ఏపీ రాజకీయాల్లో సెన్సేషన్…జనసేనలోకి వైసీపీ నేతలు

ఏపీ రాజకీయాల్లో భిన్న పరిస్థితులు చోటుచేసుకుంటున్నాయి. ఒకవైపు అధికార వైసీపీ ఫుల్ స్వింగ్‌లో ఉండి స్థానిక సంస్థల ఎన్నికలకు సై అంటుంటే..మరోవైపు టీడీపీ డిఫరెంట్ స్ట్రాటజీలతో దూకుడు పెంచింది. ఇక ఇప్పటికే బీజేపీతో పొత్తు పెట్టుకున్న జనసేన..ఎన్నికల్లో ముందడుగులు వేయడానికి సమాయత్తమవుతోంది. వైసీపీ అధికారంలోకి వచ్చి ఏడాది కాలేదు..అప్పుడే ఆ పార్టీకి చెందిన గాజువాక వైసీపీ నేతలు జనసేనలో చేరడం తీవ్ర సంచలనంగా మారింది. సాక్షాత్తూ పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ సమక్షంలో ఈ చేరికలు జరిగాయి. […]

ఏపీ రాజకీయాల్లో సెన్సేషన్...జనసేనలోకి వైసీపీ నేతలు
Follow us

|

Updated on: Mar 08, 2020 | 4:06 PM

ఏపీ రాజకీయాల్లో భిన్న పరిస్థితులు చోటుచేసుకుంటున్నాయి. ఒకవైపు అధికార వైసీపీ ఫుల్ స్వింగ్‌లో ఉండి స్థానిక సంస్థల ఎన్నికలకు సై అంటుంటే..మరోవైపు టీడీపీ డిఫరెంట్ స్ట్రాటజీలతో దూకుడు పెంచింది. ఇక ఇప్పటికే బీజేపీతో పొత్తు పెట్టుకున్న జనసేన..ఎన్నికల్లో ముందడుగులు వేయడానికి సమాయత్తమవుతోంది.

వైసీపీ అధికారంలోకి వచ్చి ఏడాది కాలేదు..అప్పుడే ఆ పార్టీకి చెందిన గాజువాక వైసీపీ నేతలు జనసేనలో చేరడం తీవ్ర సంచలనంగా మారింది. సాక్షాత్తూ పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ సమక్షంలో ఈ చేరికలు జరిగాయి. గత ఎన్నికల్లో జనసేనాని  భీమవరం, గాజువాక నియోజకవర్గాల్లో పోటీ చేశారు. కానీ దురదృష్ణవశాత్తూ రెండూచోట్ల ఆయన ఓడిపోయారు. తాజాగా స్థానిక ఎన్నికలకు ముందు గాజువాకలో చేరికలు ఆ పార్టీకి మంచి బూస్టప్‌గానే చెప్పాలి.