుకునే ముందు తప్పనిసరిగా వైద్యుల సలహా తీసుకోవాలి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/10/saffron-in-pregnancy-3.jpg</image:loc><image:caption><![CDATA[ దీనిని ఎంత మోతాదులో తీసుకోవాలనేది గర్భిణి ఆరోగ్య పరిస్థితిపై ఆధారపడి ఉంటుంది. అందరికీ ఒకే రకమైన మోతాదు వర్తించదు. తల్లి, బిడ్డల ఆరోగ్య పరిరక్షణకు సమతుల్య ఆహారం ఎంత ముఖ్యమో, వైద్యులు సూచించిన పోషకాహార సప్లిమెంట్లు తీసుకోవడం, క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకోవడం కూడా అంతే ముఖ్యం. కుంకుమపువ్వు తీసుకున్న తర్వాత శరీరంలో ఏదైనా అసౌకర్యం లేదా తేడా అనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/10/saffron-in-pregnancy-2.jpg</image:loc><image:caption><![CDATA[ కుంకుమపువ్వును చర్మ సౌందర్యంతో పాటు మానసిక ఉల్లాసం కోసం కూడా ఆహారంలో భాగంగా తీసుకుంటారు. అయితే, గర్భిణులు కుంకుమపువ్వు పాలు తాగడం వల్ల ఒత్తిడి, ఆందోళన వంటివి పూర్తిగా తగ్గుతాయని చెప్పడానికి తగినంత వైద్య ఆధారాలు లేవు. గర్భధారణ సమయంలో ఇలాంటి మానసిక సమస్యలు ఎదురైతే కేవలం కుంకుమపువ్వుపైనే ఆధారపడకుండా నిపుణులైన వైద్యులను సంప్రదించడం మంచిది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/10/saffron-in-pregnancy-1.jpg</image:loc><image:caption><![CDATA[ గర్భధారణ సమయంలో వికారం, వాంతులు, గ్యాస్, మలబద్ధకం వంటి సమస్యలు సాధారణంగా ఎదురవుతుంటాయి. ఈ సమయంలో కుంకుమపువ్వు పాలు తాగితే ఉపశమనం లభిస్తుందని కొందరు చెబుతారు. కానీ ఇది అందరి శరీర తత్వాలకు ఒకేలా సరిపడకపోవచ్చు. కాబట్టి ఇలాంటి సమస్యలు తీవ్రంగా ఉన్నప్పుడు కుంకుమపువ్వుపై ఆధారపడకుండా నేరుగా వైద్యులను సంప్రదించి సరైన చికిత్స తీసుకోవడమే ఉత్తమం. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/millet-art-exhibition-in-visakhapatnam-16-frames-showcase-human-food-evolution-1937440.html</loc><lastmod>2026-10-18T16:31:10+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/10/millets-1.jpg</image:loc>
					<image:title><![CDATA[ Millets 1 ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/10/millets.jpg</image:loc><image:caption><![CDATA[ చిరుధాన్యాలు మన శరీరానికి అద్భుతమైన పోషకాలను, సంపూర్ణ ఆరోగ్యాన్ని అందిస్తాయి. వీటిలో పీచు పదార్థం , ప్రోటీన్లు, విటమిన్లు,  ఖనిజ లవణాలు పుష్కలంగా ఉంటాయి. చాలామందికి ఇప్పటికీ అవగాహన లేక ప్రాచీన పురాతన ఆహారాన్ని మనం వదిలేససి.. మోడ్రన్ ఫుడ్ వైపు పరుగులు తీసి మన ఆరోగ్యాన్ని చేతులారా ఫణంగా పెడుతున్నాం. అందుకే సుప్రసిద్ధ మిల్లెట్ ఆర్టిస్ట్.. చిరుధాన్యాల పట్టు పూర్వకాలం నుంచి.. వర్తమాన కాలంలో పరిస్థితి.. భవిష్యత్తులో మన ఆరోగ్యం వంటి అంశాలపై ఒక ప్రత్యేకమైన చిత్రకళా ప్రదర్శన చేశారు. ఆదిమానవుని కాలం నుంచి మొదలై.. చిరుధాన్యాలు ప్రాచూర్యంలోకి ఎలా వచ్చాయి అనే విషయాన్ని కళ్ళకు కట్టినట్టు  చిత్రకళా రూపాల్లో తీర్చిదిద్దారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/10/millets-2.jpg</image:loc><image:caption><![CDATA[ ప్రపంచ ఆహార దినోత్సవం సందర్భంగా ప్రముఖ మిల్లెట్ ఆర్టిస్ట్ మోకా విజయ్ కుమార్ రూపొందించిన “ది జర్నీ ఆఫ్ హ్యూమన్ ఫుడ్ – మ్యాన్స్ ఫుడ్ ఎవల్యూషన్ – మిల్లెట్స్” అనే 16 ఫ్రేముల్లో ప్రత్యేక కళా ప్రదర్శనను విశాఖలో ప్రదర్శించారు.  ప్రాచీన కాలం నుంచి నేటి వరకు మానవ ఆహారపు అలవాట్లలో వచ్చిన మార్పులను, చిరుధాన్యాల ప్రాముఖ్యతను, వాటికి దూరం కావడం వల్ల ఎదురవుతున్న ఆరోగ్య సమస్యలపై అవగాహనను, తిరిగి సంప్రదాయ ఆహారపు అలవాట్లను ప్రోత్సహించాల్సిన అవసరాన్ని భావితరాలకు తెలియజేయడమే దీని ముఖ్య ఉద్దేశం. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/10/millets-3.jpg</image:loc><image:caption><![CDATA[ మోకా విజయ్ కుమార్ చిరుధాన్యాల తో చిత్రాల వేయడంలో సిద్ధమస్తుడు. ఇందులో భాగంగానే చిరుధాన్యాల ఆవశ్యకత చాటి చెప్పేందుకు ఇప్పటివరకు వందలాది చిత్రాలు వేశారు. రాగులు, కొర్రలు, అరికెలు, సామలు, నల్ల సామలు చిరుధాన్యాలతో వాటికి ఉన్న సహజ సిద్ధ రంగు తోనే చిత్రాలు  వేయడం ప్రత్యేకత. ఇందులో భాగంగానే 16 ప్రేముల్లో.. చిరుధాన్యాల చరిత్రను కళ్లకు కట్టినట్టు చూపించారు. ఆదిమానవుల ఆహారపు అలవాట్లు, తొలి వ్యవసాయ పద్ధతులు, పంటల సాగు, ధాన్యాల నిల్వ, ప్రాచీన ఋషులు, రాజుల కాలంలో ఆహార సంస్కృతిని ప్రతిబింబించారు. అలాగే సాంప్రదాయ వైద్యంలో చిరు ధాన్యాల ప్రస్తావన, వలస పాలనలో ఆహారపు అలవాట్లలో వచ్చిన మార్పులు, ఆధునిక ప్రాసెస్డ్ ఫుడ్, ప్యాకేజ్డ్ ఫుడ్, జంక్ ఫుడ్ వినియోగం, వాటితో ముడిపడిన ఆరోగ్య సమస్యలు, వైద్యుల ద్వారా ఆరోగ్యకరమైన ఆహారం వైపు మళ్లడం వంటి అంశాలను చిరుధాన్యాలతో చిత్ర రూపంలో ప్రదర్శించారు ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/10/millets-4.jpg</image:loc><image:caption><![CDATA[ మిల్లెట్స్‌పై ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న ఆసక్తి, రైతులకు తిరిగి చిరుధాన్యాల సాగు నుంచి లభించే అవకాశాలు వంటి అంశాలను ఈ 16 ఫ్రేముల్లో దృశ్యరూపంలో వివరించారు. తల్లి–కూతుళ్లు వంటగదిలో ఆనందంగా వంటలు చేయడం, ఆరోగ్యకరమైన కుటుంబ జీవనం, తాత తన మనవడికి ఆస్తి కంటే ఆరోగ్యకరమైన ఆహారపు విలువ గొప్పదని చెప్పడం వంటి భావోద్వేగ దృశ్యాలు కూడా ఈ ప్రాజెక్ట్‌లో చోటుచేసుకున్నాయి. “నా ఉద్దేశ్యం కేవలం చిత్రాలు గీయడం కాదు. మన పూర్వీకుల ఆహార సంస్కృతి, చిరుధాన్యాల ప్రాముఖ్యత, ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని భావితరాలకు కళ ద్వారా పరిచయం చేయడం. కొందరు ఉపన్యాసాల ద్వారా, మరికొందరు వంటకాల ద్వారా మిల్లెట్స్‌ను ప్రోత్సహిస్తున్నారు. నేను మాత్రం చిరుధాన్యాలతో కళాఖండాలను రూపొందిస్తూ, కళ ద్వారా ప్రజల్లో అవగాహన కల్పించాలనే లక్ష్యంతో పనిచేస్తున్నాను. మిల్లెట్స్‌ను తిరిగి మన ఆహారంలో భాగం చేసుకోవడం ద్వారా ప్రజల ఆరోగ్యంతో పాటు రైతుల జీవనోపాధికి కూడా మేలు జరగాలని కోరుకుంటున్నాను” అని మోకా విజయ్ కుమార్ అంటున్నారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/10/millets-5.jpg</image:loc><image:caption><![CDATA[ 2023 నుంచి మిల్లెట్స్ ప్రాచుర్యం కోసం నిరంతరం కృషి చేస్తున్న విజయ్ కుమార్, చిరుధాన్యాలతో వందలాది ప్రత్యేక కళాఖండాలను రూపొందించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో పాటు డోనాల్డ్ ట్రంప్, వివిధ దేశాల నేతల చిత్రాలను మిల్లెట్స్ తో అందంగా తీర్చిదిద్ది అందరి మన్ననలు అందుకున్నారు. తన కళా ప్రయాణంలో పది కంటే ఎక్కువ ప్రపంచ రికార్డులు, అంతర్జాతీయ గుర్తింపులు సాధించారు. “ఆహారం మనిషి జీవితానికి పునాది. మన మూలాలను గుర్తుచేసుకుని, ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లను భవిష్యత్తు తరాలకు అందించడమే నా కళా ప్రయాణం వెనుక ఉన్న ప్రధాన లక్ష్యం” అని ఆయన పేర్కొన్నారు. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/traditional-gongura-pulihora-pachadi-recipe-authentic-andhra-style-chutney-1937429.html</loc><lastmod>2026-10-18T16:13:01+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/10/pulihora-gongura-3.jpg</image:loc>
					<image:title><![CDATA[ Pulihora Gongura 3 ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/10/pulihora-gongura-2.jpg</image:loc><image:caption><![CDATA[ ముందుగా మూడు గోంగూర కట్టలను శుభ్రంగా ఆకులు వలిచి, నీళ్లతో ఒకటి రెండు సార్లు కడిగి పక్కన పెట్టుకోవాలి. ఒక పాన్‌లో ఒక టేబుల్ స్పూన్ నూనె వేసి వేడి అయ్యాక, 15 నుంచి 20 ఎండుమిర్చిని లో ఫ్లేమ్‌లో మాడిపోకుండా వేయించుకోవాలి. కారం ఎక్కువ కావాలంటే 20 వరకు, తక్కువ కావాలంటే 15 ఎండుమిర్చి వేసుకోవచ్చు. వేగిన తర్వాత వీటిని ఒక ప్లేట్‌లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/10/pulihora-gongura.jpg</image:loc><image:caption><![CDATA[ అదే నూనెలో పావు టీస్పూన్ లో సగం మెంతులు వేసి వేయించాలి. మెంతులు వేగిన తర్వాత రెండు టీస్పూన్ల మినపగుళ్ళు, రెండు టీస్పూన్ల ధనియాలు, ఒక టీస్పూన్ జీలకర్ర వేసి లో ఫ్లేమ్‌లో ఎర్రగా అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత ఒక గిన్నెలోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/10/pulihora-gongura-1.jpg</image:loc><image:caption><![CDATA[ ఇప్పుడు అదే పాన్‌లో మరొక టేబుల్ స్పూన్ నూనె వేసి వేడెక్కిన తర్వాత, మూడు మధ్యస్థాయి టమాటాలను ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. టమాటాలను ఒకసారి కలిపి, మూత పెట్టి మధ్యమధ్యలో కలుపుతూ మెత్తగా ఉడికించుకోవాలి. టమాటోలు బాగా ఉడికిన తర్వాత, ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న గోంగూర ఆకులను వేసుకోవాలి. గోంగూర ఆకులు టమాటోలో బాగా కలిసేలా కలుపుతూ, గోంగూర మెత్తబడేంత వరకు ఉడికించాలి.గోంగూర మెత్తబడిన తర్వాత, చిన్న ఉసిరికాయ అంత చింతపండు, పావు టీస్పూన్ పసుపు వేసి అంతా బాగా కలిసేలా కలుపుకోవాలి. మూతపెట్టి లో ఫ్లేమ్‌లో మధ్యమధ్యలో కలుపుతూ గోంగూర పచ్చిదనం పోయి, నూనె పైకి తేలే వరకు ఉడికించుకోవాలి. ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి, ఈ మిశ్రమాన్ని పూర్తిగా చల్లారనివ్వాలి. గోంగూర మిశ్రమం చల్లారే లోపు, పచ్చడికి తాలింపు సిద్ధం చేసుకుందాం. ఒక పాన్‌లో రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసి వేడి అయ్యాక, పావు టీస్పూన్ ఆవాలు, పావు టీస్పూన్ జీలకర్ర, ఒక టీస్పూన్ మినపగుళ్ళు, ఒక టీస్పూన్ పచ్చిశనగపప్పు వేసి వేయించుకోవాలి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/10/pulihora-gongura-4.jpg</image:loc><image:caption><![CDATA[ పోపు వేగిన తర్వాత, ఐదు వెల్లుల్లి రెబ్బలను దంచి వేసుకోవాలి. అలాగే రెండు ఎండుమిర్చిని తుంచి, కొంచెం కరివేపాకు కూడా వేసి వేయించుకోవాలి. ఇవి కూడా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి, చిటికెడు ఇంగువ వేసి ఒకసారి కలిపి పక్కన పెట్టుకోవాలి.  ఇప్పుడు మిక్సీ జార్‌లో పూర్తిగా చల్లారిన వేయించిన ఎండుమిర్చి వేసి కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత వేయించిన ధనియాలు, మినపగుళ్ళు, జీలకర్ర, రుచికి సరిపడినంత ఉప్పు వేసి మళ్ళీ కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోవాలి. దీనిలో 10 వెల్లుల్లి రెబ్బలు వేసి గ్రైండ్ చేయాలి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/10/pulihora-gongura-5.jpg</image:loc><image:caption><![CDATA[ ఆ తర్వాత చల్లారిన గోంగూర టమాటో మిశ్రమాన్ని మిక్సీ జార్‌లో వేయించిన కారపొడితో బాగా కలిసేలా కలుపుకోవాలి. కారం ఎక్కువ అవుతుందేమో అనిపిస్తే, ఈ దశలో కారపొడిలో కొంత తీసి పక్కన పెట్టుకోవచ్చు. మిక్సీలో రెండు మూడు సార్లు పల్స్ ఇస్తే సరిపోతుంది. మరీ మెత్తగా కాకుండా, కచ్చాపచ్చాగా రుబ్బుకోవాలి. ఇలా రుబ్బడం వల్ల రోట్లో రుబ్బినట్లు రుచి వస్తుంది. తయారుచేసుకున్న పచ్చడిని రెడీగా ఉన్న తాలింపులోకి వేసుకోవాలి. ఇందులో ఒక గుప్పెడు పెద్ద ముక్కలుగా తరిగిన పచ్చి ఉల్లిపాయలను విడివిడిగా వేసుకోవాలి. ఈ ఉల్లిపాయలు పచ్చడికి మరింత రుచిని ఇస్తాయి. ఉల్లిపాయలు, తాలింపు పచ్చడిలో బాగా కలిసేలా కలుపుకోవాలి. ఒకసారి రుచి చూసి, అవసరమైతే ఉప్పు వేసుకోవాలి. అంతే, కమ్మ కమ్మని గోంగూర పచ్చడి రెడీ. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/who-should-avoid-papaya-health-risks-side-effects-and-precautions-explained-1937419.html</loc><lastmod>2026-10-18T16:04:24+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/10/who-should-not-eat-papaya-5.jpg</image:loc>
					<image:title><![CDATA[ Who Should Not Eat Papaya ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/10/who-should-not-eat-papaya-4.jpg</image:loc><image:caption><![CDATA[ ముఖ్యంగా గర్భధారణ సమయంలో బొప్పాయి వినియోగం విషయంలో తీవ్ర అప్రమత్తత అవసరం. పచ్చి లేదా అరకొరగా పండిన బొప్పాయిలో లేటెక్స్ అనే పదార్థం అధిక మొత్తంలో ఉంటుంది. ఇది గర్భాశయ సంకోచాలకు కారణమయ్యే ప్రమాదం ఉన్నందున, గర్భిణీ స్త్రీలు పచ్చి బొప్పాయికి పూర్తిగా దూరంగా ఉండటమే మంచిది. పూర్తిగా పండిన బొప్పాయి ప్రభావం భిన్నంగా ఉన్నప్పటికీ, గర్భధారణ సమయంలో దీనిని ఆహారంలో చేర్చుకునే ముందు కచ్చితంగా వైద్యుల సలహా తీసుకోవాలి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/10/who-should-not-eat-papaya.jpg</image:loc><image:caption><![CDATA[ కొందరిలో బొప్పాయి తిన్న వెంటనే అలెర్జీ సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. ప్రత్యేకించి బొప్పాయి లేదా సహజ రబ్బరు పాలు అలెర్జీ ఉన్నవారిలో చర్మంపై దద్దుర్లు రావడం, తీవ్రమైన దురద, పెదవులు లేదా ముఖం వాపు వంటి లక్షణాలు బయటపడతాయి. కొందరిలో శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది లేదా గొంతు వాపు లాంటి తీవ్ర ప్రతికూలతలు కూడా కనిపించవచ్చు. అలాంటి పరిస్థితి తలెత్తితే ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే అత్యవసర వైద్య సహాయం పొందడం ఎంతో ముఖ్యం. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/10/who-should-not-eat-papaya-3.jpg</image:loc><image:caption><![CDATA[ కిడ్నీ సమస్యలతో బాధపడేవారు కూడా బొప్పాయి విషయంలో ఆచితూచి వ్యవహరించాలి. బొప్పాయిలో పొటాషియం పరిమాణం ఎక్కువగా ఉంటుంది. కిడ్నీల పనితీరు మందగించినప్పుడు రక్తంలోని అదనపు పొటాషియంను శరీరం బయటకు పంపలేక స్థాయిలు పెరిగిపోతాయి. అందుకే వైద్యులు పొటాషియం తీసుకోవడంపై నియంత్రణ విధించిన కిడ్నీ రోగులు, బొప్పాయిని ఎంత మోతాదులో తినాలో న్యూట్రిషనిస్ట్ లేదా డాక్టర్‌ను సంప్రదించి మాత్రమే నిర్ణయించుకోవాలి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/10/who-should-not-eat-papaya-2.jpg</image:loc><image:caption><![CDATA[ జీర్ణవ్యవస్థ బలహీనంగా ఉన్న కొందరిలో బొప్పాయి వికటించే అవకాశం లేకపోలేదు. బొప్పాయి తీసుకున్న తర్వాత కొందరికి కడుపుబ్బరం, తీవ్రమైన అసౌకర్యం, ఎసిడిటీ లేదా గుండెల్లో మంట వంటి జీర్ణ సంబంధిత ఇబ్బందులు ఎదురవుతుంటాయి. అలాంటి వారు దీని వినియోగాన్ని పూర్తిగా తగ్గించడం లేదా కొన్నాళ్లపాటు బొప్పాయికి దూరంగా ఉండటం మంచిది. ఇక బొప్పాయి కేవలం శరీర వేడిని పెంచుతుందనే ప్రచారానికి సరైన శాస్త్రీయ ఆధారాలు లేనప్పటికీ, వ్యక్తిగత అసౌకర్యాన్ని గమనిస్తూ ఉండటం అవసరం. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/10/who-should-not-eat-papaya-1.jpg</image:loc><image:caption><![CDATA[ మొత్తంగా చూస్తే ఆరోగ్యవంతులైన అత్యధికులకు బొప్పాయి పోషకాల గని వంటి సురక్షిత ఆహారమే. అయితే గర్భం ధరించిన వారు, కిడ్నీ వ్యాధిగ్రస్తులు, అలర్జీలతో బాధపడేవారు తమ సొంత ఆరోగ్య పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని మాత్రమే దీనిని ఎంచుకోవాలి. సమస్యలు ఉన్నవారు లేదా దీర్ఘకాలిక మందులు వాడుతున్నవారు ఆహారంలో బొప్పాయిని చేర్చేముందు లేదా తొలగించే ముందు వైద్య నిపుణుల సలహా పాటించడం ఆరోగ్యానికి మంచిది. (గమనిక: ఈ కథనంలో పేర్కొన్న సమాచారం కేవలం సాధారణ అవగాహన కోసం మాత్రమే. దీనిని వైద్య సలహాగా లేదా చికిత్సగా పరిగణించరాదు. ఏదైనా ఆరోగ్య సమస్య ఉన్నా, ఆహారంలో మార్పులు చేసుకోవాలన్నా ముందుగా సంబంధిత వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది.) ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/atukulu-pesara-pappu-payasam-recipe-traditional-sweet-for-festivals-1937394.html</loc><lastmod>2026-10-18T15:20:25+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/10/atukula-payasam.jpg</image:loc>
					<image:title><![CDATA[ Atukula Payasam ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/10/atukula-payasam-4.jpg</image:loc><image:caption><![CDATA[ కావాల్సిన పదార్థాలు:  పెసరపప్పు: అర కప్పు, అటుకులు: ఒక కప్పు,  బెల్లం: ఒకటింపావు కప్పు (తీపి తగ్గించుకోవాలంటే ఒక కప్పు), నీళ్లు: పెసరపప్పు నానబెట్టడానికి రెండు కప్పులు, బెల్లం కరిగించడానికి పావు కప్పు,  పాలు: మూడు కప్పులు, నెయ్యి: రెండు టేబుల్ స్పూన్లు, యాలకుల పొడి: అర టీస్పూన్, కొబ్బరి ముక్కలు: కొన్ని (పచ్చి లేదా ఎండు), జీడిపప్పు, బాదం పప్పు: తగినంత తీసుకోవాలి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/10/atukula-payasam-1.jpg</image:loc><image:caption><![CDATA[ ముందుగా, ఒక పాన్‌లో అర కప్పు పెసరపప్పును లో టు మీడియం ఫ్లేమ్‌లో కలుపుతూ కమ్మటి వాసన వచ్చే వరకు వేయించుకోవాలి. పెసరపప్పు రంగు కొద్దిగా మారిన తర్వాత స్టవ్ ఆపి, ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఈ పప్పును రెండుసార్లు శుభ్రంగా కడిగి, రెండు కప్పుల నీళ్లు పోసి 10-15 నిమిషాల పాటు నానబెట్టాలి. పప్పు ఎంత బాగా నానితే అంత త్వరగా ఉడుకుతుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/10/atukula-payasam-2.jpg</image:loc><image:caption><![CDATA[ పప్పు నానే లోపు, బెల్లం సిరప్ తయారుచేసుకోవాలి. ఒక గిన్నెలో ఒకటింపావు కప్పు బెల్లం వేసి, పావు కప్పు నీళ్లు పోసి కరిగించుకోవాలి. బెల్లం పూర్తిగా కరిగి, ఒక పొంగు రాగానే స్టవ్ ఆపి, వేడిగా ఉన్నప్పుడే ఫిల్టర్ చేసుకోవాలి. ఇది పూర్తిగా చల్లారే వరకు పక్కన పెట్టుకోవాలి. వేడిగా ఉన్నప్పుడు ఫిల్టర్ చేస్తే చిక్కబడకుండా ఉంటుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/10/atukula-payasam-3.jpg</image:loc><image:caption><![CDATA[ ఇప్పుడు అదే పాన్‌లో ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసి, ఒక కప్పు అటుకులు వేసి లో టు మీడియం ఫ్లేమ్‌లో క్రిస్పీగా, కరకరలాడేంత వరకు వేయించుకోవాలి. అటుకులు వేగిన తర్వాత కొద్దిగా పొంగినట్లుగా కనిపిస్తాయి. వీటిని ఒక ప్లేట్‌లోకి తీసి పక్కన పెట్టుకోవాలి.
అదే పాన్‌లో నానబెట్టిన పెసరపప్పును వేసి, ఒక టీస్పూన్ నెయ్యి కూడా కలిపి మీడియం ఫ్లేమ్‌లో ఉడికించుకోవాలి. పప్పు మరీ మెత్తగా కాకుండా, కొద్దిగా పలుకులుగా మెత్తబడేంత వరకు ఉడికించాలి. ఇలా ఉడికించడం వలన పాయసం తినేటప్పుడు పప్పు తగులుతూ రుచికరంగా ఉంటుంది. పప్పు ఉడికే లోపు, మరొక గిన్నెలో మూడు కప్పుల పాలు పోసి ఒక పొంగు వచ్చే వరకు కాచి, మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/10/atukula-payasam-5.jpg</image:loc><image:caption><![CDATA[ ఉడికించిన పెసరపప్పులో వేయించిన అటుకులు వేసి బాగా కలుపుకోవాలి. ఫ్లేమ్‌ను లోలో పెట్టి, కాచి పెట్టుకున్న పాలను కూడా పోసి ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలి. అటుకులు కొద్దిగా మెత్తబడేంత వరకు ఉడికించాలి. ఈ పాయసం ఉడికేటప్పుడు పల్చగా అనిపించినా, చల్లారాక గట్టిపడుతుంది కాబట్టి కొద్దిగా పల్చగానే చేసుకోవడం మంచిది. అటుకులు మెత్తగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేయాలి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత, యాలకుల పొడి , పూర్తిగా చల్లారిన బెల్లం సిరప్‌ను పాయసంలో వేసి బాగా కలుపుకోవాలి. బెల్లం సిరప్ కలిసిన తర్వాత, తిరిగి స్టవ్ ఆన్ చేసి రెండు నిమిషాల పాటు ఉడికించాలి. మరొక పక్కన, స్టవ్ పైన చిన్న పాన్ పెట్టి ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసి, నెయ్యి కాగిన తర్వాత సన్నగా తరిగిన కొబ్బరి ముక్కలు వేసి వేయించాలి. అవి కొద్దిగా వేగిన తర్వాత జీడిపప్పు, బాదం పప్పు కూడా వేసి ఎర్రగా వేయించుకోవాలి. ఈ వేయించిన డ్రై ఫ్రూట్స్‌ను పాయసంలో వేసి బాగా కలిపి, వెంటనే స్టవ్ ఆఫ్ చేయాలి.అంతే, కమ్మని పెసరపప్పు అటుకుల పాయసం రెడీ. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/spiritual-photos/money-plant-vastu-tips-what-happens-when-you-pour-milk-into-the-soil-1937378.html</loc><lastmod>2026-10-18T14:37:19+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/10/money-plant-vastu-tips.jpg</image:loc>
					<image:title><![CDATA[ Money Plant Vastu Tips ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/10/money-plant1.jpg</image:loc><image:caption><![CDATA[ Money Plant Vastu Tips: చాలా మంది తమ ఇళ్ల అందాన్ని పెంచుకోవడంతో పాటు, ఇంట్లో సంతోషం, శాంతి, శ్రేయస్సు వెల్లివిరియాలని మనీ ప్లాంట్‌ను పెంచుతుంటారు. ఇంటి అలంకరణకు అందంగా కనిపించే ఈ మొక్కకు వాస్తు శాస్త్రంలో కూడా ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. మనీ ప్లాంట్‌ను సరైన దిశలో పెంచితే ఇంట్లో సానుకూల శక్తి పెరుగుతుందని, ఆర్థికంగా మంచి ఫలితాలు కలుగుతాయని చాలామంది నమ్ముతారు. అయితే కొందరు మనీ ప్లాంట్ పెరుగుతున్న మట్టిలో కొద్దిగా పాలు కూడా పోస్తుంటారు. ఇలా చేయడం వెనుక ఉన్న నమ్మకాలేంటి? దీనివల్ల ఎలాంటి ఫలితాలు కలుగుతాయని భావిస్తారో తెలుసుకుందాం. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/10/money-plant2.jpg</image:loc><image:caption><![CDATA[ మనీ ప్లాంట్‌కు పాలు పోయడం వెనుక ఉన్న నమ్మకం ఏమిటి?.. 
వాస్తు శాస్త్రానికి సంబంధించిన కొన్ని నమ్మకాల ప్రకారం, పాలను పవిత్రతకు, స్వచ్ఛతకు, శ్రేయస్సుకు ప్రతీకగా భావిస్తారు. ఈ నేపథ్యంలో మనీ ప్లాంట్ మట్టిలో కొద్దిగా పాలు పోయడం శుభప్రదమని కొందరు విశ్వసిస్తారు. ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుందని, ఇంట్లో సంపద, సుఖసంతోషాలు పెరుగుతాయని నమ్ముతారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/10/money-plant3.jpg</image:loc><image:caption><![CDATA[ అంతేకాకుండా, కుటుంబ సభ్యుల మధ్య ప్రేమానురాగాలు పెరగడానికి, ఇంట్లో ప్రశాంతమైన వాతావరణం నెలకొనడానికి ఈ పరిహారం తోడ్పడుతుందని కొన్ని సంప్రదాయ విశ్వాసాలు చెబుతున్నాయి. ఆర్థిక ఇబ్బందులు తగ్గడం, అప్పుల బాధల నుంచి ఉపశమనం లభించడం, ఆదాయ మార్గాలు మెరుగుపడటం వంటి ప్రయోజనాలు కలుగుతాయని కూడా కొందరు భావిస్తారు. అయితే ఇవన్నీ మతపరమైన, వాస్తు సంబంధమైన నమ్మకాలే తప్ప, నిరూపితమైన వాస్తవాలు కావు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/10/money-plant4.jpg</image:loc><image:caption><![CDATA[ మనీ ప్లాంట్‌కు పాలు పోయడం మంచిదేనా?.. 
మొక్కల పెరుగుదలకు అవసరమైన పోషకాలు సరైన మోతాదులో అందించడం చాలా ముఖ్యం. అయితే మనీ ప్లాంట్ మట్టిలో నేరుగా పాలు పోయడం వల్ల మొక్కకు ప్రత్యేకమైన ప్రయోజనం కలుగుతుందని చెప్పడానికి శాస్త్రీయ ఆధారాలు లేవు. పైగా, పాలు మట్టిలో పేరుకుపోవడం వల్ల దుర్వాసన రావడం, బ్యాక్టీరియా పెరగడం, కీటకాలు ఆకర్షితమవడం వంటి సమస్యలు తలెత్తవచ్చు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/10/money-plant5.jpg</image:loc><image:caption><![CDATA[ కాబట్టి మనీ ప్లాంట్ ఆరోగ్యంగా పెరగాలంటే సరైన నీరు, తగినంత వెలుతురు, నీరు నిల్వ ఉండకుండా చూసే మట్టి, అవసరమైన పోషకాలను అందించాలి. వాస్తు నమ్మకాలను పాటించాలనుకునేవారు కూడా మొక్క సంరక్షణ విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. (Disclaimer: మనీ ప్లాంట్‌కు పాలు పోయడం వల్ల సంపద పెరుగుతుందని లేదా ఆర్థిక సమస్యలు తొలగిపోతాయని శాస్త్రీయంగా నిరూపించబడలేదు. ఇవి సంప్రదాయ విశ్వాసాలకు సంబంధించిన విషయాలు మాత్రమే.) ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/cinema-photos/kavya-maran-and-anirudh-ravichander-wedding-astounding-cost-of-meals-and-grand-celebration-details-1937338.html</loc><lastmod>2026-10-18T13:46:54+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/10/anirudh-1.jpg</image:loc>
					<image:title><![CDATA[ Anirudh ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/10/anirudh.jpg</image:loc><image:caption><![CDATA[ సన్ రైజర్స్ హైదరాబాద్ సీఈఓ, సన్ నెట్‌వర్క్ వారసురాలు కావ్య మారన్, టాలీవుడ్ సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ వివాహం గురించి ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ నడుస్తోంది. వీరి వివాహం నవంబర్ 11న గ్రీస్‌లో అత్యంత వైభవంగా జరగనుందని, ఆ తర్వాత నవంబర్ 21న చెన్నైలో అత్యంత ఘనంగా రిసెప్షన్ నిర్వహించనున్నారని ప్రచారం జరుగుతుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/10/anirudh-news.jpg</image:loc><image:caption><![CDATA[ ఈ నేపథ్యంలో వీరి పెళ్లికి సంబంధించిన ఖర్చులు, ముఖ్యంగా విందు భోజనానికి అయ్యే ఖర్చు గురించిన వివరాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. అల్ట్రా లగ్జరీ డెస్టినేషన్ వెడ్డింగ్‌ల కోసం గ్రీస్‌లోని సెంటోరిని, మైకోనోస్ వంటి సుందరమైన ప్రాంతాలు ఎంతో పేరుగాంచాయి. ఇక్కడ ఒక విలాసవంతమైన వేదికను లేదా రిసార్ట్‌ను ఒక రోజుకు అద్దెకు తీసుకోవడానికి అయ్యే ఖర్చు సుమారుగా రూ. 15 లక్షల నుండి రూ. 45 లక్షల వరకు ఉంటుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/10/anirudh-ravichandran-kavya.jpg</image:loc><image:caption><![CDATA[ అక్కడ జరిగే ఈ హై-ప్రొఫైల్ వివాహ వేడుకలో క్యాటరింగ్ , ఫుడ్ ఏర్పాట్లు అత్యంత ప్రత్యేకంగా ఉండనున్నాయి. నివేదికల అంచనాల ప్రకారం, ఈ లగ్జరీ వెడ్డింగ్‌లో కేవలం ఒక్క వ్యక్తికి పెట్టే భోజనం లేదా ఒక ప్లేట్ ధర సుమారు రూ. 15,000 నుండి రూ. 35,000 వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు. అతిరథ మహారథులు, రాజకీయ, సినీ , క్రీడా దిగ్గజాలు హాజరుకానున్న ఈ వేడుకలో ఫుడ్ మెనూ కోసం కోట్లాది రూపాయలు ఖర్చు చేయనున్నట్లు తెలుస్తోంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/10/anirudh-telugu.jpg</image:loc><image:caption><![CDATA[ ఇక గ్రీస్‌లో జరిగే ఈ డెస్టినేషన్ వెడ్డింగ్ వెన్యూ అద్దెలు, అతిథుల ప్రయాణ వసతి, లగ్జరీ డెకరేషన్ వంటి ఖర్చులన్నీ కలిపితే ఈ వివాహానికి కొన్ని కోట్ల రూపాయల భారీ బడ్జెట్ ఖర్చవుతుందని అంచనా. మరోవైపు, నవంబర్ 21న చెన్నైలో జరగనున్న గ్రాండ్ రిసెప్షన్‌కు సంబంధించి ఇప్పటికే ప్రముఖులకు ఆహ్వానాలు అందడం ప్రారంభమయ్యాయి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/10/anirudh-wedding.jpg</image:loc><image:caption><![CDATA[ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులతోపాటు దేశంలోని పలువురు ప్రముఖులను కూడా ఈ వేడుకకు ఆహ్వానించినట్లు సమాచారం. ఏదేమైనా ఈ ఇయర్ టాలీవుడ్, ఐపీఎల్ , మ్యూజిక్ ఇండస్ట్రీలో మోస్ట్ ఎవైటెడ్ వెడ్డింగ్‌గా కావ్య మారన్ - అనిరుధ్ వివాహం నిలవనుంది. కావ్య మారన్ తండ్రి కానిధి మారన్ ప్రముఖ మీడియా దిగ్గజం &#039;సన్ గ్రూప్&#039;వ్యవస్థాపకుడు , ఛైర్మన్. కావ్య మారన్ చెన్నైలోని స్టెల్లా మేరీస్ కాలేజీలో అండర్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/goddess-durga-decorated-with-1-crore-currency-notes-in-ravulapalem-during-navratri-1937319.html</loc><lastmod>2026-10-18T13:19:41+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/10/amma-varu-5-2.jpg</image:loc>
					<image:title><![CDATA[ Amma Varu 5 ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/10/amma-varu-6.jpg</image:loc><image:caption><![CDATA[ శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా కోనసీమ ముఖద్వారం అయిన రావులపాలెంలో శ్రీ దుర్గామాతను కోటి రూపాయల నగదు నోట్లతో అలంకరించారు. ఎంతగానో ఆకట్టుకునే విధంగా కరెన్సీ నోట్లతో అలంకరించిన అమ్మవారిని దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/10/amma-varu-1-1.jpg</image:loc><image:caption><![CDATA[ రావులపాలెం లోని కేఎస్ఆర్ కాంప్లెక్స్‌లో అమ్మవారిని ప్రతిష్టించి దసరా నవరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా అమ్మవారిని ప్రతిరోజు ప్రత్యేకంగా అలంకరిస్తూ పూజలు నిర్వహిస్తున్నారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/10/amma-varu-2-1.jpg</image:loc><image:caption><![CDATA[ అందులో భాగంగాప్రతిష్టించిన అమ్మవారి విగ్రహానికి కోటి రూపాయల నగదు, నాణేలుతో ప్రత్యేకంగా శ్రీ మహాలక్ష్మి అలంకరణ చేశారు.
దీంతో అమ్మవారు భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. ఆ ప్రాంతంలో మూడో ఏడాది నిర్వహిస్తున్నారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/10/amma-varu-4-1.jpg</image:loc><image:caption><![CDATA[ ఈ ఉత్సవాల్లో ఏడో రోజు అమ్మవారు శ్రీమహాలక్ష్మీ దేవి రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు. కమిటీ సభ్యులు, అమ్మవారి భక్తులు పెద్ద ఎత్తున అమ్మవారిని అలంకరించేందుకు ప్రత్యేక శ్రద్ధ కనబరిచారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/10/amma-varu-5-1.jpg</image:loc><image:caption><![CDATA[ నగదుతో అలంకరణ అనంతరం అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలిరావడంతో కేఎస్ఆర్ కాంప్లెక్స్ ప్రాంతం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/cinema-photos/rgv-opens-up-about-ayn-rand-philosophy-and-her-book-1937320.html</loc><lastmod>2026-10-18T13:25:15+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/10/rgv-3.jpg</image:loc>
					<image:title><![CDATA[ Rgv ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/10/rgv-2.jpg</image:loc><image:caption><![CDATA[ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తనదైన శైలిలో సమాజం, సంబంధాలు, నైతికత , ప్రముఖ రచయిత్రి &#039;ఐన్ రాండ్&#039; (Ayn Rand) సిద్ధాంతాలపై మరోసారి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. వ్యక్తిగత స్వేచ్ఛ, మానవ సంబంధాలు, గిల్ట్ , రిలేషన్‌షిప్‌లలో వచ్చే మార్పులపై ఆయన చేసిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/10/rgv-movie.jpg</image:loc><image:caption><![CDATA[ తనకు ఇష్టమైన రచయిత్రి ఐన్ రాండ్ గురించి ఆర్జీవీ మాట్లాడుతూ, ఆమె ఆలోచనా విధానం ఎంత స్పష్టంగా ఉంటుందో వివరించారు. సమాజంలో మనుషులు పాటించే నైతిక విలువలు, భయాలు , చట్టాల గురించి మాట్లాడుతూ.. జీవితంలో నిజాయితీగా ఉండటమే గిల్ట్ ఫీలింగ్‌ను దూరం చేస్తుందని అభిప్రాయపడ్డారు. మనుషుల మధ్య జరిగే భావోద్వేగ ప్రయాణాలు, అభిప్రాయాలు మారుతుంటాయని, వాటిని ముందే స్పష్టంగా తెలపడంలో తప్పులేదని అన్నారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/10/rgv-book.jpg</image:loc><image:caption><![CDATA[ ప్రతి మనిషి తన సొంత ఆనందం కోసం, తనదైన జీవన శైలిని ఎంచుకునే హక్కు కలిగి ఉంటాడని ఆర్జీవీ పేర్కొన్నారు. రిలేషన్‌షిప్‌లలో వచ్చే సమస్యలు, మనసులు విడిపోవడం వంటి అంశాలపై మాట్లాడుతూ.. కేవలం సమాజం కోసం లేదా బంధాల ఒత్తిడితో నరకం అనుభవించడం కంటే, వాస్తవాలను అంగీకరించి ముందుకు వెళ్లడమే కరెక్ట్ అని ఆయన కుండబద్దలు కొట్టారు. మహిళల అందం, వారి వ్యక్తిత్వం , ఆలోచనా విధానంపై తనకు ఉన్న అభిప్రాయాలను కూడా ఆయన ఈ సందర్భంగా పంచుకున్నారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/10/rgv-film.jpg</image:loc><image:caption><![CDATA[ సమాజానికి నాలుగు స్తంభాలు అవసరమని ఆర్జీవీ అన్నారు: చట్టం (పోలీసింగ్), మతం (శక్తిని నమ్మడం ద్వారా భయం కలిగించడం), నైతికత (పక్కవారితో ఎలా వ్యవహరించాలి), నిబద్ధత (లాయల్టీ). ఈ వ్యవస్థలు ఒక కోడ్ ఆఫ్ కండక్ట్‌ను ఏర్పరచి, గిల్టీ ఫీలింగ్‌ను ప్రేరేపించడం ద్వారా సమాజంలో క్రమాన్ని కొనసాగిస్తాయని ఆయన అభిప్రాయపడ్డారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/10/rgv-looks.jpg</image:loc><image:caption><![CDATA[ గిల్ట్‌ను అధిగమించడానికి నిజాయితీ, బహిరంగ సంభాషణలు కీలకమని ఆర్జీవీ బలంగా నమ్ముతారు. ఐన్ రాండ్ స్వయంగా దీనికి ఒక ఉదాహరణ అని ఆయన పేర్కొన్నారు. 54 ఏళ్ల వయస్సులో ఐన్ రాండ్ 27 ఏళ్ల నాథనియల్ బ్రాండెన్‌తో ప్రేమలో పడినప్పుడు, తన భర్త ఫ్రాంక్ ఓకానర్, నాథనియల్ , అతని భార్య బార్బరాను పిలిచి, తన కోరికను బహిరంగంగా వ్యక్తం చేసింది. తన నిర్ణయాన్ని వారికే వదిలేసింది. ఈ నిజాయితీ గిల్ట్‌ను నివారిస్తుందని ఆర్జీవీ వివరించారు. లంచాలు లేదా వివాహేతర సంబంధాలు వంటి వాటి వల్ల కలిగే గిల్ట్ కూడా ఈ నిజాయితీతో కూడుకున్న బహిరంగ ప్రవర్తన ద్వారా తగ్గించవచ్చని ఆయన అన్నారు. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/spiritual-photos/samsaptak-yoga-on-maha-ashtami-2026-3-zodiac-signs-that-may-benefit-1937306.html</loc><lastmod>2026-10-18T13:12:57+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/10/samsaptak-yoga-on-maha-ashtami-2026.jpg</image:loc>
					<image:title><![CDATA[ Samsaptak Yoga On Maha Ashtami 2026 ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/10/rashifal-5.jpg</image:loc><image:caption><![CDATA[ Samsaptak Yoga on Maha Ashtami: శరన్నవరాత్రుల వేళ గ్రహాల కదలికలు జ్యోతిష్యశాస్త్రంలో ప్రత్యేక ప్రాధాన్యతను సంతరించుకుంటాయి. ఈ క్రమంలో అక్టోబర్ 18న మహాష్టమి రాత్రి గురు, చంద్ర గ్రహాల ప్రత్యేక స్థితి ఏర్పడనుందని జ్యోతిష్య విశ్వాసాలు చెబుతున్నాయి. ఈ గ్రహస్థితిని సంసప్తక యోగంగా పేర్కొంటారు. ఈ సమయంలో చంద్రుడు మకర రాశిలో, గురుడు కర్కాటక రాశిలో సంచరిస్తారని చెబుతున్నారు. ఈ రెండు గ్రహాలు ఒకదానికొకటి ఏడవ స్థానంలో ఉండటం వల్ల సంసప్తక యోగం ఏర్పడుతుంది. జ్యోతిష్య విశ్వాసాల ప్రకారం, ఈ యోగం కొన్ని రాశుల వారికి వృత్తి, ఆర్థిక వ్యవహారాలు, కుటుంబ జీవితంలో సానుకూల ఫలితాలను అందించే అవకాశం ఉంది. ముఖ్యంగా మేషం, కర్కాటకం, మకర రాశుల వారికి ఈ సమయం అనుకూలంగా ఉండవచ్చని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. మరి ఆ రాశుల వివరాలు తెలుసుకుందాం. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/10/mesham-6.jpg</image:loc><image:caption><![CDATA[ మేష రాశి.. ఈ రాశి వారికి సంసప్తక యోగం శుభ ఫలితాలను అందించే అవకాశముంది. ఈ సమయంలో కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఏర్పడవచ్చు. కుటుంబ సభ్యుల మధ్య ఉన్న చిన్నపాటి విభేదాలు తొలగి, పరస్పర అవగాహన పెరిగే సూచనలు ఉన్నాయని జ్యోతిష్య విశ్వాసాలు చెబుతున్నాయి. ఉద్యోగ రంగంలో ఉన్నవారు తమ పనితీరుతో ఉన్నతాధికారుల ప్రశంసలు పొందవచ్చు. కొందరికి పదోన్నతి లేదా కొత్త బాధ్యతలు చేపట్టే అవకాశం రావచ్చు. భాగస్వామ్య వ్యాపారాలు నిర్వహిస్తున్నవారికి కొత్త ఒప్పందాలు కుదిరే సూచనలు ఉన్నాయి. ఆర్థిక విషయాల్లో ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగడం మంచిది. అలాగే ఆధ్యాత్మిక కార్యక్రమాలపై ఆసక్తి పెరిగి, దైవదర్శనాలు లేదా పుణ్యకార్యాల్లో పాల్గొనే అవకాశం ఉంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/10/karkatakam-4.jpg</image:loc><image:caption><![CDATA[ కర్కాటక రాశి... ఈ రాశి వారికి ఈ యోగం కొత్త ఆశలను కలిగించవచ్చు. చాలా కాలంగా వాయిదా పడుతున్న పనులను తిరిగి ప్రారంభించేందుకు అనుకూల పరిస్థితులు ఏర్పడవచ్చు. కొత్త వ్యాపారం ప్రారంభించాలని భావిస్తున్నవారు తమ ప్రణాళికలను ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉంది. ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నవారు కొత్త అవకాశాల కోసం ప్రయత్నించవచ్చు. ఈ సమయంలో ఆత్మవిశ్వాసం పెరగడంతో పాటు, వ్యక్తిగత జీవితంలోనూ సానుకూల మార్పులు కనిపించవచ్చని జ్యోతిష్య అంచనాలు సూచిస్తున్నాయి. జీవిత భాగస్వామితో అనుబంధం బలపడటంతో పాటు, పరస్పర అవగాహన పెరగవచ్చు. కుటుంబ విస్తరణ గురించి ఆలోచిస్తున్న వారికి కూడా ఆశాజనకమైన సమయంగా భావిస్తారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/10/makaram-4.jpg</image:loc><image:caption><![CDATA[ మకర రాశి.. ఈ రాశి వారికి ఈ సమయం పట్టుదలతో ముందుకు సాగేందుకు ప్రేరణనివ్వవచ్చు. చేపట్టిన పనులను పూర్తి చేయడానికి మరింత ఉత్సాహంగా పనిచేసే అవకాశం ఉంది. ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్నవారు కొత్త అవకాశాలను అందిపుచ్చుకునేందుకు ప్రయత్నించవచ్చు. ఇప్పటికే ఉద్యోగంలో ఉన్నవారికి తమ ప్రతిభను నిరూపించుకునే పరిస్థితులు ఎదురుకావచ్చు. ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుచుకోవడానికి కొత్త మార్గాలపై దృష్టి సారించవచ్చు. సొంతంగా వ్యాపారం ప్రారంభించాలనుకునేవారు ప్రణాళికలు సిద్ధం చేసుకోవడానికి ఇది మంచి సమయంగా భావించవచ్చు. సమాజంలో గౌరవ మర్యాదలు పెరగడంతో పాటు, కుటుంబ సభ్యుల నుంచి సహకారం లభించే అవకాశం ఉందని జ్యోతిష్య విశ్వాసాలు పేర్కొంటున్నాయి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/10/rashifal5-5.jpg</image:loc><image:caption><![CDATA[ (Disclaimer: ఈ కథనం జ్యోతిష్యశాస్త్ర విశ్వాసాల ఆధారంగా అందించబడింది. గ్రహస్థితుల వల్ల జీవితంలో మార్పులు వస్తాయని చెప్పడానికి శాస్త్రీయ ఆధారాలు లేవు. వృత్తి, ఆర్థిక వ్యవహారాలు, ఆరోగ్యం వంటి అంశాల్లో వ్యక్తిగత నిర్ణయాలు, పరిస్థితులే కీలక పాత్ర పోషిస్తాయి.) ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/traditional-vatti-thunakalu-recipe-how-telugu-style-sun-dried-mutton-is-prepared-and-cooked-nutritional-benefits-1937259.html</loc><lastmod>2026-10-18T12:52:22+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/10/dried-mutton-1.jpg</image:loc>
					<image:title><![CDATA[ Dried Mutton ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/10/dry-mutton-process.jpg</image:loc><image:caption><![CDATA[ వట్టి తునకలు.. శరీరానికి బలాన్నిచ్చే అద్భుతమైన ఆహారం.. పూర్వ కాలంలో మటన్ ఎండు మాంసం అధికంగా తినేవారు.. బలహీనంగా ఉన్నవారికి, బాలింతలకు శక్తి కోసం మేక మాంసం ముక్కలకు ఉప్పు, పసుపు అద్ది.. ఎండబెట్టేవారు.. అలా ఎండిన మాంసాన్నే వట్టి తునకలు అంటారు.. వట్టి తనకలు రుచికరంగా ఉండటంతోపాటు.. శరీరానికి అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి.. ఈ మాంసం ముక్కలను మంచిగా దాచుకుని.. అవసరమైనప్పుడు ఎలాగైనా వండుకుని తినొచ్చు.. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/10/vatti-thunakalu.jpg</image:loc><image:caption><![CDATA[ ప్రొటీన్లు, విటమిన్లు, బీ12 సమృద్ధిగా ఉన్న వట్టి తునకలు.. ఎక్కువ పోషకాలు, ఖనిజాలు కలిగిన బలవర్ధకమైన ఆహారం. ఇది శరీరానికి తక్షణ శక్తిని అందించడంతోపాటు రోగనిరోధక శక్తిని పెంచుతుంది.. ఇంకా శరీర, నరాల బలహీనతను తగ్గిస్తుంది. బాలింతలకు, శరీరం గట్టిపడటానికి, గాయాలు మానడానికి, జబ్బుల నుంచి కోలుకోవడానికి పురాతన కాలంలో ఎక్కువగా తినిపించేవారు. అందుకే.. నెలకు ఒకసారైనా వట్టితునకల కూరను తినడం ఆరోగ్యానికి మంచిదని పెద్దలు చెబుతుంటారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/10/dry-mutton.jpg</image:loc><image:caption><![CDATA[ తెలుగు రాష్ట్రాల గ్రామీణ ప్రాంతాలలో ఇది ప్రసిద్ధమైన, పోషకమైన వంటకం. వీటిని డ్రై మటన్, ఎండు తునకలు లేదా ఉప్పంచులు అని కూడా పిలుస్తారు.  వట్టి తునకల తయారీ చాలా సరళమైనది.. ప్రాచీనమైనది. మటన్ ముక్కలను ఉప్పు మరియు పసుపుతో కలిపి, ఎండలో బాగా ఎండబెడతారు. ఈ ప్రక్రియ మాంసాన్ని డీహైడ్రేట్ చేసి, దానిని సురక్షితంగా నిల్వ చేయడానికి సహాయపడుతుంది. సరిగ్గా ఎండబెట్టి, నిల్వ చేసినట్లయితే, ఈ వట్టి తునకలు ఏడాది పొడవునా చెడిపోకుండా ఉంటాయి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/10/dry-mutton-curry.jpg</image:loc><image:caption><![CDATA[ ఈ బలవర్ధకమైన ఎండు మాంసాన్ని కర్రీగా వండుకోవచ్చు లేదా నూనెలో వేయించుకొని ఫ్రైగా కూడా తీసుకోవచ్చు. రెండు రకాలుగానూ ఇది రుచికరంగా ఉంటుంది. వట్టి తునకలు కేవలం ఒక వంటకం మాత్రమే కాదు.. ఇది మాంసాన్ని సంరక్షించే ఒక సాంప్రదాయ పద్ధతికి నిదర్శనం.. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/10/mutton-dry.jpg</image:loc><image:caption><![CDATA[ అయితే.. సాధారణ మటన్ మాదిరి దీనిని వండుకుని తినవచ్చు.. ఇంకా టమాటా, దోసకాయ, గోంగూరలో కూడా వేసుకుని తినవచ్చు.. పెద్ద ఎత్తున వండాల్సిన పనిలేదు.. సుమారు 100 గ్రాముల మాంసంతో కుటుంబం మొత్తానికి అద్భుతంగా సరిపోతుంది. అయితే ఉప్పు ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నందున పరిమితంగా తీసుకోవడం, మాంసాన్ని సురక్షితంగా ఎండబెట్టి నిల్వ చేయడం ముఖ్యం. ఏమైనా సమస్యలుంటే వైద్యులను సంప్రదించడం మంచిది. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/four-planets-retrograde-during-dasara-2-zodiac-signs-set-for-good-fortune-1937279.html</loc><lastmod>2026-10-18T12:50:44+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/10/durgamatha-11.jpg</image:loc>
					<image:title><![CDATA[ Durgamatha ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/10/asro-1.jpg</image:loc><image:caption><![CDATA[ జ్యోతిష్య నిపుణుల ప్రకారం రాశులు, గ్రహాలు వాటి స్థానాలు ఎప్పటికప్పుడు మార్చుకుంటాయి. అయితే, కొన్ని సార్లు మంచిగా ఉంటే, మరికొన్ని సార్లు భయంకర పరిస్థితులను తీసుకొస్తుంది. అయితే, మంచైనా చెడు అయినా ఈ ప్రభావం మొత్తం అన్ని రాశుల పైన ప్రభావం చూపుతుందని పండితులు చెబుతున్నారు ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/10/babavanga-1-4.jpg</image:loc><image:caption><![CDATA[ రెండు రోజుల్లో దసరా వచ్చేస్తోంది. అయితే, ఈ నవరాత్రుల సమయంలో ఆకాశంలో శని, శుక్రుడు, రాహువు, కేతువు  ఇలా నాలుగు గ్రహాలు తిరోగమనంలో ఉంటాయి. ఈ ప్రభావం 12 రాశుల వారిపైన పడుతుంది. ఇంకా దీనివల్ల రెండు రాశుల వారికి మంచిగా కలిసి వస్తుంది. ఆ రాశులు ఏంటో ఇక్కడ చూద్దాం.. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/10/diwali-4-1.jpg</image:loc><image:caption><![CDATA[ మీన రాశి : దసరా రోజు నుంచే ఈ రాశుల వారికీ పట్టిందల్లా బంగారమే అవుతుంది. ఇంకా వీరికి ఉద్యోగం వస్తుంది. అంతేకాదు, కొత్తగా వ్యాపారాలు కూడా మొదలు పెడతారు.  అలాగే ఆ దుర్గాదేవి ఆశీస్సులతో ముందుకు వెళ్తారు. ఇంకా అన్నింటిలో శుభ ఫలితాలు పొందుతారు. అన్ని పనుల్లో ముందుకు వెళ్తూ ఆత్మవిశ్వాసం కూడా రెట్టింపు అవుతుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/10/diwali-5-1.jpg</image:loc><image:caption><![CDATA[ మేష రాశి : వీరి అప్పులు మొత్తం ఒక్క రోజులోనే తీరుతాయి. ఇంకా దూర ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఈ  ప్రయాణాలు బాగా కలిసి వస్తాయి. ఇంకా జరగవు అనుకున్నవి కూడా వస్తాయి. ఇంకా ఉద్యోగ, వ్యాపారాల్లో అధిక లాభాలు వస్తాయి. ఆర్థిక సమస్యల నుంచి బయట పడతారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/10/dussehra-1-2.jpg</image:loc><image:caption><![CDATA[ Note : ఇక్కడ చెప్పిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. కేవలం పాఠకుల ఆసక్తి మేరకు, పలువురు పండితుల సూచనలు, వారు తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/betel-leaf-stem-traditional-uses-benefits-and-important-precautions-you-should-know-1937282.html</loc><lastmod>2026-10-18T12:38:36+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/10/betel-leaf-stem-benefits-telugu.jpg</image:loc>
					<image:title><![CDATA[ Betel Leaf Stem Benefits Telugu ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/10/betel-leaf-stem1.jpg</image:loc><image:caption><![CDATA[ Betel Leaf Stem: తమలపాకులను మనలో చాలామంది వివిధ సందర్భాల్లో ఉపయోగిస్తుంటారు. పూజలు, తాంబూలం మొదలైన వాటితో పాటు కొన్ని సంప్రదాయ గృహచిట్కాల్లోనూ తమలపాకులకు ప్రాధాన్యం ఉంది. అయితే ఆకును ఉపయోగించిన తర్వాత మిగిలే కాడను చాలామంది పనికిరాదని భావించి పడేస్తుంటారు. కానీ సంప్రదాయ గృహవైద్యంలో తమలపాకు కాడను కూడా కొన్ని విధాలుగా ఉపయోగించినట్లు చెబుతారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/10/betel-leaf-stem2.jpg</image:loc><image:caption><![CDATA[ తమలపాకు కాడను వాము లేదా సోంపుతో కలిపి నీటిలో మరిగించి తయారు చేసిన పానీయాన్ని కొందరు సంప్రదాయంగా ఉపయోగిస్తారు. గ్యాస్, కడుపు ఉబ్బరం, అజీర్ణం, కడుపులో భారంగా అనిపించడం వంటి సమస్యలకు ఇది ఉపశమనం కలిగిస్తుందని స్థానిక నమ్మకాలు ఉన్నాయి. అయితే, తరచూ జీర్ణ సమస్యలు ఎదురైతే వైద్యుడిని సంప్రదించడం మంచిది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/10/betel-leaf-stem3.jpg</image:loc><image:caption><![CDATA[ అలాగే తమలపాకులను సంప్రదాయంగా నోటి పరిశుభ్రతకు ఉపయోగించిన సందర్భాలు ఉన్నాయి. కొన్ని గృహచిట్కాల్లో తమలపాకు కాడను మెత్తగా నూరి ఇతర పదార్థాలతో కలిపి ఉపయోగిస్తారు. అయితే దీనివల్ల పళ్ల సమస్యలు లేదా చిగుళ్ల సమస్యలు పూర్తిగా తగ్గుతాయని భావించడం సరికాదు. రోజుకు రెండుసార్లు బ్రష్ చేయడం, దంతాల మధ్య శుభ్రం చేసుకోవడం, అవసరమైనప్పుడు దంత వైద్యుడిని సంప్రదించడం చాలా ముఖ్యం. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/10/betel-leaf-stem4.jpg</image:loc><image:caption><![CDATA[ మారుతున్న వాతావరణంలో జలుబు, దగ్గు, గొంతు ఇబ్బందులు వచ్చినప్పుడు కూడా తమలపాకు, దాని కాడను ఉపయోగించే కొన్ని సంప్రదాయ పద్ధతులు ఉన్నాయి. కాడ రసంలో కొద్దిగా తేనె కలిపి తీసుకోవడం లేదా కాడతో కషాయం తయారు చేసుకోవడం వంటి పద్ధతులు కొందరిలో కనిపిస్తాయి. అయితే దగ్గు, కఫం తగ్గించడంలో ఇవి ఎంతవరకు ప్రభావవంతంగా ఉంటాయనే దానిపై తగిన శాస్త్రీయ ఆధారాలు లేవు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/10/betel-leaf-stem5.jpg</image:loc><image:caption><![CDATA[ ముఖ్యంగా పిల్లలకు ఇలాంటి ఇంటి చిట్కాలు ఇచ్చే ముందు వైద్యుల సలహా తీసుకోవాలి. ఒక సంవత్సరం లోపు చిన్నారులకు తేనె ఇవ్వకూడదు. దగ్గు ఎక్కువ రోజులు కొనసాగడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, జ్వరం లేదా ఛాతీ నొప్పి వంటి లక్షణాలు ఉంటే వెంటనే వైద్య పరీక్ష చేయించుకోవాలి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/10/betel-leaf-stem6.jpg</image:loc><image:caption><![CDATA[ తమలపాకు కాడకు సంబంధించి సంప్రదాయంగా పలు ఉపయోగాలు ఉన్నప్పటికీ, వాటిని నిర్ధారిత వైద్య చికిత్సగా పరిగణించకూడదు. పిల్లలు, గర్భిణీలు, వృద్ధులు, ఇతర అనారోగ్యాలకు మందులు వాడుతున్నవారు ప్రత్యేకంగా జాగ్రత్త వహించాలి. ఆరోగ్య సమస్యలకు సరైన నిర్ధారణ, వైద్యుల సలహానే మొదటి ప్రాధాన్యతగా ఉండాలి. (Disclaimer: ఈ కథనంలోని సమాచారం సంప్రదాయంగా ప్రచారంలో ఉన్న గృహచిట్కాలు, సాధారణ ఆరోగ్య సమాచారంపై ఆధారపడి ఉంది. వీటిని వైద్య చికిత్సకు ప్రత్యామ్నాయంగా భావించకండి. ఆరోగ్య సమస్యలు కొనసాగితే లేదా తీవ్రంగా ఉంటే తప్పనిసరిగా వైద్యులను సంప్రదించండి.) ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/gudannam-recipe-traditional-sweet-prasadam-prepared-for-dasara-festival-1937239.html</loc><lastmod>2026-10-18T11:44:49+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/10/gudannam.jpg</image:loc>
					<image:title><![CDATA[ Gudannam ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/10/gudannam-1.jpg</image:loc><image:caption><![CDATA[ తయారీకి కావలసిన పదార్థాలు : బియ్యం: 1 కప్పు (పావు కిలో), నీళ్లు (బియ్యం ఉడికించడానికి): 4 కప్పులు (1 లీటరు), 
బెల్లం: అర కిలో (2.5 కప్పులు),  నీళ్లు (బెల్లం కరిగించడానికి): 1 కప్పు, నెయ్యి: అర కప్పు, పచ్చి కొబ్బరి: 1 చిప్ప (మెత్తగా తురిమి లేదా మిక్సీలో గ్రైండ్ చేసి),  జీడిపప్పు: పావు కప్పు, ఎండు ద్రాక్ష: పావు కప్పు, ఉప్పు: పావు టీ స్పూన్, యాలకుల పొడి: 1 టీ స్పూన్, పచ్చ కర్పూరం: చిటికెడు తీసుకోవాలి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/10/gudannam-2.jpg</image:loc><image:caption><![CDATA[ ముందుగా 1 కప్పు బియ్యాన్ని రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. గూడాన్నం కోసం అన్నం చాలా మెత్తగా ఉడకాలి కాబట్టి, ఒక మందపాటి గిన్నెలో కడిగిన బియ్యం వేసి, 4 కప్పుల నీళ్లు పోయాలి. అంటే, పావు కిలో బియ్యానికి ఒక లీటరు నీళ్లు అవసరం. మూత పెట్టి మీడియం ఫ్లేమ్‌లో అన్నం మెత్తగా ఉడికేంత వరకు ఉడికించాలి. కావాలంటే అరగంట నానబెట్టి కూడా ఉడికించవచ్చు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/10/gudannam-3.jpg</image:loc><image:caption><![CDATA[ అన్నం ఉడికేలోపు, అర కిలో బెల్లాన్ని తురిమి పెట్టుకోవాలి. ఈ బెల్లంలో ఒక కప్పు నీళ్లు పోసి, స్టవ్ పైన పెట్టి బెల్లం పూర్తిగా కరిగేంత వరకు వేడి చేయాలి. పాకం రానవసరం లేదు, కేవలం బెల్లం కరిగి నీళ్లుగా మారితే సరిపోతుంది. కరిగిన బెల్లం నీళ్లను పక్కన ఉంచాలి.
పచ్చి కొబ్బరిని చిన్న ముక్కలుగా కట్ చేసి మిక్సీలో వేసి మెత్తగా కాకుండా కచ్చాపచ్చాగా బ్లెండ్ చేసుకోవాలి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/10/gudannam-4.jpg</image:loc><image:caption><![CDATA[ అన్నం పూర్తిగా ఉడికి, మెత్తగా అయిన తర్వాత, గరిటెతో బాగా మెదిపేయాలి. దధ్యోజనానికి అన్నాన్ని ఎలా మెదుపుతామో, అలాగే మెత్తగా చేయాలి. మెదిపిన అన్నంలో కరిగించుకున్న బెల్లం నీళ్లను వడపోసి పోయాలి. అడుగంటకుండా మీడియం ఫ్లేమ్‌లో కలుపుతూ ఉడికించాలి. అన్నం బెల్లం  పాకంలో కలిసే వరకు కుక్ చేయాలి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/10/gudannam-5.jpg</image:loc><image:caption><![CDATA[ అర కప్పు నెయ్యిని కొద్దికొద్దిగా  కలుపుతూ ఉండాలి. నెయ్యిని అడుగు నుంచి కలుపుతూ, గూడాన్నం పూర్తిగా దగ్గరపడి, మెరుస్తూ కనిపించేంత వరకు దాదాపు 15-20 నిమిషాలు ఉడికించాలి. ఈ ప్రక్రియ గూడాన్నానికి మంచి రుచినిస్తుంది. ఒక చిన్న కడాయిలో పావు కప్పు నెయ్యి వేడి చేసి, జీడిపప్పు వేసి గోల్డెన్ కలర్ వచ్చేవరకు వేయించాలి.  ఆ తర్వాత ఎండు ద్రాక్ష కూడా వేసి అవి పొంగేంత వరకు వేయించి స్టవ్ ఆఫ్ చేయాలి. దగ్గరపడిన గూడాన్నంలో, మిక్సీ పట్టుకున్న పచ్చి కొబ్బరి తురుము, పావు టీ స్పూన్ ఉప్పు, ఒక టీ స్పూన్ యాలకుల పొడి, చిటికెడు పచ్చ కర్పూరం, వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసి అడుగు నుంచి బాగా కలిపేయాలి. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/cinema-photos/rajinikanth-box-office-domination-jailer-2-storms-into-rs-300-crore-club-in-just-3-days-1937227.html</loc><lastmod>2026-10-18T11:43:17+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/10/jailer-2-7.jpg</image:loc>
					<image:title><![CDATA[ Jailer 2 ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/10/jailer-2-6.jpg</image:loc><image:caption><![CDATA[ సూపర్‌స్టార్ రజినీకాంత్, క్రియేటివ్ డైరెక్టర్ నెల్సన్ దిలీప్‌కుమార్ కాంబినేషన్‌లో వచ్చిన మోస్ట్ అవేటెడ్ సీక్వెల్ &#039;జైలర్ 2&#039; బాక్సాఫీస్ వద్ద సరికొత్త చరిత్ర సృష్టిస్తోంది. మొదటి భాగం తెచ్చిపెట్టిన అపారమైన క్రేజ్‌తో భారీ అంచనాల నడుమ ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్, థియేటర్లలో కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. విడుదేలైన మొదటి రోజు నుంచే పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకున్న ఈ చిత్రం, కేవలం మూడే రోజుల్లోనే ఊహించని రికార్డులను తిరగరాసింది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/10/jailer-2-film.jpg</image:loc><image:caption><![CDATA[ బాక్సాఫీస్ వర్గాల నివేదికల ప్రకారం, &#039;జైలర్ 2&#039; మూవీ కేవలం 3 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ. 300 కోట్ల గ్రాస్ వసూళ్ల అరుదైన మైలురాయిని దాటేసింది. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలతో పాటు ఓవర్సీస్‌లోనూ ఈ చిత్రానికి ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. ముఖ్యంగా నార్త్ ఇండియా , యూఎస్, మలేషియా వంటి అంతర్జాతీయ మార్కెట్లలో రజినీక్రాజ్ ఏమాత్రం తగ్గలేదని ఈ కలెక్షన్లు నిరూపిస్తున్నాయి. శని, ఆదివారాల్లో థియేటర్లన్నీ హౌస్‌ఫుల్ బోర్డులతో దర్శనమిచ్చాయి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/10/jailer-2-movie-3.jpg</image:loc><image:caption><![CDATA[ దర్శకుడు నెల్సన్ మరోసారి తన వినూత్నమైన టేకింగ్, మాస్ ఎలివేషన్లతో థియేటర్లలో ప్రేక్షకులకు పూనకాలు తెప్పించారు. టైగర్ ముత్తువేల్ పాండ్యన్‌గా రజినీకాంత్ చూపించిన స్వాగ్, గూస్‌బంప్స్ తెప్పించే యాక్షన్ సీన్లు మరియు అనిరుధ్ రవిచందర్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఈ చిత్రానికి ప్రధాన బలంగా నిలిచాయి. దానికితోడు చిత్రంలో ఉన్న సర్ ప్రైజ్ క్యామియో పాత్రలు, ఫస్ట్ హాఫ్‌లోని కామెడీ , సెకండ్ హాఫ్‌లోని హై-వోల్టేజ్ యాక్షన్ బ్లాక్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/10/jailer-2-ott.jpg</image:loc><image:caption><![CDATA[ వీకెండ్‌లో సాధించిన ఈ భారీ వసూళ్లతో &#039;జైలర్ 2&#039; లాంగ్ రన్‌లో మరిన్ని ఆల్‌టైమ్ బాక్సాఫీస్ రికార్డులను తిరగరాయడం ఖాయంగా కనిపిస్తోంది. ట్రేడ్ పండితుల అంచనా ప్రకారం, ఈ చిత్రం రాబోయే రోజుల్లో రూ. 500 కోట్ల మార్కును చాలా సులువుగా దాటే అవకాశం ఉంది. రజినీకాంత్ మాస్ మేనియాకు తిరుగులేదని ఈ సినిమా సాధిస్తున్న కలెక్షన్లు మరోసారి నిరూపించాయి. &#039;జైలర్&#039; విజయానికి అనిరుధ్ రవిచందర్ బిజీఎమ్  ఎంత పెద్ద ప్లస్ అయ్యిందో తెలిసిందే. &#039;జైలర్ 2&#039;లో కూడా రజినీకాంత్ ఎలివేషన్ సీన్ల కోసం అనిరుధ్ ఇచ్చిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ థియేటర్లలో ప్రేక్షకులకు మైండ్ బ్లోయింగ్ ఎక్స్‌పీరియన్స్‌ ఇస్తోంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/10/jailer-2-tleug.jpg</image:loc><image:caption><![CDATA[ ఈ చిత్రంలో రజినీకాంత్‌తో పాటు మొదటి భాగంలో మెరిసిన మలయాళ సూపర్ స్టార్ మోహన్‌లాల్, కన్నడ హ్యాట్రిక్ హీరో శివరాజ్‌కుమార్, రమ్యకృష్ణ తమ పాత్రల్లో మరోసారి కనిపించారు. ఇక ఈ చిత్రంలో ఈ సీక్వెల్‌లో బాలీవుడ్ నటి విద్యాబాలన్ నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో అదరగొట్టింది. విజయ్ సేతుపతి, మిథున్ చక్రవర్తి , ఎస్.జె. సూర్య ప్రధాన పాత్రల్లో కనిపించి సినిమా రేంజ్‌ను పెంచేశారు. సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ నిర్మించిన ఈ చిత్రం సుమారు రూ. 300 కోట్ల నుండి రూ. 350 కోట్ల అత్యధిక బడ్జెట్‌తో తెరకెక్కింది. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/thangedu-flowers-bathukamma-traditional-health-benefits-facts-1937218.html</loc><lastmod>2026-10-18T11:31:51+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/10/thangedu-flowers.jpg</image:loc>
					<image:title><![CDATA[ Thangedu Flowers ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/10/bathukamma-1-3.jpg</image:loc><image:caption><![CDATA[ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగలో తంగేడు పూలకు ప్రత్యేక స్థానం ఉంది. బంగారు రంగులో ఆకర్షణీయంగా కనిపించే ఈ పూలతో బతుకమ్మను పేర్చడం ఆనవాయితీ. అయితే తంగేడు మొక్కకు సంప్రదాయ వైద్యంలోనూ ప్రాధాన్యం ఉందని చాలామందికి తెలియదు. ఆయుర్వేదంలో ఈ మొక్కను వివిధ ఆరోగ్య సమస్యలకు ఉపయోగించినట్లు సంప్రదాయ గ్రంథాలు, జానపద వైద్య పద్ధతులు చెబుతున్నాయి. అయితే వీటి ప్రయోజనాలపై శాస్త్రీయ ఆధారాలు పరిమితంగా ఉన్నందున, వైద్య చికిత్సకు ప్రత్యామ్నాయంగా భావించకూడదు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/10/thangedu-flowers-benefits.jpg</image:loc><image:caption><![CDATA[ తంగేడు మొక్క బంజరు భూములు, చిట్టడవులు, పొదలు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో పెరుగుతుంది. దీని కొమ్మల చివర బంగారు రంగు పూలు గుత్తులుగా పూస్తాయి. వర్షాకాలం తర్వాత ఈ పూలు విరివిగా కనిపిస్తాయి. బతుకమ్మలో ఉపయోగించే పూలలో తంగేడు పూలు ముఖ్యమైనవి. పండుగలో వీటి వినియోగం తెలంగాణ సాంస్కృతిక వారసత్వంలో భాగంగా కొనసాగుతోంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/10/tangedu-flowers-1.jpg</image:loc><image:caption><![CDATA[ తంగేడు పూలను మినపప్పు లేదా పెసరపప్పుతో కలిపి వంటల్లో ఉపయోగిస్తే మధుమేహం నియంత్రణలోకి వస్తుందని సంప్రదాయ వైద్యంలో ప్రచారం ఉంది. అయితే తంగేడు పూలు రక్తంలో చక్కెర స్థాయులను తగ్గిస్తాయని నిర్ధారించే బలమైన మానవ అధ్యయనాలు లేవు. మధుమేహం ఉన్నవారు వైద్యులు సూచించిన మందులు, ఆహార నియమాలను కొనసాగించాలి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/10/tangedu-flowers-3.jpg</image:loc><image:caption><![CDATA[ తరచూ అలసటగా అనిపించడం, శరీరంలో బలహీనత ఉండటం వంటి సమస్యలకు తంగేడు పూలు సహాయపడతాయని కొన్ని సంప్రదాయ పద్ధతులు పేర్కొంటాయి. అయితే ఈ సమస్యలకు రక్తహీనత, పోషకాహార లోపం, ఇతర ఆరోగ్య కారణాలు ఉండవచ్చు. లక్షణాలు కొనసాగితే వైద్యులను సంప్రదించడం అవసరం. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/10/tangedu-flowers-4.jpg</image:loc><image:caption><![CDATA[ అతి మూత్రం, పురుషుల్లో స్వప్న స్కలన సమస్యలకు తంగేడు పూలను ఉపయోగించే సంప్రదాయ చిట్కాలు ప్రచారంలో ఉన్నాయి. పూల రెక్కలను ఎండబెట్టి పొడిగా చేసుకోవడం లేదా పాలతో కలిపి తీసుకోవడం వంటి పద్ధతులను కొందరు సూచిస్తారు. స్వయంగా పొడులు, మిశ్రమాలు తీసుకునే ముందు వైద్యుల సలహా తీసుకోవాలి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/10/tangedu-flowers-6.jpg</image:loc><image:caption><![CDATA[ ముఖ్య గమనిక: తంగేడు పూలకు సంప్రదాయ వైద్యంలో ప్రాధాన్యం ఉన్నప్పటికీ, వాటిని దివ్యౌషధంగా భావించి వైద్య చికిత్సను ఆపకూడదు. ముఖ్యంగా మధుమేహం లేదా మూత్ర సంబంధిత సమస్యలు ఉన్నవారు వైద్యుల సలహాతోనే చికిత్స తీసుకోవాలి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/10/tangedu-flowers-5.jpg</image:loc><image:caption><![CDATA[ ఆయుర్వేదంలో ఈ మొక్కను వివిధ ఆరోగ్య సమస్యలకు ఉపయోగించినట్లు సంప్రదాయ గ్రంథాలు, జానపద వైద్య పద్ధతులు చెబుతున్నాయి. అయితే వీటి ప్రయోజనాలపై శాస్త్రీయ ఆధారాలు పరిమితంగా ఉన్నందున, వైద్య చికిత్సకు ప్రత్యామ్నాయంగా భావించకూడదు. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/how-to-make-tough-mutton-tender-soft-quickly-raw-papaya-trick-and-dasara-special-mutton-curry-recipe-goat-meat-1937193.html</loc><lastmod>2026-10-18T11:07:40+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/10/mutton-softening-tips.jpg</image:loc>
					<image:title><![CDATA[ Mutton Softening Tips ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/10/mutton-curry-9.jpg</image:loc><image:caption><![CDATA[ పండుగల వేళ ప్రత్యేక వంటకాలు చేసుకోవడం భారతీయ సంప్రదాయం.. ముఖ్యంగా.. మంసాహార ప్రియులకు నాన్ వెజ్ ఉండాల్సిందే.. ఇక దసరా పండగకి అయితే.. మటన్ పక్కాగా ఉండాల్సిందే.. ఈ దసరాకు రుచికరమైన, త్వరగా చేసే మటన్ కర్రీని గురించి తెలుసుందాం.. ఈ రెసిపీ మీ పండుగ భోజనానికి ప్రత్యేకతను చేకూరుస్తుంది. బిర్యానీ లేదా.. బగారా.. ఏ కాంబినేషన్‌లో అయినా.. మటన్ కర్రీ అద్భుతంగా ఉంటుంది. ఎంత ముదురు మటన్ అయినా.. తొందరగా ఉడికిపోవాలంటే ఈ టిప్స్ పాటించండి.. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/10/mutton-7.jpg</image:loc><image:caption><![CDATA[ మంచి మటన్‌ను తీసుకుని.. శుభ్రం చేసుకోండి.. అనంతరం కొద్దిగా పచ్చి బొప్పాయి ముక్కల పేస్ట్ కలిపి మ్యారినేట్ చేయాలి. ఇందులో ఉండే &#039;పపైన్&#039; అనే ఎంజైమ్ మటన్ త్వరగా ఉడకడానికి సహాయపడుతుంది. అంతేకాకుండా.. ముదురు మాంసాన్ని మెత్తగా అయ్యేలా చేస్తుంది.. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/10/mutton-coocking.jpg</image:loc><image:caption><![CDATA[ ఈ మటన్ కర్రీ తయారీకి ముందుగా ఒక పాన్‌లో ధనియాలు, మిరియాలు, లవంగాలు, ఇలాచి, దాల్చిన చెక్క, జీలకర్ర, షాహిజీరా, జాపత్రి, జాజికాయ, చిరోంజి, జీడిపప్పు, తర్బూజా గింజలు వేసి దోరగా వేయించాలి. సువాసన రాగానే తీసి చల్లార్చి, పొడి చేసుకోవాలి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/10/mutton-curry-8.jpg</image:loc><image:caption><![CDATA[ తరువాత, మరో పాన్‌లో కొద్దిగా నూనె వేసి, సన్నగా తరిగిన ఉల్లిపాయలు, కొంచెం ఉప్పు కలిపి బంగారు రంగు వచ్చేవరకు వేయించాలి. పసుపు, దంచిన అల్లం, మటన్ ముక్కలు వేసి నూనె పైకి తేలేంత వరకు వేయించాలి. తరువాత సరిపడా నీళ్లు పోసి మటన్‌ను సగం ఉడికించాలి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/10/mutton-fry.jpg</image:loc><image:caption><![CDATA[ సగం ఉడికిన మటన్‌లో పచ్చిమిరపకాయలు వేసి, మటన్ పూర్తిగా ఉడికిన తర్వాత పెరుగు, కారప్పొడి, మనం తయారుచేసుకున్న మసాలా పొడి, పుదీనా ఆకు, కొత్తిమీర వేసి, ఉప్పు సరిచూసుకోవాలి. మరో ఐదు నిమిషాలు ఉడికించి, నూనె పైకి తేలగానే దించేయాలి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/10/raw-mutton.jpg</image:loc><image:caption><![CDATA[ ఈ రుచికరమైన దసరా స్పెషల్ మటన్ కర్రీని బిర్యానీ లేదా బగారా అన్నంతో వేడి వేడిగా వడ్డిస్తే అద్భుతంగా ఉంటుంది. ఈ పండుగకు ఈ వంటకాన్ని ఆస్వాదించండి. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/winter-cough-and-phlegm-relief-simple-home-remedies-for-throat-irritation-1937162.html</loc><lastmod>2026-10-18T09:15:24+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/10/miriyalu-2.jpg</image:loc>
					<image:title><![CDATA[ Miriyalu 2 ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/10/miriyalu-5.jpg</image:loc><image:caption><![CDATA[ చలికాలం మొదలు కాగానే చాలామందిని దగ్గు, జలుబు, ఛాతిలో కఫం, గొంతు గరగర వంటి సమస్యలు వేధిస్తుంటాయి. రోగనిరోధక శక్తి తక్కువ ఉన్నవారికి ఈ సమస్యలు మరింత ఇబ్బందికరంగా మారుతాయి. తరచుగా మందులు వాడినా పూర్తి ఉపశమనం లభించక నిరాశ చెందుతుంటారు. అయితే, మన ఇంట్లోనే లభించే సహజ సిద్ధమైన పదార్థాలతో సులభంగా తయారుచేసుకోగలిగే ఒక అద్భుతమైన పానీయం ఈ సమస్యలన్నింటికీ శాశ్వత పరిష్కారం చూపుతుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/10/miriyalu.jpg</image:loc><image:caption><![CDATA[ పానీయం తయారీకి కావలసిన పదార్థాలు: వెల్లుల్లి రెబ్బలు – 3, మిరియాలు – 10,  లవంగాలు – 10, అల్లం – చిన్న ముక్క
తులసి ఆకులు,   పుదీనా ఆకులు – 10, పసుపు – పావు టీస్పూన్, నీరు – 2 గ్లాసులు తీసుకోవాలి.  ముందుగా ఒక మందపాటి గిన్నెలో రెండు గ్లాసుల నీటిని పోయాలి. ఇప్పుడు ఒక్కొక్కటిగా పైన చెప్పిన వాటిని నీటిలో వేయాలి. వెల్లుల్లి రెబ్బలను పొట్టు తీసి చిన్న ముక్కలుగా కట్ చేసి వేయాలి. ఇంకా అల్లాన్ని శుభ్రం చేసి చిన్న ముక్కలుగా కట్ చేసి లేదా దంచి వేసుకోవచ్చు. తులసి, పుదీనా ఆకులను కూడా శుభ్రంగా కడిగి వేయాలి. ఆ తర్వాత మిరియాలు, లవంగాలు, పసుపు వేసి, అన్నింటినీ బాగా కలిపి మీడియం ఫ్లేమ్‌లో సుమారు ఐదు నిమిషాల పాటు మరిగించాలి. పానీయం సగం అయ్యే వరకు మరిగించడం మంచిది. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి, గోరువెచ్చగా ఉన్నప్పుడు వడకట్టి తాగాలి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/10/miriyalu-1.jpg</image:loc><image:caption><![CDATA[ వెల్లుల్లిలో యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్ గుణాలు పుష్కలంగా ఉన్నాయి. విటమిన్ B1, B2, B3, B6, C, కాల్షియం, ఐరన్ వంటి ఎన్నో పోషకాలు ఇందులో ఉంటాయి. ఇది జలుబు, దగ్గు, కఫం తగ్గించడంలో అద్భుతంగా పనిచేస్తుంది. రోగనిరోధక శక్తిని పెంచి, కాలుష్యం నుండి శరీరాన్ని రక్షిస్తుంది. మిరియాలలో విటమిన్ C అధికంగా ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది. దగ్గు, కఫం, జలుబు, గొంతు నొప్పి, గరగర వంటి గొంతు సంబంధిత సమస్యలకు మిరియాలు చక్కటి ఔషధంగా పనిచేస్తాయి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/10/miriyalu-3.jpg</image:loc><image:caption><![CDATA[ లవంగాలలో ఐరన్, కార్బోహైడ్రేట్లు, కాల్షియం, పొటాషియం, సోడియం, విటమిన్ A వంటి పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. గొంతు సంబంధిత సమస్యలు, దగ్గు, కఫం వంటి వాటికి ఇవి దివ్యౌషధంగా పనిచేస్తాయి. అల్లం దగ్గు, కఫం, గొంతు నొప్పి నుండి తక్షణ ఉపశమనం అందిస్తుంది. ఇది జీర్ణ శక్తిని మెరుగుపరిచి, కడుపును తేలికపరుస్తుంది. ఎక్కువ కఫం ఉన్నప్పుడు చిన్న అల్లం ముక్కను నమిలి రసాన్ని మింగడం ద్వారా త్వరగా ఫలితం లభిస్తుంది. తులసి జలుబు, దగ్గు, జ్వరానికి చాలా బాగా పనిచేస్తుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచి, రక్తాన్ని శుద్ధి చేస్తుంది మరియు ఇన్‌ఫెక్షన్లను నయం చేస్తుంది. బీపీ, షుగర్ నియంత్రణకు కూడా సహాయపడుతుంది. పుదీనా శ్వాస సంబంధ సమస్యలకు చక్కని పరిష్కారం. గొంతులో మంట, గొంతు నొప్పి ఉన్నప్పుడు తక్షణ ఉపశమనం ఇస్తుంది. పసుపు ఒక శక్తివంతమైన యాంటీబయాటిక్. జలుబు, దగ్గు, కఫం ఇన్‌ఫెక్షన్ల వల్ల వస్తాయి కాబట్టి, పసుపు వాడకం ఈ ఇన్‌ఫెక్షన్లను తగ్గించి, రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/10/miriyalu-4.jpg</image:loc><image:caption><![CDATA[ ఐదు నుంచి ఆరు రోజులు క్రమం తప్పకుండా ఉదయాన్నే ఈ పానీయాన్ని తాగాలి. దగ్గు, జలుబు లేని వారు కూడా వారానికి కనీసం రెండు రోజులు ఈ పానీయం తాగడానికి ప్రయత్నించాలి. ఇది రోగనిరోధక శక్తిని పెంచి, ఎలాంటి బాక్టీరియల్ ఇన్‌ఫెక్షన్లు సోకకుండా రక్షిస్తుంది. పిల్లలకు మోతాదు తగ్గించి, వారంలో ఒకసారి ఇస్తే సరిపోతుంది. (నోట్ : ఇక్కడ రాసిన సమాచారం ఇంటర్నెట్ నుంచి తీసుకోబడింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది) ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/cinema-photos/8-crore-budget-4300-crore-collection-horror-blockbuster-obsession-ott-streaming-date-fixed-1937096.html</loc><lastmod>2026-10-18T07:45:38+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/10/obsession-movie-2.jpg</image:loc>
					<image:title><![CDATA[ Obsession Movie ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/10/obsession.jpg</image:loc><image:caption><![CDATA[ హారర్ , సైకాలాజికల్ థ్రిల్లర్ చిత్రాలను ఇష్టపడే సినీ ప్రియులకు ఒక బిగ్ న్యూస్. అతి తక్కువ బడ్జెట్‌తో తెరకెక్కి ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద అసాధారణ కలెక్షన్ల సునామీ సృష్టించిన సంచలన చిత్రం &#039;ఆబ్సెషన్&#039; ఇప్పుడు డిజిటల్ ప్లాట్‌ఫామ్‌పై అలరించేందుకు సిద్ధమైంది. హ్యాలోవీన్ కానుకగా ఈ హారర్ బ్లాక్‌బస్టర్ ఓటీటీలోకి ఎంట్రీ ఇస్తుండటంతో సినీ వర్గాల్లో తీవ్ర చర్చ నడుస్తోంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/10/obsession-movie-1.jpg</image:loc><image:caption><![CDATA[ కారీ బార్కర్ దర్శకత్వంలో ఇండే నవరేట్, మైకేల్ జాన్సన్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం &#039;ఆబ్సెషన్&#039;. అతి స్వల్పంగా కేవలం రూ. 8 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ. 4,300 కోట్ల గ్రాస్ వసూలు చేసి అంతర్జాతీయంగా సరికొత్త రికార్డులను సృష్టించింది. హారర్ జానేర్‌లో అతి తక్కువ వ్యయంతో వచ్చి ఇంతటి భారీ స్థాయి కలెక్షన్లు రాబట్టడం సినీ చరిత్రలోనే అరుదైన మైలురాయిగా నిలిచింది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/10/obsession-new.jpg</image:loc><image:caption><![CDATA[ భారతదేశంలో కూడా ఈ చిత్రం విడుదలై సుమారు రూ.100 కోట్ల మేర వసూళ్లను రాబట్టి ప్రేక్షకులేను విశేషంగా ఆకట్టుకుంది. కథ విషయానికి వస్తే.. బెయర్ అనే యువకుడు నక్కి అనే అమ్మాయి ప్రేమలో పడటం, ఆ తర్వాత అనుకోకుండా ఒక రహస్యమైన శక్తి ద్వారా ఒక కోరిక నెరవేరిన తర్వాత అది ఎలా శాపంగా మారింది? వారి జీవితాల్లోకి వచ్చిన ఆ భయంకరమైన మలుపులు ఏమిటి? అనేది సినిమా ముఖ్య కథాంశం. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/10/obsession-ott.jpg</image:loc><image:caption><![CDATA[ ఈ సినిమాలో ప్రదర్శించిన భయానక సన్నివేశాలు, ఊహించని ట్విస్టులు ప్రేక్షకుల సీట్లలో ఒళ్లు గగుర్పాటు కలిగిస్తాయి. ఈ ఆల్-టైమ్ హారర్ హిట్ చిత్రం అక్టోబర్ 30న సాయంత్రం 7 గంటల నుంచి జియోహాట్‌స్టార్ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో స్ట్రీమింగ్ కానుంది. థియేటర్లలో సెన్సార్ కాట్లకు గురైన సీన్లను సైతం కలిపి ఒరిజినల్ &#039;అన్ కట్ వర్షన్&#039; రూపంలో దీనిని విడుదల చేస్తుండటం విశేషం. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/10/obsession-telugu.jpg</image:loc><image:caption><![CDATA[ అంతేకాకుండా ఇంగ్లీష్‌తో పాటు హిందీ భాషలోనూ అందుబాటులో ఉండనుంది. ఈ సినిమా ఇంగ్లీష్ , హిందీ భాషలలో అందుబాటులో ఉంటుంది. &#039;అబ్సెషన్&#039; చిత్రం అమెరికా , ఇతర దేశాలలో మే 15, 2026న విడుదల కాగా, భారతదేశంలోని థియేటర్లలో మే 29న విడుదలైంది. తక్కువ బడ్జెట్‌తో నిర్మించిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద భారీ విజయం సాధించింది. దీంతో ఈ మూవీ గురించి హారర్ మూవీ లవర్స్ ఎంతో ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/jupiter-transit-in-leo-2-zodiac-signs-that-may-see-financial-opportunities-1937021.html</loc><lastmod>2026-10-17T21:52:10+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/10/money-rashulu.jpg</image:loc>
					<image:title><![CDATA[ Money Rashulu ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/10/asro.jpg</image:loc><image:caption><![CDATA[ జ్యోతిష్య నిపుణుల ప్రకారం రాశులు, గ్రహాలు వాటి స్థానాలు ఎప్పటికప్పుడు మార్చుకుంటాయి. అయితే, కొన్ని సార్లు మంచిగా ఉంటే, మరికొన్ని సార్లు భయంకర పరిస్థితులను తీసుకొస్తుంది. అయితే, మంచైనా చెడు అయినా ఈ ప్రభావం మొత్తం అన్ని రాశుల పైన ప్రభావం చూపుతుందని పండితులు చెబుతున్నారు ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/10/babavanga-1-3.jpg</image:loc><image:caption><![CDATA[ దేవగురువు బృహస్పతి గురించి ప్రత్యేకించి అవసరం లేదు. మరి కొద్దీ రోజుల్లో  ఈ గ్రహం కర్కాటక రాశి నుంచి సింహ రాశిలోకి సంచారం చేయబోతున్నాడు. ఈ గురు గ్రహ సంచారం వల్ల రెండు రాశుల వారి జీవితాల్లో ధనయోగం పట్టబోతోంది. ఇంకా  ఉద్యోగం, వ్యాపారాల్లో కూడా అసలు ఊహించలేని డబ్బులు వస్తాయి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/10/diwali-3-1.jpg</image:loc><image:caption><![CDATA[ ఈ రాశి వాళ్ళు కొత్త ఉద్యోగం కోసం చూస్తున్న వారికి మంచి అవకాశాలు వస్తాయి. ఇప్పటికే చేస్తున్న వారికి ఉన్నత మంచి పదవులు, ఇంకా ప్రమోషన్లు, కొత్త బాధ్యతలు కూడా వస్తాయి. ఇంకా  సమాజంలో గౌరవం కూడా పెరుగుతుంది. ఇంకా నాయకత్వ లక్షణాలు కూడా  బయటపడతాయి. అలాగే కొత్త వ్యాపారం కూడా మొదలు పెడతారు. ఇంకా ప్రాజెక్టులు కూడా మొదలు పెడతారు ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/10/dussehra-3-2.jpg</image:loc><image:caption><![CDATA[ మొదలు పెట్టిన పనులు  ముందుకు పోతాయి. ఆలాగే, డబ్బు సమస్యలు పోతాయి. ఇంకా వీరి నెత్తిన పెద్ద భారాలు పడిన కూడా ముందుకు వెళ్తారు. ఇంకా వ్యాపారాలు చేసిన మంచే జరుగుతుంది. భార్య భర్తలు సంతోషంగా ఉంటారు. జాగ్రత్తగా ఉంటే మంచిది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/10/babavanga-2-3.jpg</image:loc><image:caption><![CDATA[ Note : ఇక్కడ చెప్పిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. కేవలం పాఠకుల ఆసక్తి మేరకు, పలువురు పండితుల సూచనలు, వారు తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/hajil-jebis-pilot-dream-overcoming-20-backlogs-financial-struggles-1936995.html</loc><lastmod>2026-10-17T21:22:32+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/10/hajil-jb.jpg</image:loc>
					<image:title><![CDATA[ Hajil Jb ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/10/hajil-jb-1.jpg</image:loc><image:caption><![CDATA[ కలలు కనడం కాదు.. వాటిని నిజం చేసుకోవడానికి పట్టుదలతో పోరాడటమే అసలైన విజయం. కేరళంకు చెందిన 30 ఏళ్ల హైజిల్ జెబి జీవితం దీనికి నిదర్శనం. ఇంజనీరింగ్‌లో 20 బ్యాక్‌లాగ్స్, ఆర్థిక ఇబ్బందులు, తండ్రిని కోల్పోయిన విషాదం, ఉద్యోగాల్లో ఎదురుదెబ్బలు.. ఇలా ఎన్నో అడ్డంకులు ఎదురైనా పైలట్ కావాలనే తన లక్ష్యాన్ని మాత్రం వదులుకోలేదు. పదేళ్ల నిరీక్షణ తర్వాత ఫిలిప్పీన్స్‌లో పైలట్ శిక్షణ ప్రారంభించి తన కలను సాకారం చేసుకునే దిశగా అడుగులు వేస్తున్నాడు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/10/hajil-jb-2.jpg</image:loc><image:caption><![CDATA[ కేరళంలోని త్రిస్సూర్ జిల్లా కొడుంగల్లూర్‌కు చెందిన హైజిల్ చిన్నప్పటి నుంచి కుటుంబ ఆర్థిక పరిస్థితులను దగ్గరగా చూశాడు. మంచి చదువు, స్థిరమైన ఉద్యోగంతోనే కుటుంబాన్ని ఆదుకోగలమని భావించాడు. పదో తరగతి తర్వాత విమానయాన రంగంపై ఆసక్తి పెరిగినా, కుటుంబ పరిస్థితులు, ఇతరుల అభిప్రాయాల కారణంగా తనకు ఇష్టమైన కోర్సును ఎంచుకోలేకపోయాడు. ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్‌లో చేరి, ఆసక్తి లేకపోవడంతో 20 బ్యాక్‌లాగ్స్‌ను ఎదుర్కొన్నాడు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/10/hajil-jb-3.jpg</image:loc><image:caption><![CDATA[ చదువు పూర్తి చేసిన తర్వాత ఉద్యోగం కోసం ఎన్నో ప్రయత్నాలు చేశాడు. కొచ్చిలో జొమాటో డెలివరీ పార్టనర్‌గా పనిచేశాడు. అనంతరం బెంగళూరులో బైజూస్‌లో గణిత ఉపాధ్యాయుడిగా చేరాడు. ఇదే సమయంలో సాయుధ దళాల్లో చేరేందుకు ప్రయత్నించినా తుది ఎంపికలో అవకాశం దక్కలేదు. కోవిడ్ సమయంలో దుబాయ్‌లో ఉన్న తండ్రి అనారోగ్యానికి గురవడం, 2021 జూన్‌లో ఆయన మరణించడం కుటుంబాన్ని తీవ్ర విషాదంలోకి నెట్టింది. ఆర్థిక బాధ్యతలు పెరగడంతో ట్రక్ డ్రైవర్‌గా, బస్ డ్రైవర్‌గా, ఇతర ఉద్యోగాల్లోనూ పనిచేశాడు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/10/hajil-jb-5.jpg</image:loc><image:caption><![CDATA[ ఎన్నో ఏళ్ల నిరీక్షణ తర్వాత ఇక తన కలను వాయిదా వేయకూడదని నిర్ణయించుకున్నాడు. విద్యా రుణం కోసం పలు బ్యాంకులను సంప్రదించి, చివరకు యూనియన్ బ్యాంక్ నుంచి రుణం పొందాడు. అనంతరం ఫిలిప్పీన్స్‌లోని ఫాస్ట్ ఏవియేషన్ అకాడమీ ఇంక్‌లో పైలట్ శిక్షణ ప్రారంభించాడు. “నా కలను సాకారం చేసుకోవడానికి పదేళ్లుగా ఎదురుచూస్తున్నాను. దాన్ని వాయిదా వేస్తూ పోవడం నాకు ఇష్టం లేదు” అన్న అతని మాటలు పట్టుదలకు ప్రతీకగా నిలుస్తున్నాయి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/10/hajil-jb-6.jpg</image:loc><image:caption><![CDATA[ ప్రస్తుతం శిక్షణ పూర్తి చేసి విమానయాన సంస్థలో ఉద్యోగం సాధించడం అతని ముందున్న లక్ష్యం. “వాదనలతో కాదు.. నా చేతలతోనే సమాధానం ఇచ్చాను” అనే హైజిల్ ప్రయాణం, కష్టాలు ఎదురైనా కలలను వదులుకోకూడదని చెబుతోంది. అతని లక్ష్యం ఇంకా పూర్తికాలేదు.. కానీ ఆ దిశగా వేసిన ప్రతి అడుగు ఎంతోమందికి స్ఫూర్తినిస్తోంది. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/technology-photos/extend-phone-battery-lifespan-avoid-overheating-and-damage-while-charging-1936951.html</loc><lastmod>2026-10-17T20:58:27+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/10/mobile-charging-1-1.jpg</image:loc>
					<image:title><![CDATA[ Mobile Charging ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/10/mobile-charging-1.jpg</image:loc><image:caption><![CDATA[ Mobile Charging: స్మార్ట్‌ఫోన్‌లు ప్రజల దైనందిన జీవితంలో ఒక ముఖ్యమైన భాగంగా మారాయి. అందువల్ల, తమ దైనందిన జీవితంలో స్మార్ట్‌ఫోన్‌లను ఉపయోగించే ప్రజలు ఎదుర్కొనే ఒక ప్రధాన సమస్య ఉంది. అదేమిటంటే స్మార్ట్‌ఫోన్ ఛార్జ్ తరచుగా అయిపోవడం. స్మార్ట్‌ఫోన్ బ్యాటరీ త్వరగా అయిపోకుండా నివారించడానికి ఏమి చేయాలో తెలుసుకుందాం.. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/10/mobile-charging-2.jpg</image:loc><image:caption><![CDATA[ మీ స్మార్ట్‌ఫోన్‌ను ఛార్జ్ చేస్తున్నప్పుడు గేమ్స్ ఆడటం, ఆన్‌లైన్‌లో వీడియోలు చూడటం, సోషల్ మీడియాను ఉపయోగించడం, ఆడియో, వీడియో కాల్స్ చేయడం వంటివి మీ స్మార్ట్‌ఫోన్ బ్యాటరీ సామర్థ్యంపై తీవ్ర ప్రభావం చూపుతాయి. అందువల్ల ఇలాంటి కార్యకలాపాలకు దూరంగా ఉండటం ఉత్తమం. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/10/mobile-charging-3.jpg</image:loc><image:caption><![CDATA[ మీ స్మార్ట్‌ఫోన్‌ను మంచం, సోఫా, పరుపు లేదా దిండు కింద పెట్టి ఛార్జ్ చేయడం వెంటనే ఆపివేయాలి. ఎందుకంటే ఈ విధంగా ఛార్జ్ చేయడం వల్ల స్మార్ట్‌ఫోన్ వేడిని గ్రహిస్తుంది. దీనివల్ల స్మార్ట్‌ఫోన్ ఉష్ణోగ్రత పెరిగి, బ్యాటరీ సామర్థ్యం తీవ్రంగా ప్రభావితం కావచ్చు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/10/mobile-charging-4.jpg</image:loc><image:caption><![CDATA[ సాధారణంగా మొబైల్ ఫోన్‌ను ఛార్జ్ చేస్తున్నప్పుడు స్మార్ట్‌ఫోన్ వేడెక్కుతుంది. ఫోన్ కింద పడినప్పుడు పగిలిపోకుండా ఉండేందుకు చాలా మంది మందపాటి బ్యాక్ కేస్‌లను ఉపయోగిస్తారు. అటువంటి బ్యాక్ కేస్‌లను ఉపయోగించడం వల్ల వేడి బయటకు పోకుండా ఉంటుంది. బ్యాక్ కేస్‌ను తీసివేసి ఛార్జ్ చేయడానికి ప్రయత్నించండి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/10/mobile-charging-5.jpg</image:loc><image:caption><![CDATA[ మీరు మీ మొబైల్ ఫోన్‌కు అనుకూలమైన ఛార్జర్‌లను మాత్రమే ఉపయోగించాలి. కేవలం చౌకగా ఉన్నాయని తక్కువ నాణ్యత గల ఛార్జర్‌లను కొని వాడటం సమస్యలను సృష్టించవచ్చు. ఎందుకంటే అటువంటి ఛార్జర్‌లలో సరైన వోల్టేజ్ నియంత్రణలు ఉండవు. అందువల్ల అటువంటి చర్యలను నివారించాలి. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/tirumala-marichi-annam-recipe-lord-venkateswara-shayana-bhogam-pepper-rice-prasadam-1936936.html</loc><lastmod>2026-10-17T20:29:07+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/10/marichi-annam-6.jpg</image:loc>
					<image:title><![CDATA[ Marichi Annam (6) ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/10/marichi-annam-1.jpg</image:loc><image:caption><![CDATA[ కావలసిన పదార్థాలు: పావు కిలో బియ్యం, నీళ్లు, 20 గ్రాముల ఉప్పు, 2 టేబుల్ స్పూన్ల నల్ల మిరియాలు, ⅓ కప్పు స్వచ్ఛమైన ఆవు నెయ్యి, అర టీస్పూన్ ఇంగువ. తయారీ విధానం: పావు కిలో  బియ్యాన్ని శుభ్రంగా కడిగి కనీసం ఒక గంట పాటు నీటిలో నానబెట్టాలి. బియ్యం ఎంత బాగా నానితే అన్నం అంత మెత్తగా, గుజ్జుగా ఉడుకుతుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/10/marichi-annam-2.jpg</image:loc><image:caption><![CDATA[ గంట నానిన బియ్యాన్ని కుక్కర్‌లో వేయాలి. బియ్యానికి నాలుగు రెట్లు (1 లీటర్) నీరు మరియు 20 గ్రాముల ఉప్పు వేసి కలపాలి. కుక్కర్ మూతపెట్టి మీడియం మంటపై 5 విజిల్స్ వచ్చే వరకు అన్నాన్ని చాలా మెత్తగా ఉడికించాలి. ఆవిరి పోయిన తర్వాత మూత తీసి గరిటెతో అన్నాన్ని మెదుపుతూ మెతుకు నలిగేలా కలపాలి. ఇప్పుడు కుక్కర్‌లో ఉడుకుతున్న ఈ ముద్ద అన్నంలోకి మరో అర లీటర్ మరిగే వేడి నీటిని పోసి గరిటెతో బాగా కలిపి పలుచగా, మృదువైన జారుడు ముద్దలా చేసుకోవాలి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/10/marichi-annam-3.jpg</image:loc><image:caption><![CDATA[ రోట్లో 2 టేబుల్ స్పూన్ల నాణ్యమైన నల్ల మిరియాలను వేసి మరీ మెత్తటి పౌడర్‌లా కాకుండా కచ్చాపచ్చాగా బరకగా దంచి పక్కన పెట్టుకోవాలి.తిరుమల ఆలయ స్ట్రాంగ్ మిరియాల ఘాటు ప్రకారం అయితే 8.5 గ్రాములు సరిపోతుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/10/marichi-annam-4.jpg</image:loc><image:caption><![CDATA[ స్టవ్‌పై మూకుడు పెట్టి ⅓ కప్పు స్వచ్ఛమైన ఆవు నెయ్యిని వేడిచేయాలి. నెయ్యి బాగా వేడెక్కిన తర్వాత అర టీస్పూన్ ఇంగువ వేయాలి. ఇంగువ నెయ్యిలో ఒక్కసారి పొంగగానే వెంటనే స్టవ్ ఆపేయాలి. స్టవ్ ఆపకపోతే ఇంగువ మాడిపోతుంది. స్టవ్ ఆపిన వెంటనే.. దంచి పెట్టుకున్న మిరియాల పొడిని ఆ వేడి నెయ్యిలో వేసి కలపాలి; ఆ వేడి నెయ్యికే మిరియాలు చక్కగా వేగి కమ్మటి సువాసన వస్తుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/10/marichi-annam-5.jpg</image:loc><image:caption><![CDATA[ ఈ గుమగుమలాడే మిరియాల ఇంగువ నెయ్యిని వేడివేడిగా ఉన్న ముద్ద అన్నంలో పోసి గరిటెతో అన్నం అంతటా సమంగా కలిసేలా బాగా మిక్స్ చేయాలి. అంతే, సాక్షాత్తూ తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారికి నివేదించే పవిత్ర &#039;మరీచి అన్నం&#039; ప్రసాదం సిద్ధం! మిరియాల ఘాటు ఎక్కువగా ఉండటం వల్ల ఈ ప్రసాదాన్ని పిడికెడు పరిమాణంలో తింటేనే శరీరానికి ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/high-protein-soya-pulao-recipe-30-minute-meal-maker-pulao-in-cooker-for-lunch-box-1936909.html</loc><lastmod>2026-10-17T20:25:37+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/10/meal-maker-pulao-6.jpg</image:loc>
					<image:title><![CDATA[ Meal Maker Pulao (6) ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/10/meal-maker-pulao-1.jpg</image:loc><image:caption><![CDATA[ కావలసిన పదార్థాలు: 2 గ్లాసుల బాస్మతి బియ్యం,  1 గ్లాసు సోయా చంక్స్, 3 గ్లాసుల నీళ్లు, 2 చిన్న బంగాళాదుంపలు, 1 పెద్ద క్యారెట్, 5 నుండి 6 ఫ్రెంచ్ బీన్స్, 2 చిన్న టమాటాలు, పావు కప్పు పచ్చి బఠానీలు, పావు కప్పు జీడిపప్పు పలుకులు, 1 టీస్పూన్ జీలకర్ర, హోల్ గరం మసాలా దినుసులు, 2 రెమ్మల కరివేపాకు, వంట నూనె, 2 టీస్పూన్ల ధనియాలు, 2 అంగుళాల అల్లం ముక్క, 2 టేబుల్ స్పూన్ల వెల్లుల్లి రెబ్బలు, 10 నుండి 12 పచ్చిమిరపకాయలు, 1 కప్పు తాజా పుదీనా ఆకులు, 1 కప్పు నిండుగా తాజా కొత్తిమీర, 1 టీస్పూన్ సోంపు గింజలు, అర చెక్క నిమ్మరసం, 2  ముక్కలుగా తరిగిన చిన్న ఉల్లిపాయలు ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/10/meal-maker-pulao-2.jpg</image:loc><image:caption><![CDATA[ తయారీ విధానం: రెండు గ్లాసుల బాస్మతి బియ్యాన్ని శుభ్రంగా కడిగి 15 నిమిషాలు నీటిలో నానబెట్టుకోవాలి. ఒక గ్లాసు మిల్మేకర్‌ను సాధారణ చల్లటి నీళ్లలో చేత్తో రుద్దుతూ కడగాలి. మళ్లీ నీళ్లు పోసి కేవలం రెండు నిమిషాలు మాత్రమే ఉంచి.. చేత్తో నీటిని గట్టిగా పిండేసి గిన్నెలోకి తీసుకోవాలి. వేడినీళ్లు పోయకూడదు, వేడినీళ్లలో వేస్తే మిల్మేకర్ మెత్తబడి చప్పబడిపోతుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/10/meal-maker-pulao-3.jpg</image:loc><image:caption><![CDATA[ మిక్సీ జార్‌లో 2 టీస్పూన్ల ధనియాలు, 2 అంగుళాల అల్లం ముక్క, 2 టేబుల్ స్పూన్ల వెల్లుల్లి, 10-12 పచ్చిమిర్చి, 1 కప్పు పుదీనా, 1 కప్పు కొత్తిమీర, 1 టీస్పూన్ సోంపు, అర చెక్క నిమ్మరసం మరియు 2 ఉల్లిపాయ ముక్కలు వేసి కొద్దిగా నీటితో మెత్తని పేస్ట్‌లా గ్రైండ్ చేసి పక్కన ఉంచాలి. మరో బర్నర్‌పై 3 గ్లాసుల నీటిని మరిగించుకోవాలి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/10/meal-maker-pulao-4.jpg</image:loc><image:caption><![CDATA[ స్టవ్‌పై కుక్కర్ పెట్టి 4-5 టేబుల్ స్పూన్ల నూనె, 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేడిచేయాలి. జీలకర్ర, హోల్ గరం మసాలా దినుసులు, పావు కప్పు జీడిపప్పు వేసి దోరగా వేయించాలి. ఆ తర్వాత బంగాళాదుంపలు, క్యారెట్, బీన్స్, టమాటాలు, పచ్చి బఠానీలు, కరివేపాకు మరియు రుచికి సరిపడా ఉప్పు వేసి 2 నిమిషాలు మగ్గించాలి. ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న గ్రీన్ పేస్ట్ వేసి నూనె పైకి తేలే వరకు మూతపెట్టి మగ్గించాలి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/10/meal-maker-pulao-5.jpg</image:loc><image:caption><![CDATA[ నూనె తేలిన తర్వాత పిండి ఉంచుకున్న మిల్మేకర్, నానబెట్టిన బాస్మతి బియ్యం వేసి మసాలా అంతా పట్టేలా లో ఫ్లేమ్‌పై 2-3 నిమిషాలు సున్నితంగా ఫ్రై చేయాలి. ఇప్పుడు పక్కన మరిగిస్తున్న 3 గ్లాసుల వేడి నీటిని పోసి ఉప్పు సరిచూసుకోవాలి. కుక్కర్ మూతపెట్టి మీడియం-హై ఫ్లేమ్‌పై కేవలం ఒక్కటంటే ఒకే విజిల్ రానిచ్చి స్టవ్ ఆఫ్ చేయాలి. ఆవిరి పూర్తిగా పోయిన తర్వాత మూత తీసి గరిటెతో కింద నుండి పైకి సున్నితంగా కలుపుకోవాలి. అంతే, అన్నం మెతుకు విరిగిపోకుండా పొడిపొడిలాడే కమ్మనైన &#039;సోయా పులావ్&#039; సిద్ధం! దీనికి ప్రత్యేకంగా వేరే కుర్మా అవసరం లేదు; చల్లటి ఉల్లిపాయ రైతాతో సర్వ్ చేసుకుంటే లంచ్ బాక్స్‌లో పిల్లలు మెతుకు కూడా మిగల్చకుండా లాగించేస్తారు! ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/quick-tomato-rice-recipe-easy-and-tasty-rice-dish-ready-in-just-5-minutes-1936907.html</loc><lastmod>2026-10-17T20:25:25+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/10/tomoto-rice-7.jpg</image:loc>
					<image:title><![CDATA[ Tomoto Rice ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/10/tomoto-rice-1-2.jpg</image:loc><image:caption><![CDATA[ ఏం కూర చేయాలో తోచనప్పుడు, ఇంకా కూరగాయలు అందుబాటులో లేనప్పుడు, కేవలం ఐదే ఐదు నిమిషాల్లో ఈ టమాటా రైస్ ఈజీగా  చేసుకోవచ్చు. తక్కువ పదార్థాలతో, తక్కువ సమయంలో తయారుచేయబడే ఈ రుచికరమైన టమాటా రైస్ పిల్లలకు లంచ్ బాక్సులకు, పెద్దలకు ఆఫీసులకూ కూడా మంచి ఎంపిక. దీనిని పెరుగు చట్నీతో లేదా నేరుగా కూడా తినొచ్చు ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/10/tomoto-rice-2-2.jpg</image:loc><image:caption><![CDATA[ ముందుగా, ఒక గ్లాసు బియ్యాన్ని శుభ్రంగా కడిగి, అన్నం వండుకోవాలి. అన్నం మెత్తగా కాకుండా, పొడిపొడిగా ఉండేలా చూసుకోవాలి. వండిన అన్నాన్ని ఒక ప్లేట్‌లో వేసి చల్లార్చాలి. అన్నం పొడిపొడిగా ఉంటేనే టమాటా రైస్ రుచిగా ఉంటుంది. స్టవ్ వెలిగించి ఒక పాన్ పెట్టి, అందులో రెండు టేబుల్ స్పూన్ల నూనె వేయాలి. నూనె వేడెక్కిన తర్వాత, అర టీ స్పూన్ ఆవాలు, అర టీ స్పూన్ మినప్పప్పు, అర టీ స్పూన్ పచ్చిశనగపప్పు, పావు టీ స్పూన్ సోంపు వేసి మంచి రంగు వచ్చేవరకు వేయించాలి. ఇక్కడ జీలకర్ర బదులుగా సోంపు వాడండి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/10/tomoto-rice-3-2.jpg</image:loc><image:caption><![CDATA[ పోపు దినుసులు వేగిన తర్వాత, సన్నగా, పొడవుగా తరిగిన ఒక మీడియం సైజు ఉల్లిపాయ, నిలువుగా చీల్చిన రెండు పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు వేసి రెండు నిమిషాలు వేయించాలి. ఉల్లిపాయ ముక్కలు సగం వేగితే సరిపోతుంది. ఇప్పుడు, ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి, పచ్చివాసన పోయేవరకు బాగా వేయించాలి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/10/tomoto-rice-4-2.jpg</image:loc><image:caption><![CDATA[ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత, పావు టీ స్పూన్ పసుపు పొడి, అర టీ స్పూన్ కారం పొడి, అర టీ స్పూన్ ధనియాల పొడి, అర టీ స్పూన్ గరం మసాలా పౌడర్ వేసి ఒకసారి కలుపుకోవాలి. మసాలాలు కలిపిన తర్వాత, తరిగిన పెద్ద టమాటాలు మూడు లేదా చిన్నవైతే నాలుగు ముక్కలుగా చేసి వేయాలి. ఇప్పుడు రైస్‌కు సరిపడా ఉప్పు కూడా వేసుకోవాలి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/10/tomoto-rice-5-1.jpg</image:loc><image:caption><![CDATA[ దీనివల్ల టమాటాలు త్వరగా మగ్గుతాయి. టమాటాలు సగం మగ్గితే సరిపోతుంది. ఈ వంటకంలో పుదీనా, బిర్యానీ ఆకు వంటివి వాడకుండానే చాలా రుచిగా ఉంటుంది. టమాటాలు మగ్గిన తర్వాత, ముందుగా వండి చల్లార్చిన అన్నాన్ని వేసి, పోపు మిశ్రమంతో బాగా కలుపుకోవాలి. అన్నం అంతా మసాలా మిశ్రమంతో కలిసిపోయేలా చూసుకోవాలి.  అన్నం బాగా కలిపిన తర్వాత, రెండు నిమిషాలు వేయించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. చివరిగా సన్నగా తరిగిన కొత్తిమీరతో వేస్తే మంచిగా ఉంటుంది. ఈ టమాటా రైస్ చాలా తక్కువ సమయంలో, అద్భుతమైన రుచితోరెడీ అవుతుంది. ఇంకా పిల్లలకు లంచ్ బాక్సులకు ఇది చాలా నచ్చుతుంది. పెరుగు చట్నీతో కానీ దీనిని నేరుగా కూడా దీనిని తినొచ్చు. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/business-photos/how-ceiling-fan-electricity-consumption-change-with-regulator-speed-know-bldc-technology-1936908.html</loc><lastmod>2026-10-17T20:12:31+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/10/ceiling-fan2-copy.jpg</image:loc>
					<image:title><![CDATA[ Ceiling Fan ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/10/ceiling-fan2.jpg</image:loc><image:caption><![CDATA[ Ceiling Fan: వేడి, తేమతో కూడిన రోజులలో ఫ్యాన్ వేగాన్ని సర్దుబాటు చేయడం ఒక రోజువారీ అలవాటు. మనకు బలమైన గాలి కావాలంటే రెగ్యులేటర్ వేగాన్ని పెంచుతాము. తేలికపాటి గాలి కోసం దానిని తగ్గిస్తాము. దీనివల్ల తరచుగా ఒక ప్రశ్న తలెత్తుతుంది. ఫ్యాన్‌ను తక్కువ వేగంతో నడపడం వల్ల విద్యుత్ బిల్లులు తగ్గుతాయా? దీనికి సమాధానం కేవలం ఫ్యాన్ వేగంపైనే కాకుండా, మోటార్, రెగ్యులేటర్ వెనుక ఉన్న సాంకేతికతపై కూడా ఆధారపడి ఉంటుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/10/ceiling-fan1.jpg</image:loc><image:caption><![CDATA[ వివిధ రకాల రెగ్యులేటర్లు విద్యుత్ వినియోగాన్ని విభిన్నంగా నియంత్రిస్తాయి. అందువల్ల, కేవలం ఫ్యాన్ వేగాన్ని తగ్గించడం సరిపోదు. మీ ఫ్యాన్ ఉపయోగించే సాంకేతికతను, వేగాన్ని మార్చడం దాని విద్యుత్ వినియోగాన్ని ఎలా ప్రభావితం చేస్తుందో అర్థం చేసుకోవడం కూడా ముఖ్యం. అందుకే మీరు రెగ్యులేటర్‌ను తిప్పినప్పుడు ఫ్యాన్ విద్యుత్ వినియోగం ఎలా మారుతుందో పరిశీలిద్దాం. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/10/ceiling-fan3.jpg</image:loc><image:caption><![CDATA[ మీరు రెగ్యులేటర్‌ను తిప్పినప్పుడు ఫ్యాన్ విద్యుత్ వినియోగం ఎలా మారుతుంది?: ఒక ఫ్యాన్ విద్యుత్ వినియోగం దాని మోటార్, రెగ్యులేటర్, ఆపరేటింగ్ వేగంపై ఆధారపడి ఉంటుంది. సాధారణంగా అధిక వేగాల వద్ద మోటార్ ఎక్కువ శక్తిని వినియోగిస్తుంది. అయితే తక్కువ వేగాల వద్ద వినియోగం తగ్గుతుంది. అయినప్పటికీ ఈ వ్యత్యాసం మోటార్, రెగ్యులేటర్ రకంపై కూడా ఆధారపడి ఉంటుంది. పాత రెగ్యులేటర్లు అదనపు విద్యుత్ శక్తిని వేడిగా వెదజల్లవచ్చు. ప్రస్తుతం వాడుకలో ఉన్న కెపాసిటివ్ రెగ్యులేటర్లు, వోల్టేజ్‌ను నియంత్రించడం ద్వారా విద్యుత్ వినియోగాన్ని తగ్గిస్తాయి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/10/ceiling-fan4.jpg</image:loc><image:caption><![CDATA[ పాత, కొత్త రెగ్యులేటర్ మధ్య తేడా ఏమిటి?: పాత రెసిస్టివ్ రెగ్యులేటర్లు అదనపు విద్యుత్ శక్తిని వేడిగా మారుస్తాయి. దీనివల్ల ఫ్యాన్ వేగాన్ని తగ్గించినప్పుడు కూడా అధిక విద్యుత్ వినియోగం జరగవచ్చు. ఉదాహరణకు, ఈ రకమైన రెగ్యులేటర్ ఉన్న 75-వాట్ల ఫ్యాన్ తక్కువ వేగంతో కూడా దాదాపు పూర్తి శక్తిని వినియోగించుకుంటుంది. కెపాసిటివ్ రెగ్యులేటర్లు విద్యుత్ వినియోగాన్ని తగ్గించడంలో మెరుగ్గా ఉంటాయి. ఈ రకమైన రెగ్యులేటర్ ఉన్న 75-వాట్ల ఫ్యాన్ మధ్యస్థ వేగంతో సుమారు 40 వాట్లు, తక్కువ వేగంతో సుమారు 20 వాట్లు వినియోగించుకోవచ్చు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/10/ceiling-fan5.jpg</image:loc><image:caption><![CDATA[ BLDC మోటార్లు ఉన్న ఫ్యాన్లు విద్యుత్‌ను ఎలా ఆదా చేస్తాయి?: ఫ్యాన్లలో ఉపయోగించే BLDC మోటార్లు మెరుగైన పవర్ కంట్రోల్‌ను అందిస్తాయి. ఎలక్ట్రానిక్ సర్క్యూట్లు కచ్చితమైన వేగ నియంత్రణను నిర్వహించడానికి సహాయపడతాయి. ఇది వోల్టేజ్ హెచ్చుతగ్గుల సమయంలో కూడా స్థిరమైన ఫ్యాన్ వేగాన్ని, గాలి ప్రవాహాన్ని నిర్ధారిస్తుంది. ఒక సాధారణ BLDC ఫ్యాన్ అధిక వేగంతో సుమారుగా 35 వాట్లు, మధ్యస్థ వేగంతో 15 వాట్లు, తక్కువ వేగంతో కేవలం 5 వాట్లను వినియోగించుకుంటుంది. అయితే ఫ్యాన్ మోడల్‌ను బట్టి వినియోగం మారవచ్చు. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/gasagasala-payasam-recipe-traditional-poppy-seeds-kheer-with-jaggery-for-sound-sleep-and-strong-bones-1936894.html</loc><lastmod>2026-10-17T20:07:52+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/10/gasagasala-payasam-6.jpg</image:loc>
					<image:title><![CDATA[ Gasagasala Payasam (6) ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/10/gasagasala-payasam-1.jpg</image:loc><image:caption><![CDATA[ కావలసిన పదార్థాలు: 50 గ్రాముల గసగసాలు, 1 కప్పు బెల్లం తురుము, 1 కప్పు నీళ్లు, 2 టేబుల్ స్పూన్ జీడిపప్పు,  5 నుండి 6 బాదం పప్పు, 1 కప్పు పచ్చి కొబ్బరి తురుము, 1 టీస్పూన్ కిస్‌మిస్ , 1 టేబుల్ స్పూన్ స్వచ్ఛమైన నెయ్యి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/10/gasagasala-payasam-2.jpg</image:loc><image:caption><![CDATA[ తయారీ విధానం: కడాయిలో 1 టేబుల్ స్పూన్ జీడిపప్పు, 5-6 బాదం పప్పులు వేసి నూనె లేకుండా లో ఫ్లేమ్‌పై లైట్‌గా రంగు మారే వరకు వేయించి గిన్నెలోకి తీసుకుని చల్లారనివ్వాలి. అదే కడాయిలో 50 గ్రాముల గసగసాలను వేయాలి. మంటను సిమ్‌లో ఉంచి గరిటెతో కలుపుతూ గసగసాలు మంచి గోల్డెన్ రంగులోకి మారేంత వరకు దోరగా వేయించి వేరొక గిన్నెలోకి తీసుకుని పూర్తిగా చల్లారనివ్వాలి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/10/gasagasala-payasam-3.jpg</image:loc><image:caption><![CDATA[ ఒక గిన్నెలో 1 కప్పు బెల్లం తురుము, 1 కప్పు నీళ్లు పోసి మీడియం మంటపై బెల్లం పూర్తిగా కరిగే వరకు మరిగించి స్టవ్ ఆఫ్ చేయాలి. పాకం రావాల్సిన అవసరం లేదు, బెల్లం కరిగితే చాలు. మిక్సీ జార్‌లో మొదట చల్లారిన గసగసాలను మాత్రమే వేసి మెత్తటి పొడిలా గ్రైండ్ చేసుకోవాలి. ముందే అన్నీ కలిపితే గసగసాలు నలగవు. ఆ తర్వాత వేయించి ఉంచుకున్న జీడిపప్పు, బాదం పప్పులను కూడా వేసి పొడిలా మిక్సీ పట్టాలి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/10/gasagasala-payasam-4.jpg</image:loc><image:caption><![CDATA[ ఇప్పుడు ఇందులోనే 1 కప్పు పచ్చి కొబ్బరి తురుము, 5 యాలకులు మరియు కొద్దిగా నీళ్లు పోసి ఎంత వీలైతే అంత మెత్తని నునుపైన పేస్ట్‌లా రుబ్బుకోవాలి. కడాయిలోకి కరిగించిన బెల్లం నీటిని జల్లెడతో వడకట్టుకోవాలి. ఇసుక, నలకలు తొలగిపోతాయి. ఇందులో గ్రైండ్ చేసిన గసగసాల కొబ్బరి పేస్ట్ వేయాలి. జార్‌ను నీళ్లతో కడిగి ఆ నీళ్లను కూడా పోస్తూ పాయసాన్ని చారు మాదిరిగా చాలా పలుచగా కలుపుకోవాలి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/10/gasagasala-payasam-5.jpg</image:loc><image:caption><![CDATA[ మంటను మీడియం ఫ్లేమ్‌లో ఉంచి గరిటెతో కలుపుతూ పైనున్న నురగ మొత్తం పోయి పాలు పొంగినట్లు రెండు పొంగులు వచ్చేంత వరకు మరిగించాలి. చిన్న పాన్‌లో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేడిచేసి 1 టీస్పూన్ జీడిపప్పు, 1 టీస్పూన్ ఎండు ద్రాక్ష వేసి ఎర్రగా వేయించాలి. ఈ తాలింపును మరుగుతున్న పాయసంలో వేసి.. పాయసం పైనున్న నెయ్యి జిడ్డు విరిగిపోయేలా మరో రెండు నిమిషాలు మీడియం మంటపై ఉడికించి స్టవ్ ఆఫ్ చేయాలి. అంతే, నోరూరించే బలవర్ధకమైన &#039;గసగసాల పాయసం&#039; సిద్ధం! దీనిని వేడివేడిగా అయినా లేదా ఫ్రిడ్జ్‌లో పెట్టి చల్లగా అయినా తాగితే అద్భుతమైన రుచితో పాటు రాత్రివేళ మనసుకు ప్రశాంతతను ఇచ్చి హాయిగా నిద్రపట్టేలా చేస్తుంది! ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/instant-crispy-rava-onion-bonda-recipe-street-style-suji-bonda-for-evening-snacks-1936884.html</loc><lastmod>2026-10-17T19:57:31+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/10/rava-onion-bonda-6.jpg</image:loc>
					<image:title><![CDATA[ Rava Onion Bonda (6) ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/10/rava-onion-bonda-1.jpg</image:loc><image:caption><![CDATA[ కావలసిన పదార్థాలు: 1¼ కప్పుల పుల్లటి పెరుగు, 1¼ టీస్పూన్ల వంట సోడా, 1¼ కప్పుల బొంబాయి రవ్వ, అర కప్పు బియ్యప్పిండి, పావు కప్పు మైదా పిండి, రుచికి సరిపడా ఉప్పు, అర టీస్పూన్ జీలకర్ర, 1 టీస్పూన్ అల్లం తరుగు, 2 సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు, 1 కప్పు పెద్ద ఉల్లిపాయ, కొద్దిగా తాజా కొత్తిమీర తరుగు, 2 రెమ్మల కరివేపాకు, సుమారుగా ముప్పావు కప్పు నీళ్లు, డీప్ ఫ్రైకి సరిపడా వంట నూనె  ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/10/rava-onion-bonda-2.jpg</image:loc><image:caption><![CDATA[ తయారీ విధానం:  ఒక మిక్సింగ్ బౌల్‌లో ఒకటింపావు కప్పుల పుల్లటి పెరుగు వేయాలి. అందులో ఒకటింపావు టీస్పూన్ల వంటసోడా వేసి విస్కర్‌తో బాగా కలపాలి; సోడా వేయగానే పెరుగు నురగలు కక్కుతూ చక్కగా పొంగుతుంది. ఇప్పుడు ఇందులో ఒకటింపావు కప్పుల బొంబాయి రవ్వ, అర కప్పు బియ్యప్పిండి, బోండా చక్కగా నిలబడటానికి పావు కప్పు మైదా పిండి వేయాలి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/10/rava-onion-bonda-3.jpg</image:loc><image:caption><![CDATA[ అదే బౌల్‌లో రుచికి సరిపడా ఉప్పు, అర టీస్పూన్ జీలకర్ర, 1 టీస్పూన్ సన్నని అల్లం తరుగు, 2 పచ్చిమిర్చి తరుగు, పెద్ద పాయలుగా తరిగిన 1 కప్పు ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర మరియు కరివేపాకు తరుగు వేయాలి. నీరు పోయకముందే చేతితో ఉల్లిపాయలను గట్టిగా పిండుతూ పిండి మొత్తాన్ని బాగా కలుపుకోవాలి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/10/rava-onion-bonda-4.jpg</image:loc><image:caption><![CDATA[ ఇప్పుడు కొద్దికొద్దిగా నీళ్లు పోస్తూ చేత్తో పిండిని పైకి ఎత్తుతూ 3 నుండి 4 నిమిషాల పాటు వేగంగా బీట్ చేయాలి. ఎంత బాగా బీట్ చేస్తే రవ్వ అంత తేలికపడి లోపల గుల్ల తేలుతుంది. ఈ పిండిని కనీసం 15 నిమిషాల పాటు నాననివ్వాలి. 15 నిమిషాల తర్వాత రవ్వ నీటిని పీల్చుకుని గట్టిపడుతుంది; అప్పుడు అవసరమైతే మరికొద్దిగా నీళ్లు చిలకరించి బోండాల పిండి కన్సిస్టెన్సీకి జారుడుగా కలుపుకోవాలి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/10/rava-onion-bonda-5.jpg</image:loc><image:caption><![CDATA[ కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడా నూనె బాగా వేడిచేయాలి. నూనె కాగిన తర్వాత మంటను మీడియం ఫ్లేమ్‌కి తగ్గించాలి. చేతిని నీళ్లలో తడి చేసుకుంటూ నిమ్మకాయ సైజు పిండి ముద్దలను తీసుకుని వేడి నూనెలో బోండాల్లా జార్చాలి. కడాయిని ఓవర్‌లోడ్ చేయకుండా 5-6 బోండాలను మాత్రమే వేయాలి. హై ఫ్లేమ్‌లో వేపితే రవ్వ వల్ల బయట వెంటనే రంగు వచ్చేసి లోపల పిండి ఉడకదు; కాబట్టి మీడియం మంటపైనే నిదానంగా కదుపుతూ ఎర్రగా, క్రిస్పీగా మారే వరకు వేయించి జాలి గరిటెతో తీసుకోవాలి. అంతే, నోరూరించే కరకరలాడే &#039;రవ్వ ఉల్లిపాయ బోండా&#039; సిద్ధం! ఘాటైన అల్లం పచ్చడి లేదా కమ్మటి టొమాటో చట్నీ నంజుకుని తింటుంటే ప్రతి ముద్దా అమృతంలా అనిపిస్తుంది! ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/black-cumin-benefits-health-benefits-nutritional-value-and-how-to-use-it-1936860.html</loc><lastmod>2026-10-17T19:51:01+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/10/kalonji.jpg</image:loc>
					<image:title><![CDATA[ Kalonji ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/10/kalonji-1.jpg</image:loc><image:caption><![CDATA[ ప్రకృతి ప్రసాదించిన అనేక ఔషధ గుణాలున్న దినుసులలో నల్ల జీలకర్ర. జీలకర్రలో సాధారణంగా మూడు రకాలు ఉంటాయని తెలియజేశారు. మనం తరచుగా తాలింపులలో వాడే సాధారణ జీలకర్ర, బిర్యానీలు వంటి రుచికరమైన వంటకాలలో ఉపయోగించే షాజీరా ,  ప్రత్యేక ఔషధ విలువలు కలిగిన నల్ల జీలకర్ర. షాజీరా ఘాటైన సువాసన కలిగి ఉండగా, నల్ల జీలకర్ర దాని సువాసన, రుచి కారణంగా డ్రెస్సింగ్‌గా ఉపయోగించడానికి చాలా ప్రసిద్ధి చెందింది. దీనిని నాన్, తందూరి రొట్టెలపై చల్లుకోవచ్చు. సలాడ్‌లు, ఫ్రూట్ సలాడ్‌లు, పాస్తా, నూడుల్స్, మొలకలు, వెజ్ సలాడ్‌లు, సాండ్‌విచ్‌లపై చల్లి తీసుకోవచ్చు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/10/kalonji-2.jpg</image:loc><image:caption><![CDATA[ జీర్ణక్రియ మెరుగుదల: ఇది జీర్ణవ్యవస్థకు అత్యంత ప్రయోజనకారి. జీర్ణరసాలను, ఎంజైమ్‌లను సమృద్ధిగా ఉత్పత్తి చేయడంలో సహాయపడుతుంది. ఇది ఆకలిని పెంచి, తిన్న ఆహారం శరీరానికి చక్కగా పట్టేలా చేస్తుంది. ఫాస్టింగ్ షుగర్ స్థాయిలు అదుపులోకి రాని వారికి నల్ల జీలకర్ర చాలా ఉపయోగపడుతుంది. సాయంత్రం పూట ఒక అర స్పూన్ లేదా స్పూన్ నల్ల జీలకర్రను తీసుకోవడం వలన ఉదయం రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయని అంటున్నారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/10/kalonji-4.jpg</image:loc><image:caption><![CDATA[ నల్ల జీలకర్రలో ఉండే లినోలిక్ ఆమ్లం తెల్ల జుట్టు రాకుండా నిరోధించడంలో సహాయపడుతుంది. దీనికి యాంటీ ఫంగల్, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉండటం వల్ల తలలో దాడి చేసే క్రిముల నుండి రక్షణ కల్పిస్తుంది. ఇది చుండ్రు, తలలో దురదలు రాకుండా కాపాడుతుంది. జుట్టు కుదుళ్ల భాగంలో రక్త ప్రసరణను పెంచి, జుట్టు ఆరోగ్యంగా, బలంగా పెరగడానికి దోహదపడుతుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/10/kalonji-5.jpg</image:loc><image:caption><![CDATA[ నరాల కణాలు సమర్థవంతంగా పని చేయడానికి, వాటి మరమ్మత్తుకు నల్ల జీలకర్ర చాలా ముఖ్యమైనది. మెదడును చురుకుగా ఉంచడంలో కీలకపాత్ర పోషించే ఫ్లేవనాయిడ్లు ఇందులో సమృద్ధిగా ఉన్నాయి. నల్ల జీలకర్రలో థైమాల్, నెగిలిసిన్, కార్వికాల్ వంటి రసాయన సమ్మేళనాలు ఉంటాయి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/10/kalonji-6.jpg</image:loc><image:caption><![CDATA[ ఇవి చర్మ కణాలను కాలుష్యం, సూర్యరశ్మి వంటి వాతావరణ ప్రభావాల నుండి రక్షించి, చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. పొడి చర్మంతో బాధపడేవారికి ఇది ప్రధానంగా చర్మాన్ని హైడ్రేట్ చేసి, డ్రైనెస్ రాకుండా కాపాడుతుంది. కాలేయానికి ఇది చాలా మంచిది. శరీరంలో పేరుకుపోయే హెవీ మెటల్స్, కొన్ని రసాయన సమ్మేళనాలను కాలేయం నుండి తొలగించడానికి నల్ల జీలకర్ర సహాయపడుతుంది. ఇది కాలేయ కణాలు దెబ్బతినకుండా రక్షించి, కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/watermelon-seeds-benefits-5-surprising-health-benefits-you-should-know-1936821.html</loc><lastmod>2026-10-17T19:13:58+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/10/watermelon-seeds2.jpg</image:loc>
					<image:title><![CDATA[ Watermelon Seeds ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/10/iron-rich-foods.jpg</image:loc><image:caption><![CDATA[ గుండె ఆరోగ్యానికి మేలు: పుచ్చకాయ విత్తనాలలో మెగ్నీషియం అధికంగా ఉంటుంది. ఇది రక్తపోటును సాధారణ స్థాయిలో ఉంచడానికి, గుండె పనితీరును మెరుగుపరచడానికి దోహదపడుతుంది. వీటిలోని యాంటీ ఆక్సిడెంట్లు, మోనో అన్‌శాచురేటెడ్ కొవ్వులు చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి గుండెపోటు ప్రమాదాన్ని నివారిస్తాయి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/10/anemia-prevention.jpg</image:loc><image:caption><![CDATA[ రోగనిరోధక శక్తి పెరుగుదల: ఈ విత్తనాలలో ఉండే జింక్ మన శరీర రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తుంది. జింక్ జీర్ణక్రియను మెరుగుపరచడంతో పాటు కణాల పునరుత్పత్తికి, ఇన్ఫెక్షన్ల నుండి శరీరాన్ని కాపాడటానికి సహాయపడుతుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/10/watermelon-seeds-benefits.jpg</image:loc><image:caption><![CDATA[ రక్తహీనత నివారణ: రక్తహీనత (అనీమియా) సమస్యతో బాధపడేవారికి పుచ్చకాయ విత్తనాలు మంచి ఔషధంలా పనిచేస్తాయి. వీటిలోని ఐరన్ కంటెంట్ ఎర్ర రక్త కణాల ఉత్పత్తిని పెంచి, శరీరమంతటా ఆక్సిజన్ సరఫరా వేగవంతమయ్యేలా చేస్తుంది. వీటిలో లభించే మెగ్నీషియం, బి-విటమిన్లు నాడీ వ్యవస్థ పనితీరును మెరుగుపరుస్తాయి. శరీరంలో శక్తి ఉత్పత్తికి, జీవక్రియల వేగాన్ని పెంచడానికి ఇవి ఎంతగానో తోడ్పడతాయి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/10/watermelon-seeds-benefits-1.jpg</image:loc><image:caption><![CDATA[ పుచ్చకాయ విత్తనాలను ఆహారంలో ఎలా తీసుకోవాలి?: పుచ్చకాయ విత్తనాలను నేరుగా తినడం కంటే, వాటిని ఎండబెట్టి, లైట్‌గా వేయించి కొద్దిగా ఉప్పు లేదా మసాలా చల్లుకుని హెల్తీ స్నాక్‌లా తీసుకోవచ్చు. అంతేకాకుండా, వీటిని పొడి చేసి సూప్‌లు, సలాడ్‌లు, పెరుగు లేదా స్మూతీస్‌పై చల్లుకుని తింటే మంచి రుచితో పాటు పూర్తి పోషకాలు లభిస్తాయి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/10/health-benefits-of-watermelon-seeds.jpg</image:loc><image:caption><![CDATA[ వారానికి కొన్నిసార్లు పుచ్చకాయ విత్తనాలను పరిమిత పరిమాణంలో మీ ఆహారంలో భాగం చేసుకోవడం ద్వారా గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవడమే కాకుండా, శరీరానికి అవసరమైన ముఖ్యమైన ఖనిజాలను సులభంగా పొందవచ్చు. ఇకపై పుచ్చకాయ తినేటప్పుడు విత్తనాలను పారేయకుండా మీ ఆరోగ్యానికి ఉపయోగించుకోండి. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/business-photos/why-does-a-cement-bag-weigh-50-kg-why-not-20-40-or-100-kg-heres-the-real-reason-1936825.html</loc><lastmod>2026-10-17T18:43:00+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/10/cement-bag4.jpg</image:loc>
					<image:title><![CDATA[ Cement Bag ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/10/cement-bag4-1.jpg</image:loc><image:caption><![CDATA[ Cement Bag: ఈ రోజుల్లో సొంతింటి కలను నెరవేర్చుకోవడం అనేది ప్రతి ఒక్కరి కల. అయితే ఇంటిని నిర్మించుకోవాలంటే పెద్ద సవాలుతో కూడుకున్నది. ఎందుకంటే గతంలో పోలిస్తే ఇప్పుడు కొత్త ఇంటిని నిర్మించుకోవాలంటే ఖర్చు తడిసిమోపెడవుతోంది. ఎందుకంటే ఐరన్‌, సిమెంట్‌, కూలీల ఖర్చులు, డోర్స్‌ ఇలా అన్నింటి ధరలు విపరీతంగా  పెరిపోయాయి. అయితే ఇంటి నిర్మాణంలో కీలక పాత్ర పోషించే మెరిటీయల్‌లో సిమెంట్‌ ఒకటి. ఇంటి బలానికి సిమెంట్‌ చాలా ముఖ్యం. మంచి నాణ్యమైన సిమెంట్‌ వాడితే పది కాలాల పాటు బలంగా ఉంటుంది. లేకుంటే ఇల్లు దెబ్బతినే ప్రమాదం ఉంటుందని నిపుణులు పదేపదే చెబుతుంటారు. అయితే ఇక్కడ అసలు విషయం ఏంటంటే.. ఇంటి నిర్మాణానికి కొనుగోలు చేసే సిమెంట్‌ బస్తా కేవలం 50 కిలోలే ఉంటుంది. ఎలాంటి ఇల్లు నిర్మించాలన్నా.. ఎన్ని బస్తాలు కావాలంటే ఈ పరిమాణంలోనే లభిస్తాయి. అయితే సిమెంట్‌ బస్తా 20, 40 లేదా 100 కిలోల బస్తాల్లో ఎందుకు విక్రయించరు? 50 కిలోల ప్యాకింగ్‌ వెనుక కారణాలు ఏంటో తెలుసుకుందాం.. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/10/cement-bag1.jpg</image:loc><image:caption><![CDATA[ సిమెంట్‌ అనేది ప్రతి నిర్మాణ రంగంలో అత్యంత ముఖ్యమైనది. ఇళ్లు, రోడ్లు, వంతెనలు, ఫ్యాక్టరీలు, అపార్ట్‌మెంట్లు వంటి ఇలాంటి ప్రతి ఒక్క నిర్మాణంలో సిమెంట్‌ కీలక పాత్ర పోషిస్తుంది. ఇలాంటి సమయంలో సిమెంట్‌ను ప్యాక్ చేసే పరిమాణం తయారీదారులకు, వినియోగదారులకు అనుకూలంగా ఉండాలి. 20 కిలోల బస్తాలు ఉపయోగిస్తే అదే మొత్తంలో సిమెంట్‌ కోసం ఎక్కువ బస్తాలు కావాల్సి ఉంటుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/10/cement-bag2.jpg</image:loc><image:caption><![CDATA[ ఇప్పుడు ఒక ఉదాహరణతో అర్థం చేసుకుందాం.. 100 కిలోల సిమెంట్‌కు 20 కిలోల బస్తాలు ఉపయోగిస్తే ఐదు బస్తాలు కావాల్సి ఉంటుంది. అదే 50 కిలోల బ్యాగులైతే  రెండు మాత్రమే సరిపోతాయి. బస్తాల సంఖ్య తగ్గడంతో ప్యాకేజింగ్‌ సామగ్రి, ప్యాకింగ్‌ ప్రక్రియ, నిల్వ, రవాణా వంటి ఖర్చులు కూడా తగ్గుతాయి. అందుకే 50 కిలోల పరిమాణం ఆర్థికంగా అనుకూలంగా మారిందని చెబుతుంటారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/10/cement-bag3.jpg</image:loc><image:caption><![CDATA[ ఇంటి నిర్మాణంలో సిమెంట్‌ బస్తాలను ఒక చోటు నుంచి మరో చోటుకు తరలించాల్సి ఉంటుంది. పై అంతస్తుకు తరలించాల్సి వచ్చినప్పుడు లిప్ట్‌ అందుబాటులో ఉండదు. అలాంటి సమయంలో ఎక్కువ బరువుతో ఉంటే కూలీలకు మోయడానికి ఇబ్బందిగా మారవచ్చు. 100 కిలోలు లేదా అంతకంటే ఎక్కువ బరువున్న బస్తాలను చేతులతో మోయడం చాలా కష్టం. దీనికి ఎక్కువగా శ్రమించాల్సి ఉంటుంది. దీని వల్ల కూలీలు మోసేందుకు ఆసక్తి చూపరు. అదే 50 కిలోల బస్తాలను మాత్రం సులభంగా మోసేందుకు ఉంటుంది. ఇలా ఎక్కువ కిలోలు ఉంటే మోయడానికి ఇబ్బంది ఉంటుంది. అలాగే తక్కువ కిలోలు ఉంటే ఎక్కువ బస్తాలు అవసరం ఉండటం, రవాణా ఖర్చు కూడా పెరగడం, ఇలా రకరకాల కారణాలు ఉంటాయి. 50 కిలోల బస్తాల వల్ల సిమెంట్‌ స్టాక్‌ను లెక్కించడం సులభంగా ఉంటుంది. 20 బస్తాలు అంటే 1,000 కిలోలు లేదా ఒక టన్ను. దీంతో కాంట్రాక్టర్లు, వ్యాపారులు, నిర్మాణ సంస్థలు తమ వద్ద ఉన్న సిమెంట్‌ నిల్వను సులభంగా నిర్వహించుకోవచ్చు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/10/cement-bag5.jpg</image:loc><image:caption><![CDATA[ అయితే ప్రపంచవ్యాప్తంగా సిమెంట్‌ బస్తా తప్పనిసరిగా 50 కిలోలే ఉండాలనే అంతర్జాతీయ నిబంధన లేదు. కొన్ని దేశాల్లో 40 కిలోల వంటి ఇతర పరిమాణాల్లోనూ సిమెంట్‌ విక్రయిస్తారు. స్థానిక మార్కెట్‌ అవసరాలు, ఖర్చులు, కార్మికుల సౌలభ్యం, ఎన్నో ఏళ్లుగా కొనసాగుతున్న వ్యాపార పద్ధతుల ఆధారంగా ప్యాకేజింగ్‌ పరిమాణాలు మారుతుంటాయి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/10/cement-bag6.jpg</image:loc><image:caption><![CDATA[ వేల టన్నుల సిమెంట్‌ అవసరమయ్యే భారీ ప్రాజెక్టుల్లో మాత్రం ప్రతి సారి 50 కిలోల బస్తాలను ఉపయోగించాల్సిన అవసరం లేదు. ఇలాంటి ప్రాజెక్టులకు సిమెంట్‌ను బల్క్‌గా ప్రత్యేక ట్యాంకర్లు, నిల్వ వ్యవస్థలు, పంపింగ్‌ పరికరాల ద్వారా సరఫరా చేస్తారు. దీంతో బస్తాలను ఎత్తడం, దించడం వంటి అదనపు శ్రమ తగ్గుతుంది. అందువల్ల 50 కిలోల సిమెంట్‌ బస్తా వెనుక ఒక్క కారణం మాత్రమే లేదు. ప్యాకేజింగ్‌ ఖర్చు, రవాణా, నిల్వ, లెక్కింపు, కార్మికుల సౌలభ్యం వంటి అనేక అంశాలను పరిగణలోకి తీసుకునే ఇలాంటి 50 కిలోల పరిమాణంలో ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/warm-mud-pack-for-knee-pain-potential-benefits-uses-and-safety-precautions-1936761.html</loc><lastmod>2026-10-17T17:29:47+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/10/banka-matti.jpg</image:loc>
					<image:title><![CDATA[ Banka Matti ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/10/banka-matti-5.jpg</image:loc><image:caption><![CDATA[ నేటి జీవనశైలిలో, నలభై ఏళ్ల వయసు నుంచే మోకాళ్ళ నొప్పుల సమస్య సర్వసాధారణమైంది. ఈ నొప్పుల నుండి ఉపశమనం పొందేందుకు చాలా మంది తరచుగా పెయిన్ కిల్లర్స్ ఉపయోగిస్తుంటారు. అయితే, ఈ మందుల నిరంతర వాడకం అనేక దుష్ప్రభావాలకు దారితీస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. పెయిన్ కిల్లర్స్ పై ఆధారపడకుండా, మోకాళ్ళ నొప్పులను సహజసిద్ధంగా, సమర్థవంతంగా తగ్గించుకోవడానికి ఒక అద్భుతమైన చిట్కా ఉంది. అదే  వేడి మట్టి ప్యాక్. ఈ వేడి మట్టి ప్యాక్ నొప్పిని తగ్గించడంలో, మోకాళ్ళ చుట్టూ ఉండే వాపును అరికట్టడంలో, కండరాలను సడలించడంలో, ఇన్ఫ్లమేషన్‌ను తగ్గించడంలో అద్భుతంగా పనిచేస్తుంది. దీనిని ఇంట్లో కూడా సులభంగా తయారుచేసి పాటించవచ్చు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/10/banka-matti-1.jpg</image:loc><image:caption><![CDATA[ ముందుగా పొలాల్లో లభించే నల్లటి మట్టిని సేకరించాలి. ఈ మట్టిలో ఎలాంటి తుక్కు, రాళ్లు లేదా గడ్డలు లేకుండా శుభ్రంగా చూసుకోవాలి. మెత్తటి మట్టిని మాత్రమే ఉపయోగించాలి. సేకరించిన మట్టిని ఒక గిన్నెలో వేసి తగినన్ని నీళ్లు పోసి నానబెట్టాలి.
నానబెట్టిన మట్టిని పొయ్యి మీద పెట్టి సుమారు 45 నుండి 50 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత వరకు వేడి చేయాలి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/10/banka-matti-2.jpg</image:loc><image:caption><![CDATA[ మన చర్మం తట్టుకోగలిగేంత వేడి ఉండేలా చూసుకోవాలి. ఎక్కువ వేడి చర్మాన్ని కాల్చవచ్చు లేదా బొబ్బలకు దారితీయవచ్చు కాబట్టి జాగ్రత్త వహించడం ముఖ్యం. మన శరీరానికి వేడి నీళ్ళు పోసుకునేటప్పుడు ఎంత వేడి తట్టుకుంటామో, మట్టి కూడా అంతే వేడికి ఉండాలి. మట్టి మరీ పల్చగా కాకుండా, మోకాలికి పట్టుకునే విధంగా గట్టిగా ఉండాలి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/10/banka-matti-4.jpg</image:loc><image:caption><![CDATA[ మట్టి ప్యాక్ వేయడానికి ముందు, నొప్పులు త్వరగా తగ్గడానికి మరొక చిట్కా ఉంది. మంచి గానుగాడించిన ఆవనూనె తీసుకుని, అందులో స్వచ్ఛమైన ముద్ద కర్పూరం  వేసి కరిగే వరకు ఉంచాలి. ఈ నూనెను మోకాళ్ళ భాగానికి, చుట్టుపక్కల ప్రాంతాలకు అప్లై చేసి సుమారు పది నిమిషాల పాటు మర్దన చేయాలి. కర్పూరం కలిసిన ఆవనూనె సహజసిద్ధంగా కండరాల సడలింపుకు, వాపు,  ఇన్ఫ్లమేషన్ తగ్గడానికి బాగా సహాయపడుతుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/10/banka-matti-6.jpg</image:loc><image:caption><![CDATA[ మర్దన చేసిన తర్వాత, వేడి చేసిన మట్టిని మోకాళ్ళకు శుభ్రంగా అప్లై చేయాలి. ఒకవేళ మట్టి కింద పడిపోతుంటే లేదా మోకాలి అడుగు భాగాన కూడా నొప్పి ఉంటే, ఎదురుగుండా ఒక స్టూల్ పై కాళ్ళు పెట్టుకుని, కింద భాగంలో కూడా మట్టిని వేయవచ్చు. మట్టి పడిపోకుండా సన్నటి గుడ్డతో మోకాళ్ళ చుట్టూ చుట్టాలి. చిన్న పిల్లలకు గోరింటాకు పెట్టినప్పుడు పడిపోకుండా గుడ్డలు కట్టిన విధంగానే దీనిని చేసుకోవచ్చు. మట్టి ప్యాక్‌ను మోకాళ్ళపై 15 నుండి 20 నిమిషాల పాటు ఉంచాలి. నల్లటి బంక మట్టి వేడిని ఎక్కువసేపు నిలుపుకుని, దానిలోని సహజ లక్షణాలతో నొప్పి నివారణిగా పనిచేస్తుంది. మోకాళ్ళ నొప్పులు ఎక్కువగా ఉన్నవారు రోజుకు రెండుసార్లు చేసుకోవచ్చు. ఉదయం పూట పనుల మధ్యలో కానీ ఇంకా  సాయంకాలం పని నుంచి వచ్చాక, పడుకునే ముందు ఈ వేడి మట్టి ప్యాక్ ను పెట్టుకుంటే మంచి ఉపశమనం లభిస్తుంది. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/cricket-photos/4-indian-cricketers-careers-over-bcci-snubs-retirement-after-ind-vs-nz-squad-announced-1936674.html</loc><lastmod>2026-10-17T17:15:03+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/10/team-india-squad.jpg</image:loc>
					<image:title><![CDATA[ Team India Squad ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/10/ind-vs-nz-sqaud.jpg</image:loc><image:caption><![CDATA[ భారత జట్టు (Team India) న్యూజిలాండ్ పర్యటన అక్టోబర్ 22 నుంచి డిసెంబర్ 1 వరకు జరగనుంది. ఈ పర్యటనలో భాగంగా మూడు ఫార్మాట్ల సిరీస్ కోసం బీసీసీఐ (BCCI) తొలుత టీ20 జట్టును ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా శుక్రవారం నాడు వన్డే, టెస్టు జట్లను కూడా ప్రకటించింది. ఈ జట్లలో పలువురు ఆటగాళ్లకు తిరిగి చోటు దక్కగా, అంతర్జాతీయ క్రికెట్‌లో పెద్దగా అనుభవం లేని కొందరికి కూడా అవకాశం లభించింది. కొత్త ఆటగాడిగా కుమార్ కుశాగ్రకు పిలుపు రావడం విశేషం. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/10/ind-vs-nz-players.jpg</image:loc><image:caption><![CDATA[ ఈ పర్యటనలో జరగనున్న 12 మ్యాచ్‌ల కోసం ఆటగాళ్ల ఎంపికతో భవిష్యత్తులో టీమిండియాకు ప్రాతినిధ్యం వహించే అవకాశమున్న ఆటగాళ్లు ఎవరో కొంత స్పష్టత వచ్చింది. అదే సమయంలో, భారత జట్టులో కొందరి కెరీర్‌కు దాదాపుగా ముగింపు పడినట్లేననే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలకడం తప్ప మరో మార్గం లేని నలుగురు ఆటగాళ్ల గురించి తెలుసుకుందాం. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/10/mohammed-shami-3.jpg</image:loc><image:caption><![CDATA[ 1. మహమ్మద్ షమీ: 2023 వన్డే ప్రపంచకప్‌లో అత్యధిక వికెట్లు తీసిన మహమ్మద్ షమీకి ఆ టోర్నీ తర్వాత అంతర్జాతీయ కెరీర్ ఆశించిన స్థాయిలో సాగలేదు. గాయాల కారణంగా చాలా కాలం ఆటకు దూరమైన ఆయన, 2025 ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత భారత జట్టులో చోటు కోల్పోయాడు. న్యూజిలాండ్ పర్యటనతో షమీ తిరిగి జట్టులోకి వస్తారని అంచనాలు ఉన్నప్పటికీ, ప్రగ్యాన్ ఓజా నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ ఆయనను ఎంపిక చేయలేదు. దీంతో 36 ఏళ్ల షమీ అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించే అవకాశం ఉందనే చర్చ మొదలైంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/10/ishant-sharma.jpg</image:loc><image:caption><![CDATA[ 2. ఇషాంత్ శర్మ: అనుభవజ్ఞుడైన ఫాస్ట్ బౌలర్ ఇషాంత్ శర్మ చాలా ఏళ్లుగా టీమిండియాకు దూరంగా ఉన్నాడు. రాహుల్ ద్రవిడ్ కోచ్‌గా ఉన్న సమయంలోనే ఆయన జట్టులో చోటు కోల్పోయాడు. అయినప్పటికీ ఇప్పటివరకు అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలకలేదు. న్యూజిలాండ్ పర్యటన కోసం యువ ఫాస్ట్ బౌలర్లను ఎంపిక చేయడంతో 38 ఏళ్ల ఇషాంత్ తిరిగి భారత జట్టులోకి వచ్చే అవకాశాలు దాదాపుగా లేవని స్పష్టమవుతోంది. ఈ పరిస్థితుల్లో ఆయన అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించే అవకాశం ఉందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/10/jaydev-unadkat.jpg</image:loc><image:caption><![CDATA[ 3. జయదేవ్ ఉనద్కట్: 34 ఏళ్ల జయదేవ్ ఉనద్కట్ అంతర్జాతీయ కెరీర్ కూడా ముగిసినట్లేననే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 2010లో దక్షిణాఫ్రికా పర్యటనలో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేసిన ఆయన, 16 ఏళ్లలో కేవలం 22 మ్యాచ్‌లే ఆడాడు. 2023లో టీమిండియా తరపున చివరిసారిగా బరిలోకి దిగాడు. అప్పటి నుంచి సౌరాష్ట్రకు చెందిన ఈ సీనియర్ బౌలర్‌కు మళ్లీ జాతీయ జట్టులో అవకాశం రాలేదు. న్యూజిలాండ్ పరిస్థితులు ఉనద్కట్ బౌలింగ్‌కు అనుకూలంగా ఉండే అవకాశం ఉన్నప్పటికీ, సెలక్టర్లు ఆయనకు బదులుగా యువ ఆటగాళ్లపై నమ్మకం ఉంచారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/10/saransh-subodh-jain.jpg</image:loc><image:caption><![CDATA[ 4. సారాంశ్ జైన్: ఆఫ్ స్పిన్ ఆల్‌రౌండర్ సారాంశ్ జైన్‌ను శ్రీలంకతో జరిగిన టెస్టు సిరీస్ కోసం టీమిండియాకు ఎంపిక చేశారు. రెండో టెస్టులో ఆడిన ఆయన పెద్దగా ప్రభావం చూపలేకపోయాడు. దీంతో భవిష్యత్తులో భారత జట్టులో ఆయనకు అవకాశాలు దక్కడం కష్టమేననే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. తాజాగా న్యూజిలాండ్ పర్యటనకు ప్రకటించిన జట్లలో కూడా సారాంశ్‌కు చోటు దక్కలేదు. వాషింగ్టన్ సుందర్ జట్టులో ఉన్న నేపథ్యంలో సారాంశ్‌కు భవిష్యత్తులో అవకాశాలు లభించే అవకాశాలు తక్కువగా కనిపిస్తున్నాయి. ఈ పరిణామాలను బట్టి చూస్తే, ఆయన అంతర్జాతీయ క్రికెట్‌లో ఇప్పటికే చివరి మ్యాచ్ ఆడేశాడనే చర్చ జరుగుతోంది. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/horse-gram-benefits-protein-nutrition-and-health-benefits-of-this-traditional-superfood-1936655.html</loc><lastmod>2026-10-17T17:08:33+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/10/ulavalu-1.jpg</image:loc>
					<image:title><![CDATA[ Ulavalu 1 ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/10/ulavalu.jpg</image:loc><image:caption><![CDATA[ ఇవి శరీరానికి ఎంతో  బలం, కానీ చాలా మంది వీటిని దూరం పెడతారు. నిజం చెప్పాలంటే దీనిలో ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయి. 
మాంసం, గుడ్లు కంటే కూడా దీనిలో అధిక పోషకాలు ఉంటాయి. చాలా తక్కువ ధరకే ఇవి మనకి మార్కెట్లో దొరుకుతాయి. ఇంకా ఇది  కొన్ని కంటే  బలం అని చెప్పొచ్చు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/10/ulavalu-2.jpg</image:loc><image:caption><![CDATA[ అవి ఏవో కావు ఉలవలు. ఇంకా ఇవి బలాన్ని కూడా పెంచుతాయి. ఇంకా ఎముకలు, కండరాలను కూడా  ఉక్కులా మారుస్తాయి. ఇంకా ఇవి మాంసానికి మించిన బలాన్ని ఇస్తాయి. మాంసం కంటే వీటిలోనే  ఎక్కువ పోషకాలు ఉంటాయి. ఇంకా మాంసం తినని వారికి ఉలవలు మంచి ఆహారం అని చెప్పొచ్చు. ఉలవల్లో  కాల్షియం, ప్రొటీన్, ఐరన్ వంటివి మంచిగా ఉండటం వలన చురుకుగా ఉంటారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/10/ulavalu-3.jpg</image:loc><image:caption><![CDATA[ ఇంకా చెప్పాలంటే ఇవి తింటే రక్తహీనత సమస్య కూడా తగ్గుతుంది. వీరు వీటిని ఆహారంలో తీసుకుంటే ఆ సమస్య నుంచి ఉపశమనం పొందుతారు. ఉలవల్లో కార్బోహైడ్రేట్లు తక్కువగాను ప్రొటీన్లు, ఫైబర్ ఎక్కువగా ఉండటం వలన అధిక బరువు నుంచి బయట పడొచ్చు. కాబట్టి, మీరు వీటిని ఫుడ్ డైట్ లో చేర్చుకోవచ్చు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/10/ulavalu-4.jpg</image:loc><image:caption><![CDATA[ అయితే,  ఒక కప్పు ఉలవలను తీసుకుని వాటిని బాగా ఉడికించిన  ప్రతిరోజూ ఉదయం తీసుకుంటే చాలా మంచిది. అయితే, ఇది ఖాళీ కడుపుతో తీసుకుంటే దీనిలో చిటికెడు ఉప్పు తీసుకుంటూ ఉంటే మంచిది. అంతేకాదు, మీ శరీరంలో అదనంగా పెరుకుపోయిన కొవ్వును కూడా ఇది కరిగిస్తుంది. అంతేకాదు, ఉలవలు తింటే బాడీలో కొవ్వు అస్సలు చేరదు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/10/ulavalu-5.jpg</image:loc><image:caption><![CDATA[ (నోట్ : ఇక్కడ రాసిన సమాచారం ఇంటర్నెట్ నుంచి తీసుకోబడింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది) ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/business-photos/what-happens-if-you-fail-to-pay-installments-or-emi-for-gold-loan-1936673.html</loc><lastmod>2026-10-17T16:35:22+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/10/gold-loan4.jpg</image:loc>
					<image:title><![CDATA[ Gold Loan ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/10/gold-loan4-1.jpg</image:loc><image:caption><![CDATA[ Gold Loan: మీరు బంగారు ఆభరణాలపై రుణం తీసుకుని, ఏదైనా కారణం చేత ఈఎంఐలు చెల్లించలేకపోతే, ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. కేవలం ఒక ఈఎంఐ చెల్లించనంత మాత్రాన, బ్యాంకు లేదా ఫైనాన్స్ కంపెనీ మీ ఆభరణాలను వెంటనే వేలం వేయదు. అయితే, చెల్లింపులు కొనసాగితే, బకాయి మొత్తం పెరిగి, రుణ వసూలు చర్యలు ప్రారంభం కావచ్చు. ఆభరణాలను వేలం వేస్తారా లేదా అనేది మీ రుణ ఒప్పందం, బకాయి కాలపరిమితి, రుణ సంస్థ విధానాలపై ఆధారపడి ఉంటుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/10/gold-loan1.jpg</image:loc><image:caption><![CDATA[ మీ ఆభరణాలకు ప్రమాదం వాటిల్లడానికి ఎన్ని EMIలు చెల్లించకూడదు?: రెండు, మూడు, లేదా ఆరు ఈఎంఐలు చెల్లించనప్పుడు తాకట్టు పెట్టిన బంగారాన్ని వేలం వేయాలనే ఏకరీతి నియమాన్ని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) నిర్దేశించలేదని నిపుణులు అంటున్నారు. ఒక చెల్లింపు 90 రోజుల కంటే ఎక్కువ కాలం ఆలస్యమైతే, ఆ రుణ ఖాతాను సాధారణంగా ఎన్‌పిఎ (నిరర్థక ఆస్తి)గా వర్గీకరించవచ్చు. ఇది రుణ వసూలు ప్రక్రియలను తీవ్రతరం చేసి, వేలం ప్రమాదాన్ని పెంచుతుంది. బకాయి ఉన్న కాలాన్ని అత్యంత పాత బకాయి వాయిదా నుండి లెక్కించవచ్చని గుర్తుంచుకోండి. ఉదాహరణకు, జూన్ ఈఎంఐ చెల్లించకుండా, జూలై, ఆగస్టు వాయిదాలు చెల్లిస్తే, జూన్ వాయిదా బకాయిలు రద్దు కావు. అందువల్ల, ముందుగా అత్యంత పాత బకాయి వాయిదాను చెల్లించడంపై దృష్టి పెట్టాలి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/10/gold-loan2.jpg</image:loc><image:caption><![CDATA[ బంగారు రుణ వసూలు ప్రక్రియ ఎలా పనిచేస్తుంది?: రుణం ఈఎంఐ చెల్లించడంలో విఫలమైన తర్వాత బ్యాంకు లేదా ఫైనాన్స్ కంపెనీ సాధారణంగా అనేక దశలలో వసూలు చర్యలను ప్రారంభిస్తుంది. అయితే, ప్రతి బ్యాంకుకు రోజువారీ గడువులు ఒకేలా ఉండవు. మొదటి 1 నుండి 30 రోజులలోపు, బ్యాంకు ఫోన్, SMS లేదా యాప్ ద్వారా చెల్లింపు రిమైండర్‌ను పంపవచ్చు. ఒప్పందాన్ని బట్టి, జరిమానాలు లేదా అదనపు ఛార్జీలు కూడా వర్తించవచ్చు. సుమారు 30 నుండి 90 రోజులలో బకాయి ఉన్న మొత్తాన్ని తిరిగి చెల్లించమని బ్యాంకు రాతపూర్వక రిమైండర్ లేదా నోటీసును పంపవచ్చు. 90 రోజులు లేదా అంతకంటే ఎక్కువ కాలం తర్వాత, ఖాతా నిరర్థక ఆస్తి (NPA)గా మారవచ్చు. వసూలు చర్యలు తీవ్రతరం చేయవచ్చు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/10/gold-loan3.jpg</image:loc><image:caption><![CDATA[ వేలానికి ముందు ఏమి జరుగుతుంది?: వేలానికి ముందు రుణదాత వేలం వేస్తున్న ఆభరణాల గురించి హెచ్చరిక, అవసరమైన నోటీసును అందించవచ్చు. నోటీసు వ్యవధి సంబంధిత ఒప్పందం, వర్తించే నిబంధనలపై ఆధారపడి ఉంటుంది. వేలం తర్వాత వచ్చిన ఆదాయాన్ని రుణాన్ని, వర్తించే ఏవైనా రుసుములను తిరిగి చెల్లించడానికి ఉపయోగిస్తారు. మిగిలిన బ్యాలెన్స్‌ను నిబంధనలు, షరతుల ప్రకారం కస్టమర్‌కు తిరిగి చెల్లించాలి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/10/gold-loan5.jpg</image:loc><image:caption><![CDATA[ వేలంపాటకు ముందే నగలను తిరిగి పొందవచ్చా?: నిపుణుల అభిప్రాయం ప్రకారం, తాకట్టు పెట్టిన ఆభరణాల అమ్మకం పారదర్శకమైన వేలం ప్రక్రియ ద్వారా జరగాలి. రుణదాత నిర్ధారిత పద్ధతులను విస్మరించి, ఆభరణాలను ఇష్టానుసారంగా అమ్మకూడదు. వేలం పూర్తికాకముందే వినియోగదారుడు బకాయి మొత్తాన్ని, వర్తించే రుసుములను చెల్లిస్తే, వారు తమ ఆభరణాలను తిరిగి పొందవచ్చు. కానీ వేలం పూర్తయిన తర్వాత ఆభరణాలను తిరిగి పొందే వారి హక్కు ముగిసిపోవచ్చు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/10/gold-loan6.jpg</image:loc><image:caption><![CDATA[ బంగారు రుణం ఈఎంఐ చెల్లించనంత మాత్రాన, తాకట్టు పెట్టిన ఆభరణాలను వెంటనే వేలం వేయరు. వేలం వేసే ప్రమాదం రుణ ఒప్పందం, బకాయి ఉన్న కాలం, రుణదాత విధానంపై ఆధారపడి ఉంటుంది. 90 రోజులకు మించి చెల్లింపులు ఆలస్యమైతే, ఆ ఖాతా నిరర్థక ఆస్తిగా (NPA) మారవచ్చు. ఇది రికవరీ చర్యలకు దారితీస్తుంది. వేలానికి ముందు రుణదాత తన నిర్దేశిత నోటీసు ప్రక్రియను తప్పనిసరిగా పాటించాలి. వినియోగదారుడు బకాయి ఉన్న మొత్తం, వర్తించే రుసుములను చెల్లించడం ద్వారా వేలం పూర్తికాకముందే ఆభరణాలను విడిపించుకోవచ్చు. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/warangal-bhadrakali-temple-telanganas-grand-30-foot-wooden-chariot-and-its-unique-features-1936695.html</loc><lastmod>2026-10-17T16:32:19+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/10/temple-1-3.jpg</image:loc>
					<image:title><![CDATA[ Temple 1 ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/10/temple-8.jpg</image:loc><image:caption><![CDATA[ తెలంగాణ రాష్ట్రంలోనే అతిపెద్ద రథం.. ఊరంతా ఏకమయ్యే ఉత్సవం. భద్రకాళి అమ్మవారికి అపురూప కీర్తి మకుటం సాంప్రదాయ శిల్పకళతో తయారుచేసిన భారీ రథం రెడీ అయ్యింది. మూల నక్షత్రం రోజున మహా వైభవంగా మొట్టమొదట రథాన్ని ప్రారంభించి ఇకపై మాడవీధుల్లో రాతోత్సవాలకు సర్వం సిద్ధం చేస్తున్నారు..30 ఫీట్ల ఎత్తుతో రూపుదిద్దుకున్న హ్యాండ్ మేడ్ రథం ప్రత్యేకతలు ఏంటి..! కలపలో కళ.. రథంలో భక్తి భావం. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/10/temple-2-3.jpg</image:loc><image:caption><![CDATA[ తెలంగాణ రాష్ట్రంలోని చాలా దేవాలయాలు కొత్తరూపు దిద్దుకుంటున్నాయి..మాడవీధుల నిర్మాణం ద్వారా ఆధ్యాత్మిక శోభ వెల్లివిరియనుంది.. అయితే రాష్ట్రంలోనే మొట్ట మొదట భారీరథం వరంగల్ లోని శ్రీ భద్రకాళి అమ్మవారి ఆలయంలో రూపుదిద్దుకుంది.. స్థానిక ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి ఆయన స్నేహితులు, MLC పోచంపల్లి శ్రీనివాసరెడ్డి ఇతర దాతలు అంతా కలిసి కోటి రూపాయల విరాళంతో అమ్మవారికి రథం కానుకగా సమర్పించారు.. ఈ భారీ రథాన్ని తెలంగాణ రాష్ట్ర ఐటీ మినిస్టర్ దుద్దిళ్ల శ్రీధర్ బాబు, MLA నాయిని రాజేందర్ రెడ్డి దంపతుల చేతుల మీదుగా ప్రారంభించారు . ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/10/temple-3-2.jpg</image:loc><image:caption><![CDATA[ భద్రకాళి అమ్మవారి ఆలయ చరిత్రలో అద్భుత ఘట్టం ఆవిష్కృతం అయింది..ఒక రతం మీద శాశ్వత సేవలు నిర్వహించనున్నారు..ఈ రథం ప్రత్యేకతలు ఏంటి..! మాడవీధుల్లో ఎప్పటినుండే రథోత్సవాలు ప్రారంభం కానున్నాయి..! అని భక్తజనమంతా  ఉత్కంఠగా.. భక్తిభావంతో ఎదురు చూస్తున్నారు. బహుశా తెలంగాణ రాష్ట్రంలోనే అతిపెద్ద రథం భద్రకాళి అమ్మవారి ఆలయానికి మాత్రమే స్వంతం..27 పిట్ల ఎత్తుతో రథం.. పైన మూడు ఫీట్లు ఎత్తు కలశంతో కలిపి మొత్తం 30 ఫీట్ తో భారీ రతం సిద్ధమయ్యింది..మూలా నక్షత్రం కలిసి రావడంతో మంత్రి చేతుల మీదుగా ఈ రోజు రథాన్ని ప్రారంభించి ఉత్సవాలకు అంకితం చేశారు..  ఆలయ ప్రాంగణంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/10/temple-4-3.jpg</image:loc><image:caption><![CDATA[ దైవ సంకల్పం ఉంటే దారిలోని అడ్డంకులన్నీ తొలగి పోతాయన్నట్లు.. స్తానిక MLA నాయిని రాజేందర్ రెడ్డి, MLC పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి దాతల కోటి రూపాయల విరాళాలతో ఈ రతాన్ని తయారు చేయించారు. మధుర మీనాక్షి ఆలయం తరహాలో ఇక్కడ భద్రకాళి అమ్మవారి ఆలయంలో పూర్తిగా టేకు, నార వేప కలపతో ఈ భారీ రతాన్ని తయారు చేశారు. కన్యాకుమారికి చెందిన స్థపతి మహారాజ్ బృందం ఎనిమిది నెలలపాటు శ్రమించి ఈ రథానికి జీవం పోశారు. రథం తయారీలో మొత్తం 25 టన్నులు టేకు, 15 టన్నుల నార వేప కలప ఉపయోగించారు. ఈ రథం 28 - నుండి 30 టన్నుల బరువు ఉంటుంది.. రథం అధిష్టానం చుట్టూ అబ్బుర పరిచే శిల్పాలు చెక్కారు.. ఏనుగులు, గుర్రాలు, హంసల వరుస అబ్బుర పరుస్తాయి.. సప్త మాతృకలు, కాకతీయ తోరణాలు, సింహాలు ద్వారకన్యలు, లక్ష్మీదేవి, నాగబంధం, శిఖర కలశం వంటి శిల్పాల రూపకల్పన ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/10/temple-5-3.jpg</image:loc><image:caption><![CDATA[ రథం దృష్టశక్తులు పడకుండా అష్టదిక్కుల నాగబంధనంతో ఈ రథాన్ని శిల్ప శాస్త్ర ప్రకారం తయారు చేశారు.. ఈ రథాన్ని చేతులతో లాగేందుకు 26 ఫీట్ల పొడవైన కొబ్బరితాడును ప్రత్యేకంగా యానంలో తయారు చేయించారు. ఇకపై మాడ వీధుల్లో రథయాత్ర నిర్వహించనున్నారు.. ఈ వేడుక తెలంగాణ రాష్ట్రంలో భద్రకాళి అమ్మవారి ఆలయంలో మాత్రమే నిర్వహించే మొట్టమొదటి రథోత్సవంగా నిలవనుంది.. ఈ రథం పూర్తిగా ఇక్కడే చేతివృత్తి ద్వారా రూపుదిద్దారు. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/curry-leaves-powder-benefits-nutrition-eye-health-benefits-and-easy-ways-to-use-it-1936662.html</loc><lastmod>2026-10-17T16:07:43+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/10/karivepaku-2.jpg</image:loc>
					<image:title><![CDATA[ Karivepaku 2 ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/10/karivepaku-1.jpg</image:loc><image:caption><![CDATA[ కంటి చూపు తగ్గడానికి ప్రధాన కారణమని అంటున్నారు. ఉడికిన ఆహారాలు ఎక్కువగా తీసుకోవడం వల్ల కంటికి అవసరమైన పోషకాలు అందడం లేదని, నిద్ర తగ్గడం, కంప్యూటర్లు, సెల్ ఫోన్లు, టీవీ స్క్రీన్ల అధిక వినియోగం, చిన్న అక్షరాలను శ్రద్ధగా చదవడం, రంగులు ఎక్కువగా చూడటం వంటివి కంటిపై ఒత్తిడిని పెంచుతున్నాయని అంటున్నారు. ప్రకృతి, చెట్లు వంటి వాటిని చూడటానికి అలవాటు పడిన కళ్ళు నేడు సెల్ ఫోన్ చాటింగ్‌లు, మెసేజ్‌లు చూడటానికి ఎక్కువ సమయం కేటాయించడం వలన కళ్ళు అలసిపోతున్నాయని, ఇది కంటి చూపు మందగించడానికి దారితీస్తోందని అని నిపుణులు చెబుతున్నారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/10/karivepaku-3.jpg</image:loc><image:caption><![CDATA[ సెల్ ఫోన్లు, కంప్యూటర్లు వాడకుండా ఉండటం సాధ్యం కానప్పటికీ, కొన్ని ప్రకృతి నియమాలు పాటించడం ద్వారా కంటి ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని డాక్టర్ మంతెన సత్యనారాయణ రాజు సూచించారు. కంటికి విశ్రాంతి చాలా అవసరం. కనీసం 7-8 గంటల నిద్ర, వీలైతే 9 గంటలు నిద్రపోవడం వల్ల కళ్ళు విశ్రాంతి పొంది, వాటి పనితీరు మెరుగుపడుతుంది. నిద్ర తగ్గితే కంటి చూపు త్వరగా మసకబారుతుందని ఆయన హెచ్చరించారు. సహజ సిద్ధమైన, వండని ఆహారాలకు ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా కంటికి అవసరమైన పోషకాలు లభిస్తాయి. ముఖ్యంగా విటమిన్ ఏ కంటికి చాలా కీలకం. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/10/karivepaku-4.jpg</image:loc><image:caption><![CDATA[ మాంసాహారాల్లో విటమిన్ ఏ నేరుగా ఉన్నప్పటికీ, మొక్కల ఆధారిత ఆహారాల్లో ఇది బీటా కెరోటిన్ రూపంలో ఉంటుంది. శరీరం ఈ బీటా కెరోటిన్‌ను విటమిన్ ఏగా మారుస్తుంది. ప్రతిరోజు 2400 మైక్రోగ్రాముల బీటా కెరోటిన్ అవసరమని, ఇది సుమారు 900 మైక్రోగ్రాముల విటమిన్ ఏగా మారుతుందని ఆయన తెలిపారు. బీటా కెరోటిన్ అధికంగా ఉండే ఆకుకూరలు కంటి ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనకరమైనవి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/10/karivepaku-5.jpg</image:loc><image:caption><![CDATA[ కరివేపాకు: 7500 మైక్రోగ్రాములు, కొత్తిమీర:7000 మైక్రోగ్రాములు, మునగాకు:  6700 మైక్రోగ్రాములు, పాలకూర: 5500 మైక్రోగ్రాములు, తోటకూర: 5400 మైక్రోగ్రాములు, గోంగూర: 2900 మైక్రోగ్రాములు, క్యారెట్: 1900 మైక్రోగ్రాములు, ఈ ఆకుకూరలను ప్రతిరోజూ ఆహారంలో భాగం చేసుకోవడం వలన కంటికి అవసరమైన బీటా కెరోటిన్ దొరుకుతుంది. క్యారెట్‌ను జ్యూస్‌ల రూపంలో తీసుకోవడం కూడా మంచిదని అంటున్నారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/10/karivepaku-6.jpg</image:loc><image:caption><![CDATA[ ఆకుకూరలతో పాటు పండ్లు, విత్తనాలు, సహజ సిద్ధమైన జ్యూస్‌లు తీసుకోవడం వలన కంటికి ఇతర పోషకాలు, రక్త అభివృద్ధికి అవసరమైన పోషకాలు అంది, రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. వండిన ఆహారాల్లో లభించని యాంటీఆక్సిడెంట్లు సహజ ఆహారాల్లో పుష్కలంగా లభిస్తాయి. ఇవి రెటీనాను దెబ్బతినకుండా కాపాడతాయి. సెల్ ఫోన్ల వాడకాన్ని పూర్తిగా మానేయలేనప్పటికీ, కొన్ని జాగ్రత్తలు తీసుకోవచ్చు. పెద్ద స్క్రీన్ ఉన్న ఫోన్లను వాడటం, తగినంత బ్రైట్‌నెస్ ఉంచుకోవడం, వీలైతే కంప్యూటర్, టాబ్ లేదా టీవీకి కనెక్ట్ చేసి చూడటం వల్ల కంటిపై ఒత్తిడి తగ్గుతుంది. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/spiritual-photos/mercury-jupiter-nakshatra-exchange-luck-and-financial-gains-for-these-zodiac-signs-1936654.html</loc><lastmod>2026-10-17T15:54:10+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/10/luckyzodiac-signs.jpg</image:loc>
					<image:title><![CDATA[ Luckyzodiac Signs ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/10/mesha-rasi-14.jpg</image:loc><image:caption><![CDATA[ మేషం: ఈ రాశికి చతుర్థ స్థానంలో ఉన్న గురువుకు, సప్తమ స్థానంలో ఉన్న బుధుడికి మధ్య నక్షత్ర పరివర్తన జరిగినందువల్ల ఈ నెల అక్టోబర్ 31 వరకు ఈ రాశివారికి జీవితం సుఖ సంతోషాలతో సాగుతుంది. అనుకున్న పనులన్నీ అవరోధాలు లేకుండా పూర్తి కావడం, ప్రతి ప్రయత్నమూ నెరవేరడం వంటివి తప్పకుండా జరుగుతాయి. ఆదాయం అనేక రెట్లు పెరిగి, ఆర్థికంగా సంతృప్తికర స్థాయికి చేరుకుంటారు. వృత్తి, ఉద్యోగాల్లో అధికారయోగం పడుతుంది. వ్యాపారాలు బాగా పురోగమిస్తాయి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/10/mithuna-rasi-11.jpg</image:loc><image:caption><![CDATA[ మిథునం: ఈ రాశికి పంచమంలో ఉన్న రాశ్యధిపతి బుధుడికి, ధన స్థానంలో ఉచ్ఛ స్థితిలో ఉన్న గురువుకు మధ్య నక్షత్ర పరివర్తన జరగడం వల్ల ఏ ప్రయత్నం తలపెట్టినా విజయాలు సాధిస్తారు. ఉద్యోగంలో సమర్థతకు, ప్రతిభకు మంచి గుర్తింపు లభించి అందలాలు ఎక్కడం జరుగుతుంది. ఆదాయం దిన దినాభివృద్ధి చెందుతుంది. ఆస్తుల విలువ బాగా పెరుగుతుంది. ఆస్తి వివాదం అనుకూలంగా పరి ష్కారం అవుతుంది. వృత్తి, వ్యాపారాలు కొత్త పుంతలు తొక్కుతాయి. సంతాన ప్రాప్తి కలుగుతుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/10/karkataka-rasi-13.jpg</image:loc><image:caption><![CDATA[ కర్కాటకం: ఈ రాశిలో ఉచ్ఛ స్థితిలో ఉన్న గురువు ఆశ్లేష నక్షత్రంలో, చతుర్థ స్థానంలో ఉన్న బుధుడు విశాఖ నక్షత్రంలో సంచారం చేస్తున్నందువల్ల విలువైన ఆస్తిపాస్తులు లభిస్తాయి. ఆస్తి వివాదాలు అనుకూలంగా పరిష్కారమవుతాయి. గృహ, వాహన ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగంలో రాజ యోగాలు కలుగుతాయి. ప్రాధాన్యం, ప్రాభవం బాగా పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాలకు దశ తిరు గుతుంది. నిరుద్యోగులకు మంచి విదేశీ ఆఫర్లు అందుతాయి. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/10/kanya-rasi.jpg</image:loc><image:caption><![CDATA[ కన్య: రాశ్యధిపతి బుధుడు గురు నక్షత్రంలో, గురువు రాశ్యధిపతి నక్షత్రంలో సంచారం చేస్తున్నందువల్ల ఆర్థిక, వ్యక్తిగత సమస్యలు, వివాదాల నుంచి క్రమంగా బయటపడడం జరుగుతుంది. ఆస్తిపా స్తులు లభిస్తాయి. ఉద్యోగపరంగా విపరీత రాజయోగం కలుగుతుంది. ఉద్యోగంలో కీలకమైన శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. నిరుద్యోగులకు ఆశించిన ఉద్యోగం తప్పకుండా లభిస్తుంది. ఉద్యోగం మారడానికి అవకాశం ఉంది. ఉన్నత కుటుంబానికి చెందిన వ్యక్తితో పెళ్లి నిశ్చయమవుతుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/10/tula-rashi-21.jpg</image:loc><image:caption><![CDATA[ తుల: ఈ రాశిలో ఉన్న బుధుడికి, దశమ స్థానంలో ఉచ్ఛ స్థితిలో ఉన్న గురువుకు మధ్య నక్షత్ర పరివ ర్తన జరగడం వల్ల ఒకటికి రెండుసార్లు ధన యోగాలు కలుగుతాయి. ఆకస్మిక ధన లాభానికి బాగా అవకాశం ఉంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో విశేషమైన పురోగతి ఉంటుంది. ఉద్యోగంలో ఉన్నత పదవుల్ని పొందుతారు. వృత్తి, ఉద్యోగాలరీత్యా విదేశాలకు వెళ్లడం జరుగుతుంది. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాల్లో విజయాలు లభిస్తాయి. ఆస్తి వివాదం అనుకూలంగా పరిష్కారం అవుతుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/10/makara-rasi-8.jpg</image:loc><image:caption><![CDATA[ మకరం: ఈ రాశికి సప్తమ స్థానంలో ఉన్న గురువుకు, దశమ స్థానంలో ఉన్న బుధుడికి మధ్య నక్షత్ర పరివర్తన జరగడం ఊహించని రాజయోగాలు కలుగుతాయి. రాజపూజ్యాలు పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాల్లో అంచనాల్ని మించిన పురోగతి ఉంటుంది. ఉద్యోగంలో అధికార యోగం పడుతుంది. నిరుద్యోగులకు ఆశించిన సంస్థ నుంచి ఆఫర్లు అందుతాయి. ఉద్యోగులకు డిమాండ్ పెరుగుతుంది. సంతాన ప్రాప్తికి బాగా అవకాశం ఉంది. ఆర్థికంగా బాగా ఉన్నత స్థానానికి ఎదుగుతారు. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/cardamom-side-effects-why-chewing-too-many-elaichi-seeds-can-be-dangerous-for-your-health-1936660.html</loc><lastmod>2026-10-17T15:49:48+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/10/cardamom-side-effects-5.jpg</image:loc>
					<image:title><![CDATA[ Cardamom Side Effects ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/10/cardamom-side-effects-3.jpg</image:loc><image:caption><![CDATA[ యాలకులు అందరి శరీర తత్వాలకూ సరిపడకపోవచ్చు. ముఖ్యంగా కొందరిలో ఇవి అలెర్జీ సమస్యలకు దారితీస్తాయి. యాలకులు తిన్న తర్వాత చర్మంపై దురదలు రావడం, దద్దుర్లు ఏర్పడటం, గొంతు లేదా ముఖం వాపు రావడం, కొందరిలో శ్వాస తీసుకోవడంలో తీవ్ర ఇబ్బందులు కలగడం వంటివి అలెర్జీ లక్షణాలుగా బయటపడతాయి. శరీరంలో ఇలాంటి మార్పులు గమనించిన వెంటనే యాలకులను తీసుకోవడం ఆపేసి, ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా తక్షణమే వైద్యుడిని సంప్రదించడం మంచిది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/10/cardamom-side-effects-2.jpg</image:loc><image:caption><![CDATA[ సాధారణంగా జీర్ణక్రియ బాగుండాలని చాలామంది రోజూ యాలకులు నములుతుంటారు. కానీ వీటిని పరిమితికి మించి తీసుకుంటే వికటించి తీవ్రమైన జీర్ణాశయ సమస్యలకు దారితీస్తుంది. యాలకుల మితిమీరిన వాడకం వల్ల కడుపులో విపరీతమైన గ్యాస్ ఉత్పత్తి అవ్వడం, కడుపుబ్బరం, తీవ్రమైన కడుపునొప్పి, అజీర్ణం, విరేచనాలు వంటి సమస్యలు తలెత్తుతాయి. జీర్ణవ్యవస్థ పనితీరు సజావుగా సాగాలంటే వీటిని వంటల్లో లేదా నేరుగా తీసుకునేటప్పుడు చాలా మితంగా మాత్రమే వాడాలని నిపుణులు సూచిస్తున్నారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/10/cardamom-side-effects-1.jpg</image:loc><image:caption><![CDATA[ మరో ప్రధానమైన అంశం రక్తపోటుపై యాలకుల ప్రభావం. యాలకుల్లో సహజంగానే రక్తపోటును తగ్గించే గుణాలు పుష్కలంగా ఉంటాయి. ఇది అధిక హై బీపీ ఉన్నవారికి ఎంతో మేలు చేసినప్పటికీ, ఇప్పటికే లో బీపీ సమస్యతో బాధపడేవారికి మాత్రం ప్రమాదకరంగా మారవచ్చు. లో బీపీ ఉన్నవారు యాలకులను ఎక్కువగా తీసుకుంటే వారి రక్తపోటు మరింత ప్రమాదకర స్థాయికి పడిపోయే అవకాశం ఉంది కాబట్టి వారు ఈ విషయంలో చాలా అప్రమత్తంగా ఉండాలి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/10/cardamom-side-effects-4.jpg</image:loc><image:caption><![CDATA[ నిత్యం వివిధ రకాల ఆరోగ్య సమస్యలకు మందులు వాడుతున్న వారు యాలకుల వాడకంలో జాగ్రత్త వహించాలి. యాలకుల్లో ఉండే కొన్ని క్రియాశీల రసాయన సమ్మేళనాలు మనం వాడే ఔషధాలతో నేరుగా చర్య జరిపే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా షుగర్, గుండెజబ్బులు లేదా రక్తం పలుచబడే మందులు వాడేవారు రోజూ యాలకులను డైట్‌లో భాగంగా తీసుకునే ముందు తమ వైద్యుడి సలహా తీసుకోవడం తప్పనిసరి. లేదంటే ఆ మందుల ప్రభావం తగ్గిపోవడమో లేదా తీవ్రమైన అనారోగ్య సమస్యలు రావడమో జరుగుతుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/10/cardamom-side-effects.jpg</image:loc><image:caption><![CDATA[ హార్మోన్ల అసమతుల్యతతో బాధపడేవారు కూడా యాలకులకు కాస్త దూరంగా ఉండటమే మంచిది. కొన్ని శాస్త్రీయ అధ్యయనాల ప్రకారం యాలకులు శరీరంలో ఈస్ట్రోజెన్ హార్మోన్ స్థాయిలను ప్రభావితం చేసే లక్షణాలను కలిగి ఉంటాయని తేలింది. రొమ్ము క్యాన్సర్, గర్భాశయ క్యాన్సర్ హార్మోన్ సెన్సిటివ్ రుగ్మతలతో బాధపడే రోగులు వీటిని తీసుకోకపోవడమే మంచిది. సువాసన, ఆరోగ్యం ఇస్తాయి కదా అని మితిమీరి తినకుండా, నిత్యం పరిమిత మోతాదులోనే యాలకులను ఉపయోగించడం వల్ల మాత్రమే పూర్తి ప్రయోజనాలను పొందవచ్చు. (గమనిక: ఈ కథనంలో పేర్కొన్న సమాచారం కేవలం సాధారణ అవగాహన కోసం మాత్రమే. ఏదైనా ఆరోగ్య సమస్యలు ఉన్నా, దీర్ఘకాలిక మందులు వాడుతున్నా వారు వైద్యుల సలహా తీసుకోవడం మంచిది.) ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/healthy-seasonal-fruits-vakkaya-health-benefits-nutrition-diabetes-diet-1936621.html</loc><lastmod>2026-10-17T15:25:08+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/10/vakkaya-1.jpg</image:loc>
					<image:title><![CDATA[ Vakkaya 1 ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/10/vakkaya.jpg</image:loc><image:caption><![CDATA[ ఈ కాయలు చూడటానికి చాలా చిన్నగా ఉంటాయి. ఇంకా తినడానికి ఇవి పుల్లపుల్లగా.. అలాగే వగరుగా ఉంటాయి. అవే  ‘వాక్కాయలు’. వీటి గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. మీరు దీనిని పచ్చడి రూపంలో కూడా చేసుకుని తినొచ్చు ఇంకా పప్పు,  ఊరగాయ రూపంలో కూడా ఇది తినొచ్చు. అలాగే, మనం తినే వాక్కాయల్లో విటమిన్ సి, ఐరన్  ఉంటాయి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/10/vakkaya-2.jpg</image:loc><image:caption><![CDATA[ మీరు ఇవి తింటే రోగనిరోధక శక్తిని కూడా పెంచుకోవచ్చు. ఇంకా ఇది రక్తహీనతను తగ్గించి, గుండె,  జీర్ణ వ్యవస్థకు ఎంతో మేలు చేస్తుంది. 
 వాక్కాయలను తింటే ఎలాంటి ప్రయోజనాలు చేకూరతాయి. అయితే, ఇది మీ డైట్‌లో ఎందుకు చేర్చుకోవాలి? అనేది ఇక్కడ చదివి తెలుసుకుందాం.. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/10/vakkaya-3.jpg</image:loc><image:caption><![CDATA[ వాక్కాయలు, కలేక్కాయలు, కలివి కాయలు ఇలా ఒక్కో ఏరియాను బట్టి దీనిని పిలుస్తారు. ఈ వాక్కాయలతో మీరు పులిహోర చేసుకుని తినొచ్చు. ఈ వాక్కాయ వగరు, పుల్లగా ఉంటుంది. ఇంకా ఈ వాక్కాయను చింతకాయ అంత పులుపు ఉంటుంది. ఈ చెట్టు పూవులు తెల్లగా ఉంటాయి. ఇంకా మంచి సువాసనతో ఉంటాయి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/10/vakkaya-4.jpg</image:loc><image:caption><![CDATA[ రక్తంలో చక్కెర లెవెల్స్ : ఈ వాక్కాయలు మీ మూత్ర నాళాన్ని క్లీన్ చేయడంలో ఇవి సహాయపడతాయి. ఇంకా  కిడ్నీలో రాళ్లు కూడా ఇవి కరిగిస్తాయి. ఇంకా రక్తంలో చక్కెర లెవెల్స్ ను అదుపులో ఉంచడంలో ఇవి ఎంతగానో  సహాయపడతాయి. మీరు వాక్కాయ ఆకుల కషాయం తాగితే జ్వరం వెంటనే తగ్గిపోతుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/10/vakkaya-5.jpg</image:loc><image:caption><![CDATA[ . (నోట్ : ఇక్కడ రాసిన సమాచారం ఇంటర్నెట్ నుంచి తీసుకోబడింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది) ]]></image:caption></image:image></url></urlset>