పచ్చని పంటపొలాల మధ్య గ్యాస్ ​పైప్​లైన్ వద్దే వద్దు.. జోగులాంబ గద్వాల జిల్లాలో గ్రామస్థుల ఆందోళన

భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ కంపెనీ కర్ణాటక హాసన్ జిల్లా నుంచి రాష్ట్రంలోని చర్లపల్లి వరకు గ్యాస్ పైప్​లైన్ వేస్తున్న

పచ్చని పంటపొలాల మధ్య గ్యాస్ ​పైప్​లైన్ వద్దే వద్దు.. జోగులాంబ గద్వాల జిల్లాలో గ్రామస్థుల ఆందోళన
Follow us

|

Updated on: Jan 14, 2021 | 3:19 PM

భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ కంపెనీ కర్ణాటక హాసన్ జిల్లా నుంచి రాష్ట్రంలోని చర్లపల్లి వరకు గ్యాస్ పైప్​లైన్ వేస్తున్న సంగతి తెలిసిందే. ఈ పైప్‌లైన్  జోగులాంబ గద్వాల జిల్లా మీదుగా వస్తోంది. అయితే ఈ పైప్‌లైన్‌ను వ్యతిరేకిస్తూ మనవపాడ్ మండలం గోకులపాడ్ శివారులో గ్రామస్థులు రోడ్డుపై బైఠాయించారు. పచ్చని పంట పొలాల మధ్య గ్యాస్ పైప్​లైన్ వెళ్లనిచ్చే ప్రసక్తే లేదని తెగేసి చెబుతున్నారు. ఈ ఆందోళన వల్ల రాయచూర్-కర్నూల్ అంతర్రాష్ట్ర రహదారిపై ఇరువైపుల వాహనాలు భారీగా నిలిచిపోయాయి. గ్యాస్ పైప్ లైన్ తమ పొలాల్లోంచి పోవడాన్ని వల్ల తాము తీవ్రంగా నష్టపోతున్నామని గ్రామస్థులు చెబుతున్నారు.

తక్షణమే గ్యాస్ పైప్లైన్ పనులు నిలిపివేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ.. మాకు గ్యాస్ పైప్​లైన్ వద్దని కలెక్టర్​కు కూడా వినతి పత్రం ఇచ్చినట్లు పేర్కొన్నారు. ఇంత వరకు ఏ అధికారి కూడా పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. మేమందరం నేలతల్లిని నమ్ముకొని బతుకుతున్నాం. మా ఊరిలో అందరు చిన్న, సన్నకారు రైతులే ఉన్నారు. ఉన్న ఎకరా, రెండెకరాల పొలంలో గ్యాస్ లైన్ వేస్తే మా పరిస్థితి ఎట్లా? ఏపీలో గ్యాస్ పైప్​లైన్ లీక్ కావడం వల్ల అనేక అనార్థాలు జరుగుతున్నాయి. ఎకరా పొలం ప్రస్తుత మార్కెట్ ప్రకారం రూ. 40 లక్షలు ఉంది. మేమంతా వ్యతిరేకిస్తున్నా పట్టించుకునే నాథుడే లేడు. గ్యాస్ పైప్​లైన్ వెళ్లే పొలాల రైతులకు ఎకరాకు రూ. 50,000 ఇస్తామని చెప్పి డబ్బు కూడా ఇప్పటి వరకు ఇవ్వలేదని వాపోయారు. తమకు డబ్బు వద్దు గ్యాస్ లైన్ వద్దని రైతులు కరాకండిగా చెబుతున్నారు. పైప్​లైన్ నిర్మాణాన్ని కచ్చితంగా అడ్డుకుంటామని తెలిపారు.

జోగులాంబ గద్వాల జిల్లా శాంతినగర్‌లో ప్రోటోకాల్ వివాదం.. ఇలా ప్రారంభించారు..అలా ధ్వంసం చేశారు

దిన ఫలాలు (మార్చి 29, 2024): 12 రాశుల వారికి ఇలా..
దిన ఫలాలు (మార్చి 29, 2024): 12 రాశుల వారికి ఇలా..
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!