బెజవాడ వాసులకు గుడ్ న్యూస్…

విజయవాడలోని కరకట్ట ప్రాంతాల ప్రజల కష్టాలు ఇకపై తొలగిపోనున్నాయి.  కృష్ణా నది కట్ట వెంట రిటైనింగ్ గోడను పూర్తి చేయడానికి ఆంధ్ర ప్రభుత్వం సోమవారం 122. 90 కోట్ల రూపాయలు మంజూరు చేసింది. కృష్ణా నది వెంబడి ఉన్న నగరంలోని లోతట్టు ప్రాంతాల్లో వరదలు రాకుండా ఉండటానికి ఎప్పట్నుంచో ఈ రిటైనింగ్ వాల్ నిర్మాణం ప్రపోజల్‌లో ఉంది. గతేడాది కృష్ణ నదిలో పదేపదే వరదలు రావడంతో విజయవాడలోని కృష్ణలంక పరిసరాల్లోని రాణి గారి తోట, తారాకరామ నగర్, […]

బెజవాడ వాసులకు గుడ్ న్యూస్...
Follow us

|

Updated on: Feb 04, 2020 | 12:26 PM

విజయవాడలోని కరకట్ట ప్రాంతాల ప్రజల కష్టాలు ఇకపై తొలగిపోనున్నాయి.  కృష్ణా నది కట్ట వెంట రిటైనింగ్ గోడను పూర్తి చేయడానికి ఆంధ్ర ప్రభుత్వం సోమవారం 122. 90 కోట్ల రూపాయలు మంజూరు చేసింది. కృష్ణా నది వెంబడి ఉన్న నగరంలోని లోతట్టు ప్రాంతాల్లో వరదలు రాకుండా ఉండటానికి ఎప్పట్నుంచో ఈ రిటైనింగ్ వాల్ నిర్మాణం ప్రపోజల్‌లో ఉంది. గతేడాది కృష్ణ నదిలో పదేపదే వరదలు రావడంతో విజయవాడలోని కృష్ణలంక పరిసరాల్లోని రాణి గారి తోట, తారాకరామ నగర్, రామలింగేశ్వరనగర్ వంటి లోతట్టు ప్రాంతాలను ప్రభావితం చేశాయి. చాలా కుటుంబాలు తమ వస్తువులను కోల్పోవడం, నిరాశ్రయులుగా మిగలడం పరిపాటిగా మారింది. కొందరు వరదల ఉధృతి తట్టుకోలేక ఇతర ప్రాంతాలకు వలసలు కూడా వెళ్లారు.

2009 తీవ్రంగా వరదలు సంభవించినప్పడు..రిటైనింగ్ వాల్‌ కట్టడానికి అప్పటి ప్రభత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కాని ఇప్పటివరకు అది పాక్షికంగా మాత్రమే పూర్తయ్యింది. రామలింగేశ్వరానగర్ నుండి రాణి గారి తోట వరకు పూర్తవ్వగా.. మిగిలింది నిధులు కొరత కారణంగా పెండింగ్‌లో ఉంది. సరైన పర్యవేక్షణ లేకపోవడం, నిర్మాణాలలో లోపాల వల్ల గోడ నిర్మించిన ప్రాంతంలో కూడా వరదల తాకిడి ఆగలేదు.గత టిడిపి ప్రభుత్వం చాలా కాలం తర్వాత నిర్మాణాలను పున: ప్రారంభించినప్పటికి..అవి ముందుకు సాగలేదు. ప్రస్తుతం సీఎం స్పందించి నిధులు విడుదల చేయడంతో కరకట్ట ప్రాంతవాసులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కాగా సార్వత్రిక ఎన్నికలకు ముందు వైసీపీ విజయవాడ అభ్యర్థిగా పోటీ చేసిన పీవీపీ..వరద ప్రభావిత ప్రాంతాల్లో విసృతంగా పర్యటించారు.  గెలిచినా, ఓడినా..రిటైనింగ్ వాల్ నిర్మాణం పూర్తయ్యేందుకు కృషి చేస్తానని హామి ఇచ్చారు.