నన్ను వదిలెయ్: విజయ్ దేవర కొండకు మహేష్ ట్వీట్

funny conversation between mahesh babu and vijay devara konda on twitter, నన్ను వదిలెయ్: విజయ్ దేవర కొండకు మహేష్ ట్వీట్

డియర్ కామ్రేడ్ సినిమా టీజర్లు, పాటల్లో రష్మిక-విజయ్ దేవరకొండ మధ్య కెమెస్ట్రీకి మంచి మార్కులు పడ్డాయి. ఈ మధ్య ఓ టీవీ ఛానల్ వేడుకకు ముఖ్య అతిథులుగా హాజరైన వీరు చాలా హంగామా చేశారు. దీంతో ప్రేక్షకుల్లో వీరిమధ్య లవ్ ట్రాక్ నడుస్తుందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. తాజాగా ఈ వ్యవహారంపై రష్మిక ట్వీట్ చేయగా.. విజయ్ దేవరకొండ, మహేశ్ బాబులు ఎంటర్ అయ్యారు. ఈ వ్యవహారంలో వీరిద్దరి మధ్య జరిగిన కన్వర్జేషన్ ట్విట్టర్‌లో వైరల్ గా మారింది.

నేను విజయ్‌ దేవరకొండ మంచి స్నేహితులు మాత్రమే. మా ఇద్దరి మధ్య ఏమీలేదంటూ దేవరకొండను ట్యాగ్‌ చేసి రష్మిక ట్వీట్‌ చేయగా.. దానిపై రౌడీ హీరో తనదైన శైలిలో స్పందించాడు. ఓహో నీ తర్వాతి సినిమాలో మహేష్‌బాబుతో కలిసి నటించబోతున్నావు కదా.. ఇప్పుడు నేను నీకు జస్ట్‌ ఫ్రెండ్‌నే అంటావా అంటూ జవాబిచ్చాడు విజయ్​. అయితే అనూహ్యంగా దీనిపై మహేష్‌బాబు స్పందిస్తూ షాకింగ్‌ ట్వీట్‌ చేశారు. సిస్టర్‌ అన్ని ఆశలు పెట్టుకోకు. నాకు ఆల్రెడీ పెళ్లయిందంటూ రష్మికకు ఆ ట్వీట్‌ను ట్యాగ్‌ చేశారు. వీరి కన్వర్జేషన్ నెట్టింట నవ్వులు పూయిస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *