Breaking News
  • సిద్దిపేట: దేశానికి ఆదర్శంగా గజ్వేల్‌ నిలువబోతోంది. గజ్వేల్‌లో సీఎం పర్యటనకు అన్ని ఏర్పాట్లు పూర్తి. రూ.కోట్లతో నిర్మించిన కార్యాలయాలను సీఎం కేసీఆర్‌ ప్రారంభిస్తారు-హరీష్‌రావు.
  • ఇంటర్‌ పరీక్షల నిర్వహణపై కార్యదర్శి జలీల్‌ ప్రెస్‌మీట్‌. అధిక పరీక్ష ఫీజులు వసూలు చేసిన మూడు కాలేజీలు దసరాసెలవుల్లో తరగతులు నిర్వహించిన కాలేజీలకు నోటీసులు. ఎలాంటి సమస్యలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకున్నాం. హాల్‌ టికెట్లపై ఏ సమస్య ఉన్నా భయపడొద్దు. ఏదైనా సమస్య ఉంటే బోర్డును సంప్రదించాలి. Tsbie.gov.inలో విద్యార్థులు తమ వివరాలు చెక్‌చేసుకోవచ్చ -ఇంటర్‌ బోర్డ్‌ కార్యదర్శి ఉమర్‌ జలీల్‌
  • రేపు ఏపీ వ్యాప్తంగా టీడీపీ నిరసనలు. పెరిగిన ఆర్టీసీ చార్జీలకు నిరసనగా ఆందోళనలు. ఆర్టీసీ డిపోల ఎదుట నిరసనలకు పిలుపు నిచ్చిన టీడీపీ
  • తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం శ్రీవారి ఉచిత దర్శనానికి 7 గంటల సమయం. ఈ రోజు శ్రీవారి హుండీ ఆదాయం రూ.2.73 కోట్లు.
  • విశాఖ: రైల్వే ఈ-టికెట్లు బ్లాక్‌ చేస్తున్న ముఠా గుట్టురట్టు. దువ్వాడ, తాటిచెట్లపాలెంలో ఆర్పీఎఫ్‌ దాడులు ఈ-టికెట్లు బ్లాక్‌ చేస్తున్న ఇద్దరు అరెస్ట్‌. రూ.14.89 లక్షల విలువైన ఈ-టికెట్లు సీజ్‌. కటక్‌కు చెందిన సమీర్‌కుమార్‌ ప్రధాన్‌, దుర్గారావు అరెస్ట్‌. ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్‌ను హ్యాక్‌ చేస్తున్న నిందితులు ల్యాప్‌టాప్‌, డాక్యుమెంట్లు సీజ్‌చేసిన ఆర్పీఎఫ్‌
  • కర్నూలు: నంద్యాలలో మందుబాబుల వీరంగం. పబ్లిక్‌గా మద్యం సేవిస్తున్న యువకులు. అడ్డుచెప్పిన మస్తాన్‌ వలీ అనే వ్యక్తిపై రాళ్లదాడి మస్తాన్‌వలీకి తీవ్రగాయాలు, ఆస్పత్రికి తరలింపు.
  • వరంగల్‌: హన్మకొండలో గుంతలరోడ్డుకు యువతి బలి. హంటర్‌రోడ్డులో గుంతలో పడి విద్యార్థిని బైక్‌ బోల్తా. రాంపూర్‌కు చెందిన విద్యార్థిని బ్లెస్సీ అక్కడికక్కడే మృతి.

గద్దలకొండ గణేష్ – పక్కా గ్యాంగ్‌స్టార్ స్టోరీ…

Gaddalakonda Ganesh Telugu Movie Review, గద్దలకొండ గణేష్ – పక్కా గ్యాంగ్‌స్టార్ స్టోరీ…

టైటిల్ : ‘గద్దలకొండ గణేష్’

తారాగణం : వరుణ్ తేజ్, పూజా హెగ్డే, అధర్వ, మృణాళిని రవి, బ్రహ్మనందం, బ్రహ్మజీ, సత్య తదితరులు

సంగీతం :  మిక్కీ జె మేయర్

నిర్మాతలు : రామ్ ఆచంట, గోపి ఆచంట

స్క్రీన్ ప్లే, దర్శకత్వం : హరీష్ శంకర్

విడుదల తేదీ: 20-09-2019

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా దర్శకుడు హరీష్ శంకర్ డైరెక్షన్‌లో తెరకెక్కిన చిత్రం ‘గద్దలకొండ గణేష్’. వరుణ్ గత చిత్రాలకు భిన్నంగా ఇందులో పూర్తి నెగటివ్ షేడ్ క్యారెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో కనిపించనున్నాడు. మొదటి నుంచి ఈ చిత్రానికి ‘వాల్మీకి’ టైటిల్‌ను ఖరారు చేసినా.. కొన్ని కారణాల వల్ల చివరి నిమిషంలో ‘గద్దలకొండ గణేష్’గా మార్చారు. 14 రీల్స్ బ్యానర్ పై రామ్ ఆచంట, గోపి ఆచంట నిర్మించిన ఈ చిత్రం భారీ అంచనాల మధ్య ఇవాళ విడుదలైంది. మరి గద్దలకొండ గణేష్.. ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించాడో ఈ రివ్యూలో తెలుసుకుందాం.

కథ‌ :

చిన్నతనం నుంచి సినిమాలపై ఉన్న మక్కువతో ఏదో ఒక రోజు డైరెక్టర్ అవుతానని అనుకుంటూ.. ప్రయత్నాలు సాగిస్తుంటాడు అభిలాష్(అథర్వ మురళి). ఈ క్రమంలో సంవత్సరంలోపు ఎలాగైనా సినిమా తీస్తానని ఓ సీనియర్ దర్శకుడితో  శపథం చేస్తాడు. అందులో భాగంగా కథ కోసం ఒక ఏరియాలో పెద్ద గ్యాంగ్‌స్టర్‌గా చలామణి అవుతున్న గద్దలకొండ గణేష్ జీవితాన్ని అతనికి తెలియకుండా అధ్యయనం చేయాలనుకుంటాడు.

అయితే గణేష్‌కి ఈ విషయమంతా తెలిసి.. తన గురించి కాదు.. తననే హీరోగా సినిమా తీయాలని అభిలాష్‌ను బెదిరిస్తాడు. మరి అభిలాష్ గద్దలకొండ గణేష్‌తో సినిమా తీశాడా.? అతను చివరికి డైరెక్టర్ అయ్యాడా.? అసలు గద్దలకొండ గణేష్ ఎవరు.? వీరిద్దరి కథ చివరికి ఎలా ముగిసింది.? అనే ప్రశ్నలకు సమాధానాలు వెండితెరపై చూడాల్సిందే.

న‌టీన‌టుల అభినయం:

ఈ సినిమాకి పిల్లర్ హీరో వరుణ్ తేజ్. పక్కా ఊరమాస్ గ్యాంగ్‌స్టర్ క్యారెక్టర్‌లో ఆయన జీవించాడు. తెలంగాణ యాస్‌లో ఆయన చెప్పిన ప్రతీ డైలాగు చక్కగా పేలింది. మొత్తానికి వరుణ్ తేజ్ మాస్ మేనరిజమ్స్‌తో వన్ మ్యాన్ షో చేశారని చెప్పవచ్చు. ఇక తమిళ హీరో అథర్వ మురళి విషయానికి వస్తే.. అతడికి తెలుగు ఎంట్రీ అదిరింది. ఎమోషనల్ సీన్స్‌తో పాటు కామెడీ సీన్స్‌లో కూడా చక్కని ఈజ్‌తో నటించారు. హీరోకి సమానమైన రోల్‌లో అద్భుతమైన నటన కనబరిచి ఆకట్టుకున్నాడు.

డమ్‌స్మాష్ బ్యూటీ మృణాళిని రవి అందం, అభినయంతో ఆకట్టుకుంది. అథర్వ, మృణాళిని మధ్య వచ్చే ప్రేమ సన్నివేశాలు ఆహ్లదకరంగా సాగుతాయి. ఇక హీరోయిన్ పూజా హెగ్డే.. పక్కా తెలుగమ్మాయి లుక్‌లో రెండు జల్లు, లంగావోణీలలో పూజా సరికొత్తగా కనిపించింది. పాత్ర నిడివి తక్కువైనా ఉన్నంత సేపు అందంగా ఉన్న భావన కలుగుతుంది. ఇక శ్రీదేవి, శోభన్ బాబుల హిట్ సాంగ్ ‘వెల్లువొచ్చి గోదారమ్మ’  రీమిక్స్ సినిమాకే హైలెట్‌గా నిలిచింది. ఈ సాంగ్‌లో పూజా, వరుణ్‌ల ఆహార్యం వారిద్దరిని గుర్తు చేసింది. కాగా మిగిలిన నటీనటులు తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు.

విశ్లేష‌ణ‌ :

హీరో ఎలివేషన్ కోసం ఒరిజినల్ వెర్షన్‌లో హరీష్ శంకర్ కొన్ని మార్పులు చేయడంతో అవి మూవీ సోల్‌ని దెబ్బతీశాయి. దీనితో క్లైమాక్స్‌ సోసోగా అనిపిస్తుంది. అటు వరుణ్ పాత్ర సినిమాలో వచ్చి వెళ్లే పాత్రలా అనిపిస్తుంది తప్ప.. సినిమాలో భాగంగా ఉండదు. హరీష్ శంకర్ చేసిన మార్పుల వల్ల పర్ఫెక్ట్ క్లాసిక్ స్టోరీ డిస్టర్బ్ అయిందని చెప్పవచ్చు. అంతేకాకుండా వరుణ్ తేజ్‌కి ఈ సినిమాలో ఒక్క పూర్తిస్థాయి యాక్షన్ ఎపిసోడ్ కూడా ఉండకపోవడం గమనార్హం. దీనితో పాటు ఫస్ట్ హాఫ్ కొంత స్లోగా నడుస్తుంది.

సాంకేతిక విభాగాల పనితీరు:

ఓవరాల్‌గా సినిమా బాగుంది. కానీ హరీష్ శంకర్ చేసిన మార్పుల వల్ల మాతృకలోని కొన్ని ఎమోషన్స్ క్యారీ అవ్వలేదు. కొంతమేరకు మాత్రమే హరీష్ విజయం సాధించాడని చెప్పవచ్చు. కెమెరా వర్క్ ఆకట్టుకుంటుంది. సాంగ్స్, బ్యాగ్రౌండ్ మ్యూజిక్ అంచనాలు మించి ఉన్నాయి. నిర్మాణ విలువలు చాలా రిచ్‌గా ఉన్నాయి.

ప్లస్‌ పాయింట్స్‌ :

  • క‌థ‌, క‌థ‌నం
  • వరుణ్ తేజ్ యాక్టింగ్

మైనస్‌ పాయింట్స్‌ :

  • స్లో నరేషన్