చైనా ఆస్పత్రిని మించేలా.. నేడే గచ్చిబౌలి కరోనా ఆస్పత్రి ప్రారంభం..

కోవిద్-19 ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. ఈ మహమ్మారి కట్టడికోసం చాలా దేశాలు లాక్ డౌన్ విధించాయి. చైనా కేవలం ఎనిమిది రోజుల్లోనే 1000 పడకల కరోనా ఆస్పత్రిని కట్టింది.. దాన్ని మించేలా 1500 పడకల ఆస్పత్రిని కట్టింది

చైనా ఆస్పత్రిని మించేలా.. నేడే గచ్చిబౌలి కరోనా ఆస్పత్రి ప్రారంభం..
Follow us

| Edited By:

Updated on: Apr 20, 2020 | 4:24 PM

కోవిద్-19 ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. ఈ మహమ్మారి కట్టడికోసం చాలా దేశాలు లాక్ డౌన్ విధించాయి. చైనా కేవలం ఎనిమిది రోజుల్లోనే 1000 పడకల కరోనా ఆస్పత్రిని కట్టింది.. దాన్ని మించేలా 1500 పడకల ఆస్పత్రిని కట్టింది తెలంగాణ ప్రభుత్వం. అదీ 20 రోజుల్లోపే. దాని కోసం దాదాపు వెయ్యి మంది కార్మికులు అహర్నిశలు కష్టపడ్డారు. అత్యాధునిక వైద్య సదుపాయాలతో దేశంలోనే అతి పెద్ద కరోనా ఆస్పత్రిగా రికార్డు సృష్టించిన ఈ హాస్పిటల్ నేడే ప్రారంభం కానుంది.

కాగా..ఇప్పుడు భారత్ లోనూ కోవిద్-19 విలయతనందవం చేస్తోంది. ఈ వైరస్ వల్ల ఎదురయ్యే ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించిన సీఎం కేసీఆర్.. అందుకు అనుగుణంగా చర్యలను వేగవంతం చేశారు. అందులో భాగంగానే హైదరాబాద్ శివారులో ఉన్న గచ్చిబౌలిలో 1500 పడకల ఆస్పత్రిని సిద్ధం చేయించారు. ఇప్పటి వరకు స్పోర్ట్స్ అథారిటీకి సంబంధించిన ఓ కాంప్లెక్స్‌ను పూర్తిగా కరోనా ఆస్పత్రిగా మార్చేశారు. 15 అంతస్తులున్న ఈ భవనంలో ఆస్పత్రికి సంబంధించి నిర్మాణ పనులు యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేశారు.

మరోవైపు.. ఈ ఆస్పత్రిని తొమ్మిది ఎకరాల విస్తీర్ణంలో నిర్మించారు. 468 గదుల్లో 50 పడకల ఐసీయూ బెడ్లను ఏర్పాటు చేశారు. ఒక్కో అంతస్తులో 36 గదులు ఉండనుండగా, ఒక్కో గదిలో 23 పడకలు ఉండనున్నాయి. కాగా, కరోనా రోగులందర్నీ ఈ ఆస్పత్రికి తరలించారు. వైద్యం అందించేందుకు డిప్యూటేషన్ మీద 70 మంది డాక్టర్లను, 120 మంది నర్సులను, పారా మెడికల్ స్టాఫ్‌ను తరలించారు.

Also Read: రూ.500కే కరోనా టెస్టింగ్ కిట్.. 15 నిమిషాల్లో ఫలితం..