త్వరలో కూత పెట్టనున్న గజ్వేల్‌ రైలు

ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న గజ్వేల్‌వాసుల కల నెరవేరనుంది. సికింద్రాబాద్‌ నుంచి గజ్వేల్‌కు ఈ నెలాఖరుకు రైలు సేవలు ప్రారంభం కానున్నాయి. పనులు పూర్తి కావడంతో ఈనెల 8న రైల్వే సేఫ్టీ కమిషనర్‌ తనిఖీ చేయనున్నారు. ఆరోజు పూర్తి స్థాయి రైలును గరిష్ట వేగంతో నడిపి పరీక్షించుకున్నారు. ఈ సందర్భంగా సాంకేతికంగా  వచ్చే లోపాలను రైల్వే సేఫ్టీ కమిషనర్‌ స్థానిక అధికారులకు సూచనలు చేస్తారు. వాటి ఆధారంగా అవసరమైన మార్పులు చేసిన తర్వాత పూర్తిస్థాయిలో రైలు సేవలు ప్రారంభించనున్నారు. […]

త్వరలో కూత పెట్టనున్న గజ్వేల్‌ రైలు
Follow us

|

Updated on: Jun 02, 2020 | 9:46 AM

ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న గజ్వేల్‌వాసుల కల నెరవేరనుంది. సికింద్రాబాద్‌ నుంచి గజ్వేల్‌కు ఈ నెలాఖరుకు రైలు సేవలు ప్రారంభం కానున్నాయి. పనులు పూర్తి కావడంతో ఈనెల 8న రైల్వే సేఫ్టీ కమిషనర్‌ తనిఖీ చేయనున్నారు. ఆరోజు పూర్తి స్థాయి రైలును గరిష్ట వేగంతో నడిపి పరీక్షించుకున్నారు. ఈ సందర్భంగా సాంకేతికంగా  వచ్చే లోపాలను రైల్వే సేఫ్టీ కమిషనర్‌ స్థానిక అధికారులకు సూచనలు చేస్తారు. వాటి ఆధారంగా అవసరమైన మార్పులు చేసిన తర్వాత పూర్తిస్థాయిలో రైలు సేవలు ప్రారంభించనున్నారు. ఈనెల 25 తర్వాత మంచి ముహూర్తం చూసి రైలు సేవలకు పచ్చజెండా ఊపనున్నారు. ప్రస్తుతానికి సింగిల్‌ లైన్‌గా ఉన్న ఈ మార్గంలో డీజిల్‌ లోకోమోటివ్‌తో రైలు నడపనున్నారు. అయితే రానున్న ఐదేళ్ల కాలంలో దీన్ని విద్యుదీకరించే అవకాశం కనిపిస్తోంది.