విశాఖ‌లో హై రిస్క్ జోన్స్..అక్క‌డ తిరిగితే డేంజ‌ర్..

ఏపీలో క‌రోనా బాధితుల సంఖ్య కొద్దికొద్దిగా పెరుగుతూ వెళ్తుంది. తాజాగా రాష్ట్రంలో ఈ సంఖ్య 8కి చేరుకుంది. ఈ నేప‌థ్యంలో వైజాగ్ లోని కొన్ని ప్రాంతాల‌ను హై రిస్క్ జోన్లుగా ప్ర‌క‌టించింది రాష్ట్ర ప్ర‌భుత్వం. సీత‌మ్మ ధార‌, గాజువాక‌, అన‌కాప‌ల్లి ప్రాంతాల్లో హై అల‌ర్ట్ ప్ర‌క‌టించారు. ఇప్పుటికే ఆయా ఏరియాల్లో వైర‌స్ ప్ర‌భ‌ల‌కుండా బారీ ఏర్పాట్లు చేశారు. తాజాగా మంత్రులు ఆళ్ల నాని, అవంతి శ్రీనివాస్, కుర‌సాల క‌న్న‌బాబు జిల్లాలో ప‌ర్య‌టించారు. ఇత‌ర దేశాల నుంచి రాష్ట్రానికి […]

విశాఖ‌లో హై రిస్క్ జోన్స్..అక్క‌డ తిరిగితే డేంజ‌ర్..
Follow us

|

Updated on: Mar 25, 2020 | 4:18 PM

ఏపీలో క‌రోనా బాధితుల సంఖ్య కొద్దికొద్దిగా పెరుగుతూ వెళ్తుంది. తాజాగా రాష్ట్రంలో ఈ సంఖ్య 8కి చేరుకుంది. ఈ నేప‌థ్యంలో వైజాగ్ లోని కొన్ని ప్రాంతాల‌ను హై రిస్క్ జోన్లుగా ప్ర‌క‌టించింది రాష్ట్ర ప్ర‌భుత్వం. సీత‌మ్మ ధార‌, గాజువాక‌, అన‌కాప‌ల్లి ప్రాంతాల్లో హై అల‌ర్ట్ ప్ర‌క‌టించారు. ఇప్పుటికే ఆయా ఏరియాల్లో వైర‌స్ ప్ర‌భ‌ల‌కుండా బారీ ఏర్పాట్లు చేశారు. తాజాగా మంత్రులు ఆళ్ల నాని, అవంతి శ్రీనివాస్, కుర‌సాల క‌న్న‌బాబు జిల్లాలో ప‌ర్య‌టించారు.

ఇత‌ర దేశాల నుంచి రాష్ట్రానికి వ‌చ్చిన‌వారు, వచ్చేవారు అధికారులకు సహకరించాలని కోరారు. లేకపోతే వారి మీద చట్టపరంగా తీవ్ర‌ చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు. కరోనా నివారణకు విశాఖలో 20 కమిటీలు ప‌నిచేస్తున్నాయి. విశాఖ‌ జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు…2400 మంది విదేశాల నుంచి రాగా 1470 మంది హోం క్వారంటైన్‌తో పాటు ప్ర‌భుత్వ క్వారంటైన్ సెంట‌ర్ల‌లో ఉంటున్నారు.

సుమారు మ‌రో వెయ్యి మంది కోసం అధికారులు వెతుకులాట మొద‌లెట్టారు. వాళ్ల విదేశీ ట్రావెల్ హిస్టరీ, ఇత‌ర వివ‌రాల‌ను సేకరించారు. వాళ్లందర్నీ క్వారంటైన్ కేంద్రాలకు తరలించబోతున్నారు. విశాఖలో ఉన్న మూడు క‌రోనా పాజిటివ్ కేసుల్లో రెండు ఫారెన్ నుంచి వచ్చినవి కాగా ఒకటి లోకల్‌గా ఉన్న వ్యక్తికి వచ్చినది. దీంతో ఇంత‌లా చెప్తున్నా క్వారంటైన్ సెంట‌ర్స్ కు రానివారిపై చట్ట‌ప‌రంగా చ‌ర్య‌లు తీసుకోబోతున్నారు. విదేశాల నుంచి వ‌చ్చిన‌వారు సంచ‌రించే అవ‌కాశం ఉన్న నేప‌థ్యంలో హై రిస్క్ జోన్ల‌ను ప్ర‌క‌టించారు.